సాకేత్ జోరు | Saketh Myneni trumps top seed for title | Sakshi
Sakshi News home page

సాకేత్ జోరు ఏటీపీ

Published Thu, Oct 23 2014 12:31 AM | Last Updated on Sat, Sep 2 2017 3:15 PM

సాకేత్ జోరు

సాకేత్ జోరు

ఏటీపీ  చాలెంజర్ టోర్నీ
 
పుణే: తన విజయపరంపర కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ యువతార సాకేత్ మైనేని ఏటీపీ చాలెంజర్ టోర్నీలో ముందంజ వేశాడు. పురుషుల సింగిల్స్‌లో క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టిన ఈ వైజాగ్ ప్లేయర్... డబుల్స్ విభాగంలో సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. సింగిల్స్ రెండో రౌండ్‌లో సాకేత్ కేవలం 55 నిమిషాల్లో 6-1, 6-2తో హిరోకి మొరియా (జపాన్)పై అలవోకగా గెలిచాడు. డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాకేత్-సనమ్ సింగ్ ద్వయం 7-6 (7/2), 6-2తో రెండో సీడ్ యూకీ బాంబ్రీ-దివిజ్ శరణ్ (భారత్) జంటను బోల్తా కొట్టించింది.


మరోవైపు హైదరాబాద్‌కు చెందిన విష్ణువర్ధన్, భారత నంబర్‌వన్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్, సనమ్ సింగ్, విజయ్ సుందర్ ప్రశాంత్ రెండో రౌండ్‌లోనే ఓడిపోయారు. విష్ణువర్ధన్ 2-6, 6-3, 3-6తో కిమెర్ కాప్‌జాన్స్ (బెల్జియం) చేతిలో; సోమ్‌దేవ్ 3-6, 6-7 (3/7)తో ఆడమ్ పావ్లాసెక్ (చెక్ రిపబ్లిక్) చేతిలో; సనమ్ సింగ్ 1-6, 2-6తో ఆడ్రియన్ మెనెడెజ్ (స్పెయిన్) చేతిలో; విజయ్ సుందర్ 0-6, 6-7 (5/7)తో కుద్రయెత్సెవ్ (రష్యా) చేతిలో ఓడిపోయారు. యూకీ బాంబ్రీ 7-5, 6-4తో గిగౌనోన్ (బెల్జియం)ను ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి చేరాడు. గురువారం జరిగే సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ నెదోవ్‌యెసోవ్ (కజకిస్థాన్)తో సాకేత్; యూచి సుగిటా (జపాన్)తో యూకీ బాంబ్రీ తలపడతారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement