navadeep
-
శివాజీ తాజా చిత్రం ‘దండోరా’ ప్రారంభం (ఫొటోలు)
-
అందుకే బోల్డ్ సీన్స్ పెట్టాను : ‘లవ్ మౌళి’ దర్శకుడు
‘సాధారణంగా ఒక కథ రాస్తున్నప్పుడు ఒకరిని ఊహించుకుంటాం. కానీ లవ్‌మౌళి కథ రాస్తున్నప్పుడు అలా ఊహించుకోలేదు. ఒక నవలలా రాసేశాను. ఆ తర్వాత ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోలందరినీ ఈ కథకి ఊహించుకుంటూ వచ్చా. అయితే ఆ ఫొటోలలో అప్పుడు నవదీప్ ఫొటో లేదు. అప్పుడు నవదీప్ కూడా అంత యాక్టివ్‌గా సినిమాలు చేయడం లేదు. ఓసారి నాకెందుకో నవదీప్ అయితే అనే ఆలోచన వచ్చింది. నా ఆలోచనలన్నీ అతనిపై పెట్టి.. ఆ తర్వాత వెళ్లి కథ చెప్పా. కథ వినగానే ఎగిరి గంతేశాడు’అని అన్నాడు డైరెక్టర్ అవనీంద్ర. ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘లవ్ మౌళి’. నవదీప్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని నైరా క్రియేషన్స్ మరియు శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్‌తో కలిసి టాలీవుడ్ టాలెంటెడ్ టెక్నిషియన్స్‌కి అడ్డాగా మారిన సి స్పేస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. జూన్ 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ అవనీంద్ర మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ ఈ కథ అనుకున్నప్పుడు నేను ‘ఆర్ఆర్ఆర్’ రైటింగ్‌లో ఉన్నాను. నేను ఆ సినిమాకు అసోసియేట్ రైటర్ని. అప్పుడే మా టీమ్ అంతా నువ్వు డైరెక్ట్ చేసే సమయం ఆసన్నమైందంటూ ప్రోత్సహించారు. అయితే నేను కమర్షియల్ కథలు ఎన్నో అప్పటికే రాసేశాను. ఏ కథ రాస్తే బాగుంటుందా? అని ఆలోచిస్తూ కొత్తగా ఏదైనా ప్రేక్షకులకు రిఫ్రెష్ అనిపించేలా ఉండాలని అనుకున్నాను. ఒకవైపు ఆర్ఆర్ఆర్ రాస్తున్నప్పుడే పేరలల్‌గా ఈ పాయింట్ అనుకున్నాను. ఆర్ఆర్ఆర్తో పాటు అప్పటికే ఓకే చేసిన కథలన్నీ పూర్తి చేసి ఈ కథపై కూర్చున్నా.→ ఈ కథలో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. కొంతమంది లొకేషన్స్, కొంతమంది హీరోయిన్ క్యారెక్టరైజేషన్.. ఇలా ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయ్యారు. ముఖ్యంగా అమ్మాయిలు ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు.→ ఇది నా ఫస్ట్ సినిమా. నిజాయితీగా ఓ మంచి కథను చెప్పాలని నిర్ణయం తీసుకున్నా. రిజల్ట్ తో సంబంధం లేదు.. 10 ఏళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకున్నా.. ఫస్ట్ సినిమా నిజాయితీగా చేశానని చెప్పుకోవడానికి ఉంటుందని అనుకున్నా.→ ఈ సినిమాలో హీరోకి లో దుస్తుల్లో మందు తాగే సీన్ ఉంటుంది. లో దుస్తులని పబ్లిగ్గా ఆరేయడానికి సంకోచించే మైండ్ మనది. నాకున్న స్క్రీన్‌ప్లే టైమ్‌ని దృష్టిలో పెట్టుకుని.. హీరో క్యారెక్టర్ ఇదని చెప్పడం కోసమే.. హీరో ఇన్నర్ దుస్తుల్లో మందు తాగడం చూపించడం జరిగింది. ఇందులో హీరోకి ఎటువంటి సెన్సిబిలిటీస్ ఉండవు. నిజంగా అలాంటి సీన్ డిస్టర్బ్‌గా అనిపిస్తే సెన్సార్ వాళ్లు చూసుకుంటారు. వైజాగ్‌లో షోకి 50 శాతం అమ్మాయిలే వచ్చారు. ఎవరూ ఒక్కరు కూడా ప్రశ్నించలేదు. పోస్టర్లో అలా అనిపిస్తుంది కానీ.. సినిమా చూశాక అందరికీ ఆ సీన్ అర్థమవుతుంది. 18ప్లస్‌కి అవసరమైన కథ ఇది.→ ఇది ఫాంటసీ బేస్ స్టోరీ.. ఒక ఆర్టిస్ట్ తన కాన్వాస్ మీద ఊహా చిత్రం వేస్తే.. అందులో నుంచి ఆ అమ్మాయి బయటికి వచ్చేస్తుంది. అందుకే కొత్త హీరోయిన్లని తీసుకోవడం జరిగింది. ఆడియన్స్ కూడా నిజంగానే వచ్చేసిందనే ఫీల్ పొందాలి. ఒకవేళ తెలిసిన హీరోయిన్ అయితే.. ఆడియన్ ఆ ఫీల్ పొందలేరు. అందుకే కొత్తవాళ్లని తీసుకున్నాం.→ రిలేషన్లో ఒక జంట రెండు సంవత్సరాలు హ్యాపీగా ఉన్న తర్వాత.. వారిద్దరి మధ్య ఎందుకు అంత ప్రేమ ఉండటం లేదు. ఎందుకు ఆ రిలేషన్ బ్రేక్ అవుతుంది అన్నప్పుడు నాకో ఆలోచన వచ్చింది. ఈ పాయింట్ అందరికీ నచ్చుతుందని లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కించాను. లస్ట్ కోసం కాదు లవ్ కోసం చేసిన సినిమా ఇది.→ నా దృష్టిలో ప్రేమంటే నాకు నచ్చినట్టు ఉండమనడం కాదు.. నాకు నచ్చకపోయినా.. నిన్ను నీలా ఉండనీయడం ప్రేమ. అదే ఈ సినిమా ద్వారా చెప్పాను.→ విజయేంద్ర ప్రసాద్‌గారికి ఈ కథ చెప్పినప్పుడు బూతులు తిట్టారు. ఎందుకురా నీకు ఇది. కమర్షియల్‌గా వెళ్లకపోయావ్ అని అన్నారు. మా ఇద్దరి మధ్య తండ్రీ కొడుకుల అనుబంధం ఉంటుంది. నన్ను ఆయనకి దత్తపుత్రుడు అనే వారు. అంత చనువు ఉంది ఆయన దగ్గర. నా దృష్టిలో ఇది కమర్షియల్ సినిమా. కమర్షియల్ సినిమాలు రాసిన అలవాటుతో ఈ కథ రాశాను. షూటింగ్ అయిన తర్వాత ఒక వీడియో ప్రసాద్‌గారికి చూపించాను. కీరవాణిగారికి చూపించాను.. ఆశ్చర్యపోయారు.→ ఇందులో బోల్డ్ డైలాగ్స్, లిప్ లాక్స్ బోలెడన్నీ ఉంటాయి. అవన్నీ కావాలని పెట్టినవి కాదు. కథకు అవసరమై పెట్టినవే. కమర్షియల్ మీటర్ తెలిసిన వాడిని కాబట్టి.. కథ రాసుకుంటున్నప్పుడు ఈ కథతో ఆడియన్స్‌ని రంజింపచేయడానికి అవసరమైన వన్నీ చేర్చడం జరిగింది. కరోనా తర్వాత జనాలు ప్రపంచ సినిమాను చూస్తున్నాను. టాలీవుడ్ ఇండస్ట్రీ ఇంకా ఐటమ్ సాంగ్స్ దగ్గరే ఉంది. ఈ కథకి అన్ని అలా కుదిరాయ్.→ ప్రేమతో ప్రశాంతంగా లవ్ మూడ్‌లో కూర్చున్న శివుడిని మౌళి అంటారు. ఈ సినిమాకు ఆ పేరు పెట్టడానికి కూడా ఓ కారణం ఉంది. అది సినిమా చూసిన తర్వాత అందరికీ తెలుస్తుంది. ఈ స్టోరీకి చాలా ప్రత్యేకత ఉంటుంది. 20 సంవత్సరాల తర్వాత కూడా ఈ స్టోరీని మార్చడానికి ఏం ఉండదు. -
చిన్న హీరో అంటూ ఆ హీరోయిన్ చులకనగా మాట్లాడింది: నవదీప్
జై సినిమాతో హీరో నవదీప్ తన కెరీర్ మొదలుపెట్టాడు. హీరోగానే కాకుండా విలన్‌గా, సహాయక నటుడిగానూ సినిమాలు చేశాడు. ఓటీటీలోనూ సినిమాలు, సిరీస్‌లతో ఆకట్టుకుంటున్నాడు. అతడు హీరోగా నటించిన లవ్ మౌళి మూవీ జూన్ 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్ల స్పీడు పెంచాడు నవదీప్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను గూర్చి మాట్లాడాడు.రెండో సినిమాకే..'నా రెండో సినిమా మనసు మాట వినదు సమయంలోనే కాంట్రవర్సీ మొదలైంది. సక్సెస్‌కు చాలా గ్యాప్ వచ్చిన పెద్ద హీరోలకు హిట్లు ఇచ్చిన లక్కీ పర్సన్ తానే అని హీరోయిన్ అంకిత ఫీలైంది. అలాంటి నన్ను ఈ చిన్న హీరో డేట్ల కోసం ఇబ్బందిపెడతారా? అని నిర్మాతను ప్రశ్నించింది. అప్పుడు నాకింకా 17 ఏళ్లు. అసలేం జరుగుతుందో అర్థం కాలేదు. అప్పటినుంచే..తర్వాత ఆ గొడవ సద్దుమణిగింది. ఆ సినిమా నుంచే నన్ను వివాదాలు చుట్టుముట్టడం మొదలయ్యాయి. రేవ్ పార్టీ, ఈడీ కేసులు.. అని ఏదేదో ప్రచారం చేస్తుంటారు. నాకు సంబంధం లేకపోయినా నా పేరు తీసుకొస్తుంటారు. కానీ అందులో ఏమాత్రం నిజముండదు. అసలు నాపై ఒక్క కేసు కూడా లేదు' అని నవదీప్ చెప్పుకొచ్చాడు.చదవండి: 'సలార్ 2' పక్కన పెట్టేశారని రూమర్స్.. ఒక్క ఫొటోతో క్లారిటీ -
ఈడీ ముందుకు హాజరైన హీరో నవదీప్.. బ్యాంకు లావాదేవీలపై ప్రశ్నలు
డ్రగ్స్ కేసులో టాలీవుడ్ హీరో నవదీప్‌కు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. 2017లోని డ్రగ్స్ కేసుకు సంబంధించి నవదీప్‌ను ఈడీ అధికారులు ఇప్పటికే పలుమార్లు విచారించారు. అయినా నవదీప్ నుంచి సరైన వివరాలు అందకపోవడంతో మరోసారి ఈడీ ఎదుట కావాలని నోటీసులు ఇచ్చారు. దీంతో వారి ముందు ఆయన నేడు హాజరయ్యారు. దీంతో నవదీప్‌ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. (ఇదీ చదవండి: ఆట సందీప్‌ను కుక్కకొట్టుడు కొట్టిన పల్లవి ప్రశాంత్.. ఎమోషనల్ అయిన జ్యోతిరాజ్) నవదీప్ డ్రగ్స్ సేవించినట్లుగా హైదరాబాద్ పోలీసులు ఇప్పటికే వెల్లడించారు. ఈ కేసులో 29వ నిందితుడిగా అతని పేరు చేర్చినట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపిన విషయం తెలిసిందే. ఇప్పటికే ముగ్గురు నైజీరియన్లతో సహా 8 మంది నిందితులను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. వారిలో ముగ్గురు నైజీరియన్లతో హీరో నవదీప్‌కు ఉన్న పరిచయాలపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. వీరితో జరిపిన బ్యాంకు లావాదేవీల వివరాల గురించి ప్రశ్నిస్తున్నారు. మాదాపూర్ డ్రగ్స్ కేసు వివరాలు ఇవ్వాలంటూ ఇప్పటికే నార్కోటిక్ పోలీసులను కోరిన ఈడి.. డ్రగ్ పెడ్లర్లు, బ్యాంకు లావాదేవీలతో నవదీప్‌కు ఉన్న సంబంధాలపై కూపీ లాగుతున్నారు. డ్రగ్స్ విక్రయాల ద్వారా మనీ లాండరింగ్ జరిగిందని కోణంలో ఈడి దర్యాప్తు కొనసాగుతుంది. నవదీప్ విచారణలో నోరువిప్పుతే మరికొందరి పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
ఈడీ నోటీసులు: డ్రగ్ పెడ్లర్లతో నవదీప్ కు సంబంధాలున్నట్లు గుర్తింపు
-
డ్రగ్స్ తీసుకోవడం నేనెప్పుడో మానేశా: నవదీప్
-
డ్రగ్స్ కేసుతో నాకు సంబంధం లేదు: నవదీప్
-
3 గంటలు పైగా కొనసాగుతున్న హీరో నవదీప్ విచారణ
-
డ్రగ్స్ కేసులో నవదీప్‌కు ఊహించని షాకిచ్చిన పోలీసులు
డ్రగ్స్ కేసులో టాలీవుడ్ హీరో నవదీప్‌కు పోలీసులు షాకిచ్చారు. తాజాగా ఆయనకు వారు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 23న విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే ఈ కేసుతో తనకు ఎలాంటి సబంధం లేదని ఆయన కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో నవదీప్‌ను అరెస్ట్ చేయవద్దని పోలీసులకు కోర్టు ఆదేశించింది. కానీ అతనికి ఈ కేసులో సంబంధం ఉన్నట్లు పోలీసులు బలంగా నమ్ముతున్నారు. అందుకే అతన్ని విచారించేందుకు తాజాగా పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీంతో ఈ కేసుపై మరింత ఉత్కంఠ నెలకొంది. (ఇదీ చదవండి: 'కింగ్ ఆఫ్ కొత్త' ఓటీటీ విడుదల తేదీలో మార్పు) మాదాపూర్‌లోని విఠల్‌నగర్‌లో ఉన్న ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్లో దొరికిన తీగను లాగుతుంటే టాలీవుడ్ డ్రగ్ డొంక కదులుతోంది. ఈ కేసులో ఫిల్మ్ ఫైనాన్షియర్ కె.వెంకటరమణారెడ్డితో పాటు ‘డియర్ మేఘ’ చిత్ర దర్శకుడు అనుగు సుశాంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వీరి నుంచి రూ.10 లక్షల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. వారిని విచారిస్తున్న సమయంలో నవదీప్ పేరు తెరపైకి వచ్చినట్లు సమాచారం. దీంతో ఈ డ్రగ్స్ కేసుతో నవదీప్‌కు సంబంధం ఉందని పోలీసులు వెల్లడించారు. (ఇదీ చదవండి: భర్త జైల్లో ఉంటే ఫోటోషూట్స్‌తో బిజీగా ఉన్న మహాలక్ష్మి!) నవదీప్ డ్రగ్స్ సేవించినట్లుగా హైదరాబాద్ పోలీసులు ఇప్పటికే వెల్లడించారు. ఈ కేసులో 29వ నిందితుడిగా అతని పేరు చేర్చినట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఇప్పటికే ముగ్గురు నైజీరియన్లతో సహా 8 మంది నిందితులను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. తాజాగా నవదీప్‌కు విచారణకు రావాలని నోటీసులు జారీ చేయడంతో అతన్ని కూడా అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిస్తారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. -
డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ కు హైకోర్టు షాక్
-
డ్రగ్స్ కేసు.. నవదీప్ విషయంలో హైకోర్ట్ కీలక నిర్ణయం!
