Kiran Raj
-
సినిమా విడుదలకు ముందు షాక్.. హీరోకు రోడ్డు ప్రమాదం..!
ప్రముఖ కన్నడ హీరో కిరణ్ రాజ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. బెంగళూరులోని కెంగేరి సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్‌కు గురైంది. మంగళవారం సాయంత్రం ఓ అనాథాశ్రమం నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో హీరోకు గాయాలు కావడంతో.. ప్రస్తుతం ఆయన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి సంబంధించిన ఫోటోలు ట్విటర్లో వైరలవుతున్నాయి.(ఇది చదవండి: హీరో జీవాకు రోడ్డు ప్రమాదం)కాగా.. కిరణ్ రాజ్ శాండల్‌వుడ్‌లో కన్నడతి సీరియల్‌తో ఫేమస్ అయ్యాడు. తెలుగులో నువ్వే నా ప్రాణం అనే చిత్రంలో హీరోగా నటించారు. అంతేకాకుండా పలు రియాలిటీ షోలలోనూ పాల్గొన్నారు. బాలీవుడ్లో హీరోస్, లవ్ బై ఛాన్స్, యే రిష్తా క్యా కెహ్లతా హై, తు ఆషికి వంటి సీరియల్స్‌లో కనిపించారు. కిరణ్ రాజ్ తాజాగా రోనీ: ది రూలర్ చిత్రంలో నటించారు. ఈ మూవీ సెప్టెంబర్ 12న థియేటర్లలో విడుదల కానుంది. కిరణ్ రాజ్ నటించిన చిత్రం రిలీజ్‌కు ముందే ప్రమాదం జరగడంతో ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. .#KiranRaj, the actor from #Kannadati serial, who was looking forward for his big screen release this week, met with an accident last night, while returning from an act of kindness - visiting an orphanage! Currently hospitalised, we wish him a speedy recovery. Let's come… pic.twitter.com/NFC5M3bFyo— A Sharadhaa (@sharadasrinidhi) September 11, 2024 -
‘నువ్వే నా ప్రాణం’ మూవీ రివ్యూ
టైటిల్: నువ్వే నా ప్రాణం నటీనటులు: కిరణ్ రాజ్, ప్రియా హెగ్డే, సుమన్, భానుచందర్, తిలక్, గిరి, సోనియా చౌదరి తదితరులు నిర్మాత: శేషు మలిశెట్టి దర్శకత్వం: శ్రీకృష్ణ మలిశెట్టి సంగీతం: మణిజెన్నా నేపథ్య సంగీతం: రాజా విడుదల తేది: డిసెంబర్ 30, 2022 కథేంటంటే.. సంజు(కిరణ్ రాజ్) ఓ ఐపీఎస్ అధికారి. గైనకాలజిస్ట్ కిరణ్మయి(ప్రియా హెగ్డే)తో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. ఆమె మనసు గెలుచుకొని ఇరు కుటుంబాల సమక్షంలో పెళ్లి చేసుకుంటాడు. ఇలా సాఫీగా సాగుతున్న వీరి జీవితంలోకి కొంతమంది తీవ్రవాదులు ఎంటరవుతారు. ఈ క్రమంలో కిరణ్మయి, సంజుల మధ్య గొడవ జరిగి విడిపోతారు. అసలు తీవ్రవాదులు సంజు వెనక ఎందుకు పడుతన్నారు? ప్రాణంగా ప్రేమించుకున్న సంజు, కిరణ్మయిలు ఎందుకు విడాకులు తీసుకున్నారు? చివరకు వీరిద్దరు ఎలా ఒకటయ్యారు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. లవ్ అండ్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రమిది. ఎక్కడా వల్గారిటీ లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు చూసేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఓవైపు నేటితరం యువత ఆలోచనలు, హైఫై ఫ్యామిలీస్ వింత పోకడలను చూపిస్తూనే.. మరోవైపు స్వఛ్చమైన ప్రేమకథ చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు. ఈ విషయంలో డైరెక్టర్ కొంత వరకు సఫలం అయ్యాడు. సింపుల్ పాయింట్ తో సినిమా మొత్తం చుట్టేయడం, అలాగే మెయిన్ పాయింట్‌ని ఎలివేట్ చేసి చూపించలేకపోయారు. ఫస్టాఫ్ అంతా సింపుల్‌గా సాగినప్పటికీ.. హీరో హీరోయిన్ల లవ్‌స్టోరీ ఎంటర్టైన్ చేస్తుంది. సెకండాఫ్ గాడి తప్పింది. లాజిక్ లేని ల్యాగ్ సీన్స్ ఇబ్బంది కలిగిస్తాయి. కథలో కొత్తదనం లేకున్నప్పటికీ..స్క్రీన్‌ప్లేతో మ్యానేజ్ చేశారు. దర్శకుడు శ్రీకృష్ణ మలిశెట్టి స్క్రిప్ట్‌ని మరింత బలంగా రాసుకొని, ప్రమోషన్స్ గట్టిగా చేసి ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. అయితే సినీ పరిశ్రమలో ఎటువంటి అనుభవం లేకుండా ఒక లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించి..దాన్ని విజయవంతంగా రిలీజ్ చేసినందుకు శ్రీకృష్ణ మలిశెట్టిని అభినందించాల్సిందే. ఎవరెలా చేశారంటే.. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా కిరణ్ రాజ్ చక్కగా నటించాడు. కన్నడ నటుడు అయినా అచ్చమైన తెలుగు కుర్రాడిలా తెరపై కనిపించాడు. కన్నడ హీరోయిన్ అయిన ప్రియా హెగ్డే కూడా గైనకాలజిస్ట్ పాత్రలో ఒదిగిపోయింది. ఆమె అందం, అభినయం రెండూ ఆకట్టుకుంటాయి. సుమన్, భానుచందర్, తిలక్ ఎప్పటిలాగే వారి పాత్రలకు న్యాయం చేశారు. ఒక సాంకేతిక విషయానికొస్తే.. ఈ చిత్రానికి మణిజెన్నా పాటలు హైలైట్ అని చెప్పవచ్చు. పాటలన్నీ కూడా వినడానికి, చూడటానికి బాగున్నాయి. రాజా నేపథ్య సంగీతం పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్టుగా ఉన్నాయి. -
ఆకట్టుకుంటున్న ‘విక్రమ్ గౌడ్’ స్పెషల్ పోస్టర్
కన్నడ యంగ్ హీరో కిరణ్ రాజ్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఇటీవల ‘బడ్డీస్’తో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఇప్పుడు ‘విక్రమ్ గౌడ్’ అంటూ ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నాడు.కుమారి సాయి ప్రియ సమర్పణలో మహేశ్వర పిక్చర్స్ బ్యానర్‌పై కణిదరపు రాజేష్, పి. ఉషారాణి నిర్మిస్తున్న ఈ చిత్రానికి పాశం నరసింహారావు దర్శకులు. కిరణ్ రాజ్, దీపికా సింగ్ హీరో హీరోయిన్లుగా తెలుగు, కన్నడ భాషలలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. కిరణ్ రాజ్ పుట్టిన రోజు(జూలై 5) సందర్భంగా ‘విక్రమ్ గౌడ్’ నుంచి ఓ కొత్త పోస్టర్‌ను మేకర్లు విడుదల చేశారు. ఈ పోస్టర్లో కిరణ్ రాజ్ పూర్తిగా రగ్డ్ లుక్‌లో కనిపించారు. ప్రస్తుతం ఈ పోస్టర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల చేసిన టీజర్, పోస్టర్లకు విపరీతమైన స్పందన లభించింది. -
ఆసక్తికరంగా ‘విక్రమ్ గౌడ్’టీజర్
కిరణ్ రాజ్, దీపికా సింగ్ హీరోహీరోయిన్లుగా తెలుగు, కన్నడ భాషలలో తెరకెక్కుతోన్న బైలింగ్వెల్ ఫిల్మ్ ‘విక్రమ్ గౌడ్’. పోసాని కృష్ణమురళీ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ చిత్రాన్ని పాశం నరసింహారావు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీమతి కణిదరపు వెంకాయమ్మ సమర్పణలో మహేశ్వర పిక్చర్స్ బ్యానర్‌పై సుహాసిని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ని హైదరాబాద్‌లో విడుదల చేసింది చిత్రబృందం. ‘రెండు తెలుగు రాష్ట్రాలలో 30 ఎంపీ సీట్లు వచ్చినా.. కేంద్రంలో చక్రం తిప్పలేకపోతున్నాం..’ అనే పోసాని కృష్ణమురళీ చెప్పిన డైలాగ్‌తో మొదలైన ఈ టీజర్.. నేటి రాజకీయ పరిస్థితులను తెలియజేస్తుంటే.. ‘మళ్లీ తెలుగు రాష్ట్రం అంతా ఒకటే కావాలని, అప్పుడే సమస్యలు పరిష్కారం అవుతాయని’ చెప్పడం సరికొత్త ఆలోచనలని రేకెత్తిస్తోంది. డేటింగ్‌కి ఒకరు, చాటింగ్‌కి మరొకరు, నిశ్చితార్థానికి ఇంకొకరు.. అని హీరో కిరణ్ రాజ్ చెప్పే డైలాగ్ నేటి యువత మైండ్ సెట్ ఎలా ఉందో తెలియజేస్తుంది. హీరోహీరోయిన్లు మధ్య కెమిస్ట్రీ.. హీరో చెప్పే లెంగ్తీ డైలాగ్స్ ఈ టీజర్‌కి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.ఈ చిత్రానికి ‘మంత్ర’ ఆనంద్ సంగీతం అందిస్తున్నారు. -
బుల్లితెర నటుడిపై మరో కేసు
సాక్షి, యశవంతపుర : బుల్లితెర నటుడు కిరణ్ రాజ్‌పై మరో కేసు నమోదైంది. కిరణ్ తనను మానసికంగా వేధించాడని బుల్లితెర నటి యాస్మిన్ రాజరాజేశ్వరినగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతనిపై మానసిక వేధింపుల కేసు నమోదు చేశారు. గతంలో కూడా నటి యాస్మిన్ ఫిర్యాదుపై ఆయనను జైలుకు తరలించిన విషయం తెలిసిందే. సినిమా షూటింగ్ కోసం విదేశాలు వెళ్లినప్పుడు పాస్‌పోర్టు లాక్కొని డబ్బులిస్తేనే ఇస్తానని వేధించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను మోసం చేసి తన జీవనానికి చాలా ఇబ్బంది కలిగించాడని పోలీసులకు తెలిపారు. దీంతో కిరణ్ రాజ్‌పై 420, 506, 384 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. -
బుల్లితెర నటుడి అరెస్టు..!
సాక్షి, బెంగళూరు: పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ మోడల్‌ను మోసం చేసిన కేసులో బుల్లితెర నటుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలివి.. బుల్లితెర నటుడు కిరణ్ రాజ్, ముంబైకి చెందిన మోడల్ ప్రేమించుకున్నారు. వీరిద్దరూ ఐదేళ్లుగా రాజరాజేశ్వరి నగర్లో సహ జీవనం చేశారు. పెళ్లి విషయం మాట్లాడినప్పటి నుంచి కిరణ్ అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తూ వచ్చాడు. దీంతో తను మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు ముంబై వెళ్లిపోయింది. అయితే మార్చి 24న ముంబైలో ఉన్న తన ప్రేయసిని కిరణ్ రాజ్ ఫోన్ చేసి బెంగళూరు రావాలని కోరాడు. దీంతో బెంగళూరు వచ్చిన ఆమెను ఓ ప్రాంతంలో నిర్భంధించి చిత్ర హింసలకు గురిచేశాడు. అక్కడి నుంచి తప్పించుకుని ఆమె ముంబై పారిపోయింది. ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా, సంఘటన జరిగిన ప్రాంతం బెంగళూరు కావడంతో అక్కడే ఫిర్యాదు చేయాలని ఆమెకు సూచించారు. దీంతో బాధితురాలు రాజ రాజేశ్వరి నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. -
ప్రభాస్ డూప్ ఇప్పుడు హీరో
‘బాహుబలి’ చిత్రంలో ప్రభాస్‌కు డూప్‌గా నటించిన కిరణ్ రాజ్ ‘కరాళి’ చిత్రం ద్వారా హీరోగా పరిచయమవుతున్నారు. కిరణ్ కోటప్రోలు దర్శకత్వంలో మల్లిఖార్జున్ రెడ్డి, మొహమ్మద్ జాఫర్ అలీ నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు వీరశంకర్ కెమెరా స్విచ్చాన్ చేయగా, కెమెరామేన్ సెంథిల్ క్లాప్ ఇచ్చారు. ‘టెర్రర్’ చిత్ర నిర్మాత ఆరా మస్తాన్ గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు కిరణ్ మాట్లాడుతూ– ‘‘ఇది సైకలాజికల్ థ్రిల్లర్. హీరోగా కిరణ్ సరిపోతాడనిపించి, ఎంపిక చేశాం’’ అన్నారు. ‘‘ఈ నెలాఖరున రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది’’ అన్నారు నిర్మాతలు. ‘‘బాహుబలి’ నాకో విశ్వవిద్యాలయం. వల్లీ మేడమ్ నుంచి క్రమశిక్షణ, రమా మేడమ్ నుంచి మంచితనం, రాజమౌళిగారిలో కష్టపడే తత్వం, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే లక్షణం ప్రభాస్ దగ్గర నుంచి నేర్చుకున్నా’’ అన్నారు కిరణ్ రాజ్.