జగదేవ్‌పూర్(మెదక్): ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బుధవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లి గ్రామంలోని తన వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. మంగవారం రాత్రి ఫాంహౌస్‌కు వస్తారని పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే, చివరి క్షణంలో బుధవారానికి వాయిదా పడింది. దీంతో పోలీసులు వెనుదిరిగారు.
బుధవారం మధ్యాహ్నం వస్తున్నారని సమాచారం అందడంతో జిల్లా ఎస్పీ సుమతి అధ్వర్యంలో రోడ్డు గుండా భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. సాయంత్రం 5 గంటలకు తన కాన్వాయ్ ద్వారా ముఖ్యమంత్రి ఫాంహౌస్‌కు చేరుకున్నారు. కలెక్టర్ రోనాల్డ్‌రాస్, గడా అధికారి హన్మంతరావు, సిద్దిపేట ఆర్డీవో ముత్యంరెడ్డి ఆయనకు స్వాగతం పలికారు. రాత్రి ఇక్కడే ఉండి గురువారం మండలంలోని ఎర్రవల్లి, తిగుల్, మునిగడప గ్రామాల్లో జరిగే గ్రామజ్యోతి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉందని సమాచారం.
ఫాంహౌస్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్
Published Wed, Aug 19 2015 6:35 PM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM
Advertisement