సాక్షి, బెంగళూరు: పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ మోడల్‌ను మోసం చేసిన కేసులో బుల్లితెర నటుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలివి.. బుల్లితెర నటుడు కిరణ్ రాజ్, ముంబైకి చెందిన మోడల్ ప్రేమించుకున్నారు. వీరిద్దరూ ఐదేళ్లుగా రాజరాజేశ్వరి నగర్‌లో సహ జీవనం చేశారు. పెళ్లి విషయం మాట్లాడినప్పటి నుంచి కిరణ్ అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తూ వచ్చాడు.
దీంతో తను మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు ముంబై వెళ్లిపోయింది. అయితే మార్చి 24న ముంబైలో ఉన్న తన ప్రేయసిని కిరణ్ రాజ్ ఫోన్ చేసి బెంగళూరు రావాలని కోరాడు. దీంతో బెంగళూరు వచ్చిన ఆమెను ఓ ప్రాంతంలో నిర్భంధించి చిత్ర హింసలకు గురిచేశాడు. అక్కడి నుంచి తప్పించుకుని ఆమె ముంబై పారిపోయింది. ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా, సంఘటన జరిగిన ప్రాంతం బెంగళూరు కావడంతో అక్కడే ఫిర్యాదు చేయాలని ఆమెకు సూచించారు. దీంతో బాధితురాలు రాజ రాజేశ్వరి నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment