సినిమా విడుదలకు ముందు షాక్.. హీరోకు రోడ్డు ప్రమాదం..! | Kannada actor Kiran Raj injured in car accident | Sakshi
Sakshi News home page

Kiran Raj: రోడ్డు ప్రమాదంలో హీరోకు తీవ్ర గాయాలు..!

Published Wed, Sep 11 2024 5:14 PM | Last Updated on Wed, Sep 11 2024 5:33 PM

Kannada actor Kiran Raj injured in car accident

ప్రముఖ కన్నడ హీరో కిరణ్ రాజ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. బెంగళూరులోని కెంగేరి సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్‌కు గురైంది. మంగళవారం సాయంత్రం ఓ అనాథాశ్రమం నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో హీరోకు గాయాలు కావడంతో.. ప్రస్తుతం ఆయన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి సంబంధించిన ఫోటోలు ట్విటర్‌లో వైరలవుతున్నాయి.

(ఇది చదవండి: హీరో జీవాకు రోడ్డు ప్రమాదం)

కాగా.. కిరణ్ రాజ్ శాండల్‌వుడ్‌లో కన్నడతి సీరియల్‌తో ఫేమస్ అయ్యాడు. తెలుగులో నువ్వే నా ప్రాణం అనే చిత్రంలో హీరోగా నటించారు. అంతేకాకుండా పలు రియాలిటీ షోలలోనూ పాల్గొన్నారు. బాలీవుడ్‌లో హీరోస్, లవ్ బై ఛాన్స్, యే రిష్తా క్యా కెహ్లతా హై,  తు ఆషికి వంటి సీరియల్స్‌లో కనిపించారు. కిరణ్ రాజ్ తాజాగా రోనీ: ది రూలర్ చిత్రంలో నటించారు. ఈ మూవీ సెప్టెంబర్ 12న థియేటర్లలో విడుదల కానుంది. కిరణ్ రాజ్ నటించిన చిత్రం రిలీజ్‌కు ముందే ప్రమాదం జరగడంతో ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement