Hingis
-
'ఇంగువ'ని ఇలా తీసుకుంటే ఈజీగా బరువు తగ్గుతారు!
మనం వంటల్లో వాడే ఇంగువతో బోలెడెన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీన్ని మన ఆహారంలో చేర్చడం వల్ల జీర్ణ సమస్యలు ఉండవు. అలాగే బరువు తగ్గాలనుకునేవారికి ఇది ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుందని చెబుతున్నారు ఆరోగ్యనిపుణులు. ఇంగువని నిపుణులు చెప్పిన విధానంలో గనుక తీసుకుంటే సులభంగా బరువు తగ్గుతారు. దీన్ని 'హింగ్' లేదా 'ఇంగువ' అని కూడా పిలుస్తారు. ఇది చాలా శక్తిమంతమైన మసాలా. దీన్ని మీ రోజూవారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల జీర్ణ సంబంధ సమస్యల నుంచి సత్వరమే బయటపడొచ్చని చెబుతున్నారు నిపుణులు. జీర్ణ ఎంజైమ్‌లను ప్రేరేపించి మెరుగైన పోషక శోషణను ఇస్తుందని చెబుతున్నారు. అలాగే అజీర్ణం, గ్యాస్, ఉబ్బరం తదితర సమస్యల నుచి రిలీఫ్ పొందగలరని చెబుతున్నారు. బరువు తగ్గాలనుకునేవారు మాత్రం ఇలా ఇంగువ వాటర్‌ని ఇలా తయారు చేసుకుని తాగితే చక్కటి ఫలితం ఉంటుందని చెబుతున్నారు. ఇంగువ వాటర్ తయారీ విధానం: 1/4 టీస్పూన్ హింగ్ (ఇంగువ లేదా ఆసుఫోటిడా) 1 గ్లాసు వెచ్చని నీరు తయారీ విధానం: గోరు వెచ్చని నీటిలో ఇంగువ వేసి కలపండి. ఇంగువ పూర్తిగా నీటిలో కరిగిపోయేంత వరకు కాసేపు అలానే ఉంచండి. కాసేపటి తర్వాత ఆ నీటిని తాగండి. ఇలా పరగడుపునే ఖాళీ కడుపుతో తీసుకోంటే బరువు తగ్గడం ఖాయం అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. (చదవండి: టమాటాలు ఫ్రిజ్‌లో పెడుతున్నారా? హెచ్చరిస్తున్న శాస్త్రవేత్తలు!) -
సెమీస్‌లో సానియా-హింగిస్ జంట
డబ్ల్యూటీఏ ఫైనల్స్ టోర్నీ సింగపూర్: టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నమెంట్ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంట శుభారంభం చేసింది. శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్స సానియా-హింగిస్ 7-6 (12/10), 7-5తో హావో చింగ్ చాన్-యుంగ్ జాన్ చాన్ (చైనీస్ తైపీ)లపై కష్టపడి గెలుపొందారు. గంటా 54 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఇండో-స్విస్ జోడీకి గట్టిపోటీనే లభించింది. తొలి సెట్లో 5-6తో వెనుకబడిన దశలో ప్రత్యర్థి జంట సర్వీస్‌ను బ్రేక్ చేసిన సానియా-హింగిస్ జంట స్కోరును సమం చేసింది. టైబ్రేక్‌లో మూడు సెట్ పారుుంట్లను కాపాడుకొని చివరకు 12-10తో పైచేరుు సాధించి తొలి సెట్‌ను దక్కించుకుంది. రెండో సెట్లో సానియా జోడీ 4-2తో ఆధిక్యంలోకి వెళ్లినా ఆ వెంటనే వరుసగా మూడుగేమ్లు కోల్పోరుు 4-5తో వెనుకబడింది. అరుుతే పదో గేమ్‌లో తమ సర్వీస్‌ను నిలబెట్టుకొని... 11వ గేమ్‌లో చాన్ సిస్టర్స్ సర్వీస్‌ను బ్రేక్ చేసి సానియా జంట 6-5తో ముందంజ వేసింది. 12వ గేమ్‌లో మరోసారి తమ సర్వీస్‌ను కాపాడుకొని ఈ ఇండో-స్విస్ జోడీ విజయాన్ని ఖాయం చేసుకుంది. శనివారం జరిగే సెమీఫైనల్లో హలవకోవా-హర్డెకా (చెక్ రిపబ్లిక్) లేదా వెస్నినా-మకరోవా (రష్యా) జోడీతో సానియా ద్వయం తలపడుతుంది. -
సానియా జోడీ శుభారంభం
మియామి: టాప్ సీడ్ సానియా మీర్జా (భారత్)- హింగిస్ (స్విట్జర్లాండ్) జంట మియామి ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టెన్నిస్ టోర్నమెంట్లో శుభారంభం చేసింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సానియా-హింగిస్ 6-0, 6-4తో లారా అరుబరెనా (స్పెయిన్)-రలూకా (రుమేనియా)లపై గెలిచారు. ఇదే టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో ఆరో సీడ్ రోహన్ బోపన్న (భారత్)-ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా) జంటకు తొలి రౌండ్లోనే చుక్కెదురైంది. బోపన్న-మెర్జియా జోడీ 6-2, 4-6, 4-10తో ‘సూపర్ టైబ్రేక్’లో క్యువాస్ (ఉరుగ్వే) -గ్రానోలెర్స్ (స్పెయిన్) ద్వయం చేతిలో ఓడిపోయింది. -
‘గ్రాండ్’ హ్యాట్రిక్...
* సానియా-హింగిస్ జంటకే మహిళల డబుల్స్ టైటిల్ * వరుసగా మూడో గ్రాండ్‌స్లామ్ ట్రోఫీ మెల్బోర్న్: ఊహించిన ఫలితమే వచ్చింది. కొంతకాలంగా మహిళల డబుల్స్ టెన్నిస్‌ను శాసిస్తోన్న సానియా మీర్జా-మార్టినా హింగిస్ జంట తమ ఖాతాలో వరుసగా మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను జమ చేసుకుంది. గతేడాది వింబుల్డన్, యూఎస్ ఓపెన్ టైటిల్స్‌ను నెగ్గిన ఈ ద్వయం ఆస్ట్రేలియన్ ఓపెన్‌లోనూ అజేయంగా నిలిచింది. మహిళల డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకొని గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లలో ‘హ్యాట్రిక్’ సాధించి తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. శుక్రవారం జరిగిన ఫైనల్లో టాప్ సీడ్ సానియా-హింగిస్ జోడీ 7-6 (7/1), 6-3తో ఏడో సీడ్ ఆండ్రియా హలవకోవా-లూసీ హర్డెకా (చెక్ రిపబ్లిక్) జంటను ఓడించి చాంపియన్‌గా అవతరించింది. గంటా 45 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో సానియా జంటకు తొలి సెట్లో ప్రత్యర్థి నుంచి గట్టిపోటీనే లభించింది. రెండు జోడీలు తమ సర్వీస్‌లను కాపాడుకోవడంలో ఇబ్బంది పడ్డాయి. దాంతో తొలి సెట్లో ఏకంగా ఎనిమిది సార్లు సర్వీస్‌లు బ్రేక్ అయ్యాయి. తుదకు టైబ్రేక్‌లో సానియా జంట పైచేయి సాధించి తొలి సెట్‌ను 62 నిమిషాల్లో సొంతం చేసుకుంది. రెండో సెట్ ఆరంభంలోనే హర్డెకా సర్వీస్‌ను బ్రేక్ చేసిన సానియా-హింగిస్ జంట తర్వాత అదే జోరును కొనసాగించి 5-2తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఎనిమిదో గేమ్‌లో హింగిస్ తన సర్వీస్‌ను కోల్పోయినా... తొమ్మిదో గేమ్‌లో హర్డెకా సర్వీస్‌ను బ్రేక్ చేసిన ఈ ఇండో-స్విస్ ద్వయం విజయాన్ని దక్కించుకుంది. విజేతగా నిలిచిన సానియా-హింగిస్ జంటకు 6,35,000 ఆస్ట్రేలియన్ డాలర్ల (రూ. 3 కోట్ల 5 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 2000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. బహుమతి ప్రదానోత్సవంలో ఇద్దరికీ కలిపి ఒకే ట్రోఫీ అందజేస్తారు. ఆ తర్వాత ఇంటికి తీసుకెళ్లేందుకు ఇద్దరికీ వేర్వేరుగా ఒక్కో ట్రోఫీని ఇస్తారు. మిక్స్డ్ డబుల్స్‌లో నిరాశ: మహిళల డబుల్స్‌లో టైటిల్ నెగ్గిన సానియా మిక్స్డ్ డబుల్స్‌లో మాత్రం సెమీఫైనల్లో ఓడిపోయింది. హోరాహోరీగా సాగిన సెమీఫైనల్లో టాప్ సీడ్ సానియా-ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా) జంట 5-7, 6-7 (4/7)తో ఐదో సీడ్ ఎలీనా వెస్నినా (రష్యా)-బ్రూనో సోరెస్ (బ్రెజిల్) జోడీ చేతిలో పోరాడి ఓడిపోయింది. సెమీస్‌లో ఓడిన సానియా జంటకు 39,250 ఆస్ట్రేలియన్ డాలర్ల (రూ. 18 లక్షల 90 వేలు)ప్రైజ్‌మనీ దక్కింది. 36 వరుసగా సానియా-హింగిస్ సాధించిన విజయాలు. 8 ఈ ఇండో-స్విస్ జంట ఖాతాలో చేరిన వరుస టైటిల్స్ సంఖ్య. 6 మిక్స్డ్ డబుల్స్, మహిళల డబుల్స్‌ను కలిపి సానియా సాధించిన గ్రాండ్‌స్లామ్ టైటిల్స్. 21 సింగిల్స్, మహిళల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాలలో కలిపి హింగిస్ నెగ్గిన గ్రాండ్‌స్లామ్ టైటిల్స్. -
సానియా జోడీదే ఆస్ట్రేలియా ఓపెన్
-
సాన్ టినా ఎక్స్ ప్రెస్
♦ వరుసగా 29 మ్యాచ్‌లు గెలిచిన సానియా-హింగిస్ ♦ 1994 తర్వాత అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన జోడీగా గుర్తింపు ♦ సిడ్నీ ఓపెన్ ఫైనల్లో ఇండో-స్విస్ ద్వయం అంతర్జాతీయ యవనికపై అప్రతిహత జైత్రయాత్ర కొనసాగిస్తున్న సానియా-హింగిస్ జోడీ డబ్ల్యూటీఏ సర్క్యూట్లో 22 ఏళ్ల చరిత్రను తిరగరాసింది. వరుసగా 29 మ్యాచ్‌ల్లో గెలిచి 1994 తర్వాత ఈ ఘనత సాధించిన తొలి మహిళా జోడీగా రికార్డులకెక్కింది. లక్ష్యం పెద్దదే... ప్రస్తుతానికి సానియా-హింగిస్లు 1994 తర్వాత వరుసగా ఎక్కువ మ్యాచ్‌లు గెలిచిన రికార్డును మాత్రమే అందుకున్నారు. 1990లో జానా నవోత్నా-ఎలీనా సుకోవా నెలకొల్పిన 44 మ్యాచ్‌ల రికార్డును ఛేదించాలంటే సానియా జోడి ఇంకా 16 మ్యాచ్‌లు గెలవాలి. మహిళల డబుల్స్‌లో ప్రపంచ రికార్డు లక్ష్యం మాత్రం చాలా పెద్దగా ఉంది. 1983-85 మధ్య కాలంలో మార్టినా నవ్రత్తిలోవా-ఫామ్ ష్రివర్‌లు వరుసగా 109 మ్యాచ్‌ల్లో నెగ్గారు. సిడ్నీ: అవకాశం వచ్చిన ప్రతిసారి తమ రాకెట్ నైపుణ్యాన్ని చూపెడుతున్న సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)లు మహిళల డబుల్స్‌లో 22 ఏళ్ల చరిత్రను తిరగరాశారు. వరుసగా 29 మ్యాచ్‌ల్లో గెలిచి... 1994 తర్వాత అత్యధిక మ్యాచ్‌లు నెగ్గిన మహిళా జోడీగా రికార్డులకెక్కారు. సిడ్నీ ఓపెన్ ఫైనల్లోకి చేరుకోవడం ద్వారా ఇండో-స్విస్ ద్వయం ఈ ఘనత సాధించింది. దీంతో 1994లో గిగీ ఫెర్నాండేజ్ (ప్యూర్టోరికా-అమెరికా)-నటాషా జ్వెరెవా (బెలారస్) నెలకొల్పిన 28 విజయాల రికార్డు ఈ సందర్భంగా తుడిచిపెట్టుకుపోయింది. సిడ్నీ ఓపెన్‌లో భాగంగా గురువారం జరిగిన మహిళల డబుల్స్ సెమీస్‌లో ప్రపంచ నంబర్‌వన్ సానియా-హింగిస్ 4-6, 6-3, 10-8తో రాలుకా ఒలారు (రొమేనియా)-యారోస్లావా ష్వెదోవా (కజకిస్తాన్)లపై నెగ్గారు. గతేడాది వింబుల్డన్, యూఎస్ ఓపెన్, డబ్ల్యూటీఏ ఫైనల్స్‌తో కలిపి సానియా-హింగిస్ మొత్తం 9 టైటిల్స్ గెలిచారు. గతవారం బ్రిస్బేన్ టైటిల్ నెగ్గిన ఈ జంటకు ఇది రెండో ఫైనల్. గంటా 31 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థుల నుంచి ప్రతిఘటన ఎదురైనా... ఇండో-స్విస్ జోడి దీటుగా స్పందించింది. తొలి సెట్లో రెండు జంటలు చెరో మూడుసార్లు బ్రేక్ పాయింట్లను కాపాడుకున్నాయి. అయితే ఒలారు-ష్వెదోవా నాలుగో బ్రేక్ పాయింట్‌ను కాచుకుని 6-4తో సెట్‌ను కైవసం చేసుకుంది. రెండో సెట్లో వ్యూహం మార్చిన సానియా-హింగిస్.... ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేయడంతో పాటు తమ సర్వీస్‌లను కాపాడుకున్నారు. తొలి సర్వీస్‌లోనే 76 శాతం పాయింట్లను సాధించారు. నిర్ణయాత్మక మూడో సెట్లో రెండు జోడీలు తమ సర్వీస్ పాయింట్లను నిలబెట్టుకున్నా... కీలక దశలో ఒలారు-ష్వెదోవా డబుల్ ఫాల్ట్ చేయడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. దీన్ని ఆసరా చేసుకున్న సానియా వరుస పాయింట్లతో సెట్‌తో పాటు మ్యాచ్‌ను చేజిక్కించుకుంది. -
ప్రపంచ రికార్డు సమం
♦ సానియా-హింగిస్ ఖాతాలో ♦ వరుసగా 28వ విజయం ♦ సిడ్నీ ఓపెన్ సెమీస్‌లో ప్రవేశం సిడ్నీ: తమ విజయపరంపరను కొనసాగిస్తూ సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంట మహిళల డబుల్స్‌లో వరుస విజయాల ప్రపంచ రికార్డును సమం చేసింది. వరుసగా 28వ విజయం సాధించిన ఈ ఇండో-స్విస్ ద్వయం 1994లో గీగీ ఫెర్నాండెజ్ (ప్యూర్టోరికో-అమెరికా), నటాషా జ్వెరెవా (బెలారస్) జంట నెలకొల్పిన రికార్డును అందుకుంది. సిడ్నీ ఓపెన్ టోర్నమెంట్లో భాగంగా బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ సానియా-హింగిస్ జోడీ 6-2, 6-3తో చెన్ లియాంగ్-పెంగ్ షుయె (చైనా) జంటను ఓడించి సెమీఫైనల్‌కు చేరుకుంది. 59 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సానియా-హింగిస్ తమ సర్వీస్‌ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి జంట సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. గురువారం జరిగే సెమీఫైనల్లో రలూకా ఒలారూ (రుమేనియా)-యారోస్లావా ష్వెదోవా (కజకిస్తాన్) జంటతో సానియా-హింగిస్ జోడీ తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే సానియా-హింగిస్ వరుసగా 29 మ్యాచ్‌ల్లో నెగ్గిన జోడీగా ప్రపంచ రికార్డు సృష్టిస్తుంది. -
ఎదురులేని జోడి
లక్ష్యం ఎంత గొప్పగా ఉంటే.. సంకల్పం అంత బలంగా ఉంటుంది. ప్రత్యర్థులు ఎంత పటిష్టంగా ఉంటే.. ఆట కూడా అంతగా మెరుగవుతుంది. ఏ క్షణాన హింగిస్‌తో జత కట్టిందోగానీ భారత స్టార్ సానియా... టెన్నిస్‌లో ఎదురేలేకుండా దూసుకు పోతోంది. టోర్నీ ఎలాంటిదైనా.. ప్రత్యర్థులు ఎవరైనా... వరుస విజయాలతో దుమ్మురేపుతోంది. ఆటలో తిరుగులేని జోడిగా చెలామణి అవుతూ ఈ ఏడాది మహిళల డబుల్స్‌లో పదోసారి ఫైనల్లోకి ప్రవేశించింది. డబ్ల్యూటీఏ టూర్ ఫైనల్స్ టోర్నీ తుదిపోరుకు సానియా-హింగిస్ * ఈ ఏడాది పదో ఫైనల్‌కు అర్హత సింగపూర్: అప్రతిహత జైత్రయాత్ర చేస్తున్న భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జోడి.. ఈ ఏడాది పదో టోర్నీ ఫైనల్లోకి ప్రవేశించింది. ఆదివారం జరిగే ఫైనల్లో టైటిల్ గెలిస్తే ఈ ఏడాది ఈ జోడీ ఖాతాలో తొమ్మిదో టైటిల్ చేరుతుంది. డబ్ల్యూటీఏ టూర్ ఫైనల్స్‌లో భాగంగా శనివారం జరిగిన మహిళల డబుల్స్ సెమీస్‌లో టాప్‌సీడ్ సానియా-హింగిస్ 6-4, 6-2తో మూడోసీడ్ హవో చింగ్ చాన్-యంగ్ జాన్ చిన్ (చైనీస్‌తైపీ)పై అలవోకగా నెగ్గి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. సిన్సినాటి మాస్టర్స్ సెమీస్‌లో ఇదే ప్రత్యర్థి చేతిలో సానియా జోడి అనూహ్యంగా ఓటమిపాలైంది. ఇక అప్పట్నించి తలపడిన మూడుసార్లు ఇండో-స్విస్ జోడి పైచేయి సాధించి ప్రతీకారం తీర్చుకుంది. సానియా జోడికి ఇది వరుసగా 21వ విజయం కావడం విశేషం. గంటా 23 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి సెట్ ఆరంభంలో తైపీ జంట 3-1 ఆధిక్యాన్ని సాధించింది. కానీ తర్వాతి 14 గేమ్‌ల్లో సానియా-హింగిస్ ఏకంగా 11 గేమ్‌లను గెలిచి ప్రత్యర్థులను కోలుకోలేని దెబ్బతీశారు. ఆద్యంతం మంచి సమన్వయంతో కదులుతూ అద్భుతమైన ఫోర్‌హ్యాండ్, బ్యాక్‌హ్యాండ్ షాట్లతో అదరగొట్టిన సానియా-హింగిస్ మ్యాచ్ మొత్తంలో మూడు ఏస్‌లను సంధించింది. కీలక సమయంలో ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేయడంతో పాటు తమ సర్వీస్‌ను చేజార్చుకోకుండా కాపాడుకుంది. తమ సర్వీస్‌లో ఐదింటిలో రెండు బ్రేక్ పాయింట్లను కాపాడుకున్న ఇండో-స్విస్ జంట... ప్రత్యర్థి సర్వీస్‌లో మరో ఆరు బ్రేక్ పాయింట్లను నెగ్గింది. చాన్ సిస్టర్స్‌పై తాము ప్రత్యేకమైన వ్యూహాన్ని అవలంభించామని మ్యాచ్ అనంతరం సానియా వ్యాఖ్యానించింది. ‘చాలా భిన్నమైన రీతిలో ఆడాం. ముఖ్యంగా మూలాలకు కట్టుబడి ఆడాం. మేం అనుకున్న ప్రణాళికను చక్కగా అమలు చేయగలిగాం. మా బలం, నైపుణ్యంతో పాటు పరస్పరం నమ్మకం ఉంది. ఇవే చాలాసార్లు మ్యాచ్‌లు గెలిపించాయి. 1-3తో వెనుకబడ్డప్పుడు పోరాడాలని నిశ్చయించుకున్నాం. కచ్చితంగా ఏదో సమయంలో బ్రేక్ చేస్తామని అనుకున్నాం. మ్యాచ్‌లో అదే జరిగింది’ అని సానియా పేర్కొంది. -
'సాన్ టినా'ఖాతాలో ఎనిమిదో టైటిల్
-
'సాన్ టినా' ఖాతాలో ఎనిమిదో టైటిల్
బీజింగ్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా-మార్టినా హింగిస్(స్విట్జర్లాండ్)లు మరో టైటిల్ ను సాధించి తమ జోడీకి తిరుగులేదని నిరూపించుకున్నారు. చైనా ఓపెన్ కు ముందు సాన్ టినా పేరుతో బరిలో దిగిన ఈ జోడీ తుది పోరులో చైనీస్ తైపీ జంటపై విజయం సాధించి టైటిల్ ను చేజిక్కించుకుంది. చైనా ఓపెన్ డబ్యూటీఏ ఫైనల్ పోరులో సానియా జోడి 6-7 (9/11), 6-1, 10-8 తేడాతో హౌచింగ్ చాన్-యంగ్ జన్ చెన్ పై విజయం సాధించి టైటిల్ తమ ఖాతాలో వేసుకుంది. హోరాహోరీగా సాగిన తొలి సెట్ టై బ్రేక్ దారి తీసింది. ఆ సెట్ ను కోల్సోయిన సానియా జోడీ అనంతరం పుంజుకుది. సానియా జంట రెండో సెట్ లో దూకుడుగా ఆడి ఆ సెట్ ను కైవసం చేసుకుంది. ఇక నిర్ణయాత్మక మూడో సెట్ లో సానియా జోడీ పోరాడి గెలిచి టైటిల్ ను సాధించింది. దీంతో ఈ జోడీ సాధించిన టైటిల్ సంఖ్య ఎనిమిదికి చేరగా, వరుసగా నాలుగో టైటిల్. -
యూఎస్ ఓపెన్ విజేతలు మీర్జా-మార్టినా
-
'నయా' పేస్
♦ యూఎస్ ఓపెన్‌లో కొత్త అధ్యాయాన్ని లిఖించిన భారత వెటరన్ ♦ హింగిస్‌తో కలిసి ‘మిక్స్డ్’ టైటిల్ సొంతం రేసులోకి దూసుకొస్తున్న కుర్రాళ్ల దెబ్బకు సహచరులందరూ వెనుకబడుతున్నారు... ఒకనాటి ప్రత్యర్థులందరూ ఏదో రకంగా ఆటకు గుడ్‌బై చెప్పేస్తున్నారు... కానీ... భారత వెటరన్ లియాండర్ పేస్ మాత్రం వన్నె తగ్గని వజ్రంలా ఇంకా మెరుస్తూనే ఉన్నాడు..ముదిమి వయసు ముంచుకొస్తున్నా... అచంచల ఆత్మవిశ్వాసంతో ఆటకే సవాలు విసురుతున్నాడు. నాలుగు పదుల వయసులోనూ తన రాకెట్‌కు ‘నయా పేస్ (కొత్త వేగం)’ను జోడించి యూఎస్ ఓపెన్‌లో చెలరేగిపోయాడు. హింగిస్‌తో కలిసి మిక్స్డ్ డబుల్స్ టైటిల్ గెలిచి... ఓపెన్ ఎరాలో అత్యధిక గ్రాండ్‌స్లామ్ మిక్స్డ్ టైటిల్స్ నెగ్గిన ఆటగాడిగా సగర్వంగా రికార్డులకెక్కాడు. న్యూయార్క్ : వయసు పెరుగుతున్నా.. రాకెట్లో పదును తగ్గలేదని నిరూపిస్తున్న భారత వెటరన్ ఆటగాడు లియాండర్ పేస్ టెన్నిస్‌లో చరిత్ర సృష్టించాడు. స్విస్ ప్లేయర్ మార్టినా హింగిస్‌తో కలిసి యూఎస్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ టైటిల్‌ను గెలిచి కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఫైనల్లో నాలుగోసీడ్ పేస్-హింగిస్ 6-4, 3-6, 10-7తో అన్‌సీడెడ్ బెథానీ మాటెక్ సాండ్స్-సామ్ క్వైరీ (అమెరికా)పై విజయం సాధించారు. 77 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఇండో-స్విస్ జోడి 32 విన్నర్లు సంధించి, ఐదు బ్రేక్ పాయింట్ అవకాశాల్లో నాలుగింటిని కాపాడుకుంది. తొలిసెట్లో మాటెక్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన పేస్-హింగిస్ 2-1 ఆధిక్యంలోకి వెళ్లారు. బలమైన ఫోర్‌హ్యాండ్, బ్యాక్‌హాండ్ షాట్లతో చెలరేగిన ఈ జోడి సర్వీస్‌లోనూ నిలకడను చూపెట్టింది. మాటెక్-క్వైరీ కూడా తమ సర్వీస్‌లను కాపాడుకోవడంతో ఓ దశలో పేస్ జంట స్కోరు 5-4గా మారింది. పదో గేమ్‌లో ఓ అద్భుతమైన విన్నర్‌తో హింగిస్ సెట్‌ను సాధించింది. రెండోసెట్లో మాటెక్-క్వైరీ పోరాటం మొదలుపెట్టారు. మాటెక్ నేరుగా రెండు విన్నర్లు కొట్టడంతో పాటు హింగిస్ సర్వీస్‌ను బ్రేక్ చేయడంతో 3-1 ఆధిక్యంలోకి వెళ్లారు. అయితే 2-5తో వెనుకబడి ఉన్న దశలో హింగిస్ తన సర్వీస్‌లో మూడు సెట్ పాయింట్లను కాపాడుకుంది. కానీ తర్వాతి గేమ్‌లో క్వైరీ అద్భుతమైన సర్వీస్‌తో సెట్‌ను గెలవడంతో మ్యాచ్ టైబ్రేక్‌కు దారితీసింది. సూపర్ టైబ్రేక్‌లో అమెరికా ద్వయం హింగిస్ సర్వీస్‌లను బ్రేక్ చేస్తూ ఒక్కసారిగా 4-1 ఆధిక్యాన్ని సాధించింది. కానీ తర్వాతి 12 గేమ్‌ల్లో పేస్-హింగిస్ అసలు సిసలు ఆటను చూపెట్టారు. ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా 9 గేమ్‌లు గెలిచి సెట్‌తో పాటు చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకున్నారు. విశేషాలు ►ఓవరాల్‌గా ప్రస్తుతం మార్టినా నవ్రతిలోవా 10 టైటిల్స్‌తో అగ్రస్థానంలో ఉంది. మరో టైటిల్ గెలిస్తే పేస్ ఆమెను అందుకుంటాడు. ►తాజా విజయంతో పేస్-హింగిస్ 1969 తర్వాత ఒకే ఏడాదిలో మూడు గ్రాండ్‌స్లామ్ మిక్స్డ్ టైటిల్స్‌ను సాధించిన తొలి జంటగా రికార్డు సృష్టించారు. (ఈ సీజన్లో ఈ జోడి యూఎస్ ఓపెన్‌తో పాటు ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్ టైటిల్స్‌ను కూడా సాధించింది.) 46 ఏళ్ల కిందట మార్టి రెస్సైన్-మార్గరెట్ కోర్టు ఈ ఫీట్‌ను సాధించారు. ►ఓవరాల్‌గా పేస్‌కు ఇది 17వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ కాగా, హింగిస్‌కు 19వది. హింగిస్... టెన్నిస్‌లో ఉన్న నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను భారతీయులతోనే కలిసి గెలవడం విశేషం. -
ఫైనల్లో సానియా-హింగిస్ జంట
లండన్ : భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన కెరీర్లో తొలిసారి మహిళల డబుల్స్ విభాగంలో గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించేందుకు మరో విజయం దూరంలో నిలిచింది. వింబుల్డన్‌లో సానియా తన భాగస్వామి మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)తో కలిసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో టాప్ సీడ్ సానియా-హింగిస్ ద్వయం 6-1, 6-2తో రాకెల్ కాప్స్ జోన్స్-అబిగెయిల్ స్పియర్స్ (అమెరికా) జంటపై కేవలం 56 నిమిషాల్లో గెలిచింది. శనివారం జరిగే ఫైనల్లో రెండో సీడ్ ఎలీనా వెస్నినా-ఎకతెరీనా మకరోవా (రష్యా) జోడీతో సానియా జంట తలపడుతుంది. సానియా గెలిచిన మూడు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో వచ్చాయి. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో లియాండర్ పేస్ (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంట టైటిల్ పోరుకు అర్హత సాధించింది. సెమీఫైనల్లో పేస్-హింగిస్ జోడీ 6-3, 6-4తో మైక్ బ్రయాన్-బెథానీ మాటెక్ సాండ్స్ (అమెరికా) జంటపై గెలిచింది.