బంజారాహిల్స్: హైదరాబాద్‌లో పేరొందిన ఒక స్కూలుకు ఒకప్పుడు చైర్మన్‌గా పనిచేసిన ఒక విద్యాధికుడు అత్యంత హీనమైన చర్యకు పాల్పడ్డాడు. తన ఇంటిలో పనిచేసే యువతిని బెదిరించి, ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఒక స్కూలుకు మార్గదర్శకునిగా వ్యవహరించిన ఆ వ్యక్తి ఇటువంటి దుర్మార్గానికి పాల్పడటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
వివరాల్లోకి వెళితే హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 12, మిథులానగర్‌లో నివాసముంటున్న జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ మాజీ చైర్మన్ మురళీముకుంద్ తన ఇంట్లో పని చేసే యువతిని బెదిరించి, లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అనంతరం నాంపల్లి కోర్టు న్యాయమూర్తి నివాసంలో హాజరుపరిచారు.
బాధితురాలు ఈ నెల 18న బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిన దరిమిలా పోలీసులు మురళీ ముకుంద్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మురళీ ముకుంద్‌కు 14 రోజుల పాటు జ్యుడీషీయల్ రిమాండ్‌ను విధించారు.ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించారు. కాగా, పరారీలో ఉన్న కుమారుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment