
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నటుడు సూరజ్ మెహర్( 40) మృతి చెందారు. అర్ధరాత్రి ట్రక్కును కారు ఢీకొనడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సూరజ్ మెహర్ సహచరుడు, డ్రైవర్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఇవాళ ఒడిశాలో అతనికి నిశ్చితార్థం జరగాల్సి ఉంది.
శుభకార్యం జరగాల్సిన నటుడి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. దీంతో ఆయన కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. బుధవారం అర్థరాత్రి తన సినిమా షూటింగ్ ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సూరజ్ మెహర్ ప్రస్తుతం "ఆఖ్రీ ఫైస్లా" అనే చిత్రంలో నటిస్తున్నారు. సూరజ్ ముఖ్యంగా విలన్ పాత్రలతో ఫేమస్ అయ్యారు. సూరజ్ మెహర్ బిలాస్‌పూర్‌లోని సరియా గ్రామానికి చెందిన వారుగా తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment