అభిమానులు లేనిదే హీరోలు లేరనేది వాస్తవమే అయినా.. ఆ మాటకు విలువనిచ్చే వారు ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వారిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ అభిమానులతో మాత్రం ఎప్పుడూ టచ్‌లోనే ఉంటారు. ఆపదలో ఉన్న అభిమానులకు ఎప్పుడు అండగా నిలుస్తుంటాడు. గతంలో ఎన్నోసార్లు తన అభిమానుల కోరికలను తీరుస్తూ.. వారిని వారికి సర్ ప్రైజ్ ఇచ్చాడు ఎన్టీఆర్. ఇప్పుడు మరోసారి తన అభిమానికి కోరిక తీర్చాడు ఈ నందమూరి హీరో.
(చదవండి: సమంత లేటెస్ట్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్: భావోద్వేగంతో ఇలా..)
తూర్పు గోదావరి జిల్లా మలికిపురం మండలం.. గూడపల్లి గ్రామానికి చెందిన కొప్పాడి మురళి ఎన్టీఆర్‌కు వీరాభిమాని. అయితే ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మురళి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతడి పరిస్థితి మరింతగా విషమించింది. ఈ క్రమంలో వైద్యులు అతడి కోరికలు, ఇష్టాయిష్టాలను తెలుసుకునే ప్రయత్నం చేశాడు.
దీంతో తనకు జూనియర్ ఎన్టీఆర్ ను చూడాలని ఉందని చెప్పగా.. ఆ విషయాన్ని అతని కుటుంబసభ్యులకు చెప్పాడు. ఈ విషయాన్ని యంగ్ టైగర్ ఫ్యాన్స్.. ఎన్టీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో తన వీరాభిమానికి వీడియో కాల్ చేసి మాట్లాడారు ఎన్టీఆర్. అనంతరం డాక్టర్లు, కుటుంబసభ్యులను పలకరించి.. నేను ఉన్నాను.. త్వరలో మనం కలుద్దామని ధైర్యం చెప్పారు ఎన్టీఆర్.
Young Tiger #NTR generous gesture towards his fan Murali who met with an accident recently. @tarak9999 spoke to him through video call and wished him speedy recovery.👏 pic.twitter.com/dEeHh9UNWO
— VamsiShekar (@UrsVamsiShekar) October 7, 2021
Comments
Please login to add a commentAdd a comment