రెండు దశాబ్దాలుగా అంతర్జాతీయ యవనికపై భారత టెన్నిస్‌కు చిరునామాగా నిలిచిన సానియా మీర్జా తన కెరీర్‌కు వీడ్కోలు పలికింది. గత నెలలో ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ సందర్భంగా రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించిన ఈ హైదరాబాదీ స్టార్ దుబాయ్ ఓపెన్ తన కెరీర్‌లో చివరి టోర్నీ అని పేర్కొంది. మంగళవారం జరిగిన దుబాయ్ ఓపెన్ మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో సానియా (భారత్)–మాడిసన్ కీస్ (అమెరికా) జోడీ 4–6, 0–6తో వెరోనిక కుదెర్‌మెతోవా–లుది్మలా సమ్‌సనోవా (రష్యా) ద్వయం చేతిలో ఓడిపోయింది.
తన 20 ఏళ్ల ప్రొఫెషనల్ కెరీర్‌లో సానియా ఆరు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో కలిపి మొత్తం 43 డబ్ల్యూటీఏ టైటిల్స్ సాధించింది. 91 వారాలు డబుల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలిచింది. ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించింది. దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘ఖేల్ రత్న’... ‘అర్జున అవార్డు’... పౌర పురస్కారాలు ‘పద్మభూషణ్’, ‘పద్మశ్రీ’ అందుకుంది. వచ్చే నెలలో సానియా మీర్జా కొత్త పాత్రలో కనిపించనుంది. మహిళల ప్రీమియర్ లీగ్ టి20 క్రికెట్ టోర్నీలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు సానియా ‘మెంటార్’గా వ్యవహరించనుంది.
Comments
Please login to add a commentAdd a comment