ఏపీలో విషాదం చోటు చేసుకుంది. తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. రాజమండ్రిలో శనివారం జరిగిన గేమ్ రేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వెళ్లి తిరిగి వస్తూ ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. రంగంపేట మండలం కార్గిల్ ఫ్యాక్టరీ సమీపంలో ఐచర్ వ్యాన్ ఢీకొని మరణించారు. వారిద్దరిని కాకినాడకు చెందిన తోకడ చరణ్, ఆరవ మణికంఠ గుర్తించారు.
ఘటనా స్థలంలోనే ఆరవ మణికంఠ మృతి చెందగా.. తీవ్ర గాయాల పాలైన తోకడ చరణ్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో కన్నుమూశారు. తమ అభిమాన హీరోను చూసేందుకు తిరిగిరాని లోకాలకు వెళ్లి పోయారని మృతుల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి మరణంతో రెండు కుటుంబాలు ఆధారాన్ని కోల్పోయాయి.
భర్త చనిపోవడంతో మణికంఠకు అన్ని తానే చదివించానని తల్లి రోదిస్తూ ఆవేదన వ్యక్తం చేసింది. తండ్రితో కలిపి పళ్ల వ్యాపారం చేస్తున్న చరణ్ మృతితో వారి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అయితే ఇప్పటివరకు బాధిత కుటుంబాలను సినీ ప్రముఖులు కానీ, అధికారులు కానీ పరామర్శించలేదని తెలుస్తోంది. తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబాల సభ్యులు వేడుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment