Farah
-
పదేళ్ల కల నెరవేరింది
ప్రముఖ పాటల రచయిత శ్రీమణి కొత్త ఇన్నింగ్స్‌కి శ్రీకారం చుట్టారు. పదేళ్లుగా ప్రేమించిన ఫరాతో ఏడడుగులు వేశారు. వారిది ప్రేమ వివాహమే అయినా ఇరు కుటుంబాల పెద్దల సమ్మతితోనే ఈ వేడుక జరిగింది. ఈ విషయాన్ని శ్రీమణి సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించారు. ‘‘నా జీవితంలోకి నా దేవత ఫరాకు స్వాగతం. పదేళ్లుగా ఈ మూమెంట్ కోసం ఎదురుచూశాం.. మా కల నెరవేరింది. మా మనసును అర్థం చేసుకున్న దేవుడికి, మా తల్లిదండ్రులకు థ్యాంక్స్’’ అని ట్విట్టర్లో పోస్ట్ చేశారు శ్రీమణి. ఆయన ట్వీట్‌కి సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ స్పందిస్తూ, ‘శ్రీమణీ.. నీ రొమాంటిక్ లిరిక్స్ వెనక ఉన్న సీక్రెట్ ఇప్పుడు అర్థం అయ్యింది. ‘ఇష్క్ షిఫాయా’ అని పాడి, ‘రంగులద్దుకున్న’ అని సీక్రెట్‌గా లవ్ చేసి, ‘ఏమిటో ఇది’ అని మేమందరం అనుకునేలా పెళ్లి చేసుకున్నారన్న మాట. హ్యాపీ మ్యూజికల్ మ్యారీడ్ లైఫ్’ అని పోస్ట్ చేశారు. -
ఇద్దరు స్నేహితులు
ఆనంతలక్షి్మ క్రియేష¯Œ ్స పతాకంపై ముళ్లగూరు లక్షీ్మదేవి సమర్పణలో ముళ్లగూరు ఆనంతరాముడు–ముళ్లగూరు రమేష్ నాయుడు తెలుగు–కన్నడ భాషల్లో నిర్మించిన సినిమా ‘టు ఫ్రెండ్స్’. సూరజ్, అఖిల్ కార్తిక్, సోనియా, ఫరా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి శ్రీనివాస్ జి.ఎల్.బి దర్శకుడు. ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ను అవిభక్త ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ డాక్టర్ కొణిజేటి రోశయ్య విడుదల చేశారు. ‘‘అన్ని రంగాల్లో అసాధారణ విజయాలు సాధిస్తున్న అనంత రాముడు సినిమా రంగంలోనూ సక్సెస్ అవ్వాలి’’ అన్నారు రోశయ్య. ‘‘సినిమా రంగం మోసపూరితమైనదని చాలామంది భయపెట్టారు. కానీ నాకెలాంటి చేదు అనుభవాలు ఎదురు కాలేదు. భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు తీస్తాను’’ అన్నారు అనంత రాముడు. ‘‘ఖర్చుకు వెనకాడకుండా నిర్మాతలు అందించిన సహాయ సహకారాల వల్ల సినిమా బాగా తీయగలిగాను’’ అన్నారు దర్శకుడు. దర్శకులు బి. గోపాల్, మారుతి, నిర్మాతలు సి. కల్యాణ్, రామసత్యనారాయణ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. -
అనంతపురంలో స్నేహితులు!
ప్రేమ కంటే స్నేహం గొప్పదనే కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న సినిమా ‘టు ఫ్రెండ్స్’. సూరజ్ హీరోగా జి.ఎల్.బి. శ్రీనివాస్ దర్శకత్వంలో మళ్ళగూరు అనంతరాముడు, మళ్ళగూరు రమేశ్‌నాయుడు నిర్మిస్తున్న ఈ సినిమాలో రవీంద్రతేజ, కార్తీక్, సానియా, ఫరా, స్నిగ్ధ ముఖ్యతారలు. ప్రస్తుతం అనంతపురంలోని అనంతలక్ష్మీ ఇంజినీరింగ్ కాలేజీలో స్వర్ణ మాస్టర్ నేతృత్వంలో ఓ పాటను తెరకెక్కిస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘వినోదంతో కూడిన సందేశాత్మక చిత్రమిది. హైదరాబాద్‌లో కొన్ని సీన్లు చిత్రీకరించిన తర్వాత యూనిట్ అనంతపురం చేరుకుంది. నెలాఖరు వరకు ఈ షెడ్యూల్ జరుగుతుంది. దీని తర్వాతి షెడ్యూల్ బెంగళూరులో ఉంటుంది. తెలుగు, కన్నడ భాషల్లో సినిమాను తెరకెక్కిస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: టి. సురేందర్‌రెడ్డి, కథ, మాటలు, సంగీతం: పోలూర్ ఘటికాచలం.