'సాన్ టినా' ఖాతాలో ఎనిమిదో టైటిల్ | Sania-Hingis pair wins 8th tittle | Sakshi
Sakshi News home page

'సాన్ టినా'ఖాతాలో ఎనిమిదో టైటిల్

Published Sat, Oct 10 2015 9:23 PM | Last Updated on Sun, Sep 3 2017 10:44 AM

'సాన్ టినా' ఖాతాలో ఎనిమిదో టైటిల్

'సాన్ టినా' ఖాతాలో ఎనిమిదో టైటిల్

బీజింగ్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా-మార్టినా హింగిస్(స్విట్జర్లాండ్)లు మరో టైటిల్ ను సాధించి తమ జోడీకి తిరుగులేదని నిరూపించుకున్నారు. చైనా ఓపెన్ కు ముందు సాన్ టినా పేరుతో బరిలో దిగిన ఈ జోడీ తుది పోరులో చైనీస్ తైపీ జంటపై విజయం సాధించి టైటిల్ ను చేజిక్కించుకుంది.  చైనా ఓపెన్ డబ్యూటీఏ ఫైనల్ పోరులో సానియా జోడి  6-7 (9/11), 6-1, 10-8 తేడాతో హౌచింగ్‌ చాన్‌-యంగ్ జన్ చెన్ పై విజయం సాధించి టైటిల్ తమ ఖాతాలో వేసుకుంది.

హోరాహోరీగా సాగిన తొలి సెట్ టై బ్రేక్ దారి తీసింది. ఆ సెట్ ను కోల్సోయిన సానియా జోడీ అనంతరం పుంజుకుది. సానియా జంట రెండో సెట్ లో దూకుడుగా ఆడి ఆ సెట్ ను కైవసం చేసుకుంది. ఇక నిర్ణయాత్మక మూడో సెట్ లో సానియా జోడీ పోరాడి గెలిచి టైటిల్ ను సాధించింది. దీంతో ఈ జోడీ సాధించిన టైటిల్ సంఖ్య ఎనిమిదికి చేరగా,  వరుసగా నాలుగో టైటిల్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement