మనం వంటల్లో వాడే ఇంగువతో బోలెడెన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీన్ని మన ఆహారంలో చేర్చడం వల్ల జీర్ణ సమస్యలు ఉండవు. అలాగే బరువు తగ్గాలనుకునేవారికి ఇది ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుందని చెబుతున్నారు ఆరోగ్యనిపుణులు. ఇంగువని నిపుణులు చెప్పిన విధానంలో గనుక తీసుకుంటే సులభంగా బరువు తగ్గుతారు.
దీన్ని 'హింగ్' లేదా 'ఇంగువ' అని కూడా పిలుస్తారు. ఇది చాలా శక్తిమంతమైన మసాలా. దీన్ని మీ రోజూవారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల జీర్ణ సంబంధ సమస్యల నుంచి సత్వరమే బయటపడొచ్చని చెబుతున్నారు నిపుణులు. జీర్ణ ఎంజైమ్‌లను ప్రేరేపించి మెరుగైన పోషక శోషణను ఇస్తుందని చెబుతున్నారు. అలాగే అజీర్ణం, గ్యాస్, ఉబ్బరం తదితర సమస్యల నుచి రిలీఫ్ పొందగలరని చెబుతున్నారు. బరువు తగ్గాలనుకునేవారు మాత్రం ఇలా ఇంగువ వాటర్‌ని ఇలా తయారు చేసుకుని తాగితే చక్కటి ఫలితం ఉంటుందని చెబుతున్నారు.
ఇంగువ వాటర్ తయారీ విధానం:
1/4 టీస్పూన్ హింగ్ (ఇంగువ లేదా ఆసుఫోటిడా)
1 గ్లాసు వెచ్చని నీరు
తయారీ విధానం: గోరు వెచ్చని నీటిలో ఇంగువ వేసి కలపండి. ఇంగువ పూర్తిగా నీటిలో కరిగిపోయేంత వరకు కాసేపు అలానే ఉంచండి. కాసేపటి తర్వాత ఆ నీటిని తాగండి. ఇలా పరగడుపునే ఖాళీ కడుపుతో తీసుకోంటే బరువు తగ్గడం ఖాయం అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
(చదవండి: టమాటాలు ఫ్రిజ్‌లో పెడుతున్నారా? హెచ్చరిస్తున్న శాస్త్రవేత్తలు!)
Comments
Please login to add a commentAdd a comment