ప్రపంచ రికార్డు సమం | At Sydney International, Sania Mirza-Martina Hingis equal record for most consecutive wins | Sakshi
Sakshi News home page

ప్రపంచ రికార్డు సమం

Published Thu, Jan 14 2016 12:37 AM | Last Updated on Sun, Sep 3 2017 3:37 PM

ప్రపంచ రికార్డు సమం

ప్రపంచ రికార్డు సమం

 సానియా-హింగిస్ ఖాతాలో
 వరుసగా 28వ విజయం
  సిడ్నీ ఓపెన్ సెమీస్‌లో ప్రవేశం

 
 సిడ్నీ: తమ విజయపరంపరను కొనసాగిస్తూ సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంట మహిళల డబుల్స్‌లో వరుస విజయాల ప్రపంచ రికార్డును సమం చేసింది. వరుసగా 28వ విజయం సాధించిన ఈ ఇండో-స్విస్ ద్వయం 1994లో గీగీ ఫెర్నాండెజ్ (ప్యూర్టోరికో-అమెరికా), నటాషా జ్వెరెవా (బెలారస్) జంట నెలకొల్పిన రికార్డును అందుకుంది. సిడ్నీ ఓపెన్ టోర్నమెంట్‌లో భాగంగా బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ సానియా-హింగిస్ జోడీ 6-2, 6-3తో చెన్ లియాంగ్-పెంగ్ షుయె (చైనా) జంటను ఓడించి సెమీఫైనల్‌కు చేరుకుంది.

59 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సానియా-హింగిస్ తమ సర్వీస్‌ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి జంట సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. గురువారం జరిగే సెమీఫైనల్లో రలూకా ఒలారూ (రుమేనియా)-యారోస్లావా ష్వెదోవా (కజకిస్తాన్) జంటతో సానియా-హింగిస్ జోడీ తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే సానియా-హింగిస్ వరుసగా 29 మ్యాచ్‌ల్లో నెగ్గిన జోడీగా ప్రపంచ రికార్డు సృష్టిస్తుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement