బెంగుళూరు: హాసన మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై నమోదైన అత్యాచారం కేసులో.. సిట్ పోలీసులు మూడవ ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. జేడీఎస్ పార్టీకి చెందిన ఓ మహిళపై తుపాకీతో బెదిరించి పలుమార్లు లైంగింకంగా వేధింపులకు పాల్పడినట్లు ఆ ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు.
2020 ఫిబ్రవరి నుంచి 2023 డిసెంబర్ వరకు ఓ మహిళపై ప్రజ్వల్ లైంగిక దాడి చేసినట్లు తెలిపారు. 1691 పేజీలు ఉన్న ఛార్జ్‌షీట్ లో 120 మంది సాక్ష్యుల వాంగ్మూలం కూడా ఉంది. లైంగిక చర్యకు చెందిన వీడియోలు తీసి, దాంట్లో ముఖం కనబడకుండా చేసి బెదిరింపులకు పాల్పడినట్లు సిట్ తెలిపింది. వీడియోల ఆధారంగా మళ్లీ మళ్లీ ఆ మహిళను లైంగికంగా వేధించినట్లు ఛార్జీషీట్‌లో పేర్కొన్నారు.
కాగా తన కేసు విచారణ గోప్యంగా నిర్వహించాలని కోరుతూ ప్రజ్వల్ తన న్యాయవాదుల సహకారంతో వేసుకున్న అర్జీని జస్టిస్ ఎం.నాగప్రసన్న తోసిపుచ్చారు. బాధిత మహిళల విచారణలో గోప్యత పాటించవలసి ఉంటుందని, ప్రజ్వల్ విషయంలో విచారణ ఎలా ఉండాలో న్యాయస్థానం తీర్మానిస్తుందని ప్రకటించి.. తదుపరి విచారణను 19వ తేదీకి వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment