డ్రగ్స్‌ కేసులో నవదీప్‌కు ఊహించని షాకిచ్చిన పోలీసులు | Sakshi
Sakshi News home page

Navadeep Drugs Case: డ్రగ్స్‌ కేసులో నవదీప్‌కు ఊహించని షాకిచ్చిన పోలీసులు

Published Thu, Sep 21 2023 4:50 PM

Hyderabad Police Issued Drugs Cause Notice To Navdeep - Sakshi

డ్రగ్స్ కేసులో టాలీవుడ్ హీరో నవదీప్‌కు పోలీసులు షాకిచ్చారు. తాజాగా ఆయనకు వారు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 23న విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే ఈ కేసుతో తనకు ఎలాంటి సబంధం లేదని ఆయన కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో నవదీప్‌ను అరెస్ట్‌ చేయవద్దని పోలీసులకు కోర్టు  ఆదేశించింది. కానీ అతనికి ఈ కేసులో సంబంధం ఉన్నట్లు పోలీసులు బలంగా నమ్ముతున్నారు. అందుకే అతన్ని విచారించేందుకు తాజాగా పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీంతో ఈ కేసుపై మరింత ఉత్కంఠ నెలకొంది.

(ఇదీ చదవండి: 'కింగ్‌ ఆఫ్‌ కొత్త' ఓటీటీ విడుదల తేదీలో మార్పు)

మాదాపూర్‌లోని విఠల్‌నగర్‌లో ఉన్న ఫ్రెష్‌ లివింగ్‌ అపార్ట్‌మెంట్‌లో దొరికిన తీగను లాగుతుంటే టాలీవుడ్‌ డ్రగ్‌ డొంక కదులుతోంది. ఈ కేసులో  ఫిల్మ్‌ ఫైనాన్షియర్‌ కె.వెంకటరమణారెడ్డితో పాటు ‘డియర్‌ మేఘ’ చిత్ర దర్శకుడు అనుగు సుశాంత్‌ రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. వీరి నుంచి రూ.10 లక్షల విలువైన డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు. వారిని విచారిస్తున్న సమయంలో నవదీప్‌ పేరు తెరపైకి వచ్చినట్లు సమాచారం. దీంతో ఈ డ్రగ్స్ కేసుతో నవదీప్‌కు సంబంధం ఉందని పోలీసులు వెల్లడించారు.

(ఇదీ చదవండి: భర్త జైల్లో ఉంటే ఫోటోషూట్స్‌తో బిజీగా ఉన్న మహాలక్ష్మి!)

నవదీప్ డ్రగ్స్ సేవించినట్లుగా హైదరాబాద్ పోలీసులు ఇప్పటికే వెల్లడించారు. ఈ కేసులో 29వ నిందితుడిగా అతని పేరు చేర్చినట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.  ఇప్పటికే ముగ్గురు నైజీరియన్‌లతో సహా 8 మంది నిందితులను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. తాజాగా నవదీప్‌కు విచారణకు రావాలని నోటీసులు జారీ చేయడంతో అతన్ని కూడా అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలిస్తారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement
 
Advertisement
 
Advertisement