సానియా జోడీ శుభారంభం | Sania Mirza-Martina Hingis move ahead to second round, Rohan Bopanna ousted | Sakshi
Sakshi News home page

సానియా జోడీ శుభారంభం

Published Sat, Mar 26 2016 12:42 AM | Last Updated on Sun, Sep 3 2017 8:34 PM

సానియా జోడీ శుభారంభం

సానియా జోడీ శుభారంభం

మియామి: టాప్ సీడ్  సానియా మీర్జా (భారత్)- హింగిస్ (స్విట్జర్లాండ్) జంట  మియామి ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో శుభారంభం చేసింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో సానియా-హింగిస్ 6-0, 6-4తో లారా అరుబరెనా (స్పెయిన్)-రలూకా (రుమేనియా)లపై గెలిచారు.

ఇదే టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో ఆరో సీడ్ రోహన్ బోపన్న (భారత్)-ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా) జంటకు తొలి రౌండ్‌లోనే చుక్కెదురైంది. బోపన్న-మెర్జియా జోడీ 6-2, 4-6, 4-10తో ‘సూపర్ టైబ్రేక్’లో  క్యువాస్        (ఉరుగ్వే) -గ్రానోలెర్స్ (స్పెయిన్) ద్వయం చేతిలో ఓడిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement