
కన్నడ యంగ్ హీరో కిరణ్ రాజ్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఇటీవల ‘బడ్డీస్’తో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఇప్పుడు ‘విక్రమ్ గౌడ్’ అంటూ ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నాడు.కుమారి సాయి ప్రియ సమర్పణలో మహేశ్వర పిక్చర్స్ బ్యానర్‌పై కణిదరపు రాజేష్, పి. ఉషారాణి నిర్మిస్తున్న ఈ చిత్రానికి పాశం నరసింహారావు దర్శకులు. కిరణ్ రాజ్, దీపికా సింగ్ హీరో హీరోయిన్లుగా తెలుగు, కన్నడ భాషలలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
కిరణ్ రాజ్ పుట్టిన రోజు(జూలై 5) సందర్భంగా ‘విక్రమ్ గౌడ్’ నుంచి ఓ కొత్త పోస్టర్‌ను మేకర్లు విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో కిరణ్ రాజ్ పూర్తిగా రగ్డ్ లుక్‌లో కనిపించారు. ప్రస్తుతం ఈ పోస్టర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల చేసిన టీజర్, పోస్టర్లకు విపరీతమైన స్పందన లభించింది.
Comments
Please login to add a commentAdd a comment