Sneha Ullal
-
నీలి కళ్ల పోలిక.. ఈ హీరోయిన్ కెరీర్ కొంపముంచింది! (ఫొటోలు)
-
భవనమ్లో థ్రిల్
సప్తగిరి, ధనరాజ్, ‘షకలక’ శంకర్, అజయ్, మాళవికా సతీషన్, స్నేహా ఉల్లాల్ ముఖ్య తారలుగా రూ΄÷ందిన చిత్రం ‘భవనమ్’. బాలాచారి కూరెళ్ల దర్శకత్వంలో సూపర్ గుడ్ ఫిలిమ్స్ సమర్పణలో ఆర్బీ చౌదరి, వాకాడ అంజన్ కుమార్, వీరేంద్ర సీర్వి నిర్మించారు. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 9న విడుదల చేయనున్నట్లు బుధవారం యూనిట్ ప్రకటించింది. ‘‘సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో రూ΄÷ందించిన ఈ చిత్రంలో మంచి వినోదం ఉంది. కీలక తారాగణం పండించే కామెడీ బాగుంటుంది. అన్ని వర్గాలవారూ ఎంజాయ్ చేసేలా ఆసక్తికరమైన కంటెంట్‌తో తెరకెక్కించిన ‘భవనమ్’ మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం ఉంది’’ అని చిత్రబృందం పేర్కొంది. -
ఈమె హిట్ సినిమాల తెలుగు హీరోయిన్.. కానీ అదే పెద్ద మైనస్.. గుర్తుపట్టారా?
ఈమె తెలుగు హీరోయిన్. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడంతోనే సూపర్ హిట్ కొట్టింది. ఆ తర్వాత కొన్నాళ్లకు మరో సక్సెస్ అందుకుంది. బాగానే ఉందనుకునేలోపు వరస దెబ్బలు తగిలాయి. దీంతో స్టార్ హీరోయిన్ అవుతుందనుకుంటే ఛాన్సుల్లేక ఎదురుచూసే పరిస్థితికి వచ్చేసింది. ఈ బ్యూటీకి ప్రతిభతో పాటు అన్నీ ఉన్నాగానీ ఓ విషయం మాత్రం ఈమె కెరీర్‌కి మైనస్ అయిందని చెప్పొచ్చు. ఇంతలా చెప్పాం కదా ఈమె ఎవరో కనిపెట్టారా? లేదా చెప్పేయమంటారా? పైన ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ పేరు స్నేహా ఉల్లాల్. అవును మీరు గెస్ చేసింది కరెక్టే. అరబ్ దేశం ఒమన్‌లో పుట్టి పెరిగింది. అక్కడ చదువు పూర్తి చేసింది. ఆ తర్వాత తల్లితో కలిసి ముంబయిలో అడుగుపెట్టింది. మరి నక్క తోక తొక్కిందో ఏమో గానీ ఫస్ట్ ఫస్టే సల్మాన్ ఖాన్ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. అలా 'లక్కీ: నో టైమ్ ఫర్ లవ్' చిత్రంతో నటిగా మారింది. నటిగా పాజిటివ్ మార్క్స్ పడ్డాయి. కానీ హిట్ మాత్రం తెలుగు డెబ్యూతో దక్కింది. (ఇదీ చదవండి: కుర్చీ తాత అరెస్ట్.. అసలు నిజాలు బయటపెట్టిన యూట్యూబర్) 2007లో 'ఉల్లాసంగా ఉత్సాహంగా' సినిమాతో తెలుగులో అడుగుపెట్టిన స్నేహా ఉల్లాల్.. ఫస్ట్ మూవీతో అద్భుతమైన సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత 'కరెంట్' చిత్రంతోనూ ఆకట్టుకుంది. ఈ రెండు సినిమాల పర్లేదు గానీ.. నేను మీకు తెలుసా?, సింహా, అలా మొదలైంది, మడతా కాజా, యాక్షన్ త్రీడీ, అంతా నీ మాయలోనే తదితర చిత్రాలు మాత్రం అనుకున్నంత సక్సెస్ తీసుకురాలేకపోయాయి. ఈ మూవీస్ వల్ల వరస షాకులు తగిలాయి. మరోవైపు స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్లా నీలి కళ్లతో ఉంది అనే పోలిక కూడా ఈమెకు మైనస్ అయిందని చెప్పొచ్చు. సాధారణంగా ఏదైనా పోలిక ఉంటే.. మాట్లాడుకుంటారు తప్పితే ఛాన్సులైతే ఇవ్వరు. అలా ఆ పోలిక వల్ల పెద్దగా ఉపయోగమైతే జరగలేదు. ప్రస్తుతానికైతే ఈమె చేతిలో సినిమాలేం లేవు. దీంతో సొంత దేశానికి వెళ్లిపోయి.. తల్లిదండ్రులతో ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఉండిపోయింది. (ఇదీ చదవండి: సీరియల్ హీరోయిన్ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్) -
స్నేహ ఉల్లాల్ మనోజ్ తో రిలేషన్ పై కామెంట్స్
-
గోవాలో జూ.ఐశ్వర్యారాయ్.. రకుల్ స్పైసీ లుక్
బీచ్ వెకేషన్లో స్నేహా ఉల్లాల్ ఎంజాయ్ క్రేజీ ఔట్ఫిట్ తో హాట్నెస్ పెంచేసిన రకుల్ ఓర చూపులతో టెంప్ట్ చేస్తున్న తెలుగమ్మాయి జిగేలుమనే పోజుల్లో యంగ్ హీరోయిన్ మెహ్రీన్ బీచ్ ఒడ్డున బికినీలో రెచ్చిపోతున్న ఎల్లీ అవ్రామ్ డైమండ్ నెక్లెస్‌తో హనీరోజ్ పిచ్చెక్కించే లుక్ క్యూట్ పోజుల్లో బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ మాల్దీవుల్లో సోనాల్ చౌహాన్ గ్లాసు చాటు అందాలు పింక్ కలర్ స్కర్ట్‌లో ఐశ్వర్య మేనన్ అందాలు View this post on Instagram A post shared by Sneha Ullal (@snehaullal) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Shreya Dhanwanthary (@shreyadhan13) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Elli AvrRam (@elliavrram) View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) View this post on Instagram A post shared by Neha Sshetty (@iamnehashetty) View this post on Instagram A post shared by Sonam Kapoor Ahuja (@sonamkapoor) View this post on Instagram A post shared by Sonal Chauhan (@sonalchauhan) View this post on Instagram A post shared by ISWARYA MENON (@iswarya.menon) View this post on Instagram A post shared by Manushi Chhillar (@manushi_chhillar) View this post on Instagram A post shared by Tejaswi Madivada (@tejaswimadivada) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Hamsa Nandini (@ihamsanandini) -
‘వేగన్’న్యువరీ ఉద్యమం.. శాకాహారం తీసుకోవడం వల్ల కలిగే లాభాలు!
సమాజంలో చాలామందిలో మాంసాహారపు అలవాట్లు ఉన్నప్పటికీ... శాకాహారం ఆరోగ్యానికి మేలు చేస్తుందన్న భావన ఎప్పట్నుంచో ఉన్నదే. శాకాహార అలవాటు తాలూకు విప్లవంగా రూపొందిందే ఈ ‘వేగన్యువరీ’. జనవరి (జాన్యువరీ) లాగే ‘వేగన్’న్యువరీ అనే ఓ దీక్ష తీసుకుని నెల్లాళ్లపాటు శాకాహారపు అలవాటు పెంపొందించుకుని, అది మంచి ఫలితాలనే ఇస్తే దాన్నే కొనసాగించాలని కోరుతూ నడుస్తున్న ఉద్యమమే ఈ ‘వేగన్’న్యువరీ. దీని గురించి కొన్ని వివరాలు.... దాదాపు 2014 నుంచి ఈ వేగన్ ఉద్యమం కొనసాగుతున్నప్పటికీ మనదేశంలో మాత్రం ఇది అధికారికంగా 2021 డిసెంబరు 9న ప్రారంభమైంది. ప్రత్యేకత? ‘వేగన్’న్యువరీ అనే పేరుతో తొలుత భూతదయా, అటు తర్వాత మొక్కలనుంచే శాకాహారం తీసుకుంటూ మంచి ఆరోగ్యం పెంపొందించుకోవడం, జీవావరణాన్నీ, జీవవైవిధ్యాన్నీ కాపాడుకోవడం కోసం కృషి చేయడం వంటి కార్యకలాపాలతో ప్రపంచవ్యాప్తంగా ఈ ‘వేగన్’న్యువరీ ఉద్యమానికి మంచి ఆదరణే వస్తోంది. జనవరి మాసమంతా శాకాహారానికి మళ్లుతామంటూ ప్రతినబూనడమే ఈ ‘వేగన్’న్యువరీ మాసపు ప్రత్యేకత అన్నమాట. పెద్ద సంఖ్యలో చేరువవుతున్న ప్రజలు గతేడాది అంటే 2022లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6,20,000 మందికి పైగా ప్రజలు ఈ ఉద్యమానికి మద్దతిచ్చారు. కేవలం మాంసాహారంలోనే మంచి రుచులు అందుతాయనే వాదనను తోసిరాజంటూ... ఈ ఉద్యమాన్ని తారస్థాయికి తీసుకెళ్లడం కోసం శాకాహారాల్లో కొత్త కొత్త రుచులు అన్వేషిస్తున్నారు. దీనికి తార్కాణమే గతేడాది కొత్తగా అందుబాటులోకి వచ్చిన శాకాహార ఉత్పాదనలు! ఒక అంచనా ప్రకారం 2022లో దాదాపు 1,540 కొత్త శాకాహార ఉత్పాదనలు (వేగన్ ప్రాడక్ట్స్) అందుబాటులోకి వచ్చాయి. ‘వేగన్’న్యువరీ ఉద్యమానికి అత్యద్భుతంగా ప్రచారాలను కల్పించే ఆ శాకాహార ప్రాధాన్యానికి గతేడాది ప్రపంచవ్యాప్తంగా 4,351 మీడియా కథనాలు వెలువడ్డాయనేది మరో అంచనా. దీనికితోడు ఎన్నో కార్పొరేట్ సంస్థలు సైతం అనేక ప్రచార కార్యకలాపాల ద్వారా ఈ ఉద్యమానికి తోడు నిలుస్తున్నాయి. మన దేశానిది మూడోస్థానం... ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6.3 లక్షల మంది ఈ ఉద్యమంలో భాగస్వామ్యం తీసుకుంటే అందులో 65,000 మంది మన భారతీయులే. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడీ ప్రచార కార్యకలాపాల్లో 228 దేశాలు పాలుపంచుకుంటుండగా... వీటన్నింటిలో మన దేశం మూడో స్థానంలో ఉండటం కూడా ఓ విశేషం. మనకంటే ముందు స్థానంలో ఉన్న దేశాల్లో మొదటిది యునైటెడ్ కింగ్డమ్ (ఇంగ్లాండ్) కాగా... రెండోది యూఎస్ఏ. వీళ్లే మన దేశపు బ్రాండ్ అంబాసడర్లు... ఈ ఉద్యమపు పదో వార్షికోత్సవం సందర్భంగా మనదేశం నుంచి దాదాపు పదిమంది ప్రముఖులు ఈ క్యాంపైన్లో విస్తృతంగా పాలుపంచుకుంటున్నారు. వీరిలో ప్రముఖ నటి, బిగ్‌బాస్ ఫేమ్ సౌందర్యశర్మ, మరో ప్రముఖ నటుడు, ప్రో–బాస్కెట్‌బాల్ ఆటగాడు అరవింద్‌కృష్ణ, మ్యూజీషియన్, నటి మోనికా డోగ్రా, ప్రముఖ మౌంటెనీరింగ్ నిపుణురాలు ప్రకృతి వర్షిణీ, మరో మౌంటనీరింగ్ నిపుణుడు కుంతల్ జోయిషర్, ప్రో–టెన్నిస్ ఆటగాడు విశ్వజిత్ సాంగ్లే, గాయని అనుష్కా మన్‌చందా, మరో ప్రముఖ నటీమణులు స్నేహా ఉల్లాల్, సదా సయీద్ మన దేశం నుంచి ఈ ఉద్యమానికి బ్రాండ్ అంబాసిడర్లుగా, ప్రచారకులుగా వ్యవహరిస్తున్నారు. మరో వారంలో జనవరి అయిపోతోంది. కనీసం ఆఖరి వారంలో నైనా వేగన్యువరీని అనుసరిద్దాం. ఆరోగ్యమూ బాగుంటుంది ‘వేగనిజం’ అనేది ఓ సంస్కృతి. ఈ సంస్కృతితో మనం తోటి జీవులకు ఎలాంటి హానీ కలగకుండా చూడవచ్చు. అందుకే నేను శాకాహార ఉద్యమాన్ని సమర్థిస్తుంటాను. అంతేకాదు... శాకాహారం తీసుకోవడం వల్ల మన చర్మానికి మంచి నిగారింపు రావడంతో పాటు మన ఆరోగ్యమూ బాగుంటుంది. ఏ జీవికీ హాని లేకుండా మనమూ బతికి, ఇతరులనూ బతకనివ్వడం అనే భావనే ఎంతో ఉన్నతమైనదని నా ఉద్దేశం. – స్నేహా ఉల్లాల్,సినీ నటి. – సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
షాకిచ్చిన స్నేహా ఉల్లాల్, రకుల్ కష్టాలు, థ్యాంక్స్ చెప్పిన అరియాన
దసరా శుభాకాంక్షలు తెలిపిన శ్రియా సరన్, బిగ్‌బాస్ దివి, స్నేహా ఉల్లాల్, ఆదా శర్మ దుర్గమ్మ అవతారమెత్తిన అదా శర్మ సాయి ధరమ్ తేజ్‌కు బర్త్‌డే విషెస్ తెలిపిన వరుణ తేజ్, వరుణ్, సాయిల చిన్ననాటి ఫొటో వైరల్ బతకడం కోసం తినాలి అంటూ వీడియో షేర్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్ తాళిబోట్టు, సిందూరంతో షాకిచ్చిన స్నేహా ఉల్లాల్ View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by Ariaana & Viviana Manchu (@ariviviofficial) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Varun Tej Konidela (@varunkonidela7) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Sneha Ullal (@snehaullal) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Divi Vadthya (@actordivi) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Vishnu Manchu (@vishnumanchu) -
ఐశ్వర్యరాయ్‌కి జిరాక్స్ కాపీలా ఉంది కదూ..
ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాతో టాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది స్నేహా ఉల్లాల్. అచ్చం ఐశ్వర్యరాయ్‌లా కనిపించడం ఆమెకు మరింత ప్లస్ అయ్యింది. దీంతో అతి తక్కువ టైంలోనే తక్కువ టైంలో పాపులారిటీ సంపాదించుకుంది. జూనియర్ ఐశ్వర్యగా యూత్‌లో మంచి క్రేజ్‌ను సంపాదిందచుకుంది ఈ ముద్దుగుమ్మ. అయిలా కెరీర్ పరంగా మాత్రం ఈ అమ్మడికి అంతగా కలిసిరాలేదు. వివిధ భాషల్లో దాదాపు 20 వరకు సినిమాలు చేసినా అంతగా గుర్తింపు రాలేదు. దీంతో అడపాదడపా సినిమాలు చేస్తూ ముందుకెళ్తుంది ఈ భామ. తాజాగా స్నేహ ఉల్లాల్ షేర్ చేసిన ఓ ఫోటో ఆమెను మరోసారి వార్తల్లో నిలిచేలా చేసింది. బ్రైడల్ ఫోటో షూట్లో పాల్గొన్న స్నేహ ఉల్లాల్..నుదుటన పాపిట బిళ్ల, జుంకీలు, చేతి రింగ్‌తో అచ్చం జోధా అక్భర్‌లో ఐశ్వర్యరాయ్‌లా ఉంది. ఈ ఫోటోను స్నేహ ఉల్లాల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీంతో ఈ ఫోటో నెట్టింట తెగ వైరలవుతోంది. ఐశ్వర్యకు జిరాక్స్ కాపీలా ఉందే అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. స్నేహ ఉల్లాల్ ఇటీవలె ‘ఎక్స్పైరీ డేట్’ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. ఇటీవలె బ్యాక్‌లెస్ ఫోటోను షేర్ చేసి ఇది ‘నేను కాదు.. కానీ నేనే కావచ్చు’ అంటూ ఓ బ్లాక్ అండ్ వైట్ ఫోటోను షేర్ చేసిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Sneha Ullal (@snehaullal) చదవండి : ఛాన్స్ వస్తే ఆ హీరోతో డేటింగ్‌కు వెళ్తా : రష్మిక ప్రముఖ తెలుగు యాంకర్‌పై సోనూసూద్ ప్రశంసలు.. కారణమిదే.. -
బిగ్‌బాస్ గూటికి స్నేహా ఉల్లాల్
కరోనా వార్తలతో జడిసిపోతున్న జనాలు కూసింత వినోదాన్ని అందించే ప్రోగ్రాములవైపు దృష్టి సారిస్తున్నారు. దీంతో వారికి కావాల్సినంత సరుకు అందించేందుకు బిగ్‌బాస్ సిద్ధమవుతోంది. కొట్లాటలు, అలకలు, ఆటలు, సాహసాలు, సీక్రెట్లు, పాటలు, డ్యాన్సులు ఒకటేమిటి.. నవరసాలను ఒలికిస్తూ ప్రేక్షకుల మనసు దోచుకునేందుకు బిగ్‌బాస్ హిందీ 14వ సీజన్ రంగంలోకి దిగుతోంది. కరోనా టైంలో అసలు ఈ షో వస్తుందో లేదో అనుకునే సమయంలో టీజర్ వదిలి హైప్ క్రియేట్ చేశారు. ఈసారి కూడా సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుండగా ఆయనపై ముంబైలోని మెహబూబ్ స్టూడియోలో ఇదివరకే ప్రోమో చిత్రీకరించారు. దీన్ని ఆగస్టు 15న రిలీజ్ చేయనున్నారు. సెప్టెంబర్‌లో మొదలు కానున్న ఈ షోలో ఈసారి ఎవరెవరు పాల్గొంటారనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. (బిగ్‌బాస్ హౌస్‌లో 'ఓ బేబీ' నటి?) అయితే ఎప్పటిలాగానే ఈసారి కూడా టీవీ నటులపైనే ప్రధానంగా ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ఈసారి బిగ్‌బాస్ షోలో వివియాన్ సేన, సంగీతా ఘోష్, అలీషా పన్వార్, జై సోని, షాగున్ పాండే, విశాల్ రహేజా, డోనాల్ బిష్త్, షలీన్ భనోత్, షిరాన్ మిర్జా, నియా శర్మ, జాస్మిన్ భాసిన్ పాల్గొననున్నట్లు సమాచారం. వీరితో పాటు "ఉల్లాసంగా ఉత్సాహంగా" హీరోయిన్ స్నేహా ఉల్లాల్ కూడా బిగ్‌బాస్‌లో అడుగు పెట్టనున్నట్లు వినికిడి. అయితే ఇదే కంటెస్టెంట్ల లిస్టు చివరి నిమిషం వరకూ కొనసాగుతుందో లేదా అనేది సస్పెన్స్‌గా మారింది. ఇక ఎన్నో వివాదాలు రాజుకుని రక్తి కట్టిన బిగ్‌బాస్ 13 సీజన్లో అంతిమంగా సిద్ధార్థ్ శుక్లా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. (నీకు తోడుగా ఉంటా: బిగ్‌బాస్ రన్నరప్) -
బ్రహ్మానందం, స్నేహ ఉల్లాల్ ప్రచారం
సాక్షి, షోలాపూర్: తెలుగు ఓటర్లను ఆకట్టుకునేందుకు జాతీయ పార్టీలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నాయకులను ఎన్నికల ప్రచారంలోకి దింపాయి. ముంబైతోపాటు రాష్ట్రవ్యాప్తంగా తెలుగు ప్రజలు అత్యధికంగా ఉండే ప్రాంతాలలో పర్యటిస్తూ తమ తమ పార్టీల అభ్యర్థులను గెలిపించాలంటు కోరారు. శనివారం సాయంత్రం ఎన్నికల ప్రచార పర్వం ముగిసే వరకు అనేక మంది తమదైన శైలిలో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. ముఖ్యంగా మహారాష్ట్రలో అక్టోబరు 21వ తేదీ సోమవారం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ తెలంగాణకు చెందిన కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి కిషన్‌రెడ్డి, ఇతర బీజేపీ నాయకులు నటుడైన మాజీ మంత్రి బాబు మోహన్, నిజమాబాదు ఎంపి ధర్మపురి అరవింద్, ధరం గురువా రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డిలతోపాటు కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి, హస్య నటుడు బ్రహ్మానందం, సీతారాం ఏచూరి తదితర నాయకులు గత కొన్ని రోజులుగా ప్రచారం చేశారు. బై, భివండీలతోపాటు పశ్చిమ మహారాష్ట్రలని షోలాపూర్, పుణే మొదలగు ప్రాంతాలపై వీరు ప్రత్యేక శ్రద్ద చూపించారు. దీంతో తెలుగు వారుండే పలు ప్రాంతాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరుగుతున్న అనుభూతి కలిగిందని చెప్పవచ్చు. ఫ్లకార్డుల నుంచి వేదికపై బ్యానర్లు తదితరాలన్ని దాదాపు తెలుగులోనే దర్శనమిస్తున్నాయి. మహేశ్ కోటెకు మద్దతుగా బ్రహ్మానందం, స్నేహా ఉల్లాస్ షోలాపూర్ సిటీ సెంట్రల్ నియోజక వర్గం నుంచి పోటీచేస్తున్న శివసేన తిరుగుబాటు ఇండిపెండెంట్ అభ్యర్ధి మహేశ్ కోటేకు మద్దతుగా ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం, నటీ స్నేహా ఉల్లాస్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నిన్న మధ్యాహ్నం వీరిద్దరు పట్టణంలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని 70 ఫీట్ల రోడ్ నుంచి ప్రారంభమైన ఈ రోడ్ షో తుకారాం చౌక్, అశోక్ చౌక్, పద్మశాలి చౌక్, మౌలాలి చౌక్, సివిల్ కోర్టు మీదుగా సాగింది. సినీ నటీ నటులను చూసేందుకు జనాలు భారీగా తరలివచ్చారు. ఇండిపెండెంట్‌గా పోటీచేస్తున్న మన తెలుగు అభ్యర్ధి మహేశ్ కోటేను గెలిపించాలని ఇరువురు కోరారు. ముగిసిన ఎన్నికల ప్రచారం మహారాష్ట్రలో గత కొన్ని రోజులుగా వాడివేడిగా సాగిన ప్రచారపర్వం నిన్నటితో ’(శనివారం)తో ముగిసింది. చెదురుముదురు సంఘటనలు మినహా ప్రశాంతంగానే ప్రచారాలు ముగిశాయి. అక్టోబరు 21వ తేదీ జరగనున్న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో మొత్తం 288 అసెంబ్లీ నియోజకవర్గాలలో మొత్తం 8,97,62,706 మంది ఓటర్లున్నారు. ఇతర ఎన్నికల కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 95, 473 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనుండగా 1.8 లక్షల ఈవీఎంలను వినియోగించనున్నారు. ఈ సారి సుమారు 13 రోజులు మాత్రమే ప్రచారాలకు సమయం లభించింది. బహుముఖ పోటీ? రాష్ట్రంలో నియోజకవర్గాలన్నింటిలో త్రిముఖ, బహుముఖ పోటీ జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. గత సంవత్సరం ఒంటరిగా బరిలోకి దిగిన ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, ఎన్సీపీలు, శివసేన, బీజేపీల కూటమిగా పోటీ చేస్తున్నాయి. మరోవైపు వంచిత్ బహుజన్ ఆఘాడి, ఎమ్మెన్నెస్, ఎంఐఎం, ఎస్పీ, బీఎస్పీలతోపాటు ఇతర స్థానిక పార్టీలున్నాయి. ఇలాంటి నేపథ్యంలో దాదాపు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో త్రిముఖ, బహుముఖ పోటీ ఏర్పడింది. కొన్ని నియోజకవర్గాల్లో శివసేన, బీజేపీల కూటమి, కాంగ్రెస్, ఎన్సీపీల కూటమిల మధ్య ప్రధాన పోటీ జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. హామీల వర్షం.. అసెంబ్లీ ఎన్నికల కోసం రూపొందించిన వివిధ పార్టీల మేనిఫేస్టోలలో హామీల వర్షం కురిపిచాయి. అనేక అభివృద్ధి పనులు చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. స్వాతంత్ర వీర్ సావర్కర్‌కు భారతరత్న అవార్డు ఇవ్వనుండటంతో మరాఠ్వాడా కోసం వాటర్ గ్రిడ్ ఇతర మౌళిక సదుపాయాలు, రూ. 10కే భోజనం, రూ. 1 కే వైద్యకీయ పరీక్షలు మౌళిక సదుపాయాలు, సొంత ఇళ్లు, విద్యుత్ సమస్య, రైతుల సమస్యలు, రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర ప్రజల సంక్షేమం తదితరాలు మేనిఫేస్టోలలో పొందుపరిచారు. పెద్ద పార్టీగా అవతరించనున్న బీజేపీ? రాష్ట్రంలో అత్యధిక సీట్లను బీజేపీ కైవసం చేసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఎన్నికలకు ముందు చేసిన సర్వేలన్ని కూడా ఇవే చెబుతున్నాయి. గత కొంత కాలంగా రాష్ట్రంలో బీజేపీ బలోపేతమైంది. లోకసభ ఎన్నికల తర్వాత బీజేపీ కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నిండింది. దీంతో ఈసారి బీజేపీ మనోబలంపెరిగింది. మరోవైపు శివసేన రెండవ అతిపెద్ద పార్టీగా నిలుస్తుందని కొందరు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ ఈ సారి నాలుగో స్థానంలో నిలువగా ఎన్సీపీ రెండో స్థానంలో నిలుస్తుందని అంచనాలు వేశాయి. ప్రచారం చేసిన ప్రముఖులు.. రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది ప్రముఖులు ప్రచారం చేశారు. ప్రముఖ పార్టీల జాతీయ నాయకులు ప్రచార సభలు జరిగాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా, కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ, ఎన్సీపీ అధ్యక్షులు శరద్ పవార్ తదితర అనేక మంది పాల్గొన్న సభలకు ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. అయితే వీరందరు ఓట్లు ఎవరికి వేస్తారనేది వేచిచూడాల్సిందే. ఈ సారి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కోసం కాంగ్రెస్ జాతీయ నాయకులు దూరంగా ఉండటం అందరినీ విస్మయం కలిగించింది. రాహుల్ గాంధీ ముంబైలో ఒక సభలో పాల్గొన్నప్పటికీ సోనియాగాంధీ, ప్రియంకా గాంధీలు మాత్రం ఎక్కడా కానరాలేదు. ప్రచారానికి వారిద్దరు దూరం ఉండటం గమనార్హం. ఈ సారి ఎన్నికల్లో దివంగత బాల్ ఠాక్రే మనుమడైన యువసేన అధ్యక్షులు ఆదిత్య ఠాక్రే ముంబై వర్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. ఠాక్రే కుటుంబం నుంచి మొట్టమొదటిసారిగా ఆయన పోటీ చేస్తుండటం ఈ ఎన్నికల విశేషం. భారీ వర్షంలో శరద్ పవార్ సభ... సాతారాలో భారీ వర్షంలో కూడా ఎన్సీపీ అధ్యక్షులు శరద్ పవార్ సభ కొనసాగించడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయ అంశంగా మారింది. సుమారు 80 ఏళ్ల వయసులో కూడా ఆయన వర్షంలోను ఎలాంటి ఇబ్బంది లేకుండా మాట్లాడిన తీరు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. సాతారాలో శుక్రవారం రాత్రి సభలో శరద్ పవార్ ప్రసంగం ప్రారంభించగానే భారీ వర్షం ప్రారంభమైంది. అయితే అనేక మంది వర్షం కారణంగా సభలను రద్దు చేసుకోగా శరద్ పవార్ మాత్రం భారీ వర్షంలోనే సభ కొనసాగించారు. దీనిపై యువసేన అధ్యక్షులు ఆదిత్య ఠాక్రే స్పందించారు. తన తాత దివంగత బాల్ ఠాక్రే మిత్రులైన శరద్ పవార్ నుంచి నేర్చుకోవల్సింది చాలా ఉందన్నారు. మరోవైపు ఉక్కులాంటి నేతృత్వం మాకు లభించిందని అజిత్ పవార్‌ను కొనియాడారు. -
ఇలా జరగడం లైఫ్‌లో మొదటిసారి : స్నేహా ఉల్లాల్
ఉల్లాసంగా.. ఉత్సాహంగా, కరెంట్, సింహా చిత్రాలతో ఫేమస్ అయిన స్నేహా ఉల్లాల్.. వెండితెరపై కనిపించి చాలా కాలమవుతోంది. అయితే తాజాగా సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్‌తో స్నేహా ఉల్లాల్ మళ్లీ వార్తల్లోకెక్కింది. తాను మొదటిసారిగా ఆసుపత్రిలో చేరారని, ఇలా జరగడం ఇదే ప్రథమమని పేర్కొన్నారు. అంతేకాకుండా అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘జీవితంలో మొదటిసారి ఆసుపత్రి పాలయ్యాను. విపరీతమైన జ్వరంతో ఇబ్బంది పడుతున్నాను. ఎంతకీ తగ్గకపోవడంతో హాస్పిటల్ లో చేరాల్సి వచ్చింది. భయం అనిపించింది.. కానీ కొంత సమయం తర్వాత ఇప్పుడు కొంచెం బెటర్ గా ఫీల్ అవుతున్నాను. నన్ను ఎంత వీలైతే అంత విశ్రాంతి తీసుకోమని డాక్టర్లు చెప్పారు. అది బోరింగ్ గా ఉంటుంది కదా.. అయితే నాతో నెట్ ఫ్లిక్స్ ఉంది. నాపట్ల కేర్ తీసుకునే మనుషులు నాతో ఉన్నారు. వీలైనంత త్వరగా మళ్ళీ వర్క్ లైఫ్ లోకి రావాలనుకుంటున్నా.. మీ అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా’ అని సుదీర్ఘమైన పోస్ట్ చేశారు. View this post on Instagram So i was hospitalised for the first time in my life.I had a very high fever that wasn’t dying down despite multiple treatments.It was scary.BUT. After a while of terrible health , im finally a lil better.I have been asked to rest it out as much as possible.So thats going to be boring.But i have my Netflix and a bunch of very caring #foreverkindofpeople with me to keep me going.Cant wait to get back to work. I wish you all good health. A post shared by Sneha Ullal (@snehaullal) on Jun 2, 2019 at 4:46am PDT -
ప్రపంచం ఏమైతే నాకేంటి?
చరణ్‌తేజ్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఆయుష్మాన్ భవ’, స్నేహా ఉల్లాల్ కథానాయిక. ‘నేనులోకల్’ చిత్ర దర్శకుడు త్రినాథ్‌రావు నక్కిన కథ, దర్శకత్వ పర్యవేక్షణలో, దర్శకుడు మారుతి సహ నిర్మాతగా సి.టి.ఎఫ్ నిర్మాణ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రం చివరి షెడ్యూల్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా చరణ్ తేజ్ మాట్లాడుతూ–‘‘సమాజం ప్రేమను చూసే పద్ధతి మారాలి అనే కమర్షియల్ పాయింట్‌తో తెరకెక్కుతోన్న చిత్రమిది. ప్రేమించిన అమ్మాయి కులం, మతం వేరైతే మర్చిపోవాలా? పారిపోవాలా? చచ్చిపోవాలా? ప్రపంచం ఏమైతే నాకేంటి. సమాజం ప్రేమను చూసే విధానం మారాలి.. లేదంటే చంపేస్తా. అనుకునే హీరో క్యారెక్టర్‌తో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమా ద్వారా స్నేహా ఉల్లాల్ టాలీవుడ్‌కి రీ ఎంట్రీ ఇస్తున్నారు. మరో తెలుగు టాప్ హీరోయిన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. పరుచూరి బ్రదర్స్, త్రినాథ్‌రావు నక్కిన స్క్రీన్‌ప్లే బాగుంటుంది. నవంబర్ 9న సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మీట్ బ్రోస్, కెమెరా: దాసరధి శివేంద్ర, అసోసియేట్ ప్రొడ్యూసర్స్ : బి.ఏ.శ్రీనివాసరావు, హేమరత్న. -
పారిపోవాలా? చచ్చిపోవాలా?
చరణ్ తేజ్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆయుష్మాన్ భవ’. స్నేహా ఉల్లాల్ కథానాయిక. ‘నేను లోకల్’ చిత్రదర్శకుడు త్రినాథ్‌రావు నక్కిన కథ అందించడంతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. దర్శకుడు మారుతి సహ నిర్మాతగా సి.టి.ఎఫ్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ నెల 21న రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు 75వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా చరణ్ తేజ్ మాట్లాడుతూ– ‘‘ప్రేమించిన అమ్మాయి కులం, మతం వేరైతే మర్చిపోవాలా? పారిపోవాలా? చచ్చిపోవాలా? ప్రపంచం ఏమైతే నాకేంటి? సమాజం ప్రేమని చూసే విధానం మారాలి.. లేకపోతే చంపేస్తా.. అనుకునే హీరో క్యారెక్టరైజేషన్‌తో ఈ చిత్రం తెరకెక్కింది. ఫస్ట్ లుక్ పోస్టర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ మీట్ అందించిన ఆడియోను యూత్ ఎంజాయ్ చేస్తున్నారు’’ అన్నారు. హుజన్, పరుచూరి వెంకటేశ్వరావు, రంగరాజన్, అశ్విన్, నిఖిత నటించిన ఈ చిత్రానికి అసోసియేట్ ప్రొడ్యూ సర్స్: బి.ఏ.శ్రీనివాసరావు, హేమరత్న, కథనం: పరుచూరి బ్రదర్స్, కెమెరా: దాశరథి శివేంద్ర. -
పారిపోతే పిరికితనం
‘‘మనకి నచ్చిన అబ్బాయి మనవాళ్లకి నచ్చకపోతే ప్రాబ్లమ్ వాళ్ళది.. దానికి మనం ఎందుకు సూసైడ్ చేసుకోవాలి? తప్పు.. అలా అని పారిపోతే పిరికితనం.. ఓడిపోతే చేతకానితనం... ఇదే జీవితమా?’’ అనే మాటలు ‘ఆయష్మాన్‌భవ’ చిత్రంపై ఆసక్తి పెంచుతున్నాయి. చరణ్ తేజ్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆయష్మాన్‌భవ’. దర్శకుడు త్రినాథ్‌రావు నక్కిన కథ అందించి, దర్శకత్వ పర్యవేక్షణ చేయగా, మరో దర్శకుడు మారుతి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. స్నేహా ఉల్లాల్ ఓ కథానాయిక. మరో హీరోయిన్ హుజన్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రంలో ఆమె చేసిన సారా పాత్ర మొదటి లుక్ విడుదల చేశారు.ఆ పోస్టర్లోనే పై విధంగా రాశారు. చరణ్ తేజ్ మాట్లాడుతూ– ‘‘సమాజం ప్రేమని చూసే పద్ధతి మారాలి’ అనే కమర్షియల్ పాయింట్‌తో తెరకెక్కించిన చిత్రమిది. మా చిత్రానికి పరుచూరి బ్రదర్స్ చక్కని కథ ఇచ్చారు. బాలీవుడ్ సంగీత దర్శకుడు మీట్ బ్రోస్ అద్భుతమైన సంగీతం అందించారు. ఈ వేసవిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి ప్రొడక్షన్ హౌస్ అండ్ ప్రొడ్యూసర్: సి.టి.ఎఫ్, అసోసియేట్ ప్రొడ్యూసర్స్: బి.ఎ.శ్రీనివాసరావు, హేమరత్న, కెమెరా: దాశరథి శివేంద్ర. -
ప్రపంచం ఏమైతే నాకేంటి?
చరణ్ తేజ్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆయుష్మాన్ భవ’. స్నేహా ఉల్లాల్ కథానాయిక. సి టి.ఎఫ్ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా మొదటి లుక్‌ని విడుదల చేశారు. చరణ్ తేజ్ మాట్లాడుతూ– ‘‘ప్రేమించిన అమ్మాయి కులం, మతం వేరైతే మర్చిపోవాలా? పారిపోవాలా? చచ్చిపోవాలా? ప్రపంచం ఏమైతే నాకేంటి? సమాజం ప్రేమని చూసే విధానం మారాలి.. లేకపోతే చంపేస్తా’.. అనుకునే హీరో క్యారెక్టరైజేషన్‌తో ఈ చిత్రం తెరకెక్కింది. మా చిత్రానికి ఇంత మంచి కథ అందించటంతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్న దర్శకుడు త్రినాథ్‌రావు నక్కినగారికి, స్క్రీన్‌ప్లే అందించిన రచయితలు పరుచూరి బ్రదర్స్‌కి, సహనిర్మాతగా వ్యవహరిస్తున్న దర్శకుడు మారుతిగారికి ధన్యవాదాలు. బాలీవుడ్ సంగీత దర్శకుడు మీట్ బ్రోస్ పాటలు ఆకట్టుకుంటాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ వేసవిలో విడుదల కానున్న మా సినిమా అన్నివర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుందని నమ్ముతున్నాం’’ అన్నారు. హుజన్, పరుచూరి వెంకటేశ్వర రావు, రంగరాజన్, అశ్విన్, నిఖిత తదితరులు నటించిన ఈ చిత్రానికి అసోసియేట్ ప్రొడ్యూసర్స్: బి.ఎ. శ్రీనివాసరావు, హేమ రత్న, కెమెరా: దాసరది శివేంద్ర. -
వైశాలి... ఫిగర్ అదిరింది
ధనలక్ష్మీ గుర్తుందా? అదేనండి... ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ సినిమాలో ఈ పేరుతోనే హీరోయిన్గా పరిచయమయ్యారు స్నేహా ఉల్లాల్. ఆ సినిమా తర్వాత ‘నేను మీకు తెలుసా’, ‘సింహా’, ‘అలా... మొదలైంది’, ‘మడత కాజా’, యాక్షన్ 3డీ’ వంటి చిత్రాల్లో నటించిన ఈ తేనెకళ్ల సుందరి కొన్ని కారణాల వల్ల సిల్వర్ స్క్రీన్కు దూరమయ్యారు. ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ తర్వాత ‘ఆయుష్మాన్ భవ’ సినిమాతో తెలుగు తెరపై మరోమారు మెరవనున్నారు. సోమవారం ఆమె పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం సినిమాలోని పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ‘‘ఏంటి? వైశాలి అంటే ట్రెడిషనల్ అనుకుంటున్నారా..? పిచ్చ పోష్! ఫిగర్ అదరిపోద్ది’’ అని ఈ పోస్టర్‌పై ఉండటం విశేషం. సో.. ఈ సినిమాలో స్నేహా ఉల్లాల్ పేరు వైశాలి అని అర్థమైంది కదా. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది మంచి హిట్స్‌లో ఒకటి నిలిచిన నాని ‘నేను లోకల్’ దర్శకుడు త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తారన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో ‘సాక్షి’ ఆయన్ను సంప్రదించగా ‘‘ఈ సినిమాతో నాకు ఎటువంటి సంబంధం లేదు. హీరో రామ్‌తో ఓ లవ్‌స్టోరీ సినిమా చేయనున్నాను. ఫిబ్రవరిలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు త్రినాథరావు. -
అందుకే బ్రేక్ తీసుకున్నా!
ఐశ్వర్యా రాయ్‌కి సిస్టర్ ఏమో అన్నట్లుగా స్నేహా ఉల్లాల్ ఉంటారు. అయితే ఐష్‌కీ, తనకూ ఎలాంటి రిలేషన్ లేదని ఈ తేనెకళ్ల సుందరి తెలుగులో తొలి సినిమా ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ చేసినప్పుుడే క్లారిఫై చేశారనుకోండి. ఆ తర్వాత టాలీవుడ్లో పలు చిత్రాల్లో నటించిన స్నేహా మూడేళ్లుగా కనిపించడంలేదు. ఎలాగూ హిందీ అమ్మాయి కాబట్టి, అక్కడ సినిమాలు చేస్తున్నారేమోనని చాలామంది అనుకున్నారు. కానీ, స్నేహా ఉల్లాల్ కెమెరా జోలికి వెళ్లలేదు. విషయం ఏంటంటే... అనారోగ్యం బారిన పడ్డారట. దీని గురించి స్వయంగా స్నేహా ఉల్లాలే చెప్పారు. ‘‘ఒంట్లో బాగా లేకపోవడంతో ఆస్పత్రికి వెళ్లి, చెక్ చేయించుకున్నా. టెస్టులన్నీ చేశాక నేను ‘ఆటోఇమ్యూన్ డిజార్డర్’తో బాధపడుతున్నానని డాక్టర్లు చెప్పారు. నా రోగ నిరోధక శక్తే నాకు ప్రతికూలంగా మారేలా చేసే రుగ్మత అన్నమాట. ఇది రక్తానికి సంబంధించిన జబ్బు’’ అని స్నేహా ఉల్లాల్ అన్నారు. ఇంకా ఆమె మాట్లాడుతూ – ‘‘ఈ రుగ్మత వల్ల నేను బలహీనమైపోయా. కంటిన్యూస్‌గా అరగంట నిలబడలేని పరిస్థితి. అయినా సినిమాలు చేశా. దాంతో ఇంకా వీక్ అయిపోయాను. ఒకానొక దశలో పరిగెత్తడం, డ్యాన్స్ చేయడం... ఇవన్నీ చేయలేకపోయా. దాంతో బ్రేక్ తీసుకుని, మందులు వాడుతూ, తగినంత విశ్రాంతి తీసుకున్నా. ఫైనల్‌గా నా ఆరోగ్య సమస్య సాల్వ్ అయింది. ఇక సినిమాలు చేయాలనుకుంటున్నా. అయితే ‘కమ్‌బ్యాక్’ అంటే ఇష్టపడను. ఎందుకంటే, కావాలని సినిమాలను వదిలేసి, మళ్లీ వస్తే అది ‘కమ్‌బ్యాక్’ అవుతుంది. నేను జస్ట్ బ్రేక్ తీసుకున్నా’’ అన్నారు. -
క్రిస్ గేల్.. స్నేహా ఉల్లాల్...
విధ్వంసానికి పరాకాష్ట క్రిస్‌గేల్ బుధవారం జరిగిన టీ20 మ్యాచ్ లో సెంచరీ కొట్టిన తరువాత స్టేడియంలో వేసిన స్టెప్పులు క్రికెట్ అభిమానులు అంత తేలిగ్గా మర్చిపోయేవి కావు. సహచరులంతా కలిసి గేల్ ను అనుకరిస్తూ రెస్ట్ రూంలో హంగామా సృష్టించారు. స్టేడియంలో అభిమానులకి పరిచయం చేసిన ఆ సరికొత్త స్టెప్ బ్రేవో డీజెగా మారి కంపోజ్ చేసిన 'చాంపియన్' పాటకు సంబంధించింది. ప్రస్తుతం గేల్ ఇంట్రడ్యూస్ చేసిన 'చాంపియన్' స్టెప్ కుర్రకారుని ఉర్రూతలూగిస్తుంది. మ్యాచ్ కంటే ముందే బ్రేవో, గేల్ కలిసి ఓ పార్టీలో చాంపియన్ పాటకు డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశారు. వీరికి నటి స్నేహా ఉల్లాల్ కూడా తోడవడంతో పార్టీ పీక్స్‌కు చేరింది. సల్మాన్ ఖాన్ సహకారంతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన స్నేహా ఉల్లాల్ ఈ మధ్యకాలంలో సినిమాల్లో కనిపించింది తక్కువే. అయితే తాజాగా గేల్ తో కలిసి స్నేహా పార్టీలో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. టి20ల్లో తను ఎంత ప్రమాదకరమో క్రిస్ గేల్ (48 బంతుల్లో 100 నాటౌట్; 5 ఫోర్లు, 11 సిక్సర్లు) మరోసారి నిరూపించాడు. కళ్ల ముందు భారీ లక్ష్యం ఉన్నా... పూనకం వచ్చినోడిలా ఇంగ్లిష్ బౌలర్ల భరతం పట్టాడు. సిక్సర్లు, బౌండరీల వర్షం కురిపిస్తూ టి20 ప్రపంచకప్‌లో అజేయ సెంచరీ నమోదు చేశాడు. ఫలితంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో కరీబియన్ జట్టు 6 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన విషయం తెలిసిందే. -
డిసెంబర్ 18న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు రాజ్యలక్ష్మి (నటి), స్నేహా ఉల్లాల్ (హీరోయిన్) ఈ రోజు పుట్టిన తేదీ 18. ఇది కుజసంబంధమైనది కాబట్టి జన్మతః నాయకత్వ లక్షణాలు, దేహదారుఢ్యం కలిగి, పోలీసు, మిలిటరీ రంగాలలో ఉద్యోగాలు సంపాదిస్తారు. పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. పరిశ్రమలు స్థాపిస్తారు. భూ వ్యవహారాలలో విజయం సాధిస్తారు. గత సంవత్సరం ప్రారంభించిన వ్యాపారాలు లాభాల బాటలో పడతాయి. రాజకీయ నాయకులకు పదవులు లభిస్తాయి. ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 2. ఇది చంద్రసంఖ్య కావడం వల్ల వీరు జన్మతః అందాన్ని, మంచి ఊహాశక్తిని కలిగి ఉంటారు. అయితే ఈ సంవత్సరం కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టకుండా, గతంలో చేపట్టిన వృత్తి ఉద్యోగ వ్యాపారాలనే కొనసాగించడం మంచిది. అలాగే స్థిరాస్తి విక్రయంలో పునరాలోచన మంచిది. తల్లి లేదా భార్య తరఫు వారి నుంచి సహాయ సహకారాలు అందుతాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో కొత్త ఐడియాలు ప్రదర్శించి లాభపడతారు. లక్కీ డేస్: 1,3,5,6,8, 9; లక్కీ కలర్స్: ఎల్లో, పర్పుల్, వైట్, క్రీమ్, రోజ్, ఆరంజ్, రెడ్; లక్కీ డేస్: సోమ, మంగళ, బుధ, శుక్రవారాలు. సూచనలు: మాట లు, చేతలలో సంయమనం పాటించడం, దుర్గాదేవిని పూజించడం, తల్లిని, తత్సమానురాలైన వారిని ఆదరించడం, రక్తదానం, శివుడికి అభిషేకం చేయడం మంచిది. వాహనాలు నడిపేటప్పుడు, పదునైన ఆయుధాలను ఉపయోగించేటప్పుడు జాగ్రత్త అవసరం. - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ -
285 ఏళ్ల క్రితం మహిళగా...
కేజ్రీ అనే చెట్లను కాపాడటం కోసం మహారాజుని సైతం ఎదిరించిన వీర మహిళ ‘అమృతా దేవి’. ఆమె ఇప్పటి మహిళ కాదు. 1730లో జోథ్‌పూర్‌లోని కెజార్లీ అనే గ్రామానికి చెందిన మహిళ ఆమె. కేజ్రీ చెట్లును నరకడం భరించలేక తన ప్రాణాలు సైతం వదులుకున్నారు. ఆమెతో పాటు ఆమె ముగ్గురు కూతుళ్లూ, ఆ గ్రామానికి చెందిన 363 మంది సైతం ప్రాణ త్యాగం చేశారు. 1730లో జరిగిన వాస్తవ సంఘటన ఇది. ఈ సంఘటన ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘సాకో 363’. ఇందులో అమృతాదేవి పాత్రను స్నేహా ఉల్లాల్ చేస్తున్నారు. అంటే.. 285 ఏళ్ల క్రితం నాటి మహిళగా స్నేహా కనిపిస్తారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కల్యాణ్ సీరివి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన అధిక శాతం షూటింగ్‌ను రాజస్తాన్‌లోనే జరుపుతారు. అమృతా దేవి పాత్ర చేయడం ఓ సవాల్ అనీ, ఒక మంచి చిత్రంలో నటిస్తున్నప్పుడు ఆనందం దానంతట అది కలుగుతుందనీ స్నేహా పేర్కొన్నారు. -
ఈసారి... లేడీ డాన్‌గా!
తేనెకళ్ల సుందరి స్నేహా ఉల్లాల్ ఇప్పటివరకూ పోషించిన పాత్రలకు పూర్తి భిన్నంగా గ్యాంగ్‌స్టర్‌గా నటించనున్నారు. అయితే ఇది తెలుగులో కాదు.. హిందీలో. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఘరానా దొంగ బబ్లూ శ్రీవాత్సవ జీవితం ఈ చిత్రానికి ఆధారం. ఇందులో ఉత్కంఠ రేపే యాక్షన్ సన్నివేశాలు పుష్కలమట. షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని స్నేహా ఉల్లాల్ ఎదురుచూస్తున్నారు. -
చుక్కేశానంటున్న చక్కనమ్మ
చూసేందుకు అచ్చం ఐశ్వర్యారాయ్లాగే ఉండి.. తెలుగు ప్రేక్షకులను కొన్నాళ్ల పాటు ఆకట్టుకున్న స్నేహా ఉల్లాల్.. కెరీర్లో పెద్దగా సాధించిన విజయాలు లేవు. చాలా సినిమాల్లో చేసినా కూడా ఇప్పుడు ఆమె చెప్పుకోడానికి అంటూ పెద్ద పాత్రలు కూడా లేవు. ఇప్పుడు చేతిలో ఛాన్సులు కూడా అంతగా లేవు. అయితే.. ఎలాగైనా వార్తల్లో నిలవాలన్న తపన మాత్రం స్నేహా ఉల్లాల్‌కు బాగానే ఉన్నట్లుంది. అందుకే ఈ చక్కనమ్మ సరదాగా ఓ చుక్కేస్తూ.. ఫొటోలకు పోజులిచ్చింది. తన కుటుంబ సభ్యులతో కలిసి ఓ ఫైవ్‌స్టార్ హోటల్లో ఆమె సరదాగా గడుపుతున్నప్పుడే ఈ ఫొటో తీసినట్లు సమాచారం. తొలిసారి ఆమె షాంపేన్ తాగింది. ఈ విషయాన్ని స్వయంగా తన ట్విట్టర్లో కూడా తెలిపింది. ''తొలిసారి ఆల్కహాల్ తీసుకున్నా. ఇదే నా తొలి గ్లాసు. చాలా గర్వంగా ఉంది. ఇది షాంపేన్'' అని ఆమె ట్విట్టర్లో రాశారు. -
గాడ్‌ఫాదర్ ఆశీస్సులతో...
తొలిచూపులోనే అందరి దృష్టినీ ఆకర్షించిన తార స్నేహా ఉల్లాల్. తొమ్మిదేళ్ల క్రితం ‘లక్కీ’ సినిమాతో తెరంగేట్రం చేశారామె. ఆ సినిమా సమయంలో అందరూ ఆమెను నిజంగా లక్కీ అన్నారు. ఐశ్వర్యారాయ్ పోలికలుండటం ఓ లక్. సల్మాన్‌ఖాన్ లాంటి సూపర్‌స్టార్ గాడ్‌ఫాదర్ అవ్వడం మరో లక్. తొలి సినిమాకే ఎక్కడలేని ప్రచారం లభించడం ఇంకో లక్. ఇలా స్నేహకు అన్నీ లక్కులే అన్నారంతా. తీరా సినిమా విడుదలయ్యాక ఆమెకు లక్ అంతగా కలిసి రాలేదు. ఇక చేసేది లేక దక్షిణాది బాట పట్టారామె. ఇక్కడ కూడా అర కొర విజయాలే దక్కడంతో మళ్లీ ముంబై చేరుకున్నారామె. ఇటీవల సల్మాన్... ‘బెల్లీ డాన్స్ నేర్చుకో.. నీ కెరీర్‌కి అది బాగా ఉపయోగపడుతుంది’ అని స్నేహకు ఓ సలహా ఇచ్చారట. గాడ్‌ఫాదర్ మాటను పాటిస్తూ ‘బెల్లీ డాన్స్’లో ప్రావీణ్యం సంపాదించి, సల్మాన్‌ని కలిశారట స్నేహా ఉల్లాల్. ఆమెలోని పట్టుదల సల్మాన్‌ని కట్టిపడేసిందట. తత్ఫలితంగానే... ‘బేజుబాన్’ అనే సినిమాలో కథానాయికగా నటించే బంపర్ ఆఫర్ స్నేహను వరించింది. వచ్చే వారమే ఈ సినిమా సెట్స్‌కి వెళ్లనుందట. ఇది అద్భుతమైన ప్రేమకథ అని, ఈ అవకాశం రావడానికి కారకుడైన తన గాడ్‌ఫాదర్ సల్మాన్‌కి కృతజ్ఞతలని తెగ సంబరపడిపోతోంది స్నేహా ఉల్లాల్. మరి స్నేహ బాలీవుడ్ కెరీర్ ఎలా ఉంటుందో చూడాలి. -
భీమిలి ఓటర్ లిస్టులో సినీనటి స్నేహ ఉల్లాల్
-
మళ్లీ సొంతగూటికి చేరిన సుందరి
-
అందర్నీ మాయ చేస్తుంది
నవదీప్, స్నేహాఉల్లాల్ జంటగా రూపొందుతోన్న చిత్రం ‘అంతా నీ మాయలోనే’. పి.వి.కృష్ణ దర్శకుడు. వినోద్ సూర్యదేవర నిర్మాత. హైదరాబాద్ ఆర్ఎఫ్సీలో ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటోంది. ప్రత్యేక పాత్ర పోషిస్తున్న డా. రాజేంద్రప్రసాద్‌తో పాటు సహ నటులంతా ఈ షూటింగ్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. ‘‘నాకు హిట్ అవసరం అనుకునే సమయంలో ఈ అవకాశం వచ్చింది. ఇంటిల్లిపాదీ చూసేలా సినిమా ఉంటుంది. 70 శాతం టాకీ పూర్తయింది. వచ్చే నెలలో షూటింగ్ పూర్తవుతుంది. విజువల్ ఎఫెక్ట్స్‌తో తీసిన గీతం ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అని నవదీప్ చెప్పారు. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ తర్వాత తనకు మంచి గుర్తింపు తెచ్చే సినిమా అవుతుందని స్నేహాఉల్లాల్ అన్నారు. రాజేంద్రప్రసాద్‌గారితో పనిచేయడం ఆనందంగా ఉందని బ్రహ్మాజీ అన్నారు. ఇంకా జయప్రకాష్‌రెడ్డి, ప్రగతి, శ్రీనివాసరెడ్డి, సత్యం రాజేష్, సత్యకృష్ణన్, శివన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి మాటలు: నివాస్, సంగీతం: స్వరాజ్. -
అంతా నీ మాయలోనే మూవీ స్టిల్స్
-
స్నేహా ఉల్లాల్‌కు సల్మాన్ సాయం!
అచ్చం అలనాటి అందాల నటి మందాకినిలా, కొన్ని యాంగిల్స్‌లో ఐశ్వర్యా రాయ్లా కూడా ఉండి, తెలుగులో సింహా, ఉల్లాసంగా ఉత్సాహంగా లాంటి సినిమాలతో కొద్దిపాటి హిట్లు సాధించి.. ఇప్పుడు అంతగా మార్కెట్ లేని స్నేహా ఉల్లాల్.. ఇప్పుడు బాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. తొలిసారి హిందీలో ఆమెకు అవకాశం కల్పించిన బాలీవుడ్ బ్రహ్మచారి సల్మాన్‌ఖానే ఇప్పుడు కూడా ఆమెకు మరో చాన్సు ఇస్తున్నాడు. 'లక్కీ.. నో టైం టు లవ్' అనే చిత్రంలో స్నేహా ఉల్లాల్ తొలిసారి హిందీతెరపై కనిపించింది. అయితే ఆ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తాపడింది. లక్కీ సినిమా నాటినుంచే సల్మాన్ ఖాన్ తనతో టచ్‌లోనే ఉన్నారని, అప్పటికి సినిమాలంటే తనకు భయం పోలేదు గానీ ఇప్పుడైతే బాగా అనుభవం వచ్చింది కాబట్టి, ఇప్పుడు మరోసారి బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధంగా ఉన్నానని స్నేహా ఉల్లాల్ చెప్పింది. సినిమాల్లో బాగా ఆకర్షణీయంగా కనిపించాలని సల్మాన్ చెప్పాడని, జిమ్ ఎలా చేయాలో చెప్పడమే కాక, బెల్లీ డాన్సు కూడా నేర్చుకోవాలని సూచించాడని తెలిపింది. ఇప్పటికి కొన్ని తెలుగు సినిమాల్లో నటించిన అనుభవం ఉంది కాబట్టి, ఇక మీదట సినిమాలు ఎంచుకునేటప్పుడ జాగ్రత్తగా వ్యవహరిస్తానని చెబుతోంది. ఈసారి ఎలాంటి పొరపాట్లు చేయబోనని అంటోంది. అయితే ప్రస్తుతానికి సల్మాన్‌తో కలిసి నటించడానికి మాత్రం ఎలాంటి అవకాశం లేదని ఆమె చెప్పింది.