సానియా మీర్జాతో పెళ్లి..? ఎట్టకేలకు స్పందించిన మహ్మద్‌ షమీ | Mohammed Shami Breaks Silence On Rumours Of Marriage With Sania Mirza, Deets Inside | Sakshi
Sakshi News home page

Sania-Shami Marriage Rumour: సానియా మీర్జాతో పెళ్లి..? ఎట్టకేలకు స్పందించిన మహ్మద్‌ షమీ

Published Sat, Jul 20 2024 11:34 AM | Last Updated on Sat, Jul 20 2024 12:44 PM

Mohammed Shami Breaks Silence On Rumours Of Marriage With Sania Mirza

టీమిండియా స్టార్ క్రికెట‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీ-టెన్నిస్ స్టార్ సానియా మీర్జా వివాహం చేసుకోబోతున్నారంటూ గ‌త కొన్ని రోజులగా ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఈ వార్త‌లను సానియా తండ్రి ఖండిస్తూ ఓ క్లారిటీ ఇచ్చిన‌ప్ప‌ట‌కి.. ఎదో ఒక చోట వీరిద్ద‌రూ పెళ్లి ప్రస్తావన వస్తోంది. 

అయితే ఎట్టకేలకు ఈ వార్తలపై మహ్మద్ షమీ స్పందించాడు. ఇటీవలే శుభంకర్ మిశ్రా అనే యూట్యూబర్‌కు షమీ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ క్రమంలో తన రెండో పెళ్లి గురుంచి వస్తున్న పుకార్లపై షమీని శుభంకర్ మిశ్రా ప్రశ్నించాడు.

"ప్రతీ ఒక్కరూ సోషల్ మీడియా పట్ల బాధ్యతగా వ్యవహరించాలి. సానియాతో నా పెళ్లి అనేది కేవలం రూమర్స్ మాత్రమే. ఇలాంటి నిరాధారమైన వార్తలను ప్రచారం చేయడం మానుకోవాలి. మీ సరదా కోసం ఇతరుల మనోభావాలను దెబ్బతీయకూడదు. 

మీరు చేస్తుంది సరైనది కాదు. ఆ మధ్య కాలంలో నా ఫోన్ ఓపెన్ చేసి చూస్తే చాలు అవే మీమ్ప్ కనిపించేవి. మీమ్‌లు అనేది కేవలం వినోదం కోసం మాత్రమే. అంతే తప్ప అబద్దాలను ప్రచారం చేయడానికి కాదు. ట్రోలర్స్, మీమర్స్‌కు నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను.

దయచేసి వ్యక్తిగత జీవితాల విషయానికి రావొద్దు. ఒకరి వ్యక్తిగత జీవితాన్నిఇంకొకరితో ముడివేస్తూ వారిని బజారుకి లాగవద్దు. మీకు దమ్ము ఉంటే ఇలాంటి పోస్టులను  గుర్తింపు లేని సోషల్‌ మీడియా అకౌంట్స్‌ నుంచి కాకుండా నిజమైన  అకౌంట్స్ నుంచి పోస్ట్ చేయండి.

అప్పుడు నేను ఏమి సమాధానం చెప్పాలో అదే చెబుతా. దయచేసి ఎటువంటి వికృత చేష్ఠలు మానుకుని జీవితంలో ఎదగడానికి ప్రయత్నంచండి. మీ వంతు ప్రజలకు సహాయం చేయండి. మిమ్మల్ని మీరు మార్చుకోండి. అప్పుడే మీరు మంచి వ్యక్తిగా ఈ సమాజంలో జీవించగలరు" అని షమీ స్ట్రాంగ్ రిప్లే ఇచ్చాడు. కాగా ష‌మీ ఇప్ప‌టికే త‌న భార్య హసిన్ జహాన్‌కు విడాకులు ఇవ్వ‌గా.. సానియా కూడా తన భ‌ర్త‌ షోయ‌బ్ మాలిక్‌తో విడిపోయింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement