Akhil Kartik
-
ఉచిత విద్య కోసం పోరాటం
సామాన్యులకు విద్య, వైద్యం అందుబాటులో ఉండాలి.. అప్పుడే సమాజం బాగుంటుందనే సామాజిక సృహతో తెరకెక్కిన చిత్రం ‘ఎమ్బిఎమ్’ (మేరా భారత్ మహాన్). అఖిల్ కార్తీక్, ప్రియాంక శర్మ జంటగా భరత్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ప్రముఖ వైద్యులు శ్రీధర్ రాజు ఎర్ర, తాళ్ల రవి, టి.పల్లవి రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదలకానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో భరత్ మాట్లాడుతూ– ‘‘లవ్, కామెడీ అంశాలతో అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఈ సినిమా తెరకెక్కించాం. మన వ్యవస్థలో ఉన్న లోటుపాట్లను సవరించాలన్నదే మా అభిప్రాయం. ముఖ్యంగా విద్య, వైద్యం ఉచితంగా అందించాలన్నదే మా పోరాటం’’ అన్నారు. చిత్ర నిర్మాత, కథా రచయిత, నటుడు డా.శ్రీధర్ రాజు ఎర్ర మాట్లాడుతూ– ‘‘సమకాలీన అంశాలకు కమర్షియల్ హంగులు జోడించి ఓ సందేశాత్మక చిత్రంగా నిర్మించాం. ఇప్పటి ప్రభుత్వాలు ప్రవేశపెడుతోన్న పథకాలు, వాటిలో లోటుపాట్లు చూపిస్తున్నాం’’ అన్నారు. ఈ కార్యక్రమం అనంతరం ఇటీవల వరంగల్ జిల్లాలో అప్పుల బాధతో మరణించిన రెండు రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారు. డా.తాళ్ల రవి, డా. టి.పల్లవి రెడ్డి, అఖిల్ కార్తీక్, రచయిత ‘అంపశయ్య’ నవీన్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ముజీర్ మాలిక్, సంగీతం: లలిత్ సురేష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సోమర్తి సాంబేష్. -
స్వచ్ఛమైన ప్రేమ
‘‘టు ఫ్రెండ్స్’ హీరో కార్తీక్ కోసం ఈ వేడుకకు వచ్చా. అతనికి ఉజ్వల భవిష్యత్తు ఉండాలి. రైతు కుటుంబం నుంచి సినిమాల్లోకి వచ్చిన అనంతరాముడు అగ్ర నిర్మాతగా ఎదగాలి’’ అని హీరో శ్రీకాంత్ అన్నారు. సూరజ్, అఖిల్ కార్తీక్ హీరోలుగా, సోనియా, ఫర హీరోయిన్లుగా శ్రీనివాస్ జి.ఎల్.బి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘టు ఫ్రెండ్స్’. ట్రూ లవ్ ఉపశీర్షిక. ముళ్లగూరు లక్ష్మీదేవి సమర్పణలో ముళ్లగూరు అనంతరాముడు, ముళ్లగూరు రమేష్ నాయుడు నిర్మించిన ఈ సినిమా రేపు రిలీజవుతోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో అనంతరాముడు మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రం నిర్మాణంలో కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయి. సినిమా బాగా రావడం వల్ల వాటిని అనుభవ పాఠాలుగా తీసుకున్నా. తెలుగు, కన్నడ భాషల్లో రూపొందిన ఈ చిత్రాన్ని కన్నడంలో రిలీజ్ చేయగా, మంచి వసూళ్లు సాధించింది’’ అన్నారు. -
ఇద్దరు స్నేహితులు
ఆనంతలక్షి్మ క్రియేష¯Œ ్స పతాకంపై ముళ్లగూరు లక్షీ్మదేవి సమర్పణలో ముళ్లగూరు ఆనంతరాముడు–ముళ్లగూరు రమేష్ నాయుడు తెలుగు–కన్నడ భాషల్లో నిర్మించిన సినిమా ‘టు ఫ్రెండ్స్’. సూరజ్, అఖిల్ కార్తిక్, సోనియా, ఫరా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి శ్రీనివాస్ జి.ఎల్.బి దర్శకుడు. ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ను అవిభక్త ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ డాక్టర్ కొణిజేటి రోశయ్య విడుదల చేశారు. ‘‘అన్ని రంగాల్లో అసాధారణ విజయాలు సాధిస్తున్న అనంత రాముడు సినిమా రంగంలోనూ సక్సెస్ అవ్వాలి’’ అన్నారు రోశయ్య. ‘‘సినిమా రంగం మోసపూరితమైనదని చాలామంది భయపెట్టారు. కానీ నాకెలాంటి చేదు అనుభవాలు ఎదురు కాలేదు. భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు తీస్తాను’’ అన్నారు అనంత రాముడు. ‘‘ఖర్చుకు వెనకాడకుండా నిర్మాతలు అందించిన సహాయ సహకారాల వల్ల సినిమా బాగా తీయగలిగాను’’ అన్నారు దర్శకుడు. దర్శకులు బి. గోపాల్, మారుతి, నిర్మాతలు సి. కల్యాణ్, రామసత్యనారాయణ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. -
పదేళ్ల ప్రయాణంలో... అఖిల్ కార్తీక్
-
పదేళ్ల ప్రయాణంలో...
‘‘నేను చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి పదేళ్లయ్యింది. ‘దోస్త్, అంజలి ఐ లవ్ యు, ప్రామిస్, అలా, లైఫ్ స్టయిల్’ తదితర చిత్రాల్లో హీరోగా చేశాను. ‘మొగుడ్స్ పెళ్లామ్స్, ఎవడైతే నాకేంటి, రామరామ కృష్ణకృష్ణ, మిస్టర్ పర్ఫెక్ట్’ చిత్రాల్లో కీలక పాత్రలు చేశాను’’ అని నటుడు అఖిల్ కార్తీక్ చెప్పారు. నటునిగా దశాబ్ద ప్రయాణం పూర్తయిన సందర్భంగా బుధవారం హైదరాబాద్లో ఆయన పత్రికల వారితో ముచ్చటించారు. ‘‘ఇన్నేళ్ల ప్రయాణంలో మలుపులూ, మెరుపులూ లేకపోయినా భవిష్యత్తుపై భరోసా ఉంది. కచ్చితంగా ఎప్పటికైనా విజయం సాధిస్తాను. హీరోగానే కాకుండా ఎలాంటి పాత్రకైనా నేను సిద్ధం. ప్రస్తుతం నేను చేస్తున్న ‘తీయని కలవో, క్రిమినల్స్, వేగం’ తదితర చిత్రాలు నాకు మంచి పేరు తెచ్చి పెడతాయి’’ అని అఖిల్ కార్తీక్ తెలిపారు.