
అందర్నీ మాయ చేస్తుంది
నవదీప్, స్నేహాఉల్లాల్ జంటగా రూపొందుతోన్న చిత్రం ‘అంతా నీ మాయలోనే’. పి.వి.కృష్ణ దర్శకుడు. వినోద్ సూర్యదేవర నిర్మాత. హైదరాబాద్ ఆర్‌ఎఫ్‌సీలో ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటోంది. ప్రత్యేక పాత్ర పోషిస్తున్న డా. రాజేంద్రప్రసాద్‌తో పాటు సహ నటులంతా ఈ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు.
‘‘నాకు హిట్ అవసరం అనుకునే సమయంలో ఈ అవకాశం వచ్చింది. ఇంటిల్లిపాదీ చూసేలా సినిమా ఉంటుంది. 70 శాతం టాకీ పూర్తయింది. వచ్చే నెలలో షూటింగ్ పూర్తవుతుంది. విజువల్ ఎఫెక్ట్స్‌తో తీసిన గీతం ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అని నవదీప్ చెప్పారు. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ తర్వాత తనకు మంచి గుర్తింపు తెచ్చే సినిమా అవుతుందని స్నేహాఉల్లాల్ అన్నారు.
రాజేంద్రప్రసాద్‌గారితో పనిచేయడం ఆనందంగా ఉందని బ్రహ్మాజీ అన్నారు. ఇంకా జయప్రకాష్‌రెడ్డి, ప్రగతి, శ్రీనివాసరెడ్డి, సత్యం రాజేష్, సత్యకృష్ణన్, శివన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి మాటలు: నివాస్, సంగీతం: స్వరాజ్.