డ్రగ్స్ కేసులో టాలీవుడ్ హీరో నవదీప్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో అతనికి సంబంధమున్నట్లు హైదరాబాద్ సీపీ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నవదీప్ హైకోర్ట్‌ను ఆశ్రయించారు. అతని పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. ఈ కేసులో నవదీప్‌ను ఆరెస్ట్ చేయవద్దని పోలీసులను ఆదేశించింది. (ఇది చదవండి: హీరో నవదీప్‌కు నోటీసులు.. డ్రగ్స్ కేసులో ఉన్న టాలీవుడ్ ప్రముఖులు) అసలేం జరిగిందంటే.. మాదాపూర్‌లోని విఠల్‌నగర్‌లో ఉన్న ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్లో దొరికిన తీగను లాగుతుంటే టాలీవుడ్ డ్రగ్ డొంక కదులుతోంది. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు వేగవంతం చేశారు. ఫిల్మ్ ఫైనాన్షియర్ కె.వెంకటరమణారెడ్డితో పాటు ‘డియర్ మేఘ’ చిత్ర దర్శకుడు అనుగు సుశాంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వీరి నుంచి రూ.10 లక్షల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో టాలీవుడ్‌కు చెందిన హీరో నవదీప్‌తో పాటు నిర్మాత సుశాంత్ రెడ్డి కూడా ఉన్నట్లు నగర పోలీసు కమీషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. నవదీప్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, త్వరలోనే అతన్ని పట్టుకుంటామని చెప్పారు. అయితే దీనిపై వెంటనే హీరో నవదీప్ కూడా స్పందించాడు. అసలు ఆ డ్రగ్స్ కేసుతో తనకు సంబంధమే లేదన్నాడు. తాను ఎక్కడికి పారిపోలేదు తాను ఎక్కడికి పారిపోలేదని, హైదరాబాద్‌లోనే ఉన్నానన్నారు. తన కొత్త సినిమాకి సంబంధించిన సాంగ్ లాంచింగ్ ఈవెంట్లో బీజీగా ఉన్నాయనని ఓ మీడియా ప్రతినిధికి ఆయన చెప్పారు. అలాగే ట్విటర్(ఎక్స్) ద్వారా కూడా ఆయన ఈ కేసుపై స్పందించాడు. అది నేను కాదు జెంటిల్మెన్, నేను ఇక్కడే ఉన్నాను ముందు క్లారిటీ తెచ్చుకోండి థాంక్స్ అని ట్వీట్ చేశాడు. (ఇది చదవండి: అక్కడ సూపర్ హిట్.. తెలుగులో రిలీజ్ కానున్న మూవీ!) నవదీప్ స్నేహితుడు అరెస్ట్ అయితే ఈ కేసులో నవదీప్ స్నేహితుడు రాంచందర్‌ని నార్కోటిక్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన ఇచ్చిన సమాచారం ప్రకారమే నవదీప్‌ను డ్రగ్స్ కన్స్యూమర్ గా తేల్చారు. ఈ విషయాన్ని సీసీ ఆనంద్ మీడియా ముఖంగా తెలియజేశారు. గతంలోనూ టాలీవుడ్ డ్రగ్స్ కేసు విషయంలో నవదీప్ పేరు మారుమోగింది.అప్పట్లో ఎక్సైజ్, ఈడీ విచారణకు కూడా ఆయన హాజరయ్యారు. -
హీరో నవదీప్‌కు నోటీసులు.. డ్రగ్స్ కేసులో ఉన్న టాలీవుడ్ ప్రముఖులు
మాదాపూర్‌లోని విఠల్‌నగర్‌లో ఉన్న ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్లో దొరికిన తీగను లాగుతుంటే టాలీవుడ్ డ్రగ్ డొంక కదులుతోంది. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు వేగవంతమైంది. ఫిల్మ్ ఫైనాన్షియర్ కె.వెంకటరమణారెడ్డితో పాటు ‘డియర్ మేఘ’ చిత్ర దర్శకుడు అనుగు సుశాంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వీరి నుంచి రూ.10 లక్షల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకుంది. (ఇదీ చదవండి: లావణ్య త్రిపాఠి రూట్లో 'ఉప్పెన' బ్యూటీ కృతి శెట్టి.. పెళ్లిపై నిజమెంత?) తాజాగా టాలీవుడ్ హీరో నవదీప్‌కు ఇదే కేసులో నోటీసులు జారీ చేయనున్నారు. ఇప్పటికే ఆయన కుటుంబంతో సహా పరారీలో ఉన్నాడని నగర పోలీసు కమీషనర్ సీవీ ఆనంద్ వెల్లడించిన విషయం తెలిసిందే. దీనిపై హీరో నవదీప్ కూడా స్పందించాడు. ఆ డ్రగ్స్ కేసుతో తనకు సంబంధమే లేదని, ఆ పేరు తనది కాదని ఆయన టచ్‌లోకి వచ్చాడు. ఇప్పటికే డ్రగ్స్ వాడిన నిందితులను నార్కోటిక్ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. కానీ షాడో సినిమా నిర్మాత ఉప్పలపాటి రవితో పాటు మోడల్ శ్వేతా ఇంకా పరారీలోనే ఉన్నారని సమాచారం. (ఇదీ చదవండి: మార్క్ ఆంటోని ట్విటర్ రివ్యూ.. విశాల్ సినిమాకు అలాంటి టాక్!) హైదరాబాద్‌లో మళ్లీ ఒక్కసారిగా డ్రగ్స్ కలకలం రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. దీంతో పలు పబ్‌ల పైనా నార్కోటిక్ పోలీసులు నిఘా పెట్టారు. గచ్చిబౌలి లోని స్నార్ట్ పబ్, జూబ్లీహిల్స్‌లోని టెర్రా కేఫ్ అండ్ బిస్ట్రోలో డ్రగ్స్ విక్రయాలు జరిగాయని తెలుస్తోంది. ఈ కేసులో డీలర్ బాలాజీ నుంచి డ్రగ్స్ ఖరీదు చేసి వినియోగిస్తున్న వారిలో ప్రముఖులు, సినీ రంగానికి చెందిన వారూ ఉన్నట్లు టీఎస్ నాబ్ గుర్తించింది. హీరో నవదీప్, షాడో, రైడ్ చిత్రాల నిర్మాత రవి ఉప్పలపాటి, మోడల్ శ్వేత, మాజీ ఎంపీ దేవరకొండ విఠల్‌రావ్ కుమారుడు సురేశ్ రావ్, ఇంద్రతేజ్, కార్తీక్‌లతోపాటు కలహర్‌రెడ్డి ఉన్నారు. -
హీరో నవదీప్ సమర్పిస్తున్న, 'సగిలేటి కథ'
హీరో నవదీప్ సమర్పణలో రవితేజ మహాదాస్యం, విషిక కోట జంటగా నటించిన చిత్రం ‘సగిలేటి కథ’. రాజశేఖర్ సుద్మూన్ దర్శకత్వంలో నవదీప్ సమర్పణలో అశోక్ మిట్టపల్లి, దేవిప్రసాద్ బలివాడ నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ‘‘రాయలసీమ ప్రాంతం నేపథ్యంలో ఒక గ్రామంలో జరిగే ఘటనలతో సాగే చిత్రం ఇది. రాయలసీమ నేటివిటీ, సంస్కృతీ సంప్రదాయాలతో వచ్చే సన్నివేశాలు సహజంగా ఉంటాయి. ఇందులో చికెన్ కూడా ఒక పాత్ర. ఈ నెల 31న ట్రైలర్ రిలీజ్ చేస్తాం’అని చిత్ర యూనిట్ పేర్కొంది. ‘సగిలేటి కథ కేవలం సినిమా కాదు. మన జీవితంలో ఉండే అన్ని భావోద్వేగాలా సమర్పణ. ప్రతి ఒక్క పాత్ర మిమ్మల్ని అలరిస్తుంది. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. ఈ సినిమా లో హీరో గా చేయడం చాలా అదృష్టం గా భావిస్తున్నాను’అని రవితేజ మహాదాస్యం అన్నారు. -
చెన్నై ఆస్పత్రిలో నారాయణ కాలేజ్ విద్యార్థి మృతి..
సాక్షి, తిరుపతి: రేణిగుంట నారాయణ కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న నవదీప్ చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. నారాయణ క్యాంపస్ హాస్టల్లో పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న సమయంలో నవదీప్ కత్తిపోటుకు గురయ్యారు. వెంటనే దగ్గర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుడు నవదీప్ రైల్వేకోడూరు వాసిగా తెలుస్తోంది. నవదీప్ ఒంటిపై గాయాలపై అనుమానం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చదవండి: (మహా నగరంలో మాయగాడు.. సివిల్ సప్లయీస్ డెప్యూటీ కలెక్టర్‌నంటూ..) -
నవదీప్ బర్త్‌డే: ఇంట్రస్టింగ్‌గా కొత్త సినిమా టైటిల్!
యంగ్ హీరో, బిగ్‌బాస్ కంటెస్టెంట్ నవదీప్ బర్త్‌డే నేడు(జనవరి 26). ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న తాజా చిత్రం టైటిల్ ప్రకటించారు మేకర్స్. దీనికి సంబంధించిన టీజర్‌ను భళ్లాల దేవ రానా దగ్గుబాటి రిలీజ్ చేశాడు. 'పుట్టినందుకు థ్యాంక్స్' అంటూ మొదలైన ఈ టీజర్లో సినిమాకు లవ్ మౌలి అన్న టైటిల్‌ను ఖరారు చేసినట్లు వెల్లడించారు. ఈ చిత్రంలో నవదీప్‌ను మరో యాంగిల్లో చూడబోతున్నారని హింట్ ఇచ్చారు. ఇక ఈ సినిమాకు అవనీంద్ర దర్శకత్వం వహిస్తుండగా నైరా క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రశాంత్ రెడ్డి నిర్మిస్తున్నాడు. గోవింద్ వసంత సంగీతం అందిస్తున్నాడు. వీడియో చూస్తుంటే నవదీప్ మరో లెవల్లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ టీజర్ గురించి రానా నిన్నే హింట్ ఇచ్చాడు. 'ఒక్కడు.. పొగరెక్కిన ప్రవాహం లాంటోడు.. నిలిచిపోయిన గాలిలోంటోడు.. నిలకడ లేని నిప్పులాంటోడు.. వెలుతురు తాకని భూమిలాంటోడు.. ఆ నింగి కన్నా ఒంటరోడు.. మౌలి' అంటూ సాగే వీడియోను షేర్ చేస్తూ సినిమాకు హైప్ ఇచ్చాడు! Wow. Wonder who this guy is. Looking forward to meet him tomorrow.#evadramouli pic.twitter.com/R5CIyjbVEu — Rana Daggubati (@RanaDaggubati) January 25, 2022 -
డ్రగ్ కేసు: విచారణకు హాజరైన నవదీప్, ఈడీ ప్రశ్నల వర్షం
టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంలో హీరో నవదీప్ ట్లో ఈడీ విచారణకు హాజరయ్యాడు. తన బ్యాంకు ఖాతాలకు సంబంధించిన డాక్యకుమెంట్స్ నవదీప్ ఈడీ కార్యాలయానికి చేరుకున్నాడు. ఈ సందర్భంగా ఈడీ నవదీప్‌పై ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. మని లాండిరింగ్, బ్యాంక్ లావాదేవీలపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఈ కేసులో ప్రధాన నిందితుడైన కెల్విన్‌తో బ్యాంకు లావాదేవీలపై కూడా ఈడీ విచారిస్తోంది. అయితే ఫ్ క్లబ్ పబ్ యజమాని నవదీప్ కావడం గమనార్హం. ఈ పబ్‌లో తరచుగా సినీ ప్రముఖులకు పార్టీలు నిర్వహించేవారని సమాచారం. చదవండి: మరో కాస్ట్లీ కారు కొన్న రామ్ చరణ్, వీడియో వైరల్ ఈ పార్టీల్లో డ్రగ్స్ వినియోగించేవారని ఆరోపణలు ఉన్నాయి. ఈ డ్రగ్ కేసులో ప్రధాన నిందితులైన కెల్విన్, జీషాన్‌లు తరచూ హాజరైరయ్యేవారని గతంతో ఎక్సైజ్ అధికారుల విచారణలో తేలిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈరోజు విచారణకు హాజరుకావాలంటూ కెల్విన్‌ను కూడా ఈడీ అధికారులు ఆదేశించారు. ప్రధానంగా మనీ లాండరింగ్ అంశంపైనే విచారణ జరగనుంది. కాగా ఈ కేసులో ఇప్పటి వరకు దర్శకుడు పూరి జగన్నాథ్, నటి చార్మీ, హీరోయిన్ రకుల్ ప్రీత సింగ్, హీరో రానా, రవి తేజ, నందులు విచారణకు గజరైన సంగతి తెలిసిందే. -
ఐటీ మోసగాళ్ళు
ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ కుంభకోణం నేపథ్యంలో రూపొందుతున్న హాలీవుడ్–ఇండియన్ సినిమా ‘మోసగాళ్ళు’. మంచు విష్ణు, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్నారు. హాలీవుడ్‌కు చెందిన జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి, నవదీప్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం కోసం హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో సుమారు రూ. 3.5 కోట్ల వ్యయంతో ఒక భారీ ఐటీ ఆఫీస్ సెట్‌ను నిర్మించారు. ఈ సెట్లో కీలక సన్నివేశాలు చిత్రీకరించాలనుకున్నారు. కానీ, కరోనా వైరస్ వ్యాప్తి నిరోధ చర్యల్లో భాగంగా ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించడంతో చిత్రీకరణ నిలిచిపోయింది. ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ– ‘‘ఇప్పటికే ప్రధాన సన్నివేశాలు, కై్లమ్యాక్స్, యాక్షన్ సీన్లు దాదాపు పూర్తయ్యాయి. ఇటీవల విడుదల చేసిన మా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్లకు ప్రేక్షకులు, అభిమానుల నుంచి మంచి స్పందన లభించింది. యూనిట్ సభ్యుల క్షేమం దృష్ట్యా చిత్రీకరణ నిలిపివేశాం. సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాక తిరిగి చిత్రీకరణ కొనసాగిస్తాం. వేసవిలో ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ప్రపంచంలో కరోనా వైరస్ వల్ల ప్రభావితులైన వారు త్వరగా కోలుకోవాలి. ప్రజలందరూ ప్రభుత్వ సలహాలు, సూచనలను కచ్చితంగా పాటించాలి. అందరూ సామాజిక దూరం పాటిస్తూ, స్వీయ క్వారంటైన్ ను పాటించాలి’’ అన్నారు. -
నాకు హీరోలకన్నా విలన్స్ అంటేనే ఇష్టం
‘‘స్టాలిన్ అనేది నా ఫేవరెట్ పేరు. స్టాలిన్ రష్యన్ నియంత. ‘స్టాలిన్’ పేరుతో చిరంజీవిగారు సినిమా చేశారు. మళ్లీ చాలా సంవత్సరాల తర్వాత ‘స్టాలిన్’ అనే పేరుని వింటున్నాను. ఈ చిత్రం టైలర్ చాలా బావుంది’’ అని దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ అన్నారు. జీవా, రియా సుమన్, నవదీప్ ముఖ్య పాత్రల్లో రతిన శివ దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘సీరు’. తెలుగులో ‘స్టాలిన్’ టైటిల్‌తో వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్, నట్టిస్ ఎంటర్టైన్మెంట్స్, క్విట్టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు ఫిబ్రవరి 7న విడుదల చేస్తున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ – ‘‘జీవా చాలా ఈజ్‌తో నటించాడు. ఇందులో నవదీప్ లుక్ (నవదీప్‌ది విలన్ పాత్ర) విభిన్నంగా కనిపిస్తోంది. నాకు హీరోలకన్నా విలన్స్ అంటేనే ఇష్టం. దర్శకుడు సినిమాను బాగా హ్యాండిల్ చేశారు’’ అన్నారు. ‘‘జీవా తండ్రి ఆర్.బి. చౌదరిగారి బ్యానర్లో రాజశేఖర్‌గారు సింహరాశి, గోరింటాకు వంటి పెద్ద హిట్ సినిమాలు చేశారు. వాళ్ల నాన్నగారి పేరు నిలబెట్టాలని జీవా మంచి మంచి సినిమాలు చేస్తున్నాడు. ‘రంగం’ కంటే ఈ సినిమా ఇంకా పెద్ద హిట్ అవ్వాలి’’ అన్నారు జీవితా రాజశేఖర్. ‘‘మొదటి నుంచి తెలుగు ప్రేక్షకులతో నాకు మంచి అనుబంధం ఉంది. నన్ను ‘రంగం’ నుంచి సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. వర్మగారి సినిమాలంటే నాకు ఇష్టం. ఆయన దగ్గర డైరెక్షన్ నేర్చుకోవాలని అనుకున్నాను. త్వరలో స్ట్రయిట్ తెలుగు సినిమా చేయాలనుకుంటున్నాను’’ అన్నారు జీవా. ‘‘తెలుగు ప్రేక్షకులను కూడా దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా కథ రాశాను. మంచి సందేశం ఇవ్వబోతున్నాం’’ అన్నారు రతిన శివ. ‘‘తెలుగు ప్రేక్షకులకు తెలుగు, తమిళం అనే భేదాలు ఉండవు. అన్ని భాషల చిత్రాలను ఆదరిస్తారు. తొలిసారి ఇందులో పూర్తి స్థాయి విలన్ పాత్రలో నటించాను’’ అన్నారు నవదీప్. ‘‘నట్టి ఫ్యామిలీకి ఈ సినిమా మంచి విజయం తీసుకురావాలి’’ అన్నారు టి. అంజయ్య. ‘‘మంచి పాయింట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. భారీ స్థాయిలో ఈ సినిమాను విడుదల చేస్తున్నాం’’ అన్నారు నట్టికుమార్. ఈ కార్యక్రమంలో హీరోయిన్ రియా సుమన్, నిర్మాతలు దామోదర ప్రసాద్, నట్టి కరుణ, నట్టి క్రాంతి, వేల్స్ శ్రవణ్, శివ బాలాజీ, మధుమిత పాల్గొన్నారు. -
వెబ్ సిరీస్‌లో హెబ్బా
డిజిటల్ మీడియమ్‌లో షోలు, సిరీస్‌లకు ఆదరణ విపరీతంగా పెరుగుతోంది. ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేయడానికి స్టార్స్ కూడా వెబ్ వరల్డ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా హెబ్బా పటేల్ కూడా ఓ వెబ్ సిరీస్‌లో కనిపించనున్నారు. నవదీప్, హెబ్బా పటేల్ ముఖ్య పాత్రల్లో దర్శకుడు అజయ్ భూయాన్ ఓ వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ షూటింగ్ ఇటీవల ప్రారంభం అయింది. ఈ వెబ్ సిరీస్ జానర్, మిగతా నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం నితిన్ ‘భీష్మ’, రాజ్ తరుణ్ ‘ఒరేయ్ బుజ్జిగా’ సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు హెబ్బా పటేల్. -
ఘనంగా హీరోయిన్ నిశ్చితార్థం
హీరోయిన్ అర్చన(వేద) త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోంది. ఓ ప్రముఖ హెల్త్‌కేర్ కంపెనీ ఉపాధ్యక్షుడు, వ్యాపారవేత్త జగదీశ్ భక్తవత్సలంతో అర్చన నిశ్చితార్థం గురువారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరై అర్చన-జగదీశ్‌లకు శుభాకాంక్షలు చెప్పారు. ముఖ్యంగా బిగ్‌బాస్ సీజన్-1 మిత్రులైన నవదీప్, శివబాలాజీలు ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక జగదీశ్-అర్చనల మధ్య గత కొద్ది కాలంగా ప్రేమాయణం నడుస్తోన్న విషయం తెలిసిందే. గత నెలలో తన ప్రియుడితో కలిసి దిగిన ఫోటోలను ఫేస్బుక్లో పోస్ట్ చేసి త్వరలోనే శుభవార్త వింటారని అర్చన పేర్కొన్న సంగతి తెలిసిందే. కాగా, 2004లో నేను సినిమాతో తెరంగేట్రం చేసిన అర్చన.. తెలుగుతో పాటు కన్నడ, తమిళంలోనూ సినిమాలు చేసింది. అయితే సరైన హిట్ లేకపోవడంతో హీరోయిన్గా నిలదొక్కుకోలేకపోయింది. అయితే తన అందం, అభినయంతో కుర్రకారు మనసులను దోచుకుంది. బిగ్‌బాస్ సీజన్-1 కంటెస్టెంట్‌గా పాల్గొని వార్తల్లో నిలిచింది. అయితే ఆ షో తెచ్చిన ఫేమ్ ఆమె సినిమా కెరీర్‌కు అంతగా ఉపయోగపడలేదు. తాజాగా సప్తగిరి హీరోగా నటించిన వజ్రకవచధార గోవిందా అనే చిత్రంలో ఓ పవర్ఫుల్ పాత్రను పోషించింది. పలు డ్యాన్స్‌షోలకు అర్చన న్యాయనిర్ణేతగా వ్యవహరించిన విషయం తెలిసిందే. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
బావా.. మంచి గిఫ్ట్ ఇచ్చావు : అల్లు అర్జున్
తన బావ ఓ మంచి బహుమతిని ఇచ్చాడని స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. ఇంతకీ ఆ గిఫ్ట్ ఏంటి? ఆ బావ ఎవరు? అనే కదా సందేహం. రుద్రమదేవి చిత్రంలో మోస్ట్ పవర్ఫుల్ పాత్ర అయిన గోన గన్నారెడ్డి పాత్రకు సంబంధించిన ఓ బొమ్మను హీరో నవదీప్ బన్నీ ప్రజెంట్ చేశాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. గోన గన్నారెడ్డిగా బన్నీ చేసిన సందడి అంతా ఇంతా కాదు. బన్నీ చేసిన ఈ క్యారెక్టర్.. సినిమా విజయవంతం కావడంలో ముఖ్యపాత్రను పోషించింది. తాజాగా ఆ గెటప్ ఉన్న బొమ్మను నవదీప్.. బన్నీకి గిఫ్ట్‌గా ఇచ్చాడు. వీరిద్దరూ మంచి స్నేహితులు అన్న సంగతి తెలిసిందే. ఆర్య-2లో అల్లరి చేసిన వీరిద్దరూ .. తెర వెనకాల కూడా మంచి స్నేహితులుగా మారారు. తాజాగా నవదీప్ తనకు ఇచ్చిన బహుమతి గురించి సోషల్ మీడియాలో తెలుపుతూ.. ‘ఔ గన్నారెడ్డి.. గోన గన్నారెడ్డి.. వన్ ఆఫ్ ది స్వీటెస్ట్ గిఫ్ట్.. థాంక్యూ నవదీప్’ అంటూ పోస్ట్ చేశారు. అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తోన్న సంగతి తెలిసిందే. -
‘మరి’ "బుల్లెట్ దిగిందా"
గ్యాంగ్ ఉంది... గన్నులున్నాయి..చూడ్డానికి ఆడియెన్స్ ఉన్నారు.రివాల్వర్ తిరిగినట్టు ఒక అరడజన్ ట్విస్టులున్నాయి.పండుగాడు లేకపోయినా దిమ్మతిరుగుద్ది.సగం టైం ఏం జరుగుతుందో తెలీక ఓ డజన్ ఎపిసోడ్స్ డజన్ అరటిపండ్లు జీర్ణమైనంత ఈజీగా అయితే కాదు..బాగా మైండ్ పెట్టాలంతే!బుల్లెట్ దిగిందా లేదా అన్న డౌట్ మాత్రం ఆడియెన్స్‌ని ట్రిగ్గర్ చేస్తూనే ఉంటుంది. లొకేషన్ ఒక హోటల్ సూట్ (స్వీట్ అనాలి) లాంటి గది. అది విశ్వకు ఇచ్చిన బస. లోపలికి వచ్చి చూస్తే పడక గదిలో మంచం మీద ‘రెడ్’ పడుకొని ఉంటాడు. తన గదిలోకి ఎలా వచ్చావని రెడ్‌తో గొడవపడ్తాడు. రెడ్ కూడా తీవ్రంగానే గొడవకు సిద్ధమవుతాడు. విశ్వ తన మేనేజర్ కీర్తిని పిలిచి.. రెడ్ తన గదిలోకి ఎలావచ్చాడు అని ప్రశ్నిస్తాడు. కీర్తి కూడా అవాక్కవుతుంది రెడ్ను అక్కడ చూసి. వెళ్లిపొమ్మని చెప్తుంది. కాని రెడ్ వినడు. దాంతో ఘర్షణ పెద్దదవుతుంది. ఎటూ పాలుపోక కీర్తి.. అజయ్‌కు ఫోన్ చేస్తుంది. వస్తాడు. అతను విశ్వకు తోడవడంతో రెడ్ తన దగ్గరున్న గన్ తీస్తాడు.‘‘పేలుస్తావా.. పేల్చు’ అంటూ విశ్వ అతనిని రెచ్చగొడ్తాడు. అజయ్ అటు విశ్వకు, ఇటు రెడ్‌కు నచ్చజెçప్తూ వారిస్తుండగానే విశ్వ, రెడ్ ఒకరిపై ఒకరు తలపడ్తారు. వాళ్లను ఆపే ప్రయత్నంలో ఆ ఇద్దరి మధ్యలోకి అజయ్ వెళ్లి రెడ్ చేతిలో ఉన్న గన్ తీసుకోబోతుండగా పేలుతుంది. రెడ్‌కు బులెట్ తగిలి చనిపోతాడు. కీర్తి సహా ఆ ఇద్దరూ షాక్ అవుతారు. దాన్నుంచి బయటపడటం ఎలా? ఆ క్షణంలోనే అజయ్ స్నేహితురాలు జర్నలిస్ట్ జాహ్నవి అక్కడకు వస్తుంది. డెడ్ బాడీని చూసి ఆమె కూడా అవాక్కవుతుంది. సహాయం కోసం జాహ్నవికి అసలు విషయం చెప్పేస్తాడు అజయ్. హెల్ప్ చేస్తానని మాటిచ్చి బయటకు వచ్చి ఆ ఏరియా సీఐ ఆంజనేయులుకు ఫోన్ చేస్తుంది. సీన్లోకి ఆంజనేయులు ఎంటర్ అవుతాడు. చనిపోయిన రెడ్.. కేడీ బావమరిది. కేడీ.. సీఐకి బెస్ట్ ఫ్రెండ్. ఆ విషయం బయటకు తెలియకుండా ఉండాలంటే పదికోట్లు కావాలని డిమాండ్ చేస్తాడు. వీళ్లు ఒప్పుకుంటారు. ఇక్కడే కథ ఓ మలుపు తిరుగుతుంది. ఫ్లాష్‌బ్యాక్ విశ్వ.. సినిమా హీరో. కీర్తి.. అతని మేనేజర్. అజయ్.. విశ్వ నటిస్తున్న సినిమా హీరోయిన్ ఐశ్వర్య మేనేజర్. కీర్తి, అజయ్.. క్లాస్మేట్స్. కాలేజ్ డేస్‌లో ప్రేమికులు కూడా. కీర్తికి వచ్చిన మోడలింగ్ అవకాశాన్ని తన మేల్ ఈగోతో అడ్డుకుంటాడు అజయ్. దాంతో వాళ్లిద్దరి ప్రేమ బ్రేక్ అవుతుంది. ఇద్దరి ధ్యేయం ఒకటే, సినిమా ఫీల్డ్‌లోకి రావాలని. ప్రొడ్యూసర్ కావాలని కీర్తి, డైరెక్టర్ కావాలని అజయ్ సినీరంగంలో స్ట్రగుల్‌కి సిద్ధపడ్తారు . అంతకుముందు విశ్వకు మేనేజర్‌గా ఉన్న వ్యక్తికి ఛాతీనొప్పి వచ్చి విశ్రాంతి తీసుకుంటుంటాడు. అతని స్థానంలో కీర్తి మేనేజర్‌గా బాధ్యత తీసుకుంటుంది. అజయ్ తండ్రి ఒకప్పుడు హీరో కావాలనే తాపత్రయంతో సినీ రంగంలోకి వస్తాడు. బ్యాక్‌గ్రౌండ్ లేక.. జూనియర్ ఆర్టిస్ట్‌గానూ సెటిల్ కాలేక న్యూస్‌రీడర్‌గా స్థిరపడ్తాడు. తన కొడుక్కీ తనలాంటి అనుభవమే ఎదురవుతుందేమోననే భయంతో అజయ్‌ను సినిమాలోకి వెళ్లనివ్వకుండా అడ్డుకుంటుంటాడు. కొడుకు పట్టుదల చూశాక ఆఖరు చాన్స్‌గా ఓకే అంటాడు. డైరెక్టర్ కావాలని అడుగుపెట్టిన అజయ్‌కు మేనేజర్‌గా అవకాశం వస్తుంది. ఈ లైన్ ద్వారా లక్‌ను పరీక్షించుకుందామని చేరుతాడు. అలా కీర్తి, అజయ్ ఇద్దరూ హీరోహీరోయిన్ మేనేజర్లుగా ఒక సెట్ మీద తారసపడతారు. ఆ సినిమా వెనక కథ విశ్వ, ఐశ్వర్య నటిస్తున్న సినిమాకు అనధికార నిర్మాత కుమార్ దాస్ ఉరఫ్ కేడీ. అతనొక గ్యాంగ్‌స్టర్. వడ్డీ వ్యాపారి కూడా. ఆయన వయసులో సగం వయసున్న అమ్మాయి కేడీని ఇష్టపడి పెళ్లి చేసుకుంటుంది. వాళ్లకు ఒక పాప. బయటివాళ్లతో కరుకుగా ఉండే కేడీ పెళ్లాం, బిడ్డలంటే ప్రాణం పెడ్తాడు. ఒకసారి చిన్న అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లిన కేడీకి వైద్య పరీక్షలు చేసి.. క్యాన్సర్ అని తేలుస్తారు డాక్టర్లు. అదీ అడ్వాన్స్డ్ స్టేజ్‌లో ఉందని, ఇంకెంతో కాలం బతకడనీ చెప్పేస్తారు. కుంగిపోతాడు కేడీ. తన దగ్గరున్న బ్లాక్ మనీని వైట్ చేసి.. తన తదనంతరం తన కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లేక బతికేలా చూడాలని ఆరాటపడ్తుంటాడు. అలాంటి ఏర్పాటు చేయమని మిత్రుడు సీఐ ఆంజనేయులు దగ్గరకు వెళ్తాడు. తన జబ్బు విషయమూ బయటపెట్టేస్తాడు. బాగా ఆలోచించిన ఆంజనేయులు ఆ మనీని సినిమాలో పెట్టుబడిగా పెట్టి వైట్ చేసుకోవచ్చని, అందుకు పాల సుబ్రహ్మణ్యమనే నిర్మాతను పట్టుకుందామని సలహా ఇస్తాడు. సుబ్రహ్మణ్యం పాల వ్యాపారంతో పైకెదిగి సినిమా నిర్మాతగా మారి పాల సుబ్రహ్మణ్యంగా పాపులర్ అవుతాడు. వీళ్ల ప్రపోజల్‌ను ఒప్పుకుంటాడు. అలా విశ్వ, ఐశ్వర్య నటిస్తున్న సినిమా స్టార్ట్ అవుతుంది. మరి రెడ్ ఎలా ఎంటర్ అయ్యాడు? సినిమా సెట్స్ మీదున్నప్పుడు ఐశ్వర్య, విశ్వ అందరూ కలిసి పబ్‌లో పార్టీ చేసుకుంటారు. హఠాత్తుగా ఆ పార్టీలో ఐశ్వర్య మాజీ బాయ్‌ఫ్రెండ్ ప్రత్యక్షమవుతాడు. అసహనంగా ఉంటాడు విశ్వ. చిన్న రగడ అవుతుంది. ఆ గొడవతో చిరాకు పడ్డ ఐశ్వర్య.. విశ్వను, తన మాజీ బాయ్ ఫ్రెండ్‌ను తిట్టి వెళ్లిపోతుంది. విశ్వ హర్ట్ అవుతాడు. ఆ పార్టీకి అజయ్ ఫ్రెండ్ జర్నలిస్ట్ జాహ్నవి కూడా వస్తుంది. ఆ వ్యవహారాన్నంతా సెల్ఫోన్లో రికార్డ్ చేసి తన న్యూస్‌చానల్‌కు ఫీడ్ ఇస్తుంది. రచ్చవుతుంది. సినిమా ఆగిపోయే పరిస్థితి వస్తుంది. పాల సుబ్రహ్మణ్యం చాకచక్యంతో ఇద్దరినీ కన్విన్స్ చేసి సినిమా ఆగిపోకుండా చూస్తాడు. కాని హీరో, హీరోయిన్ ఒకరినొకరు సాధించుకుంటూ షూటింగ్‌కి ఆటంకం కలిగిస్తుంటారు. దీన్ని చక్కదిద్దడానికి తన బావమరిది రెడ్ను సెట్స్ మీదకు పంపిస్తాడు కేడీ. రెడ్ కూడా సినిమా హీరో కావాలనుకుంటుంటాడు. కాని బావ తనకు ఆ అవకాశం ఇవ్వకపోవడం పట్ల కొంచెం కోపంగా ఉంటాడు. రెడ్.. షారూఖ్ ఫ్యాన్. ట్విట్టర్ అంటే క్రేజీ. ఎప్పుడూ బొడ్లో గన్‌తో, నలుగురిని వెంటేసుకొని తిరుగుతుంటాడు. రెడ్‌కు తిక్కెక్కువ. ఆ తిక్కతోనే అదిగో.. తన గన్ తూటాకు తనే బలవుతాడు. తర్వాత కేడీకి తెలియకుండా అతని బావమరిది శవాన్ని మాయం చేయడానికి సీఐ ఆంజనేయులు అడిగిన పదికోట్ల రూపాయలను సర్దలేకపోతారు అజయ్, విశ్వ. దాంతో మండిపడ్డ ఆంజనేయులు .. రెడ్ శవాన్ని తీసుకుని స్టేషన్‌కు రమ్మని ఆజ్ఞాపిస్తాడు. ఆ ప్రకారం శవాన్ని తీసుకుని ఆ గది బయటకు రాగానే కేడీ ఎదురుపడ్తాడు వీళ్లకు. రెడ్ శవాన్ని చూసి .. ‘‘ఎవడు నా బామ్మర్దిని చంపింది’’ అంటూ ఆంజనేయులు వారిస్తున్నా వినకుండా ఆవేశంతో విశ్వ, అజయ్ మీదకు కాల్పులు జరుపుతాడు కేడీ. అజయ్‌కు తూటా తగిలి నేలకొరుగుతాడు. కంగారు పడ్తాడు ఆంజనేయులు. అప్పుడు కేడీనే ఉపాయం చెప్తాడు. అజయ్ శవాన్ని నువ్వు తీసుకుపో.. నా బామ్మర్ది శవాన్ని నేను తీసుకుపోతాను అని. అలాగే జరుగుతుంది. అజయ్ శవాన్ని ఊరవతల కొండమీదకు తీసుకెళ్లి అక్కడినుంచి చెరువులో పడేస్తాడు. అది రికార్డ్ అయి ఆ వీడియో మళ్లీ చానళ్లలో ప్రసారం అవుతుంది. దీనికంతటికీ ముందు కేడీకి క్యాన్సర్ లేదని, వైద్య పరీక్షలకోసం తీసిన బ్లడ్ శాంపిల్స్ తారుమారవడం వల్ల ఆ పొరపాటు జరిగిందని డాక్టర్లు క్షమాపణ చెప్తారు కేడీకి. ఇక టీవీలో వచ్చిన ఆంజనేయులు నిర్వాకానికి పోలీస్ బాస్ గుస్సా అవుతాడు. వివరణ కోరుతాడు. ఆ హత్య కేడీ చేశాడని చెప్పేస్తాడు ఆంజనేయులు. కేడీని పిలిపిస్తారు. నేనెవరినీ చంపలేదు అంటాడు. అబ్ధమని వాదిస్తూ అజయ్ వాళ్లే రెడ్‌ని చంపారనే విషయాన్నీ బయటపెడ్తాడు. నిర్ధారణ కోసం విశ్వను పిలిపిస్తారు. అజయ్ కూడా వస్తాడు. ఆ ట్విస్ట్ వెనక సీఐ ఆంజనేయులు అడిగిన డబ్బును అరేంజ్ చేస్తానని ఆ స్వీట్ నుంచి బయటపడ్డ అజయ్ డైరెక్ట్‌గా కేడీ దగ్గరకు వెళ్లి నిజం చెప్తేస్తాడు పెనుగులాటలో రెడ్ చనిపోయినట్టు. కాగల కార్యం గంధర్వులే తీర్చినట్టు ఫీలవుతాడు కేడీ. దానికి కారణం.. కేడీకి క్యాన్సర్ ఉందని తేలగానే అతనికి దగ్గరున్న డబ్బును కొట్టేయాలనుకుంటాడు సీఐ ఆంజనేయులు. హీరో చాన్స్ ఇవ్వలేదని బావ మీద అసంతృప్తిగా ఉన్న రెడ్నూ రెచ్చగెట్టి అతనితో కేడీకి స్పాట్ పెట్టించాలని ప్లాన్ వేస్తాడు. రెడ్ ఒప్పుకుంటాడు. దీన్ని చూసిన కేడీ అనుచరుడు వీడియో తీసి కేడీకి చూపిస్తాడు. నా అనుకున్న, నమ్మిన వాళ్లే మోసం చేస్తున్నారని కలత చెందుతాడు కేడీ. వాళ్లపని పట్టేందుకు సమయం కోసం వేచి చూస్తుంటాడు. అజయ్ వాళ్ల వల్ల రెడ్ లైఫ్‌కి ఎండ్పడడంతో హ్యాపీగా ఫీలవుతాడు కేడీ. ఇక సీఐ అంతుతేల్చడానికి అజయ్‌తో ఓ పథకం వేస్తాడు కేడీ. అదే.. అజయ్‌కు డమ్మీ బుల్లెట్ తగిలినట్టు నాటకం ఆడటం. శవాన్ని పడేస్తుంటే వీడియో తీయడం ఎట్సెట్రా. ఇంతకీ చెరువులో పడేసింది రెడ్ శవమన్నమాట. కేడీ అజయ్‌ను కాల్చాక.. సీఐని మాటల్లో పెడ్తాడు. ఆ టైమ్‌లో తన ప్లేస్‌లో రెడ్ను సీఐ జీప్‌లో పడేస్తారు అజయ్ అండ్ విశ్వ. లాస్ట్ సీన్ విశ్వ, ఐశ్వర్య, కీర్తి, అజయ్‌ల మధ పొరపొచ్చాలు తొలగి ఒక్కటవుతారు. జరిగిన ఆ కథనంతా స్క్రిప్ట్‌గా రాసి డైరెక్ట్ చేసే చాన్స్ అజయ్‌కి ఇస్తాడు కేడీ. అలా ది ఎండ్‌కి అజయ్ డైరెక్టర్ అయిపోతాడు. కథ సుఖాంతం అవుతుంది. తొలి తెలుగు వెబ్ సిరీస్ అమెజాన్ ప్లాట్ ఫామ్ మీద స్క్రీన్ అయిన తొలి తెలుగు వెబ్‌సిరీస్ గ్యాంగ్‌స్టార్స్. స్క్రిప్ట్, స్క్రీన్‌ప్లే తెలుగు సినిమా ఫక్కీలో ఉండడం వల్ల వెబ్ సిరీస్‌గా ఇది ఆకట్టుకోలేకపోయింది. పెద్ద తారలను తీసుకున్నారు కథ, కథనం మీద కూడా అంతే శ్రద్ధ పెడితే ఇంకా బాగుండేది. కేడీగా జగపతిబాబు, విశ్వగా నవదీప్, ఐశ్వర్యగా శ్వేతాబసు ప్రసాద్, అజయ్‌గా సిద్ధు జొన్నలగడ్డ, కీర్తిగా అపూర్వ అరోరా, రెడ్‌గా రాహుల్ రామకృష్ణ, సీఐ ఆంజనేయులగా శివాజీ, పాల సుబ్రహ్మణ్యంగా పోసాని కృష్ణమురళి, విశ్వ తండ్రిగా కృష్ణ భగవాన్ నటించారు. – సరస్వతి రమ -
తెలుగు సినిమా మారుతోంది
రోజు వారి జీవితంలో ప్రతి విషయాన్ని, ప్రతి నిమిషాన్ని ప్లాన్ చేసుకుంటాం. అలా ప్లాన్ చేసుకున్న ఒక్కో పని అయిపోగానే ‘నెక్ట్స్ ఏంటి’ అనుకుంటాం. ఇప్పుడు అదే పేరుతో ఓ సినిమా రూపుదిద్దుకుంది. తమన్నా, సందీప్ కిషన్‌లు నాయికా, నాయకులుగా నవదీప్, పూనమ్ కౌర్‌లు ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘నెక్ట్స్ ఏంటి’. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కునాల్ కోహ్లి దర్శకత్వం వహించారు. రైనా జోషి, అక్షయ్ పూరి నిర్మాతలుగా వ్యవ హరించిన ఈ చిత్రానికి లియోన్ జోన్స్ సంగీతాన్ని అందించారు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్‌ను శుక్రవారం హైదరాబాద్‌లో విడుదల చేసింది చిత్రబృందం. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు కునాల్ కోహ్లీ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా స్క్రిప్ట్‌ను మొదట నేను శరత్‌బాబుగారికి పంపాను. ఆయన ఎంతో థ్రిల్ ఫీలయ్యి నన్ను హైదరాబాద్ రమ్మన్నారు. శరత్‌బాబుగారు, తమన్నా తండ్రీకూతుళ్లలా నటించారు. ఈ పాత్రల మధ్య సీన్స్ చాలా బావుంటాయి. భారతదేశ సంప్రదాయాన్ని తెలిపే చిత్రం ఇది. సినిమాకి భాష ఇబ్బంది కాదు, కంటెంట్ బావుంటే ఏ భాషలోనైనా ఆడుతుంది’’ అన్నారు. నవదీప్ మాట్లాడుతూ– ‘‘తమన్నా ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేసింది. ఆమె డబ్బింగ్ బావుంది. సినిమా ట్రైలర్లో ఉన్న కంటెంట్ వేరు.. సినిమాలో ఉన్న ఫీల్ వేరు. యూత్‌ని ఆకట్టుకోవటానికి ట్రైలర్‌ను అలా కట్ చేశారు’’ అని చెప్పారు. సందీప్ కిషన్ మాట్లాడుతూ– ‘‘ఫస్ట్ కునాల్ దర్శకుడు అనగానే హిందీ సినిమా అనుకున్నాను. తర్వాత తెలిసింది తెలుగు సినిమా అని. కథ వినగానే ఇంట్రెస్టింగ్గా అనిపించింది. మ్యూజిక్ చాలా బావుంది. నేను వర్క్ చేసిన ప్రొడ్యూసర్స్‌లో నాకు బాగా నచ్చిన నిర్మాత కిరణ్‌గారు.. ఆ తర్వాత అక్షయ్‌గారు. తమన్నాతో వర్క్ చేయటం మంచి ఎక్స్పీరియన్స్’’ అన్నారు. తమన్నా మాట్లాడుతూ– ‘‘తెలుగు సినిమా రోజు రోజుకు మారుతోంది. తెలుగు సినిమాలు భారతదేశం మొత్తం తెలిసిపోతున్నాయి. నేను ముంబైలో పుట్టినా తెలుగు సినిమా నాకు చాలా ఇంపార్టెంట్. దర్శకుడు కునాల్గారికి తెలుగు ఇండస్ట్రీకి బిగ్ వెల్ కమ్ చెబుతున్నా. ఈ చిత్రంలో నా కేరక్టర్ నేనే ప్లే చేశానా అనిపించింది. డిసెంబర్లో సినిమా విడుదలవుతుంది, అందరూ ఆదరించాలి’’ అన్నారు. -
తర్వాత ఏంటి?
తెలుగు చిత్ర పరిశ్రమలో సత్తా చాటిన దర్శకులు బాలీవుడ్ వెళ్లడం ఆనవాయితీ.. బట్ ఫర్ ఎ ఛేంజ్.. బాలీవుడ్లో తన ప్రతిభ నిరూపించుకున్న డైరెక్టర్ కునాల్ కోహ్లి తెలుగు చిత్ర పరిశ్రమకి వచ్చారు. ‘ఫనా, హమ్ తుమ్’ వంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన తొలిసారి ఓ తెలుగు చిత్రాన్ని తెరకెక్కించారు. సందీప్ కిషన్, తమన్నా జంటగా కునాల్ కోహ్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నెక్ట్స్ ఏంటి’. నవదీప్, పూనమ్ కౌర్ ముఖ్య పాత్రల్లో నటించారు. రైనా జోషి, అక్షయ్ పూరి నిర్మించారు. రొమాంటిక్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా లండన్, హైదరాబాద్ ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకుంది. ఫస్ట్ లుక్, టీజర్‌ని త్వరలో విడుదల చేయనున్నారు. డిసెంబర్లో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. శరత్ బాబు, లారిస్సా నటించిన ఈ చిత్రానికి సంగీతం: లియోన్ జేమ్స్, కెమెరా: మనీష్ చంద్రభట్, అసోసియేట్ ప్రొడ్యూసర్స్: సతీష్ సాల్వి, సంజన చోప్రా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: షాజహాన్, శివప్రసాద్ గుడిమిట్ల. -
వెన్నెల కిషోర్ పాటకు.. నవదీప్ రియాక్షన్!
టాలీవుడ్ కమెడియన్స్‌లో బిజీగా ఉండే వెన్నెల కిషోర్.. సోషల్ మీడియాలో కూడా బిజీగా ఉంటాడు. సినిమాల్లో మాదిరిగానే సోషల్ మీడియాలో కూడా హాస్యాన్ని పండిస్తాడు. ప్రస్తుతం వెన్నెల కిషోర్ పాడిన పాట, మొదలు పెట్టిన సీజన్ 1 ట్విట్టర్లో వైరల్ అవుతోంది. తిన్నది అరక్క.. అనే కాన్సెప్ట్‌తో చచ్చారు పో అంటూ మొదలు పెట్టిన ఈ మొదటి సీజన్ ఫస్ట్ ఎపిసోడ్‌ను సింగర్ చిన్నయికి అంకితం చేశాడు. పాట పాడిన వీడియోను కూడా షేర్ చేశాడు. దీనికి నవదీప్ వింత ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ వీడియోను పోస్ట్ చేశాడు. ఇక వెన్నెల కిషోర్ పాడిన పాటపై బ్రహ్మాజీ కామెంట్ చేస్తూ.. కాకా.. పాట పాడొచ్చు కదా.. లిరిక్స్ చదివావ్ అని అంటే.. నీ దృష్టిని నావైపు మళ్లించడానికే అంటూ రిప్లై ఇచ్చాడు.. వెంటనే బ్రహ్మాజీ స్పందిస్తూ.. నేను సరే అన్నా.. పాపం చిన్నయి ఎలా ఉందో ఒక సారి కనుక్కో అనగానే.. అవునన్నో.. అటునుంచి (చిన్మయి) రెస్పాన్సే లేదంటూ జవాబిచ్చాడు. మళ్లీ వెంటనే చిన్మయి స్పందిస్తూ.. ఇప్పుడే స్పృహ వచ్చిందంటూ రిప్లై ఇచ్చింది. ఇలా ఈ వీడియో కామెంట్లతో వైరల్‌గా మారుతోంది. pic.twitter.com/SrZk7DuoMp — Navdeep (@pnavdeep26) 27 September 2018 -
ట్రాఫిక్ సిగ్నల్‌పై హీరో సెటైర్.. వైరల్..
ట్రాఫిక్ సిగ్నల్‌పై హీరో నవదీప్ సెటైర్ వేశాడు. గత రాత్రి ఓ ప్రాంతంలో ట్రాఫిక్ సిగ్నల్ ఫొటోను తీశాడు. దాని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తూ.. ‘స్టాప్ బ్లేమింగ్ మి ఫర్ నాట్ హవింగ్ ఎ డైరెక్షన్ ఇన్ లైఫ్’ అని పోస్టు చేశాడు. అంతేకాక ఓ పిక్‌ను కూడా జత చేశాడు. నవదీప్ పెట్టిన పిక్‌లో రెడ్‌లైట్ ఆన్‌లో ఉంది. దాంతోపాటు స్ట్రెయిట్, లెఫ్ట్ సిగ్నల్స్‌ను కూడా చూపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై నెటిజన్లు కూడా సరదా కామెంట్స్ పెడుతున్నారు. ‘ఏ ప్రాంతం’ అని ఒకరు.. ‘భయంకరం’ అని మరొకరు సరదాగా ఆ ఫొటోపై స్పందించారు. -
‘గ్యాంగ్ స్టార్స్’లో జగ్గుభాయ్
క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా విలన్‌గా ఫుల్ బిజీగా ఉన్న సీనియర్ నటుడు జగపతిబాబు డిజిటల్ మీడియాలోకి అడుగుపెడుతున్నారు. ప్రస్తుతం అన్ని భాషల్లో వెబ్ సిరీస్‌ల ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే రానా లాంటి ఫాంలో ఉన్న యంగ్ హీరోలు కూడా వెబ్ సిరీస్‌లలో నటించేందుకు ముందుకు వస్తున్నారు. తాజాగా జగపతిబాబు కూడా ఈ లిస్ట్‌లో చేరిపోయారు. డార్క్ కామెడీగా తెరకెక్కుతున్న గ్యాంగ్‌స్టార్స్ వెబ్ సిరీస్‌లో జగపతిబాబు గూండా కృష్ణదాస్ పాత్రలో కనిపించనున్నారు. నందిని రెడ్డి దర్శకత్వ పర్యవేక్షణలో ‘దడ’ ఫేం అజయ్ భుయాన్ ఈ వెబ్ సిరీస్‌ను డైరెక్ట్ చేస్తున్నారు. శ్వేత బసు ప్రసాద్, నవదీప్, పోసాని కృష్ణ మురళి, శివాజీ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సిరీస్‌ను 12 ఎపిసోడ్లుగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. జూన్ 1న తొలి ఎపిసోడ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కానుంది. -
వెబ్ సిరీస్‌లలో యంగ్ హీరోలు
-
వీరమహాదేవి వచ్చేశారహో!
రాణీ వీరమహాదేవి విచ్చేశారు. బుధవారం స్టారై్టన షూటింగ్ లొకేషన్‌కు వచ్చారు. సిల్వర్ స్క్రీన్‌పై సన్నీ లియోన్ వీరమహాదేవి అనే విషయం తెలిసిందే. వీసీ వడివుడయాన్ దర్శకత్వంలో సన్నీ లియోన్ టైటిల్ రోల్ చేస్తున్న సినిమా ‘వీరమహాదేవి’. తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో ఏకకాలంలో సినిమాని రూపొందిస్తున్నారు. తెలుగులో ‘వీరమహాదేవి’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అంతకుముందు ఐటమ్ సాంగ్స్, స్పెషల్ రోల్స్‌లో అలరించిన సన్నీ సౌత్‌లో హీరోయిన్గా చేస్తోన్న తొలి సినిమా ఇది. ఇంకో ఇంట్రెస్టింగ్ మేటర్ ఏంటంటే... ఇందులో నవదీప్ విలన్ రోల్ చేస్తున్నారని సమాచారం. ఈ సినిమా ఎంటైర్ షూట్లో ఆల్మోస్ట్ 300 గుర్రాలు అవసరం అవుతాయట. ‘క్వీన్’ వీరమహాదేవి పాత్ర కోసం కత్తి యుద్ధాలు, గుర్రపు స్వారీ నేర్చుకున్నారు సన్నీ లియోన్. ఇదిలా ఉంటే సినిమాలో ఆల్మోస్ట్ 50 పర్సెంట్ గ్రాఫిక్స్ వర్క్ ఉండటంతో ‘బాహుబలి, 2.0’ సినిమాలకు వర్క్ చేసిన టెక్నీషియన్స్‌ను తీసుకున్నారు. ‘‘వీరమహాదేవి షూటింగ్ స్టారై్టంది.. సో ఎగై్జటెడ్’’ అని పేర్కొన్నారు సన్నీ. -
పవన్ పాట.. ఇవాంక కోసం!
హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారాల పట్టి ఇవాంక అంతర్జాతీయ పారిశ్రామిక సదస్సు కోసం నగరానికి విచ్చేసిన విషయం తెలిసిందే. ఇవాంక రాకతో హైదరాబాద్‌లో ఉదయం భారీగా ట్రాఫిక్ ఏర్పడింది. దీంతో హీరో నవదీప్ వెంటనే ‘అజ్ఞాతవాసి’ పాటను గుర్తు చేసుకున్నాడు. ఆమెకు.. ఆ పాటకు ఏం సంబంధం అనుకుంటున్నారా ? నగరంలో ఇవాళ ఉదయం 10 గంటలకు భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. అందులో చిక్కుకున్న నవదీప్ వెంటనే తన ట్విట్టర్ ద్వారా ఆ విషయాన్ని వెల్లడించారు. ‘బయటికెళ్లి చూస్తే టైం ఏమో 10’O క్లాక్’. ఇంటికెళ్లే రోడ్డు మొత్తం ఇవాంక రోడ్డు బ్లాక్’ అని ట్రాఫిక్ కష్టాల గురించి హీరో ఫన్నీగా ట్విట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. Baitikelli chusthe time emo 10 o clock Intikelle road mothham ivanka road block !! #haha :) — Navdeep (@pnavdeep26) November 28, 2017 -
హీరోను ఆటాడుకున్న ఎన్టీఆర్!
తెలుగులో ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అతిపెద్ద రియాల్టీ షో 'బిగ్‌బాస్'. ఈ షో ఇప్పటికే పాపులర్ అయిన విషయం తెలిసిందే. ఆదివారం ప్రసారం అయిన ఎపిసోడ్లో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన టాలీవుడ్ హీరో నవదీప్‌ను హోస్ట్ ఎన్టీఆర్ సరదాగా ఆటపట్టించారు. 'మీ ఇంట్లో పాత 500, 1000 నోట్లు ఉన్నట్లు గుర్తించారు. నువ్వు పాత నోట్లను ఎందుకు రిటర్న్ చేయలేదు. త్వరగా బ్యాగు సర్దుకో. నీకు కేవలం 5 నిమిషాలు టైమ్ ఇస్తున్నాను. వెంటనే బయటకు వచ్చేయ్ అని' ఎన్టీఆర్ అనగానే షో కంటెస్టెంట్ నవదీప్ కు ఫ్యూజులు ఎగిరిపోయి, ముఖంలో రంగులు మారిపోయాయి. అసలే ఎలిమినేషన్ జరిగేరోజు కూడా కావడంతో నిజంగానే హౌస్ వదిలి పోవాలేమోనని నవదీప్ టెన్షన్ పడ్డాడు. అయితే నవదీప్‌ను ఎన్టీఆర్ ఆట పట్టించడానికి ఓ కారణం ఉంది. బిగ్‌బాస్ హౌస్‌లోకి ఇంట్లోకి లేటెస్ట్గా ఇచ్చిన వ్యక్తి కావడంతో ఇతర కంటెస్టెంట్లు విశేషాలు అడుగుతారు. రద్దయిన పాత 500, 1000 నోట్లు చెల్లుతున్నాయని చెప్పడమే కాదు, వారిని నమ్మించిన విషయం తెలిసిందే. 'హౌస్ సభ్యులకు నువ్వు కథలు చెప్పావు కదా. కథలు చెప్పడం నీకు మాత్రమే వచ్చా. మాకు కూడా వచ్చునంటూ' ఎన్టీఆర్ చెప్పగానే ఇతర కంటెస్టెంట్లు చప్పట్లు కొడుతూ ఎంజాయ్ చేశారు. మరోవైపు సెల్ఫ్ గా ఎలిమినేషన్‌కు నామినేట్ చేసుకున్న కారణంగా హౌస్‌ను వీడుతున్న నటి ముమైత్ ఖాన్‌కు బిగ్‌బాస్ మరో ఛాన్స్ ఇచ్చారు. కొన్ని టాస్క్‌లు సరిగ్గా నిర్వహిస్తే త్వరలో ఆమె మళ్లీ బిగ్‌బాస్ హౌస్‌లోకి రీఎంట్రీ ఇవ్వనుంది. -
బిగ్‌బాస్: సింగర్‌పై వేటు.. యువహీరో ఎంట్రీ!
బిగ్‌బాస్ వీకెండ్ ఎపిసోడ్లో మరోసారి ఎలిమినేషన్ ప్రక్రియ రక్తికట్టింది. ఇప్పటికే ఈ షో నుంచి మహేశ్ కత్తి ఎలిమినేట్ అవ్వగా.. ఆదివారం నాటి ఎపిసోడ్లో సింగర్ కల్పన కూడా ఇంటి దారి పట్టారు. ఈ వారం బిగ్‌బాస్ నుంచి ఇద్దరు ఎలిమినేట్ అవ్వగా.. యువ హీరో నవదీప్ వైల్డ్‌కార్డు ఎంట్రీ ఇచ్చి ఆశ్చర్యపరిచాడు. ఎలిమినేషన్ జోన్లో ఈ వారం చివరివరకు దీక్ష, హరితేజ, కల్పనలు ఉండగా.. వీరిలో సింగర్ కల్పనను ప్రేక్షకుల తీర్పు మేరకు బిగ్‌బాస్ హౌస్ నుంచి పంపివేస్తున్నట్టు హోస్ట్ జూనియర్ ఎన్టీఆర్ ప్రకటించాడు. మంచి గాయనిగా పేరొందిన కల్పన వెళ్తూ .. వెళ్తూ.. తనదైన టాలెంట్‌తో ఆకట్టుకున్నారు. బిగ్‌బాస్‌లోని తోటి సభ్యులను ఉద్దేశించి పాటలు పాడుతూ, ఇమిటేట్ చేస్తూ కడుపుబ్బా నవ్వించారు. ఇక, తన అంచనా ప్రకారం బిగ్ బాస్ టైటిల్ ప్రిన్స్ గెల్చుకునే అవకాశం ఉందని కల్పన తెలిపారు. హౌస్‌లో డబుల్ మైండ్ ఎవరికి ఉంది అని ఎన్టీఆర్ అడుగగా.. ధనరాజ్ అని బదులిచ్చారు. ఇప్పటికే బిగ్ బాస్ హౌస్‌లోకి దీక్షను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వగా.. తాజాగా యువ హీరో నవదీప్ హౌజ్‌లోకి ప్రవేశించాడు. బిగ్‌బాస్ హౌజ్‌లో ఉన్న మొమైత్ఖాన్ ఇప్పటికే డ్రగ్స్ కేసులో సిట్ విచారణను ఎదుర్కొన్నారు. సిట్ విచారణ కోసం బిగ్‌బాస్ నిర్వాహకులు స్వయంగా ఆమె వెంట వచ్చారు. ఇప్పుడు డ్రగ్స్ కేసులో సిట్ విచారణ ఎదుర్కొన్న మరో నటుడు నవదీప్ బిగ్‌బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇవ్వడం పలువురిని ఆశ్చర్యపరిచింది. -
సిట్ విచారణకు హాజరైన హీరో నవదీప్
హైదరాబాద్ : డ్రగ్స్ మాఫియా కేసులో నోటీసులు అందుకున్న హీరో నవదీప్ సోమవారం సిట్ విచారణకు హాజరయ్యారు. ఆయన సోమవారం ఉదయం 10.20 గంటలకు సిట్ కార్యాలయానికి వచ్చారు. అలాగే సిట్ అధికారులు పబ్‌ల నిర్వహణపై నవదీన్ను విచారణ చేస్తున్నారు. డ్రగ్స్ వాడకం, కెల్విన్‌తో సంబంధాలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. కెల్విన్ కాల్ డేటాల్ నవదీప్ ఫోన్ నంబర్ ప్రముఖంగా ఉన్నట్లు సమాచారం. పబ్‌ల మాటున డ్రగ్స్ దందా చేసినట్లు నవదీప్‌పై ఆరోపణలు ఉన్నాయి. విచారణలో ఆయన నుంచి కీలక సమాచారం లభించే అవకాశం ఉన్నట్లు సమాచారం. దేశ, విదేశాల్లో పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్న నవదీప్ నటుడుగానే కాక ఈవెంట్ ఆర్గనైజర్‌గా కూడా చలామణీ అవుతున్నారు. ప్రముఖుల కుటుంబాల్లో జరిగే పార్టీలకు కావాల్సిన ఏర్పాట్లు కూడా తానే చేసేవాడని సమాచారం. ఈ నేపథ్యంలో గోవా ముఠాలకు సంబంధించిన కీలకమైన వివరాలను ఆయన నుంచి రాబట్టవచ్చని సిట్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో కెల్విన్‌తో సంబంధాలు, డ్రగ్స్ మాఫియాతో లింకులు, గతంలో డగ్స్ తీసుకున్నారా తదితర ప్రశ్నలను సిట్ అధికారులు నవదీప్ కోసం సిద్ధం చేశారు. సిట్ చేతిలో నవదీప్ కాల్‌డేటా, వాట్సాప్ మెసేజ్‌లు ఆధారంగా విచారణ కొనసాగిస్తున్నారు.కాగా గత ఏడాది మార్చిలో నవదీప్‌కు చెందిన గెస్ట్‌హౌస్‌పై ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి, అక్రమంగా వినియోగిస్తున్న మద్యాన్ని స్వాధీనం చేసుకొని ఒకరిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్, కెమెరామేన్ శ్యామ్‌కే నాయుడు, నటుడు సుబ్బరాజు, హీరో తరుణ్‌ను సిట్ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. సుబ్బరాజు విచారణ ఆధారణంగా తాజాగా మరో 15మంది సినీనటులకు నోటీసులు పంపించనున్నారు. గతంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో నవదీప్ పట్టుబడ్డారు. -
సిట్ విచారణకు హాజరైన నవదీప్
-
డ్రగ్స్ కేసులో నోటీసులు అందాయి: నటుడు
-
మాట మరియు మరణము
ప్రోజ్ పొయెమ్ అపుడు కదా, చీకటి గుహలో ఒంటిగా ఉన్నపుడు పూలరెక్కలతో ఎగిరివచ్చి మదిలో కొన్ని మిణుగురులను పొదుగుతావు. ఇన్ని యుగాలు ఏమైపోయావ్- బ్రహ్మనడిగి నీ చిరునామా కనుక్కొన్నా తెలుసా అంటో కొన్ని మంత్రపుష్పాలు చల్లి ఎడారిని సరస్సుగా మారుస్తావు. పిల్లలమై పిల్లులమై కిచకిచలాడుకుంటున్నవేళ పొత్తిళ్లలో కొన్ని కలల్ని వదులుతావు. ఎద ఆన్చి అద్వైతం అంటే ఇదే, ఇదొక్కటే, ఇది మాత్రమే నిత్యమూ సత్యమూ శాశ్వతమూ అని కొత్త భాష నేర్పుతావు. అర్ధనారీశ్వరులమై ఏకదేహమున శివసాయుజ్యం పొందెదమని ఆన పెడతావు. చేయి వదిలితివా నా ప్రాణమేనని బేలకళ్లతో కువకువమంటావు. మాటలను వెలిగించి చలి కాచుకుంటూ ఉంటానా, కాగితప్పడవలు చేసి జలపాతాల్లో ఆటలాడుకుంటూ ఉంటానా, గాలిబుడగలు చేసి ఆకాశపు అంచుల్లో విహరిస్తూ ఉంటానా! అపుడు కదా, గాలిదుమారంలాగా వచ్చి పిచ్చీ అవి బుడగలు కావు, కండోమ్స్ అంటావు- కొత్తనైన చూపుతో. - నవదీప్ -
ధృవ సినిమాలో మరో హీరో
బ్రూస్ లీ సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ధృవ సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి చేసుకున్నా.. చరణ్ మాత్రం మూడో షెడ్యూల్ నుంచే షూటింగ్లో పాల్గొంటున్నాడు. తమిళ సూపర్ హిట్ సినిమా తనీ ఒరువన్కు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఇంట్రస్టింగ్ కాస్టింగ్‌ను సెట్ చేస్తున్నారు. చరణ్ సరసన హీరోయిన్గా మరోసారి రకుల్ ప్రీత్ కనిపిస్తుండగా, తమిళ వర్షన్లో విలన్‌గా నటించిన అరవింద్ స్వామి, చరణ్ తోనూ ఢీ అంటున్నాడు. చరణ్ షూటింగ్లో పాల్గొంటున్న తాజా షెడ్యూల్లో యువ నటుడు నవదీప్ కూడా ధృవ టీంతో జాయిన్ అవుతున్నాడు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్న నవదీప్, తన పాత్ర ఏంటి అన్నది మాత్రం రివీల్ చేయలేదు. Happy to be onboard charans #dhruva :) lets see what comes out of this :) #oldwaysdontopennewdoors :) — Navdeep (@pnavdeep26) 7 June 2016 -
ఆ పార్టీలో నేనూ ఉన్నా : బ్రహ్మాజీ
శనివారం ఉదయం నుంచి మీడియాలో హీరో నవదీప్ ఫాం హౌస్ పార్టీపై వస్తున్న కథనాలను నటుడు బ్రహ్మాజీ ఖండించాడు. హైదరాబాద్ శివార్లలోని నవదీప్ ఫాం హౌస్‌లో రేవ్ పార్టీ జరిగిందని, ఆ పార్టీపై పోలీసులు దాడి చేయగా నవదీప్ సహా పలువురు సినీ నటులు పరారీలో ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంపై నవదీప్ స్పందిస్తూ, అది రేవ్ పార్టీ కాదని కుటుంబ సభ్యులంతా కలిసి గృహవేశ కార్యక్రమంలో పాల్గొన్నట్టు తెలిపాడు. తాజాగా ఇదే విషయంపై నటుడు బ్రహ్మాజీ కూడా స్పందించాడు. నవదీప్‌పై వస్తున్న వార్తలన్ని అవాస్తవాలని తెలిపిన అతడు, తాను కూడా కుటుంబ సమేతంగా ఆ పార్టీలో పాల్గొన్నట్టుగా తెలిపాడు. ఇది పిల్లలు, కుటుంబ సభ్యులతో కలిసి ఏర్పాటు చేసిన ఫాం హౌస్ పార్టీ అంటూ ట్వీట్ చేశాడు. అయితే నవదీప్ చెప్పినట్టుగా ఇది గృహప్రవేశ కార్యక్రమం అన్నట్టుగా కాకుండా, అది ఫాం హౌస్ పార్టీ అని చెప్పాడు బ్రహ్మాజీ. News about @pnavdeep26 is utterly baseless.I was there with my family too..it's farm house party with kids n families. — BRAHMAJI (@actorbrahmaji) March 26, 2016 -
ఆ ముగ్గురికీ కీలకమే
దర్శకుడిగా ఒకప్పుడు టాప్ స్టార్ డమ్‌ను అందుకున్న తేజ, కొంత కాలంగా ఆకట్టుకోలేకపోతున్నాడు. ఒకప్పుడు హీరోలకు సమానంగా క్రేజ్ సంపాదించుకున్న ఈ దర్శకుడు, ఇప్పుడు మినిమమ్ కలెక్షన్లు వసూళు చేసే సినిమాను కూడా ఇవ్వలేకపోతున్నాడు. దీంతో ఈ సారి ఎలాగైన హిట్ కొట్టాలనే ఆలోచనలో ఓ క్రేజీ కాంబినేషన్‌ను సెట్ చేస్తున్నాడు. తానే ఇంట్రడ్యూస్ చేసిన ఓ యువ నటుడు హీరోగా, మరో సీనియర్ హీరోను విలన్‌గా పరిచయం చేస్తూ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే కథా కథనాలు కూడా రెడీ అయిన అహం సినిమాను త్వరలోనే సెట్స్ మీదకు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాడు దర్శకుడు తేజ. ఈ సినిమాలో తేజ ఇండస్ట్రీకి పరిచయం చేసిన నవదీప్ హీరోగా నటిస్తున్నాడు. 12 ఏళ్ల క్రితం జై సినిమాతో తేజ డైరెక్షన్లో పరిచయం అయిన నవదీప్, ఇన్నేళ్ల తరువాత తిరిగి తన గురువుతో కలిసి నటిస్తున్నాడు. అంతేకాదు ఈ సినిమాతో యాంగ్రీ హీరో రాజశేఖర్ తొలిసారిగా నెగెటివ్ రోల్లో నటించడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం రాజశేఖర్, తేజ, నవదీప్‌ల కెరీర్లు భారీ కష్టాల్లో ఉన్నాయి. అందుకే ఈ ముగ్గురికి అహం సినిమా సక్సెస్ చాలా కీలకం కానుంది. మరి ఈ అహం ఆ ముగ్గురి కెరీర్లను గాడిలో పెడుతుందేమో చూడాలి. -
బాలీవుడ్ బాటలో యువహీరో
హీరోగా టాలీవుడ్ లో ఆకట్టుకోలేకపోయిన ఓ యువ కథానాయకుడు త్వరలో బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు. చందమామ సినిమాతో హీరోగా మంచి విజయం సాధించినా తరువాత ఆ స్థాయిలో అలరించలేకపోయాడు. దీంతో సపోర్టింగ్ రోల్స్‌తో పాటు, నెగెటివ్ రోల్స్‌తోనూ ఆకట్టుకున్నాడు నవదీప్. హీరోగా సక్సెస్ కాలేకపోయినా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మాత్రం మంచి విజయాలు సాధిస్తున్నాడు. మోడలింగ్‌లో సత్తా చాటుతున్న నవదీప్ బాలీవుడ్లో ఓ క్రేజీ ఆఫర్ సొంతం చేసుకున్నాడు. ఇమ్రాన్ హష్మీ హీరోగా నటిస్తున్న బయోపిక్ 'అజర్'లో కీలక పాత్రలో నటించనున్నాడు నవదీప్. ఈ పాత్ర కోసం చాలా మంది బాలీవుడ్ నటీనటులను పరిశీలించిన దర్శకుడు టోని ఫైనల్‌గా నవదీప్కే ఫిక్స్ అయ్యాడట. భారత క్రికెట్ టీం ను విజయం పథంలో నడిపించిన అజహరుద్ధీన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబందించిన షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. మరో వారం రోజుల్లో నవదీప్ కూడా 'అజర్' టీంతో జాయిన్ అయ్యే అవకాశం ఉందంటున్నారు చిత్రయూనిట్. ఇప్పటికే తెలుగు తమిళ భాషల్లో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నవదీప్, ఈ సినిమాతో బాలీవుడ్లో కూడా తన మార్క్ చూపించాలని భావిస్తున్నాడు. -
ఇది వైవిధ్య ప్రయత్నం
-హీరో నవదీప్ ‘‘చాలా కొత్త కథ ఇది. విభిన్నమైన స్క్రీన్‌ప్లేతో వైవిధ్యంగా చేసిన మా ప్రయత్నానికి మంచి స్పందన లభిస్తోంది’’ అని హీరో నవదీప్ చెప్పారు. నవదీప్, నవీన్‌చంద్ర, పూజ ముఖ్యతారలుగా కార్తీక్‌వర్మ దర్శకత్వంలో శిరువూరి రాజేష్ నిర్మించిన ‘భమ్ బోలేనాథ్’ ఇటీవలే విడుదలైంది. ఈ సంద ర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో యూనిట్ సభ్యులు ప్రసంగించారు. తమ పాత్రలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయని నవీన్‌చంద్ర, పూజ చెప్పారు. -
స్టార్ రిపోర్టర్ - నవదీప్
-
ఇలాంటి సినిమాలు తక్కువ వస్తాయి!
‘‘ఈ చిత్రం ఆరంభం నుంచి చివరి వరకు ఆసక్తికరంగా సాగుతుంది. నాకు ఈ తరహా స్క్రీన్‌ప్లే, క్లైమాక్స్‌తో తక్కువ సినిమాలు వస్తాయి. విభిన్న అంశాలను మేళవించి తీసిన చిత్రం ఇది. చేస్తున్నప్పుడే చాలా థ్రిల్ అయ్యాను. రషెస్ చూసి, చాలా సంతృప్తిపడ్డాను’’ అని నవదీప్ అన్నారు. కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో నవదీప్, నవీన్ చంద్ర హీరోలుగా శ్రీకాంత్ దంతులూరి సమర్పణలో శిరువూరి రాజేష్ వర్మ నిర్మించిన చిత్రం ‘భమ్ బోలేనాథ్’. ఈ చిత్రం ఫస్ట్ లుక్ దర్శకుడు చందు మొండేటి ఆవిష్కరించి, చిత్రబృందానికి శుభాకాంక్షలందజేశారు. అనంతరం కార్తీక్ వర్మ మాట్లాడుతూ -‘‘చందు దర్శకత్వంలో వహించిన ‘కార్తికేయ’కు స్క్రీన్‌ప్లే ఇచ్చాను. ఆ సినిమా ముగింపు దశలో ఉన్నప్పుడు రాజేష్‌గారికి ఈ కథ చెప్పాను. ఇదొక క్రైమ్, కామెడీ థ్రిల్లర్. కథను నమ్మి ఆయన ఈ అవకాశం ఇచ్చారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టే విధంగా ఈ సినిమా చేశాను’’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘కార్తీక్ వర్మ ఏదైతే చెప్పాడో దాన్ని అద్భుతంగా తెరపై ఆవిష్కరించాడు. ఒక కొత్త కథతో తీసిన ఈ సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది. ఈ నెలాఖరుకి చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. ఓ మంచి స్క్రిప్ట్‌తో చేసిన చిత్రమిదని నవీన్‌చంద్ర తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: శరణ్ కొప్పిశెట్టి, కార్తీక్ వర్మ దండు, సంగీతం: సాయి కార్తీక్, కెమెరా: భరణి కె. ధరన్. -
నటుడు మూవీ స్టిల్స్
-
సాహసోపేతమైన నటన
నవదీప్, కావ్యాశెట్టి జంటగా రూపొందిన చిత్రం ‘నటుడు’. ఎన్.ఎస్. ఆర్.ప్రసాద్ దర్శకుడు. రమేశ్‌బాబు కొప్పుల నిర్మాత. డీఎస్ రావు సమర్పకుడు. జయసూర్య స్వరాలందించిన ఈ చిత్రం పాటల సీడీని అనిల్ సుంకర ఆవిష్కరించి, కె.వి.వి.సత్యనారాయణకు అందించారు. టైటిల్ లోగోను తమ్మారెడ్డి భరద్వాజ్ అవిష్కరించారు. ‘‘ఈ కథను పదిమంది హీరోలకు వినిపిస్తే... ధైర్యంగా చేస్తానని ముందుకొచ్చిన ఏకైక హీరో నవదీప్. సాహసోపేతమైన ఈ పాత్రను అద్భుతంగా పోషించాడు తను’’ అని దర్శకుడు చెప్పారు. ‘‘‘పిల్లజమీందార్’ తర్వాత నాకు ఆ స్థాయి విజయం రాలేదు. అయినా... మొక్కవోని ధైర్యంతో ముందుకెళుతున్నాను. మంచి కథతో ఈ సినిమా తీశాం. ‘పిల్ల జమీందార్’ సినిమాను బాలీవుడ్లో నవదీప్‌తో తీయాలనుకుంటున్నాను’’ అని డీఎస్ రావు చెప్పారు. ఇంకా చిత్రం యూనిట్ సభ్యులు మాట్లాడారు. -
బంగారు కోడిపెట్ట టీమ్‌తో చిట్‌ఛాట్
-
'బంగారు కోడిపెట్ట' సక్కెస్ మీట్
-
ఇక ముందు అలాంటి సినిమాలు చేయను
‘‘నిజజీవితంలో నేను కొంచెం దూకుడే. అందుకే వివాదాల్లో చిక్కుకున్నాను. నన్నెవరు పట్టించుకుంటారులే అనే భావనతో తెలీకుండానే కొన్ని తప్పులు చేశాను. సినిమా వాళ్ల పట్ల ప్రజల అటెన్షన్ ఉంటుందని, ఇక ముందు బాధ్యతతో మెలగాలని తెలుసుకున్నాను’’ అని నవదీప్ చెప్పారు. నవదీప్, కలర్స్ స్వాతి జంటగా రూపొందిన చిత్రం ‘బంగారు కోడిపెట్ట’. రాజ్ పిప్పళ్ల దర్శకుడు. సునీత తాటి నిర్మాత. ఈ నెల 7న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా నవదీప్ విలేకరులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ‘‘ప్రస్తుతం ఆఫర్ చేసిన పాత్రల్ని చేస్తూ వస్తున్నాను. కథల్ని ఎంపిక చేసుకునే స్థాయి రావాలంటే నాకో కమర్షియల్ హిట్ కావాలి. ‘బంగారు కోడిపెట్ట’ ఆ లోటును తీరుస్తుందనుకుంటున్నాను. ఇందులో నా పాత్రలో భిన్న పార్శ్వాలుంటాయి. స్వాతితో నా సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తాయి’’ అని ఆశాభావం వ్యక్తం చేశారు నవదీప్. ఇంకా మాట్లాడుతూ -‘‘సినిమాల ఎంపికలో తెలీకుండానే కొన్ని తప్పులు చేశాను. ఆ తప్పులే చేయకుంటే.. ఈ రోజున నా స్థానం వేరేలా ఉండేది. ఉదాహరణకు ‘బాద్షా’. ఏ మాత్రం ప్రాధాన్యత లేని పాత్రను అందులో చేశాను. నిజానికి ఆ పాత్రను నేనే చేయనవసరం లేదు. ఎవరైనా చేయొచ్చు. ఇక ముందు అలాంటి సినిమాలు చేయను’’ అని నిర్మొహమాటంగా చెప్పారు నవదీప్. ఎన్టీఆర్‌తో సినిమా నిర్మించబోతున్నారట కదా? అనడిగితే- ‘‘సినిమాలు తీసేంత స్థాయి నాకు లేదు. నా సంపాదన నా కారు, నా పబ్బులకే సరిపోవడం లేదు’’ అని నవ్వుతూ సమాధానమిచ్చారు నవదీప్. -
అందర్నీ మాయ చేస్తుంది
నవదీప్, స్నేహాఉల్లాల్ జంటగా రూపొందుతోన్న చిత్రం ‘అంతా నీ మాయలోనే’. పి.వి.కృష్ణ దర్శకుడు. వినోద్ సూర్యదేవర నిర్మాత. హైదరాబాద్ ఆర్ఎఫ్సీలో ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటోంది. ప్రత్యేక పాత్ర పోషిస్తున్న డా. రాజేంద్రప్రసాద్‌తో పాటు సహ నటులంతా ఈ షూటింగ్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. ‘‘నాకు హిట్ అవసరం అనుకునే సమయంలో ఈ అవకాశం వచ్చింది. ఇంటిల్లిపాదీ చూసేలా సినిమా ఉంటుంది. 70 శాతం టాకీ పూర్తయింది. వచ్చే నెలలో షూటింగ్ పూర్తవుతుంది. విజువల్ ఎఫెక్ట్స్‌తో తీసిన గీతం ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అని నవదీప్ చెప్పారు. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ తర్వాత తనకు మంచి గుర్తింపు తెచ్చే సినిమా అవుతుందని స్నేహాఉల్లాల్ అన్నారు. రాజేంద్రప్రసాద్‌గారితో పనిచేయడం ఆనందంగా ఉందని బ్రహ్మాజీ అన్నారు. ఇంకా జయప్రకాష్‌రెడ్డి, ప్రగతి, శ్రీనివాసరెడ్డి, సత్యం రాజేష్, సత్యకృష్ణన్, శివన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి మాటలు: నివాస్, సంగీతం: స్వరాజ్. -
గొప్ప నటులను కోల్పోయాం....
వేటపాలెం : తెలుగు సినీపరిశ్రమ వరుసగా అక్కినేని నాగేశ్వరరావు, శ్రీహరి, ఏవీఎస్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఉదయ్ కిరణ్ వంటి గొప్ప నటులను కోల్పోయిందని నటుడు నవదీప్ ఆవేదన వ్యక్తం చేశాడు. వేటపాలం మండలం జాండ్రపేట బీవీ అండ్ బీఎన్ హైస్కూల్లో ఆదివారం ఓ సావనీర్‌ను ఆవిష్కరించాడు. అనంతరం వేటపాలెంలో సన్నిహితుల ఇంటికి వెళ్లాడు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నవదీప్ మాట్లాడుతూ కేవలం అయిదు నెలల వ్యవధిలో అయిదుగురు మంచి నటులను తెలుగు చిత్రపరిశ్రమ కోల్పోవడం బాధగా ఉందన్నాడు. తాను సినీ పరిశ్రమలోకి వచ్చి పదేళ్లు పూర్తయిందని, ఇప్పటివరకూ 25 తెలుగు, తమిళ చిత్రాల్లో నటించినట్లు తెలిపాడు. ప్రస్తుతం తాను నటించిన బంగారు కోట, అంతసీన్ లేదు, నటుడు చిత్రాలు రిలీజ్‌కి సిద్ధంగా ఉండగా, అంతా నీమాయ, పాగా చిత్రాలు నిర్మాణ దశలో ఉన్నాయన్నాడు. తనకు చందమామ, గౌతం, ఆర్య-2 చిత్రాలు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయని తెలిపాడు. తాను చిన్నతనంలో చీరాల, వేటపాలెం ప్రాంతాల్లో ఎక్కువగా గడిపినట్లు నవదీప్ గుర్తు చేసుకున్నాడు. -
‘కింగ్ ఫిషర్’ ఫ్యాషన్ వీక్