అనంతపురంలో స్నేహితులు! | The love of friendship is better than love with the concept of "to friends | Sakshi
Sakshi News home page

అనంతపురంలో స్నేహితులు!

Published Wed, Jul 12 2017 12:04 AM | Last Updated on Tue, Sep 5 2017 3:47 PM

అనంతపురంలో స్నేహితులు!

అనంతపురంలో స్నేహితులు!

ప్రేమ కంటే స్నేహం గొప్పదనే కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న సినిమా ‘టు ఫ్రెండ్స్‌’. సూరజ్‌ హీరోగా జి.ఎల్‌.బి. శ్రీనివాస్‌ దర్శకత్వంలో మళ్ళగూరు అనంతరాముడు, మళ్ళగూరు రమేశ్‌నాయుడు నిర్మిస్తున్న ఈ సినిమాలో రవీంద్రతేజ, కార్తీక్, సానియా, ఫరా, స్నిగ్ధ ముఖ్యతారలు.

ప్రస్తుతం అనంతపురంలోని అనంతలక్ష్మీ ఇంజినీరింగ్‌ కాలేజీలో స్వర్ణ మాస్టర్‌ నేతృత్వంలో ఓ పాటను తెరకెక్కిస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘వినోదంతో కూడిన సందేశాత్మక చిత్రమిది. హైదరాబాద్‌లో కొన్ని సీన్లు చిత్రీకరించిన తర్వాత యూనిట్‌ అనంతపురం చేరుకుంది. నెలాఖరు వరకు ఈ షెడ్యూల్‌ జరుగుతుంది. దీని తర్వాతి షెడ్యూల్‌ బెంగళూరులో ఉంటుంది. తెలుగు, కన్నడ భాషల్లో సినిమాను తెరకెక్కిస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: టి. సురేందర్‌రెడ్డి, కథ, మాటలు, సంగీతం: పోలూర్‌ ఘటికాచలం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement