form house
-
కన్నడ హీరో దర్శన్ మేనేజర్ సూసైడ్.. ఘటనాస్థలిలో కీలక ఆధారాలు!
హీరో దర్శన్ అభిమాని హత్య కేసు శాండల్‌వుడ్‌ను కుదిపేస్తోంది. ఈ కేసులో ఇప్పటికే దర్శన్, ఆయన ప్రియురాలు పవిత్ర గౌడను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసును బెంగళూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్య జరిగిన ప్రదేశంలో దర్శన్ కారు కనిపించడంతో పోలీసులు అతన్ని నిందితుడిగా చేర్చారు. ప్రస్తుతం ఈ కేసులో పవిత్ర గౌడ, దర్శన్ పోలీసుల కస్టడీలో ఉన్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా మరో షాకింగ్ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. దర్శన్‌కు చెందిన బెంగళూరు ఫామ్‌హౌస్‌ను చూసుకునే మేనేజర్ శ్రీధర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని మృతదేహాన్ని ఫామ్‌హౌస్ సమీపంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్కడే సూసైడ్ నోట్‌తో పాటు వీడియో సందేశం పోలీసులకు లభించాయి.విపరీతమైన ఒంటరితనం కారణంగానే జీవితాన్ని ముగిస్తున్నట్లు సూసైడ్ నోట్లో మేనేజర్ శ్రీధర్ పేర్కొన్నాడు. ఈ కేసులో తన మిత్రులు, బంధువులకు ఎలాంటి సంబంధం లేదని.. తన మరణానికి తానే కారణమని సూసైడ్ నోట్లో రాసుకున్నాడు. అయితే మేనేజర్ ఆత్మహత్యకు, దర్శన్ అభిమాని రేణుకాస్వామి హత్య కేసుకు మధ్య ఉన్న సంబంధంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. -
రెండేసి ఇళ్లు కొంటున్నారు..!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కరోనా నేపథ్యంలో భౌతిక దూరం అనివార్యమైంది. కరోనా వచ్చాక ఒకే ఇంట్లో కుటుంబ సభ్యులతో ఉండటం సమస్యే. ఒకవైపు కరోనా చేతికి చిక్కకుండా.. మరోవైపు వర్క్ ఫ్రం హోమ్ చేసుకునేందుకు వీలుగా ఉండేందుకు సెకండ్ హోమ్స్ ప్రాధాన్యత పెరిగింది. కోవిడ్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న నగరాల నుంచి దూరంగా ఉండాలన్న లక్ష్యంతో భద్రత, ప్రశాంతమైన ప్రాంతాలలో నివాసం ఉండేందుకు సంపన్న వర్గాలు ఆసక్తి చూపిస్తున్నాయి. ద్వితీయ శ్రేణి పట్టణాలు, పచ్చని పర్యావరణంతో ఓపెన్ స్పేస్ ఎక్కువగా ప్రాంతాలలో నివాసం ఉండేందుకు ఇష్టపడుతున్నారు. ఎవరు కొంటున్నారంటే? ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు నగరాలకు చెందిన ప్రవాసులు, హైనెట్ వర్త్ ఇండివిడ్యువల్స్ (హెచ్ఎన్ఐ), సంపన్న భారతీయులు ఎక్కువగా సెకండ్ హోమ్స్‌ను కొనుగోళ్లు చేస్తున్నారు. ప్రీ–కోవిడ్‌తో పోలిస్తే సెకండ్ వేవ్ తర్వాత సెకండ్ హోమ్స్ కోసం ఎంక్వైరీలు 20–40 శాతం, లావాదేవీలు 15–20 శాతం మేర వృద్ధి చెందాయని రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ జేఎల్ఎల్ సీనియర్ డైరెక్టర్ రితేష్ మిశ్రా తెలిపారు. కొన్ని సంపన్న వర్గాలు నగరంలో 40 కి.మీ. పరిధిలో సెకండ్ హోమ్స్ కోసం ఎంక్వైరీలు చేస్తుంటే.. మరికొందరేమో 300 కి.మీ. దూరం అయినా సరే గ్రీనరీ, ఓపెన్ స్పేస్ ఎక్కువగా ఉండే ప్రాంతాలను ఎంచుకుంటున్నారని తెలిపారు. ఎక్కడ కొంటున్నారంటే? ద్వితీయ శ్రేణి పట్టణాలు, గ్రీనరీ ఎక్కువగా ఉండే ప్రాంతాలలో సెకండ్ హోమ్స్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వర్క్ ఫ్రం హోమ్ చేసుకునేందుకు వీలుగా వై–ఫై కనెక్టివిటీ, మెరుగైన రవాణా సేవలు ఉండే ప్రాంతాలను ఎంచుకుంటున్నారు. కరోనా నేపథ్యంలో మహారాష్ట్రలోని నాసిక్, కర్ణాటకలోని మైసూరు, మంగళూరు, తమిళనాడులోని ఊటి, కేరళలోని కొచ్చి, హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా, కసౌలి, పర్వాను, పుదుచ్చేరి ప్రాంతాలలో సెకండ్ హోమ్స్‌కు డిమాండ్ ఉందని అడ్వైజరీ సర్వీసెస్ కొల్లియర్స్ ఇండియా ఎండీ శుభంకర్ మిత్రా తెలిపారు. దుబాయ్, యూఏఈలోనూ.. మిలీనియల్స్ కస్టమర్లేమో ముంబై నుంచి 300 కి.మీ. దూరంలో ఉన్న నాసిక్, కర్జాత్, డియోలాలి, పన్వేల్ సరిహద్దులలో కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ప్రాపర్టీ లు, ప్రీ–కోవిడ్‌తో పోలిస్తే ధరలు పెద్దగా పెరగని ప్రాజెక్ట్‌లలో కొనుగోలు చేస్తున్నారు. చెన్నైలో మహాబలిపురం, కేరళలోని కోవలం మెయిన్ రోడ్లో ఫామ్‌హౌస్‌లకు డిమాండ్ ఉంది. గోవాలోని పలు బీచ్ ప్రదేశాలు కూడా హెచ్ఎన్ఐ ఆసక్తి ప్రదేశాలలో ఒకటిగా ఉన్నాయి. కొంతమంది సంపన్న వర్గాలు దుబాయ్‌లోనూ సెకండ్ హోమ్స్‌ను కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. సులువైన విమాన ప్రయాణం ఒక కారణమైతే.. ఆ దేశంలో కోవిడ్ నియంత్రణ మెరుగ్గా ఉండటం మరొక కారణమని తెలిపారు. కరోనా కంటే ముందుతో పోలిస్తే దుబాయ్‌లో సెకండ్ హోమ్స్ డిమాండ్ 15–20 శాతం వృద్ధి చెందిందని తెలిపారు. దుబాయ్‌లో రూ.1–1.50 కోట్ల ధరల ప్రాపర్టీలకు ఆసక్తి చూపిస్తున్నారని పేర్కొన్నారు. రూ.100 కోట్ల ఫామ్‌హౌస్‌లు.. ఎన్సీఆర్, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, బెంగళూరు నగరాలలో సెకండ్ హోమ్స్ వృద్ధి 30–40% వరకుందని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ చైర్మన్ అనూజ్ పూరీ తెలిపారు. ఢిల్లీలోని చత్తర్‌పూర్, సుల్తాన్‌పూర్‌లలో రూ.10–100 కోట్ల ఫామ్ హౌస్‌లకు డిమాండ్ ఏర్పడిందని పేర్కొన్నారు. ముంబైలో సెకండ్ హోమ్స్ కొనుగోలుదారులు రెండు రకాలుగా ఉన్నారు. హెచ్ఎన్ఐ కస్టమర్లేమో... రూ.5–20 కోట్ల మధ్య ధరలు ఉండే స్థలాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక, మిలీనియల్స్ కొనుగోలుదారులమో.. చిన్న సైజ్, రో హౌస్ అపార్ట్మెంట్ల కోసం అన్వేషిస్తున్నారు. రూ.1–5 కోట్ల ధరలు ఉండే ప్రాపర్టీలను కొనుగోలు చేస్తున్నారు. ఆయా ప్రాజెక్ట్‌లలో వర్క్ ఫ్రం హోమ్‌కు వీలుగా వేగవంతమైన వై–ఫై కనెక్టివిటీ, ఆఫీసులకు వెళ్లేందుకు మెరుగైన రవాణా, ఇతరత్రా మౌలిక వసతులను కోరుకుంటున్నారు. -
సానియా మీర్జా ఫాంహౌస్ ఇంచార్జీ అరెస్ట్
-
ఫాంహౌస్‌లో దొంగల బీభత్సం
దొడ్డబళ్లాపురం: దోపిడీ దొంగలు ఒక ఫాంహౌస్‌లో చొరబడి యువకున్ని చంపి పెద్దమొత్తంలో నగలు, డబ్బును దోచుకున్నారు. ఈ ఘోరం దొడ్డ తాలూకా దొడ్డ బెళవంగల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మంజునాథ్ (22)హత్యకు గురైన యువకుడు. దాబస్‌పేట–దొడ్డబళ్లాపురం జాతీయ రహదారి మార్గంలోని హులికుంట గ్రామం వద్ద రోడ్డు పక్కనే ఉన్న ఒక తోటలో ఈ సంఘటన జరిగింది. మంచినీళ్లు కావాలంటూ వచ్చి తోటలోని ఇంట్లో మృతుడు మంజునాథ్ ఇతడి తల్లి, అక్క ముగ్గురే నివసిస్తుండేవారు. ఆదివారం అర్ధరాత్రి కొందరు అపరిచిత వ్యక్తులు తలుపు తట్టి తాగడానికి నీళ్లు కావాలని అడిగారు. తలుపులు తీయగానే లోపలకు జొరబడ్డ దుండగులు ముగ్గురిపైనా దాడిచేసి దోపిడీకి ప్రయత్నించారు. ఈ క్రమంలో మంజునాథ్ అడ్డుకోవడంతో కత్తితో పొడిచారు. తరువాత దొరికిన నగలు, నగదు దోచుకుని ఇంటి ముందు నిలిపి ఉన్న బైక్‌ను తీసుకుని పరారయ్యారు. తీవ్రంగా గాయపడ్డ మంజునాథ్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. మంజునాథ్ తల్లి లలితమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దొడ్డబెళవంగల పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఫామ్‌హౌజ్ వ్యవహారంలో కేటీఆర్‌కు ఊరట
-
ప్రకృతిసేద్య నిపుణుడు నారాయణరెడ్డి మృతి
సాక్షి, హైదరాబాద్: సుప్రసిద్ధ ప్రకృతి వ్యవసాయ నిపుణుడు డాక్టర్ ఎల్. నారాయణరెడ్డి(84) కర్ణాటకలోని తన వ్యవసాయ క్షేత్రంలో ఆదివారం నిద్రలోనే కన్నుమూశారు. మరలేనహళ్లిలో గల తన వ్యవసాయ క్షేత్రంలో ఆదివారం సైతం ఆయన రైతులకు ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ ఇచ్చారు. కాగా, ఆయన స్వస్థలం బెంగళూరు రూరల్ వర్తూర్‌లో సోమవారం అంత్యక్రియలు నిర్వర్తించారు. జపాన్‌కు చెందిన ప్రకృతి వ్యవసాయ నిపుణులు మసనొబు ఫుకువోకా శిష్యుడిగా నారాయణరెడ్డి ప్రసిద్ధి పొందారు. ఫుకువోకా భారత్‌లో పర్యటనకు వచ్చినప్పుడు మరలేనహళ్లిలోని నారాయణరెడ్డి వ్యవసాయక్షేత్రాన్ని సందర్శించారు. డాక్టర్ నారాయణరెడ్డి 35 ఏళ్లుగా ప్రకృతి వ్యవసాయంలో ఉన్నారు. తన వ్యవసాయ క్షేత్రాన్ని అంతర్జాతీయ ప్రకృతి వ్యవసాయ శిక్షణా కేంద్రంగా తీర్చిదిద్దారు. ఆ పొలంలోని మట్టి 5 శాతం సేంద్రియ కర్బనంతో కూడి ఉండటం విశేషంగా చెబుతారు. దేశ విదేశాల నుంచి రైతులు వచ్చి ఆయన వద్ద అనుభవపూర్వకంగా ప్రకృతి వ్యవసాయ పాఠాలు నేర్చుకుంటూ ఉంటారు. లీసా ఇండియా ఆంగ్ల ప్రకృతి వ్యవసాయ మాసపత్రికకు చాలా ఏళ్లుగా ఆయన కాలమిస్టు. వేలాది మంది రైతులను ప్రకృతి వ్యవసాయంలోకి మళ్లించిన డా. నారాయణరెడ్డి మరణం తీరని లోటని పలువురు నివాళులర్పించారు. -
వ్యవసాయ కార్మికులకు ఆస్ట్రేలియా ఆహ్వానం
సిడ్నీ: వ్యవసాయ కార్మికుల కొరతతో సతమతమవుతున్న ఆస్ట్రేలియా కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీయులకు అందజేసే వర్కింగ్ హాలీడే వీసా లేదా బ్యాక్‌ప్యాకర్ వీసాల గడువును మూడేళ్ల కాలానికి పొడిగించింది. యువతీయువకులు ఎవరైనా ఉత్తర ఆస్ట్రేలియాలోని వ్యవసాయ క్షేత్రాల్లో 6 నెలల పాటు పనిచేస్తే వారికి మూడేళ్ల పాటు దేశంలో ఉండే అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం తెలిపింది. సాధారణంగా ఏడాది కాలానికి ఈ వీసాను జారీచేస్తారు. ఈ ఏడాది కాలంలో ఆరు నెలల పాటు ఉత్తర ఆస్ట్రేలియా, క్వీన్స్‌ల్యాండ్ ప్రాంతాల్లోని వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేస్తే వీసా గడువును మరో ఏడాది అదనంగా పొడిగించేవారు. తాజాగా ఈ రెండేళ్ల వీసా గడువును మూడేళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ చెప్పారు. ఈ నిర్ణయం 2019, జూలై నుంచి అమల్లోకి వస్తుందన్నారు. ఈ వీసాలకు 45 దేశాల పౌరులు దరఖాస్తు చేసుకునే అవకాశముంది. -
హెచ్చరికలతో అప్రమత్తమైన సీఎం కేసీఆర్
-
ఫాంహౌస్ నుంచి సీఎం తిరుగుముఖం
జగదేవ్‌పూర్ (మెదక్): సీఎం కేసీఆర్ మెదక్ జిల్లా ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రం నుంచి ఆదివారం సాయంత్రం తిరిగి హైదరాబాద్‌కు బయల్దేరి వెళ్లారు. శనివారం రాత్రి ఫాంహౌస్‌కు వచ్చిన సీఎం ఇక్కడే బస చేశారు. ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో వ్యవసాయక్షేత్రంలో పంటలను పరిశీలించారు. మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రాస్, తెలంగాణ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రత్యేక అధికారి ప్రవీణ్‌రావు, నెటాఫిమ్ మేనేజర్ నారాయణ, జేసీ వెంకట్రాంరెడ్డి, ఇరిగేషన్ స్పేషల్ అధికారి మల్లయ్య, ఆర్డీఓ ముత్యంరెడ్డిలతో ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. మే లోపు అన్ని రకాల అభివృద్ధి పనులు పూర్తి చేయాలని, డ్రిప్పు పనులు ప్రారంభించాలని అధికారులను అదేశించారు. సాయంత్రం 4:30 గంటల సమయంలో తిరిగి హైదరాబాద్‌కు వెళ్లారు. -
ఆ పార్టీలో నేనూ ఉన్నా : బ్రహ్మాజీ
శనివారం ఉదయం నుంచి మీడియాలో హీరో నవదీప్ ఫాం హౌస్ పార్టీపై వస్తున్న కథనాలను నటుడు బ్రహ్మాజీ ఖండించాడు. హైదరాబాద్ శివార్లలోని నవదీప్ ఫాం హౌస్‌లో రేవ్ పార్టీ జరిగిందని, ఆ పార్టీపై పోలీసులు దాడి చేయగా నవదీప్ సహా పలువురు సినీ నటులు పరారీలో ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంపై నవదీప్ స్పందిస్తూ, అది రేవ్ పార్టీ కాదని కుటుంబ సభ్యులంతా కలిసి గృహవేశ కార్యక్రమంలో పాల్గొన్నట్టు తెలిపాడు. తాజాగా ఇదే విషయంపై నటుడు బ్రహ్మాజీ కూడా స్పందించాడు. నవదీప్‌పై వస్తున్న వార్తలన్ని అవాస్తవాలని తెలిపిన అతడు, తాను కూడా కుటుంబ సమేతంగా ఆ పార్టీలో పాల్గొన్నట్టుగా తెలిపాడు. ఇది పిల్లలు, కుటుంబ సభ్యులతో కలిసి ఏర్పాటు చేసిన ఫాం హౌస్ పార్టీ అంటూ ట్వీట్ చేశాడు. అయితే నవదీప్ చెప్పినట్టుగా ఇది గృహప్రవేశ కార్యక్రమం అన్నట్టుగా కాకుండా, అది ఫాం హౌస్ పార్టీ అని చెప్పాడు బ్రహ్మాజీ. News about @pnavdeep26 is utterly baseless.I was there with my family too..it's farm house party with kids n families. — BRAHMAJI (@actorbrahmaji) March 26, 2016 -
రేవ్ పార్టీ కాదు.. గృహప్రవేశం: నవదీప్
మోమిన్‌పేట్: హీరో నవదీప్ ఫామ్ హౌస్‌లో రేవ్ పార్టీ చేసుకున్నాడని ఆ సమయంలోనే పోలీసులు దాడులు చేశారని కానీ నవదీప్ అక్కడ్నుంచి తప్పించుకున్నాడని వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నాడని కూడా జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే నవదీప్ మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చాడు. అసలు ఆ రేవ్ పార్టీ గోలేంటో తనకేమీ తెలియదని చెబుతున్నాడు. తనకి ఫామ్ హౌసే లేదంటున్నాడు. మీడియాను ఉద్దేశించి ఆయన ట్విట్టర్లో స్పందిస్తూ ``మీరు నా పేరు వాడిన ప్రతిసారీ ఒక్కో రూపాయి ఇచ్చినా నేను ఫామ్ హౌస్ కొనగలిగేవాడినేమో. ఎలాగో వీడి మీద చాలా ఉన్నాయి కదా. మరొకటి వేసేద్దాం అనుకుంటున్నారు. ఫ్యామిలీతో కలిసి డిన్నర్ కి వెళ్తే.. రేవ్ పార్టీలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మరి ఆ రేవ్ పార్టీతో నాకేంటో సంబంధం?.. వాడు చెప్పాడని.. వీడు రాశాడని.. ఇంకొకడు రాశాడంట..దేశానికి నేను ఎలాగూ పనికిరానని మీ ఫీలింగ్ కదా.. పోనీలే.. మీరైనా పనికిరండి. నన్ను పక్కనపెట్టి పనికొచ్చే పనిచేయండి.. పెద్దలు, కుటుంబంతో కలిసి గడిపిన ఓ గృహప్రవేశాన్ని రేవ్ పార్టీ చేసిన మహానుభావులకు పాదాభివందనాలు..'' అంటూ అని ట్వీట్ చేశాడు. కాగా యువ హీరో నవదీప్ చెందిన ఫాంహౌస్ పై పోలీసులు, ఎక్సైజ్ అధికారులు శనివారం తెల్లవారుజామున ఉమ్మడిగా దాడులు నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా మోమిన్‌పేట్ మండలం చక్రంపల్లిలో నవదీప్ కు ఫాంహౌస్ ఉంది. అందులో శుక్రవారం అర్థరాత్రి రేవ్ పార్టీ జరుగుతోందని, కొందరు సినీ ప్రముఖులు మద్యం తాగుతూ డ్యాన్సర్లతో హంగామా చేస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు దాడులు చేపట్టారు. అయితే పార్టీలో పాల్గొన్న హీరో, మరికొందరు నటులు పరారైనట్టు సమాచారం. ఈ సందర్భంగా పెద్ద మొత్తంలో విదేశీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మేనేజర్ అరుణ్ సాయిని పోలీసులు అదుపులో తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే రేవ్ పార్టీలో పాల్గొన్న పలువురు ప్రముఖులను పోలీసులు తప్పించినట్టు స్థానికులు చెబుతున్నారు. ఓ ప్రముఖ నటుడు పోలీసులు అదుపులో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఆ నటుడు ఎవరు, ఏమిటన్నల వివరాలు తెలియ రాలేదు. ఈ సంఘటనపై పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించడం లేదు. Hilarious news of the day! Dinner with parents and families - rave party! When questioned about it say "cant name my sources!" #journalism — Navdeep (@pnavdeep26) March 26, 2016 Elago veedi meedha chaala unnay kadha , inkokati vesedham, janalu nammutharu , aanandhistharu, trp osthadhemo! #dhenemmajeevitham lol — Navdeep (@pnavdeep26) March 26, 2016 Meeru na peru vaadina prathisari naku oka one rupee isthe , nijangane farmhouse konagaligevadnemo! #Hatsoff — Navdeep (@pnavdeep26) March 26, 2016 Vadu cheppadani veedu raasadanta Veedu raasadani inkokadu raasadanta! Desaniki nenu elago panikiranani mee feeling kadha! Ponile (1/2) — Navdeep (@pnavdeep26) March 26, 2016 meeraina panikirandi! Nannu pakkanapetti panikoche pani cheyyandi! #thanks :) (2/2) — Navdeep (@pnavdeep26) March 26, 2016 Pillu pottery chesthu , peddhalu families tho bond avuthu gadipina oka gruha prevashanni RAVE party chesina mahaanubhavulaki (1/2) — Navdeep (@pnavdeep26) March 26, 2016 paadhaabhivandhanalu! (2/2) — Navdeep (@pnavdeep26) March 26, 2016 My mother was with me what's wrong with u! Anything for trps? No checking facts no checking with me atleast! #blindjournalism — Navdeep (@pnavdeep26) March 26, 2016 Guess when writing s**t is your bread and butter .. You should be excused! Cool bro , go find your other news of the day! :) #peace — Navdeep (@pnavdeep26) March 26, 2016 -
ఫాంహౌస్‌లో కేసీఆర్
జగదేవ్‌పూర్: రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శనివారం రాత్రి మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లిలో గల తన వ్యవసాయక్షేత్రానికి చేరుకున్నారు. రాత్రి 7 గంటల ప్రాంతంలో కాన్వాయ్ ద్వారా ఫాంహౌస్‌కు చేరుకున్న ఆయన.. వస్తూనే చండీయాగం పనులను పరిశీలించారు. పది నిమిషాల పాటు చండీయాగం నిర్వహణ స్థలంలో తిరిగారు. 'యాగం పనులు ఎంత వరకు వచ్చాయ్' అంటూ ఆరా తీశారు. బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి అయుత చండీయాగం పనుల వివరాలను సీఎంకు వివరించారు. పనులను వేగంగా చేయాలని నిర్వహకులకు సీఎం సూచించారు. ఆదివారం సాయంత్రం వరకు వ్యవసాయక్షేత్రంలోనే ఉండనున్నట్లు సమాచారం. సీఎం ఫాంహౌస్‌కు వస్తున్నారని సమాచారం ఉండడంతో జిల్లా ఎస్పీ సుమతి ఆధ్వర్యంలో ఫాంహౌస్ వద్ద పోలీస్‌బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతకు ముందు శంగేరీ వేద పండితులు శశాంక్‌శర్మ, గోపికష్ణశర్మలు చండీయాగం పనులను పరిశీలించారు. -
గ్రామజ్యోతి ఎలా నడుస్తోంది?
ఎర్రవల్లి గ్రామస్తులతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరా * బాగా చేయండి.. నేనే వస్తా.. శ్రమదానం చేస్తా జగదేవ్‌పూర్: గ్రామజ్యోతి కార్యక్రమం ఎలా నడుస్తోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆరా తీశారు. బుధవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి ఆయన తన కాన్వాయ్ ద్వారా గణేశ్‌పల్లి, నర్సన్నపేట, ఎర్రవల్లి గ్రామాల మీదుగా ఫాంహౌస్‌కు చేరుకున్నారు. ఎర్రవల్లి మీదుగా వెళ్తున్న క్రమంలో స్థానిక వాటర్‌ట్యాంకు దగ్గర గ్రామ సర్పంచ్ భాగ్యబాల్‌రాజు, గ్రామ ప్రజలు గుమికూడటంతో అక్కడ ముఖ్యమంత్రి ఐదు నిమిషాల పాటు ఆగారు. గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆరా తీశారు. ‘మీ ఊర్లో గ్రామ జ్యోతి ఎలా నడుస్తోంది... బాగా చేయండి.. నేనూ పాల్గొని శ్రమదానం చేస్తా.. గ్రామజ్యోతిని బ్రహ్మాండంగా నిర్వహిద్దాం.. గురువారం లేదా ఆదివారం ప్రతి వాడలో పర్యటిస్తా’ అని కేసీఆర్ ఉత్సాహపరిచారు. అనంతరం ముఖ్యమంత్రి తన కాన్వాయ్ ద్వారా గ్రామ సమీపంలోని ఫాంహౌస్‌కు చేరుకున్నారు. ఆయనకు కలెక్టర్ రోనాల్డ్‌రాస్, గడా అధికారి హన్మంతరావు స్వాగతం పలికారు. ఫాంహౌస్‌కు చేరుకోగానే జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సీఎం ఆరా తీసినట్లు తెలిసింది. తన క్షేత్రంలో జరుగుతున్న వ్యవసాయ పనుల గురించి అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. నేడు మూడు గ్రామాల్లో పర్యటన! ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం మండలంలోని ఎర్రవల్లి, తిగుల్, మునిగడప గ్రామాల్లో పర్యటించే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. ఈ క్రమంలో ఎర్రవల్లిలో గడా అధికారి హన్మంతరావు బుధవారం వివిధ పనులను దగ్గరుండి మరీ పర్యవేక్షించారు. తిగుల్ గ్రామంలో కూడా పర్యటించనున్నారని తెలిసింది. దీంతో గ్రామ సర్పంచ్ సుధాకర్‌రెడ్డి.. తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట మధ్యలో సీఎం ఎప్పుడైనా గ్రామానికి వచ్చే అవకాశం ఉందని తెలిసింది. మునిగడపలో సైతం పర్యటిస్తారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. మొత్తానికి ఆదివారం వరకు సీఎం ఫాంహౌస్‌లో ఉంటారని సమాచారం. -
ఫాంహౌస్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్
జగదేవ్‌పూర్(మెదక్): ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బుధవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లి గ్రామంలోని తన వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. మంగవారం రాత్రి ఫాంహౌస్‌కు వస్తారని పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే, చివరి క్షణంలో బుధవారానికి వాయిదా పడింది. దీంతో పోలీసులు వెనుదిరిగారు. బుధవారం మధ్యాహ్నం వస్తున్నారని సమాచారం అందడంతో జిల్లా ఎస్పీ సుమతి అధ్వర్యంలో రోడ్డు గుండా భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. సాయంత్రం 5 గంటలకు తన కాన్వాయ్ ద్వారా ముఖ్యమంత్రి ఫాంహౌస్‌కు చేరుకున్నారు. కలెక్టర్ రోనాల్డ్‌రాస్, గడా అధికారి హన్మంతరావు, సిద్దిపేట ఆర్డీవో ముత్యంరెడ్డి ఆయనకు స్వాగతం పలికారు. రాత్రి ఇక్కడే ఉండి గురువారం మండలంలోని ఎర్రవల్లి, తిగుల్, మునిగడప గ్రామాల్లో జరిగే గ్రామజ్యోతి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉందని సమాచారం. -
ఫాంహౌస్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్
జగదేవ్‌పూర్(మెదక్): ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లి గ్రామ సమీపంలోని తన ఫాంహౌస్‌కు చేరుకున్నారు. ఉదయం కరీంనగర్ జిల్లాలో పర్యటించిన ఆయన, పర్యటన అనంతరం ఇక్కడికి వచ్చారు. సీఎం రాక నేపథ్యంలో జిల్లా ఎస్పీ సుమతి ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డి, గడా అధికారి హన్మంతరావు కేసీఆర్‌కు స్వాగతం పలికారు. రాత్రి ఇక్కడే బస చేసి ఆదివారం వ్యవసాయక్షేత్రంలో పర్యటిస్తారని తెలిసింది. ఆదివారం సాయంత్రానికి హైదరాబాద్ వెళ్లే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. -
గు‘లాబీ’!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: పుట్టింట్లో పట్టుకోసం టీఆర్ఎస్ పాట్లు పడుతోంది. జిల్లాలో రాజకీయంగా ‘ఫాం’లోకి రావడానికి ‘ఫాంహౌస్’ మీదే ఆశలు పెట్టుకుంది. ఉద్యమ పరంగా ముందున్న తెలంగాణ రాష్ట్ర సమితి రాజకీయంగా నియోజకవర్గంలో చాలా వెనుకబడి ఉంది. దాదాపు ఆరు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్కు బలమైన పునాదులు లేవు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే సిద్దిపేట, దుబ్బాక మీదనే ఆ పార్టీకి ఆశలు సజీవంగా ఉన్నాయి. మెదక్, సంగారెడ్డి నియోజకవర్గాల్లో పార్టీకి క్యాడర్ ఉన్నప్పటికీ ఇప్పటికే ఇక్కడ వర్గపోరు మొదలైంది. ఈ నేపథ్యంలో జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు గులాబీ దళపతి వేస్తున్న ఎత్తులు.. జిత్తులు చిత్తయిపోతున్నాయి. ‘హ్యాండిచ్చి’ జారుకున్నారు... టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైనా కాంగ్రెస్ పార్టీలో చేరవచ్చని కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ వ్యాఖ్యానించడం.. టీఆర్ఎస్ నేతల కోసం రెడ్ కార్పెట్ పరవటం... మరోవైపు ‘టీఆర్ఎస్ వాళ్లు కాంగ్రెస్‌లోకి పోతారో, కాంగ్రెస్ వాళ్లు టీఆర్ఎస్లోకి వస్తారో చూద్దాం’ అంటూ ఆ మరుసటి రోజే గులాబీ దళపతి కేసీఆర్ సవాల్ విసిరిన విషయం తెలిసిందే. అదే ఊపు మీద కేసీఆర్ పటాన్చెరు ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్ మీద వల విసిరారు. ఫాంహౌస్ విందుకు పిలిచి పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. టీఆర్ఎస్లో చేరటం దాదాపు ఖాయమనే నందీశ్వర్‌గౌడ్ సంకేతాలు పంపించారు. ఇక గులాబీ కండువా కప్పుకోవడమే తరువాయి అనుకున్న సమయంలో ఆయన హ్యాండిచ్చి జారిపోయారు. ఇదే జిల్లా నుంచి ఇద్దరు మాజీ మంత్రులకు కూడా కేసీఆర్ గాలం వేశారు. వారిని ఒప్పించి పార్టీలోకి తీసుకొచ్చే బాధ్యతను రంగారెడ్డి జిల్లా పరిగి ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్‌రెడ్డికి అప్పగించినట్టు, ఆయన ఆ ఇద్దరు మాజీ మంత్రులను ఒప్పించే ప్రయత్నం చేసినట్టు సమాచారం. వారిద్దరి చేరిక దాదాపు ఖారారైనట్టే అని, రేపో మాపో పార్టీలో చేరిపోతారని టీఆర్ఎస్లోనే ఒక వర్గం మీడియాకు లీకుల మీద లీకులు ఇచ్చింది. ఈ లీకులపై స్పందించిన సదరు మాజీ మంత్రి ఒకరు పార్టీ మారే ప్రసక్తి లేదని, మాది మొదటి నుంచి కాంగ్రెస్ కుటుంబమేనని, పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదని కొట్టిపారేశారు. ఇక మరో మాజీ మంత్రి కోసం ప్రయత్నం చేస్తే ముందు పొత్తుల విషయం తేలనివ్వండి ఆ తర్వాత ఆలోచన చేద్దాం అన్నట్లు ప్రచారం జరుగుతోంది. దళిత నాయకుడు, ముఖ్యమంత్రి రేసులో ఉన్న దామోదర రాజనర్సింహకు చెక్ పెట్టడానికి కేసీఆర్ వేసిన రెండు ఎత్తులు పని చేయలేదు. ముందుగా తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రిని పార్టీలోకి ఆహ్వానించారు. మొదటి నుంచి ఆయనకు కేసీఆర్‌తో మంచి సాన్నిహిత్యం ఉంది. ఎన్ని సార్లు పిలిచినా ఆయన పార్టీలోకి రాకపోయేసరికి కేసీఆర్‌కు కోపం వచ్చి సదరు మాజీ మంత్రి పార్టీలోకి వచ్చినా తీసుకునేది లేదని తన అనుచరులతో తెగేసి చెప్పినట్టు సమాచారం. ఆయన బదులుగా ప్రజా కళాకారుడు రసమయి బాలకిషన్‌ను జోగిపేటకు పంపేందుకు కేసీఆర్ సూచనప్రాయంగా ప్రతిపాదించారు. ఇక గతంలో పార్టీని వీడి ఇటీవలే మళ్లీ చేరిన ఆయన్ను జోగిపేట నుంచి పోటీ చేయించాలని ప్రయత్నం చేశారు. ఆట పాటలతో రాజనర్సింహను కట్టడి చేయాలని టీఆర్ఎస్ నేతలు కొందరు రసమయికి సూచించగా... కేసీఆర్ పాచికలను ముందే పసిగట్టిన బాలకిషన్ మానకొండూరు తప్ప మరోచోట పోటీ చేయనని తెగేసి చె ప్పినట్లు సమాచారం. జహీరాబాద్, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లో సొంత పార్టీ నేతల కంటే ప్రత్యర్థి పార్టీ నేతల వలసల మీదనే కేసీఆర్ ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. కానీ ఇక్కడ ప్రత్యర్థి పార్టీల నుంచి రెండో శ్రేణి నాయకత్వం, అంతకంటే తక్కువ స్థాయి నాయకులు టీఆర్ఎస్లో చేరేందుకు మొగ్గు చూపుతున్నారు. జాక్‌పాట్ కొట్టగలిగే నేతలు పార్టీలో చేరేందుకు ఒక్కరూ ముందుకు రాకపోవడంతో కేసీఆర్ మరింత పదునుతో మరో ఎత్తుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. -
అడ్డా మార్చారు...
పరిగి, న్యూస్‌లైన్: నగర శివారులో రిసార్టులపై పోలీసులు దాడుల నేపథ్యంలో ‘జల్సారాయుళ్లు’ తమ రూటు మార్చారు. గ్రామీణ ప్రాంతాలైతే సురక్షితంగా ఉంటుందని భావించి ఇక్కడి ఫాంహౌస్‌లలో తమ ‘కార్యకలాపాలు’ నిర్వహిస్తున్నారు. శనివారం అర్ధరాత్రి దాటాక పోలీసులు పరిగి మండల పరిధిలోని తొండపల్లి సమీపంలోని ఫాంహౌస్‌లో దాడి చేశారు. అశ్లీల నృత్యాలు, వ్యభిచారం నిర్వహిస్తున్న 20 మంది పురుషులతో పాటు ముగ్గురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. పచ్చని పల్లెల్లో ఇలాంటి ‘పాడుపని’ ఏమిటని స్థానికులు నిర్ఘాంతపోయారు. నింది తులు మద్యం మత్తులో నృత్యాలు చేస్తూ పేకాట ఆడుతున్నారు. నగర శివారు ప్రాంతాల్లో పోలీసులు రిసార్టులపై దాడులు చేస్తుండడంతో జల్సారాయులు రూటు మార్చినట్లుగా తెలుస్తోంది. పరిగి మండలం మారుమూల ప్రాంతమవడంతో వారు ఎంచుకున్నారు. సురక్షిత ప్రాంతమనే.. రియల్ బూమ్ సమయంలో నగరవాసులు చాలామంది పరిగి, పూడూరు మండలాల్లో భూములు కొనుగోలు చేసి తోటలు పెంచుతూ విలాసవంతమైన భవనాలు నిర్మించుకొని ఫాంహౌస్‌లను ఏర్పాటు చేసుకున్నారు. భారీ ఎత్తుగా ప్రహరీలు ఏర్పాటు చేసుకున్నారు. దీంతో లోపల ఏం జరుగుతుందనే విషయం స్థానికులకు తెలిసే ఆస్కారం లేకుండా పోయింది. దీంతో కొందరు జల్సారాయుళ్లు అసాంఘిక కార్యకలాపాలు యథేచ్ఛగా సాగిస్తున్నారు. పరిగి నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల్లో కలిపి దాదాపు 200-250 ఫాంహౌస్‌లు ఉన్నాయి. కాగా బిజీ జీవనంతో సతమతమమ్యే నగరవాసులు కొందరు ఫాంహౌస్‌లకు వస్తూ సేదతీరుతున్నారు. ఇటీవల ఫాంహౌస్‌లకు జంటల తాకిడి కూడా బాగా పెరిగిందని, వారిని స్ధానికులు ప్రశ్నిస్తే వాహనాలపై పరారవుతున్నారని చెబుతున్నారు. దీనిని బట్టి అసాంఘిక కార్యకలాపాలు ఏమేర సాగుతున్నాయో.. ఊహించుకోవచ్చు. ఫాంహౌస్‌ల నిర్వాహకులు కొందరు డబ్బుకు ఆశపడి సకల సౌకర్యాలు కల్పిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఆందోళనలో స్ధానికులు.. పచ్చని పల్లెలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతుండడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పల్లె వాతావరణం కలుషితమవుతోందని చెబుతున్నారు.