తర్వాత ఏంటి? | Tamannaah & Sundeep Kishan starrer titled Next Enti | Sakshi
Sakshi News home page

తర్వాత ఏంటి?

Published Fri, Nov 9 2018 2:33 AM | Last Updated on Sun, Sep 15 2019 12:38 PM

Tamannaah & Sundeep Kishan starrer titled Next Enti - Sakshi

తమన్నా, సందీప్‌

తెలుగు చిత్ర పరిశ్రమలో సత్తా చాటిన దర్శకులు బాలీవుడ్‌ వెళ్లడం ఆనవాయితీ.. బట్‌ ఫర్‌ ఎ ఛేంజ్‌.. బాలీవుడ్‌లో తన ప్రతిభ నిరూపించుకున్న డైరెక్టర్‌ కునాల్‌ కోహ్లి తెలుగు చిత్ర పరిశ్రమకి వచ్చారు. ‘ఫనా, హమ్‌ తుమ్‌’ వంటి హిట్‌ చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన తొలిసారి ఓ తెలుగు చిత్రాన్ని తెరకెక్కించారు. సందీప్‌ కిషన్, తమన్నా జంటగా కునాల్‌ కోహ్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నెక్ట్స్‌ ఏంటి’. నవదీప్, పూనమ్‌ కౌర్‌ ముఖ్య పాత్రల్లో నటించారు.

రైనా జోషి, అక్షయ్‌ పూరి నిర్మించారు. రొమాంటిక్‌ ఎంటర్‌ టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా లండన్, హైదరాబాద్‌ ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకుంది. ఫస్ట్‌ లుక్, టీజర్‌ని త్వరలో విడుదల చేయనున్నారు. డిసెంబర్‌లో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. శరత్‌ బాబు, లారిస్సా నటించిన ఈ చిత్రానికి సంగీతం: లియోన్‌ జేమ్స్, కెమెరా: మనీష్‌ చంద్రభట్, అసోసియేట్‌ ప్రొడ్యూసర్స్‌: సతీష్‌ సాల్వి, సంజన చోప్రా, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌: షాజహాన్, శివప్రసాద్‌ గుడిమిట్ల.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement