
సాక్షి, యశవంతపుర : బుల్లితెర నటుడు కిరణ్ రాజ్‌పై మరో కేసు నమోదైంది. కిరణ్ తనను మానసికంగా వేధించాడని బుల్లితెర నటి యాస్మిన్ రాజరాజేశ్వరినగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతనిపై మానసిక వేధింపుల కేసు నమోదు చేశారు. గతంలో కూడా నటి యాస్మిన్ ఫిర్యాదుపై ఆయనను జైలుకు తరలించిన విషయం తెలిసిందే. సినిమా షూటింగ్ కోసం విదేశాలు వెళ్లినప్పుడు పాస్‌పోర్టు లాక్కొని డబ్బులిస్తేనే ఇస్తానని వేధించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.
తనను మోసం చేసి తన జీవనానికి చాలా ఇబ్బంది కలిగించాడని పోలీసులకు తెలిపారు. దీంతో కిరణ్ రాజ్‌పై 420, 506, 384 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment