ఆ పార్టీలో నేనూ ఉన్నా : బ్రహ్మాజీ
శనివారం ఉదయం నుంచి మీడియాలో హీరో నవదీప్ ఫాం హౌస్ పార్టీపై వస్తున్న కథనాలను నటుడు బ్రహ్మాజీ ఖండించాడు. హైదరాబాద్ శివార్లలోని నవదీప్ ఫాం హౌస్లో రేవ్ పార్టీ జరిగిందని, ఆ పార్టీపై పోలీసులు దాడి చేయగా నవదీప్ సహా పలువురు సినీ నటులు పరారీలో ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంపై నవదీప్ స్పందిస్తూ, అది రేవ్ పార్టీ కాదని కుటుంబ సభ్యులంతా కలిసి గృహవేశ కార్యక్రమంలో పాల్గొన్నట్టు తెలిపాడు.
తాజాగా ఇదే విషయంపై నటుడు బ్రహ్మాజీ కూడా స్పందించాడు. నవదీప్పై వస్తున్న వార్తలన్ని అవాస్తవాలని తెలిపిన అతడు, తాను కూడా కుటుంబ సమేతంగా ఆ పార్టీలో పాల్గొన్నట్టుగా తెలిపాడు. ఇది పిల్లలు, కుటుంబ సభ్యులతో కలిసి ఏర్పాటు చేసిన ఫాం హౌస్ పార్టీ అంటూ ట్వీట్ చేశాడు. అయితే నవదీప్ చెప్పినట్టుగా ఇది గృహప్రవేశ కార్యక్రమం అన్నట్టుగా కాకుండా, అది ఫాం హౌస్ పార్టీ అని చెప్పాడు బ్రహ్మాజీ.
News about @pnavdeep26 is utterly baseless.I was there with my family too..it's farm house party with kids n families.
— BRAHMAJI (@actorbrahmaji) March 26, 2016