Open WTA Premier tennis tournament
-
‘ఇండియన్ వెల్స్’ చాంప్స్ బదోసా, కామెరాన్ నోరి
కాలిఫోర్నీయా: ప్రతిష్టాత్మక ఇండియన్ వెల్స్ ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్, ఏటీపీ మాస్టర్స్ సిరీస్ టోర్నీలో పౌలా బదోసా (స్పెయిన్), కామెరాన్ నోరి (బ్రిటన్) చాంపియన్స్‌గా అవతరించారు. మహిళల సింగిల్స్ ఫైనల్లో పౌలా బదోసా 7–6 (7/5), 2–6, 7–6 (7/2)తో మాజీ నంబర్‌వన్ అజరెంకా (బెలారస్)పై గెలిచింది. తాజా గెలుపుతో బదోసా 14 స్థానాలు ఎగబాకి 27వ ర్యాంక్ నుంచి 13వ ర్యాంక్‌కు చేరుకుంది. పురుషుల సింగిల్స్ ఫైనల్లో 26వ ర్యాంకర్ కామెరాన్ నోరి 3–6, 6–4, 6–1తో బాసిలాష్ విలి (జార్జియా)పై గెలిచి ఈ టోర్నీ చరిత్రలో విజేతగా నిలిచిన తొలి బ్రిటన్ ప్లేయర్‌గా నిలిచాడు. చాంపియన్స్ బదోసా, నోరికి 12,09,730 డాలర్ల (రూ. 9 కోట్ల 11 లక్షలు) చొప్పున ప్రైజ్‌మనీ దక్కింది. -
సానియా జోడీ శుభారంభం
మియామి: టాప్ సీడ్ సానియా మీర్జా (భారత్)- హింగిస్ (స్విట్జర్లాండ్) జంట మియామి ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టెన్నిస్ టోర్నమెంట్లో శుభారంభం చేసింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సానియా-హింగిస్ 6-0, 6-4తో లారా అరుబరెనా (స్పెయిన్)-రలూకా (రుమేనియా)లపై గెలిచారు. ఇదే టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో ఆరో సీడ్ రోహన్ బోపన్న (భారత్)-ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా) జంటకు తొలి రౌండ్లోనే చుక్కెదురైంది. బోపన్న-మెర్జియా జోడీ 6-2, 4-6, 4-10తో ‘సూపర్ టైబ్రేక్’లో క్యువాస్ (ఉరుగ్వే) -గ్రానోలెర్స్ (స్పెయిన్) ద్వయం చేతిలో ఓడిపోయింది.