ప్రభాస్‌ డూప్‌ ఇప్పుడు హీరో | bahubali prabhas dup kiranraj intrdeus to hero of karali movie. | Sakshi
Sakshi News home page

ప్రభాస్‌ డూప్‌ ఇప్పుడు హీరో

Published Fri, Jun 16 2017 12:01 AM | Last Updated on Tue, Sep 5 2017 1:42 PM

ప్రభాస్‌ డూప్‌ ఇప్పుడు హీరో

ప్రభాస్‌ డూప్‌ ఇప్పుడు హీరో

‘బాహుబలి’ చిత్రంలో ప్రభాస్‌కు డూప్‌గా నటించిన కిరణ్‌ రాజ్‌ ‘కరాళి’ చిత్రం ద్వారా హీరోగా పరిచయమవుతున్నారు. కిరణ్‌ కోటప్రోలు దర్శకత్వంలో మల్లిఖార్జున్‌ రెడ్డి, మొహమ్మద్‌ జాఫర్‌ అలీ నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు వీరశంకర్‌ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, కెమెరామేన్‌ సెంథిల్‌ క్లాప్‌ ఇచ్చారు.

‘టెర్రర్‌’ చిత్ర నిర్మాత ఆరా మస్తాన్‌ గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు కిరణ్‌ మాట్లాడుతూ– ‘‘ఇది సైకలాజికల్‌ థ్రిల్లర్‌. హీరోగా కిరణ్‌ సరిపోతాడనిపించి, ఎంపిక చేశాం’’ అన్నారు. ‘‘ఈ నెలాఖరున రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలవుతుంది’’ అన్నారు నిర్మాతలు. ‘‘బాహుబలి’ నాకో విశ్వవిద్యాలయం. వల్లీ మేడమ్‌ నుంచి క్రమశిక్షణ, రమా మేడమ్‌ నుంచి మంచితనం, రాజమౌళిగారిలో కష్టపడే తత్వం, ఎంత  ఎదిగినా ఒదిగి ఉండాలనే లక్షణం ప్రభాస్‌ దగ్గర నుంచి నేర్చుకున్నా’’ అన్నారు కిరణ్‌ రాజ్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement