సెమీస్‌లో సానియా-హింగిస్ జంట | Sania-Hingis in semifinals | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో సానియా-హింగిస్ జంట

Published Fri, Oct 28 2016 11:57 PM | Last Updated on Mon, Sep 4 2017 6:35 PM

సెమీస్‌లో సానియా-హింగిస్ జంట

సెమీస్‌లో సానియా-హింగిస్ జంట

డబ్ల్యూటీఏ ఫైనల్స్ టోర్నీ


సింగపూర్: టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నమెంట్ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంట శుభారంభం చేసింది. శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్‌‌స సానియా-హింగిస్ 7-6 (12/10), 7-5తో హావో చింగ్ చాన్-యుంగ్ జాన్ చాన్ (చైనీస్ తైపీ)లపై కష్టపడి గెలుపొందారు. గంటా 54 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఇండో-స్విస్ జోడీకి గట్టిపోటీనే లభించింది. తొలి సెట్‌లో 5-6తో వెనుకబడిన దశలో ప్రత్యర్థి జంట సర్వీస్‌ను బ్రేక్ చేసిన సానియా-హింగిస్ జంట స్కోరును సమం చేసింది.


టైబ్రేక్‌లో మూడు సెట్ పారుుంట్లను కాపాడుకొని చివరకు 12-10తో పైచేరుు సాధించి తొలి సెట్‌ను దక్కించుకుంది. రెండో సెట్‌లో సానియా జోడీ 4-2తో ఆధిక్యంలోకి వెళ్లినా ఆ వెంటనే వరుసగా మూడుగేమ్‌లు కోల్పోరుు 4-5తో వెనుకబడింది. అరుుతే పదో గేమ్‌లో తమ సర్వీస్‌ను నిలబెట్టుకొని... 11వ గేమ్‌లో చాన్ సిస్టర్స్ సర్వీస్‌ను బ్రేక్ చేసి సానియా జంట 6-5తో ముందంజ వేసింది. 12వ గేమ్‌లో మరోసారి తమ సర్వీస్‌ను కాపాడుకొని ఈ ఇండో-స్విస్ జోడీ విజయాన్ని ఖాయం చేసుకుంది. శనివారం జరిగే సెమీఫైనల్లో హలవకోవా-హర్డెకా (చెక్ రిపబ్లిక్)  లేదా వెస్నినా-మకరోవా (రష్యా) జోడీతో సానియా ద్వయం తలపడుతుంది. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement