ATP Challenger singles title
-
ఆటకు ఆల్విదా.. వీడ్కోలు పలికిన టెన్నిస్ దిగ్గజం
రెండు దశాబ్దాలుగా అంతర్జాతీయ యవనికపై భారత టెన్నిస్‌కు చిరునామాగా నిలిచిన సానియా మీర్జా తన కెరీర్‌కు వీడ్కోలు పలికింది. గత నెలలో ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ సందర్భంగా రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించిన ఈ హైదరాబాదీ స్టార్ దుబాయ్ ఓపెన్ తన కెరీర్లో చివరి టోర్నీ అని పేర్కొంది. మంగళవారం జరిగిన దుబాయ్ ఓపెన్ మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సానియా (భారత్)–మాడిసన్ కీస్ (అమెరికా) జోడీ 4–6, 0–6తో వెరోనిక కుదెర్మెతోవా–లుది్మలా సమ్సనోవా (రష్యా) ద్వయం చేతిలో ఓడిపోయింది. తన 20 ఏళ్ల ప్రొఫెషనల్ కెరీర్లో సానియా ఆరు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో కలిపి మొత్తం 43 డబ్ల్యూటీఏ టైటిల్స్ సాధించింది. 91 వారాలు డబుల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలిచింది. ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించింది. దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘ఖేల్ రత్న’... ‘అర్జున అవార్డు’... పౌర పురస్కారాలు ‘పద్మభూషణ్’, ‘పద్మశ్రీ’ అందుకుంది. వచ్చే నెలలో సానియా మీర్జా కొత్త పాత్రలో కనిపించనుంది. మహిళల ప్రీమియర్ లీగ్ టి20 క్రికెట్ టోర్నీలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు సానియా ‘మెంటార్’గా వ్యవహరించనుంది. -
రన్నరప్ సాకేత్
సాక్షి, హైదరాబాద్: కెరీర్లో రెండోసారి ఏటీపీ చాలెంజర్ సింగిల్స్ టైటిల్ సాధించాలని ఆశించిన హైదరాబాద్ టెన్నిస్ ప్లేయర్ సాకేత్ మైనేనికి నిరాశ ఎదురైంది. టర్కీలోని అగ్రి పట్టణంలో ఆదివారం ముగిసిన ఏటీపీ చాలెం జర్ టోర్నీలో సాకేత్ రన్నరప్‌గా నిలిచాడు. ఫైనల్లో ఎనిమిదో సీడ్ సాకేత్ 4-6, 4-6తో ఆరో సీడ్ ఫారూఖ్ దస్తోవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడిపోయాడు. 80 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత డేవిస్ కప్ జట్టు సభ్యుడైన సాకేత్ ఏడు ఏస్‌లు సంధించడంతోపాటు నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. రన్నరప్‌గా నిలిచిన సాకేత్‌కు 3,600 యూరోల (రూ. 2 లక్షల 63 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 55 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
సాకేత్‌కు డబుల్స్ టైటిల్
ఏటీపీ చాలెంజర్ టోర్నీ పుణే: గతవారం కెరీర్లో తొలి ఏటీపీ చాలెంజర్ సింగిల్స్ టైటిల్ నెగ్గిన ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ స్టార్ సాకేత్ మైనేని ఈ వారం డబుల్స్ టైటిల్‌ను సాధించాడు. శుక్రవారం జరిగిన పుణే ఏటీపీ చాలెంజర్ డబుల్స్ ఫైనల్లో సాకేత్-సనమ్ సింగ్ (భారత్) జంట 6-3, 6-2తో టాప్ సీడ్ సంచాయ్ రటివటానా-సొంచాట్ (థాయ్‌లాండ్) ద్వయ ంపై గెలిచింది. ఈ విజయంతో సాకేత్ జంటకు 3,100 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. లక్షా 89 వేలు)తోపాటు 90 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. సాకేత్ కెరీర్లో ఇది మూడో ఏటీపీ చాలెంజర్ టోర్నీ డబుల్స్ టైటిల్. సింగిల్స్‌లో సాకేత్ సెమీస్‌లో 6-7 (6/8), 4-6తో నాలుగో సీడ్ యూచి సుగిటా (జపాన్) చేతిలో ఓడిపోయాడు.