
సాక్షి, హైదరాబాద్: భర్త లేని ఓ మహిళపై ఓ వ్యక్తి లైంగిక దాడి చేశాడు. ఈ విషయం బయటకు చెప్పవద్దని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. ఇంతటితో ఆగకుండా తన కుటుంబ సభ్యులతో కలిసి ఆమెపై అర్ధరాత్రి దాడి చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే మహిళ(45) బ్యూటీషియన్. భర్త మరణించడంతో కుమార్తెతో కలిసి ఉంటోంది. మెహిందీ, సౌందర్యపు పౌడర్లు అమ్ముతుంటుంది. బంజారాహిల్స్‌కు చెందిన మహ్మద్ ఖాలేద్ భార్యకు తరచూ మెహిందీ ఇచ్చేది.
ఈ క్రమంలో ఖాలేద్ స్నేహితుడు తమీన్ జలానీతో మహిళకు పరిచయం ఏర్పడింది. అతను కొద్ది రోజుల క్రితం ఒంటరిగా ఉన్నమహిళపై లైంగిక దాడి చేశాడు. ఆ తరువాత విషయం బయట చెప్పవద్దంటూ వేడుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. కానీ కొద్ది రోజుల తరువాత ముఖం చాటేయడం మొదలు పెట్టాడు. ఇటీవల పెళ్లి గురించి ఆమె నిలదీయడంతో తమీన్ జలానీ, ఖాలేద్, ఎండీ షకీల్‌లో కలిసి అర్ధరాత్రి ఆమెను రోడ్డు మీద తరుముతూ పరుగులు తీయించాడు.
ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా దాడి చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు ముగ్గురిపై సెక్షన్ 354, 341, 509, 506, 504, 120బి ఐపీసీ సెక్షన్ 156(3) సీఆర్‌పీసీ కింద కేసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: అమెరికాలో ఉన్నా వదలట్లేదు.. యువతి ఫిర్యాదుతో వెలుగులోకి
Comments
Please login to add a commentAdd a comment