![Molestation Attempt On 4 years Old Girl In Banjarahills - Sakshi](/styles/webp/s3/article_images/2021/12/22/Old-Girl.jpg.webp?itok=cKzBjDJs)
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, బంజారాహిల్స్: బిర్యానీ తినిపిస్తానని నాలుగేళ్ల చిన్నారిని తన గదిలోకి రప్పించిన యువకుడు లైంగిక దాడికి యత్నించిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు... యూసుఫ్‌గూడ రహ్మత్‌నగర్ సమీపంలోని సంతోషిమాతా టెంపుల్ వద్ద నివసించే నాలుగేళ్ల చిన్నారిని పక్కింట్లో నివసిస్తున్న శ్రీకాకుళం జిల్లాకు చెంది పెయింటర్ కోటేశ్వర్‌రావు ఈ నెల 20వ తేదీన మధ్యాహ్నం బిర్యానీ తిందాంరా అంటూ గదిలోకి పిలిచాడు.
ఆమె వచ్చిన తర్వాత అసభ్యంగా ప్రవర్తించాడు. ఏడుస్తూ బయటికి వచ్చిన చిన్నారిని తల్లి ఏం జరిగిందని ప్రశ్నించగా కోటేశ్వర్‌రావు తన పట్ల ప్రవర్తించిన తీరును తల్లికి తెలిపింది. చిన్నారి తల్లి ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. జూబ్లీహిల్స్ పోలీసులు కోటేశ్వర్‌రావుకు ఐపీసీ సెక్షన్ 354(బి), పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు.
చదవండి: కడుపునొప్పి పేరుతో భర్తను బయటకు పంపి.. క్షణాల్లో పెళ్లికూతురు మాయం
లైంగిక దాడికి గురైన బాలికకు శిశువు జననం
Comments
Please login to add a commentAdd a comment