అభినందనల పర్వం
ఒలింపిక్స్‌లో రజతం గెలిచిన సింధుపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురిసింది.
‘ధృడ సంకల్పంతో అద్భుతంగా ఆడావు. దేశం తరఫున రజతం సాధించినందుకు అభినందనలు’ - రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
‘ఫైనల్లో మంచి పోరాటాన్ని ప్రదర్శించావు. రియోలో నీ ప్రదర్శన స్ఫూర్తిదాయకం. కొన్నేళ్లు గుర్తుండిపోతుంది’ - ప్రధాని మోదీ
‘పీవీ సింధు పోరాటం అద్భుతం. ఈ కృషికి కారణమైన కోచ్ గోపీచంద్‌కు కూడా అభినందనలు’ - తెలంగాణ సీఎం కేసీఆర్
‘ఈ గెలుపు చరిత్రాత్మకం. ఇది తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా మరిన్ని విజయాలకు నాంది పలికే స్ఫూర్తిమంతమైన విజయం’ - వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి
‘సింధు పోరాట పటిమ నూరు కోట్ల భారతీయులకు స్ఫూర్తి నిచ్చింది. స్వర్ణం కోసం తుది వరకూ పోరాడిన సింధు యువతరానికి గర్వకారణం’ - ఏపీ సీఎం చంద్రబాబు
‘చిన్న వయస్సులోనే ఒలింపిక్ పతకం సాధించినందుకు అభినందనలు.అద్భుతంగా ఆడి మా హృదయాలను కొల్లగొట్టావు’ - సచిన్ టెండూల్కర్
‘వారం రోజుల క్రితం కంటే ఇప్పుడే ఎక్కువగా ‘బాధపడుతున్నాను’. పీవీ సింధు నాకు స్ఫూర్తిగా నిలిచావు’ - అభినవ్ బింద్రా
‘విజేతకు ఫైనలిస్ట్‌కు తేడా స్వల్పం మాత్రమే. నీ ప్రదర్శనతో గర్విస్తున్నాం. రజతాన్ని ఆస్వాదించు’ - విశ్వనాథన్ ఆనంద్
సింధు సాధించిన విజయం దేశంలోని లక్షలాది చిన్నారులకు ఈ ఆట పట్ల ఆసక్తిని కలిగిస్తుంది. ప్రపంచ స్థాయిలో భారత బ్యాడ్మింటన్ ప్రతిభను చూపగలిగింది’ - బాయ్ అధ్యక్షుడు అఖిలేష్ దాస్ గుప్తా
కనకవర్షం: సింధు రజతం సాధించడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.కోటి నజరానా ప్రకటించింది. భారత బ్యాడ్మింటన్ సమాఖ్య (బాయ్) కూడా తనకు రూ.50 లక్షలు, కోచ్ గోపీచంద్‌కు రూ.10 లక్షలు ఇవ్వనుంది. అలాగే మధ్యప్రదేశ్ ప్రభుత్వం రూ.50 లక్షల రివార్డును ప్రకటించింది.