
శ్రీనివాస్, అనంతరాముడు
ఆనంతలక్షి్మ క్రియేష¯Œ ్స పతాకంపై ముళ్లగూరు లక్షీ్మదేవి సమర్పణలో ముళ్లగూరు ఆనంతరాముడు–ముళ్లగూరు రమేష్ నాయుడు తెలుగు–కన్నడ భాషల్లో నిర్మించిన సినిమా ‘టు ఫ్రెండ్స్’. సూరజ్, అఖిల్ కార్తిక్, సోనియా, ఫరా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి శ్రీనివాస్ జి.ఎల్.బి దర్శకుడు. ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ను అవిభక్త ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ డాక్టర్ కొణిజేటి రోశయ్య విడుదల చేశారు.
‘‘అన్ని రంగాల్లో అసాధారణ విజయాలు సాధిస్తున్న అనంత రాముడు సినిమా రంగంలోనూ సక్సెస్ అవ్వాలి’’ అన్నారు రోశయ్య. ‘‘సినిమా రంగం మోసపూరితమైనదని చాలామంది భయపెట్టారు. కానీ నాకెలాంటి చేదు అనుభవాలు ఎదురు కాలేదు. భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు తీస్తాను’’ అన్నారు అనంత రాముడు. ‘‘ఖర్చుకు వెనకాడకుండా నిర్మాతలు అందించిన సహాయ సహకారాల వల్ల సినిమా బాగా తీయగలిగాను’’ అన్నారు దర్శకుడు. దర్శకులు బి. గోపాల్, మారుతి, నిర్మాతలు సి. కల్యాణ్, రామసత్యనారాయణ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment