
హీరో దర్శన్ అభిమాని హత్య కేసు శాండల్‌వుడ్‌ను కుదిపేస్తోంది. ఈ కేసులో ఇప్పటికే దర్శన్, ఆయన ప్రియురాలు పవిత్ర గౌడను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసును బెంగళూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్య జరిగిన ప్రదేశంలో దర్శన్ కారు కనిపించడంతో పోలీసులు అతన్ని నిందితుడిగా చేర్చారు. ప్రస్తుతం ఈ కేసులో పవిత్ర గౌడ, దర్శన్ పోలీసుల కస్టడీలో ఉన్నారు.
ఇదిలా ఉండగా.. తాజాగా మరో షాకింగ్ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. దర్శన్‌కు చెందిన బెంగళూరు ఫామ్‌హౌస్‌ను చూసుకునే మేనేజర్ శ్రీధర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని మృతదేహాన్ని ఫామ్‌హౌస్ సమీపంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్కడే సూసైడ్ నోట్‌తో పాటు వీడియో సందేశం పోలీసులకు లభించాయి.
విపరీతమైన ఒంటరితనం కారణంగానే జీవితాన్ని ముగిస్తున్నట్లు సూసైడ్ నోట్‌లో మేనేజర్ శ్రీధర్ పేర్కొన్నాడు. ఈ కేసులో తన మిత్రులు, బంధువులకు ఎలాంటి సంబంధం లేదని.. తన మరణానికి తానే కారణమని సూసైడ్ నోట్‌లో రాసుకున్నాడు. అయితే మేనేజర్ ఆత్మహత్యకు, దర్శన్ అభిమాని రేణుకాస్వామి హత్య కేసుకు మధ్య ఉన్న సంబంధంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment