గుప్త జ్వాల | sakshi special story to gutta jwala | Sakshi
Sakshi News home page

గుప్త జ్వాల

Published Fri, Nov 18 2016 10:43 PM | Last Updated on Mon, Sep 4 2017 8:27 PM

గుప్త జ్వాల

గుప్త జ్వాల

మనిషిలో ఉన్న ప్రతిభ గుప్తంగా ఎందుకు ఉండాలి?
దేవుడిచ్చిన సామర్థ్యాన్ని గోప్యంగా ఎందుకుంచాలి?
యజ్ఞంలో అగ్గిలేకపోతే ఎలా? జీవితంలో జ్వాల లేకపోతే ఎలా?
ఈ ప్రజ్వలాలన్నీ కాంతినివ్వకపోతే ఎలా? ఈ కీర్తిని మసకబార్చిన వాళ్లపై కోపం ఉండదా?
గుత్తా జ్వాలకు కోపం వచ్చింది! గోప్యం లేకుండా మాట్లాడింది! గుప్త జ్వాల ఎగిసిపడింది!!

మీ ఆటకు బదులు మీ దుస్తులు, వేషధారణ గురించి మాట్లాడితే మీకు బాధనిపించదా?
మన దేశంలో విషాదం ఏంటంటే.. ఒక స్పోర్ట్స్ ఉమన్ అంటే సరిగ్గా డ్రెసప్ కాకూడదు. మేకప్ వేసుకోకూడదు. అలా వ్యక్తిగత శ్రద్ధ చూపించకపోతేనే వాళ్లు వాళ్ల కెరీర్ పట్ల ఫోకస్డ్‌గా ఉన్నట్టు లెక్క. ఒక్క స్పోర్ట్సే కాదు.. ఏ కెరీర్‌లోనైనా అంతే. అమ్మాయి కొంచెం పర్సనల్ కేర్ తీసుకున్నట్టు కనపడితే చాలు. ఈజీగా ముద్ర వేసేసారు. మ్యానిక్యూర్, పెడీక్యూర్ లాంటివి పర్సనల్ హైజీన్ అన్న విషయాన్ని అర్థం చేసుకోరు. కొంచెం బ్రైట్‌గా కనపడితే చాలు... ఫాస్ట్ అంటారు.. యాక్టివ్ అంటారు. సచ్ ఎ హారిబుల్ థింగ్. భవిష్యత్‌లో వాళ్లూ ఆడపిల్లలకు తండ్రులవుతారనే  ఆలోచన ఎందుకు రాదో... అర్థం కాదు.

మీరేం మాట్లాడినా కాంట్రవర్సీ అంటారు. ఎందుకు?
యా... నన్ను, సానియాను కాంట్రావర్సీ క్వీన్స్ అంటారు. కానీ, నేనెప్పుడు కాంట్రవర్సీ చేశానండీ? ఎవరినైనా తిడితే.. కొడితే కాంట్రవర్సీ. మా ైరైట్స్ గురించి మాట్లాడితే కాంట్రావర్సీయా? నేను, ఈవెన్ సానియా.. మేమెప్పుడూ మా హక్కుల గురించే మాట్లాడాం. మన దేశంలో ఇప్పటికీ మనం రైట్స్ గురించి పోట్లాడాల్సిన దుఃస్థితి. హక్కుల గురించి పోరాడే మహిళలపై చాలా తేలికగా ముద్ర వేస్తారు.

మీరు ఇతర స్పోర్ట్స్‌పర్సన్స్‌కు మద్దతిచ్చినట్టు మీకు వాళ్ల  మద్దతు దొరికిందా?
ఏ స్పోర్ట్స్ పర్సన్ గురించి ఎవరు తక్కువగా మాట్లాడినా, నేను సహించను. వాళ్లకు సపోర్ట్‌గా నిలబడతాను. నా విషయంలో వాళ్లు అలాగే స్పందించాలని ఎక్స్‌పెక్ట్ చేయను. నాతోపాటు నిలబడితే అది నాకు కాదు... వాళ్లకే హెల్ప్ అవుతుంది. వాళ్లు నా కోసం ఫైట్ చేయనప్పుడు వాళ్ల కోసం వాళ్లూ ఫైట్ చేసుకోలేరు కదా!

మిగిలిన ప్లేయర్స్‌లా మీకూ ఎంకరేజ్‌మెంట్ దొరికిందా?
టిల్ డేట్ నేను గవర్నమెంట్‌ని డబ్బులు అడగలేదు. ‘పద్మశ్రీ’ అవార్డ్ అడగలేదు. అవి వస్తే వస్తాయి.. అది సెకండరీ.. రెస్పెక్ట్  మాత్రం కోరుకున్నాను. మొన్న ఒలింపిక్స్ నుంచి సింధు వచ్చాక అందరూ ‘వాళ్ల ఫాదర్ ఇంత కష్టపడ్డారు.. అంత కష్టపడ్డారు’ అని అన్నారు. నో డౌట్ దె వర్క్డ్ హార్డ్. బట్ ఎవ్రీబడీ వర్క్స్ హార్డ్. స్పోర్ట్స్ పర్సన్స్ అందరి పేరెంట్స్ అంతే కష్టపడ్తారు. కాని సింధుకు దొరికిన సపోర్ట్ ఏంటి? మిగతావాళ్లకు అందిన సపోర్ట్ ఏంటి? అని ఎవరూ ఎందుకు అడగరు? ఈవెన్ సానియా విషయంలో కూడా అంతే కదా... షి హ్యాడ్ జీవీకే స్పాన్సర్స్ ఆల్ ద టైమ్. తెలంగాణ గవర్నమెంటూ సపోర్ట్ చేసింది. వియ్ నెవర్ గాట్ ఎనీ సపోర్ట్. దీని గురించి నేను నిజాలు మాట్లాడితే ఇష్టపడరు. కాంట్రవర్సీ చేస్తారు.

అయితే ఎవరి సపోర్టూ అందలేదంటారా?
హూ సపోర్టెడ్ మి?మా తల్లితండ్రులు నా ఆట కోసం డబ్బు ఖర్చుపెట్టారు. నేను నా బ్లడ్ ధారపోశా. బాడ్మింటన్‌కు నా లైఫ్ ఇచ్చా. ఐ బికేమ్ నేషనల్ ఛాంపియన్ బై మై ఓన్. ఐ బికేమ్ ఇంటర్నేషనల్ ఛాంపియన్. కామన్‌వెల్త్ గేమ్స్ మెడల్, గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్... హ్యావ్ డన్ వెల్. నేను పాపులర్ అయింది, ఫేమస్ అయింది నా ఆటతీరుతో, మీడియా సపోర్ట్‌తో. నేను కృతజ్ఞురాలినంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకే. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే మా ట్రిప్స్‌కి ఫండింగ్ చేసింది. ఇంకెవరూ ఏమీ చేయలేదు. అలాగని ఎవరిపై కంప్లయింట్స్ లేవు. ఈరోజు ఎవరు పీఆర్ మెయిన్‌టైన్ చేయగలరో వాళ్లకే గుర్తింపు. పని మీదే దృష్టిపెట్టే వాళ్లకు ఏ గుర్తింపు లేదు. మా డాడీ చెప్పే ‘యు హ్యావ్ టు ఫైట్ యువర్ ఓన్ బాటిల్’ అనే మాట నమ్ముతా.. ఆచరిస్తా! 

అబద్ధాలు, రూమర్స్ ప్రచారం గురించి?
నా గురించి అబద్ధాలు, రూమర్స్ నమ్మడం ఈజీ. మే బీ బికాజ్ ఆఫ్ మై పర్సనాలిటీ. ఐయామ్ వెరీ టాల్ అండ్ బ్రాడ్ పర్సనాలిటీ. యారగెంట్‌నని.. నాట్ ఫ్రెండ్లీ అనీ నిర్ధారణకు వచ్చేస్తారు. పైగా, ఐ హ్యావ్ కలర్డ్ మై హెయిర్.. ఐ లైక్ టు టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. కొంచెం ప్రెజెంటబుల్‌గా కనిపిస్తాను... కాబట్టి నా మీద వచ్చిన రూమర్స్‌ను జనాలు ఈజీగా నమ్మేస్తారు. నమ్మించేలా  డర్టీ గిమ్మిక్స్ కూడా ప్లే చేస్తారు. కాని అవి నన్ను హర్ట్ చేస్తాయని, నాకూ ఓ కుటుంబం ఉంటుందని, ఫ్రెండ్స్ ఉంటారని ఆలోచించరు. నిజానికి నాది చాలా ఫ్రెండ్లీ నేచర్. ప్రాక్టీస్ తర్వాత ఇంట్లో, రెస్టారెంట్లలో నా ఫ్రెండ్స్‌తో హ్యాంగవుట్ అవాలనుకుంటా... అవుతాను.

 ఇండిపెండెంట్ విమెన్‌పై మనవాళ్ల వైఖరిపై మీ వ్యాఖ్య?
ఉయ్ లివ్ ఇన్ ఎ ఫ్రీ కంట్రీ. బట్ ఇన్ ఎ హిపొక్రటిక్ కంట్రీ. ఇండిపెండెంట్ విమెన్ పట్ల మన మైండ్ సెట్స్ ఛేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇండిపెండెంట్ అనగానే సమ్‌థింగ్ ఈజ్ రాంగ్ అంటారు. దట్ ఈజ్ సచ్ ఎ హోప్‌లెస్, డర్టీ థింకింగ్. అయామ్ టెల్లింగ్ ఇట్ టుడే... అలా రాంగ్‌గా ఉండేది ఎక్కువగా మగవాళ్లే. కాని అబ్బాయికి అలాంటి పేరు లేదు. అమ్మాయికి మాత్రం పేరు పెడతారు. విచ్ ఈజ్ రియల్లీ సిక్. షేమ్ ఆన్ దోస్ పీపుల్ హూ థింగ్ లైక్ దట్.

మీకు లేనివాటిని మీకు అపాదిస్తున్నట్టు అనిపిస్తోందా?
అయామ్ వెరీ వార్మ్ పర్సన్. పీపుల్ లైక్ టు ఎజ్యూమ్. అండ్ దే ఆల్వేజ్ డన్ ఇట్ విత్ మి... చిన్నప్పటి నుంచి. నా గురించి తెలియని వాళ్లు నన్నెందుకు డిస్‌లైక్ చేస్తారో? నన్ను ఇష్టపడక పోవడానికి వాళ్లకుండే కారణాలు వాళ్లకుండొచ్చు. అది వాళ్ల సొంతం. నాకర్థమైంది ఏంటంటే.. నన్ను ఇష్టపడకపోవడానికి వాళ్ల ఇగో ఓ రీజన్ కావచ్చు. నేను మాత్రం అందరికీ ఒకే రకమైన గౌరవం ఇస్తాను. ఇంట్లో పనిచేసేవాళ్లను కూడా మా ఫ్యామిలీ మెంబర్స్‌గానే ట్రీట్ చేస్తాను. అలా పెంచారు మా డాడీ.

మీ మ్యారీడ్ లైఫ్...?
నేను పెళ్లి చేసుకునే నాటికి అంత పాపులర్ కాదు. ఫేమస్ కాదు. ఐ వజ్ వెరీ ఇన్నోసెంట్ ఎట్ దట్ టైమ్. ఆ పెళ్లి ద్వారా చాలా నేర్చుకున్నాను. అదే సమయంలో మా అమ్మానాన్నలను చూసీ చాలా అర్థం చేసుకున్నాను. పెళ్లి అనేది భార్యభర్తలిద్దరిలో ఎవరికీ రిస్ట్రిక్షన్‌లా ఉండకూడదు. మేల్ అండ్ ఫీమేల్ షుడ్ గ్రో టుగెదర్.  భర్తకు చేదోడుగా భార్య, భార్యకు చేయూతగా భర్తా ఉండాలి. మా  విషయంలో అలా జరగలేదు. సమ్‌వేర్ ఐ థాట్ ఉయ్ వర్ నాట్ గ్రోయింగ్.. ఇంకేవో కొన్ని విషయాలు. వీటన్నిటితో ఆ రిలేషన్ కంటిన్యూ చేయలేననిపించింది. విడిపోయాం.

 ఇప్పుడు పెళ్లి గురించి మళ్లీ ఆలోచిస్తున్నారా?
ఎందుకు ఉండదు? అయితే నాకు కొంచెం భయం. అంత త్వరగా ఎవరినీ నమ్మలేను. మనుషులను అంచనా వేయడంలో చాలా పూర్. మా పేరెంట్స్ ట్రూత్‌ఫుల్‌గా ఉండడమే నేర్పించారు. నా ఈ నేచర్, నా ఎక్స్‌పిరీయెన్సెస్ వల్ల అంత త్వరగా కమిట్ కాలేను. బట్ యెస్.. పెళ్లి చేసుకునే ఆలోచనైతే ఉంది. కానీ నాకు కావల్సిన మనిషి ఇంకా దొరకలేదు. టాల్‌గా కూడా ఉండాలి (నవ్వుతూ).

 మీ సినిమా ఎంట్రీ.. ఎక్స్‌పెక్టెడా? అనెక్స్‌పెక్టెడా?
నితిన్ నాకు మంచి ఫ్రెండ్. మాకు ఓ కామన్ గ్రూప్ ఉంది. ఓ సారి అందరం కలిసి డిన్నర్ చేస్తుంటే.. ‘జ్వాలా! నా మూవీలో యాక్ట్ చేస్తావా?’అని అడిగాడు. నేను అంతే కాజ్యువల్‌గా ‘ఆ చేస్తాను’ అని చెప్పి ఆ విషయం మరిచిపోయా. త్రీ మంత్స్ తర్వాత ‘జ్వాలా! సాంగ్ రెడీ’ అంటూ వచ్చాడు. ఐ వజ్ షాక్డ్. ఆ టైమ్‌లో బాడ్మింటన్ కూడా ఎక్కువగా ఆడట్లేదు. సో చేసేశాను.

భవిష్యత్తులో  చేసే అవకాశం ఉందా?
ఫ్యూచర్‌లో... ఐ డోంట్ థింక్. ఇప్పటి వరకు నా లైఫ్‌లో చాలా హార్డ్ వర్క్ చేశా. ఇప్పుడు ఓ కొత్త ఫీల్డ్‌లోకి వెళ్లి మళ్లీ అక్కడ స్ట్రగుల్ చేయడం ఇష్టం లేదు. ఐ లైక్ చాట్ షోస్. వాటిని హోస్ట్ చేయడం లాంటివైతే ఓకే. ఐ వాంట్ టు టీచ్ యూత్ టు డీల్ విత్ ట్రూత్.

కోచ్‌గా మారే అవకాశం ఏమైనా ఉందా?
నాకు పేషెన్స్ తక్కువ. సో మంచి కోచ్‌ని కాలేను. అయితే మన దగ్గర కోచ్‌లను గౌరవించే కల్చర్ లేదు. అలాంటి కల్చర్‌ను పెంచాలనైతే ఉంది. గవర్నమెంట్ సహాయంతో విమెన్ స్పోర్ట్స్‌ను ఎంకరేజ్ చేయాలని ఉంది.  మన దగ్గర మంచి పనులకు అవకాశాలు త్వరగా దొరకవుగా. ఎన్నాళ్లో నుంచో ప్రయత్నిస్తున్నా. చూద్దాం!

ఫ్యూచర్‌లో ఎలాంటి వాతావరణం కోరుకుంటున్నారు?
పదిహేనేళ్ల కిందట ఉన్న మంచి వాతావరణం.. భద్రతా ఇప్పుడు లేవు. ఆడవాళ్లను గౌరవంగా చూడాలని, వాళ్లనూ మనుషులుగానే పరిగణించాలని మన మగపిల్లలకు నేర్పించట్లేదు. ఐఫోన్ 7 ఉంటేనో, బీఎమ్‌డబ్ల్యూ కారు ఉంటేనో డెవలప్ అయినట్టు కాదు. ఆడవాళ్లు మగవాళ్లతో సమాన గౌరవం పొందగలిగినప్పుడు, ఆమె భద్రంగా ఉండగలిగినప్పుడే ఈ సొసైటీ డెవలప్ అయినట్టు! మా ఇంట్లో అలాంటి ఎట్‌మాస్ఫియరే ఉంది.  మా అమ్మ విషయంలో, మా విషయంలో దేనికీ రిస్ట్రక్షన్స్ పెట్టలేదు మా నాన్న. ఉయ్ నీడ్ మెన్ లైక్ హిమ్. అలాగే ఆడవాళ్లూ సాటి ఆడవాళ్లకి సపోర్ట్‌గా నిలవాలి. ఇది ఇంటి నుంచే మొదలుకావాలి. ఎందుకంటే పిల్లలు చెబితే నేర్చుకోరు, చూసి నేర్చుకుంటారు. ఇంట్లో ఆడపిల్లను గౌరవించే వాతావరణం ఉంటే అదే పిల్లలకూ అలవడుతుంది!

రాజకీయాల్లోకి వచ్చే చాన్స్ ఉందా?
టు డూ సమ్‌థింగ్ గుడ్ యు నీడ్ పవర్.. సో ఐ విల్ సీ. నాలాంటి అభిప్రాయాలు, ఆశయాలు ఉన్న ఏ రాజకీయవేత్తలైనా నాకు అవకాశం ఇస్తే, నేననుకున్నది చేయగల స్వేచ్ఛను ఇస్తే.. డెఫినెట్లీ డు. ఒకవేళ అలాంటి చాన్స్ వస్తే అధికారాన్ని ఈ దేశంలోని  మహిళలు, చిన్న పిల్లల సంక్షేమం కోసం వినియోగిస్తా!

‘గాంధీ’ కోసం వచ్చాం!
డాడీ (గుత్తా క్రాంతి), మమ్మీ (ఎలెన్) మహారాష్ట్రలోని సేవాగ్రామ్‌లో  ఒకటే కాలేజ్‌లో చదువుకున్నారు.  మా ముత్తాత మహాత్మాగాంధీ శిష్యులు. ఆయన మహాత్మాగాంధీ బయోగ్రఫీని చైనీస్‌లోకి ట్రాన్స్‌లేట్ చేయడానికి సేవాగ్రామ్ వచ్చారు. వస్తూ వస్తూ తన వెంట మా మమ్మీని కూడా తీసుకొచ్చారు.  అలా కాలేజ్‌లో కలుసుకున్న మమ్మీ డాడీల పరిచయం... ప్రేమగా, ఆ తర్వాత పెళ్లిగా మారింది. డాడీ నాగ్‌పూర్‌లో రిజర్వ్‌బ్యాంక్‌లో పనిచేసేవారు. నేను అక్కడే పుట్టాను. నాకు ఓ చెల్లి (ఇన్సీ). నా నాలుగో ఏట హైదరాబాద్‌కి వచ్చాం.

పుల్లెల గోపీచంద్‌తో గొడవేంటి?
నాకూ తెలియదు. టిల్ డేట్ ఐ రియల్లీ వండర్. నాకొకటే బ్యాడ్ ఫీలింగ్.. ఏంటంటే.. సింగిల్స్‌కి సపోర్ట్ చేసినట్టు డబుల్స్‌కి ఆయన ఎప్పుడూ సపోర్ట్ చేయలేదు. ఇప్పటికీ  చేయట్లేదు.. వై? వాట్ ఈజ్ ద రీజన్? గివ్ మి వన్ రీజన్ అని అడుగుతున్నా. ఇఫ్ హి కెన్ మేక్ సింధూ..  కెన్ మేక్ అనదర్  డబుల్స్ ఛాంపియన్.. మిక్స్‌డ్ డబుల్స్ ఛాంపియన్.. విమెన్  డబుల్స్ ఛాంపియన్. ‘ఐ వజ్ వరల్డ్ నంబర్ 6... యు డోంట్ వాంట్ టు గివ్ మి ఎనీ రెస్పెక్ట్.. ఫైన్! ఎంకరేజ్ ది అదర్ డబుల్స్.. వై నాట్?’ ఇది మాట్లాడ్డానికి  చాలామంది ప్లేయర్స్ భయపడ్తారు. నా విషయంలో ఏం జరుగుతోందో చూస్తున్నారుగా.

నితిన్ క్లోజ్... ఐ లవ్ ప్రభాస్... నాని కూడా ఇష్టం..!
వెస్ట్రన్ వేర్, ట్రెడిషనల్ వేర్ రెండూ ఇష్టపడతా. చీరలంటే చాలా ఇష్టం. సిన్మాలు బాగా చూస్తా. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అన్నీ! తెలుగు హీరోల్లో  ఐ లవ్ ప్రభాస్. నానీ అంటే కూడా ఇష్టమే. హి ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆల్సో. ఐ హ్యావ్ మెట్ ప్రభాస్ వన్స్ ఆర్ ట్వయిస్. హి ఈజ్ సో టాల్ ఆల్సో. వీ డోన్ట్ హ్యావ్ టాల్ మెన్ కదా! (నవ్వు)     - సరస్వతి రమ

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement