
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, బంజారాహిల్స్: పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఓ బాలిక పై లైంగికదాడికి పాల్పడిన వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రహమత్‌నగర్‌లో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్న బాలికకు ఇంటి యజమాని కుమారుడు సయ్యద్ సమీర్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. సమీర్ ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో అందుకు అంగీకరించింది.
ఈ విషయం సదరు బాలిక తల్లిదండ్రులకు తెలియడంతో సమీర్‌కు ఇదివరకే పెళ్లి జరిగిందని ఇద్దరు పిల్లలు ఉన్నారని, అతనితో మాట్లాడవద్దని సూచించారు. దీంతో ఆమె కొన్ని రోజులుగా అతడికి దూరంగా ఉంటోంది. అయితే ఇటీవల సమీర్ తన భార్యను ఒప్పించి పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.
గత ఏడాది ఆగస్టు 6 న ఆమెను తన ఇంటికి రప్పించుకుని లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలియడంతో గత 23న బాధితురాలి తల్లితండ్రులు సమీర్ ఇంటికి వెళ్లి పెళ్లి విషయమై ప్రశ్నించారు. అందుకు అతను అంగీకరించకపోవడంతో ఆదివారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సమీర్ పై పొక్సో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: ఛార్జింగ్‌లో ఉన్న మొబైల్ తీస్తుండగా షాక్ తగిలి చిన్నారి మృతి
Comments
Please login to add a commentAdd a comment