సాకేత్‌కు డబుల్స్ టైటిల్ | Saket to the doubles title | Sakshi
Sakshi News home page

సాకేత్‌కు డబుల్స్ టైటిల్

Published Sat, Oct 25 2014 1:42 AM | Last Updated on Sat, Sep 2 2017 3:19 PM

సాకేత్‌కు డబుల్స్ టైటిల్

సాకేత్‌కు డబుల్స్ టైటిల్

ఏటీపీ చాలెంజర్ టోర్నీ
 
పుణే: గతవారం కెరీర్‌లో తొలి ఏటీపీ చాలెంజర్ సింగిల్స్ టైటిల్ నెగ్గిన ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ స్టార్ సాకేత్ మైనేని ఈ వారం డబుల్స్ టైటిల్‌ను సాధించాడు. శుక్రవారం జరిగిన పుణే ఏటీపీ చాలెంజర్ డబుల్స్ ఫైనల్లో సాకేత్-సనమ్ సింగ్ (భారత్) జంట 6-3, 6-2తో టాప్ సీడ్ సంచాయ్ రటివటానా-సొంచాట్ (థాయ్‌లాండ్) ద్వయ ంపై గెలిచింది. ఈ విజయంతో సాకేత్ జంటకు 3,100 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. లక్షా 89 వేలు)తోపాటు 90 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. సాకేత్ కెరీర్‌లో ఇది మూడో ఏటీపీ చాలెంజర్ టోర్నీ డబుల్స్ టైటిల్.  సింగిల్స్‌లో సాకేత్ సెమీస్‌లో  6-7 (6/8), 4-6తో నాలుగో సీడ్ యూచి సుగిటా (జపాన్) చేతిలో ఓడిపోయాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement