స్నేహా ఉల్లాల్కు సల్మాన్ సాయం! | Salman khan guiding Sneha Ullal for second stint in Bollywood | Sakshi
Sakshi News home page

స్నేహా ఉల్లాల్కు సల్మాన్ సాయం!

Published Tue, Jan 28 2014 4:37 PM | Last Updated on Wed, Apr 3 2019 7:03 PM

స్నేహా ఉల్లాల్కు సల్మాన్ సాయం! - Sakshi

స్నేహా ఉల్లాల్కు సల్మాన్ సాయం!

అచ్చం అలనాటి అందాల నటి మందాకినిలా, కొన్ని యాంగిల్స్లో ఐశ్వర్యా రాయ్లా కూడా ఉండి, తెలుగులో సింహా, ఉల్లాసంగా ఉత్సాహంగా లాంటి సినిమాలతో కొద్దిపాటి హిట్లు సాధించి.. ఇప్పుడు అంతగా మార్కెట్ లేని స్నేహా ఉల్లాల్.. ఇప్పుడు బాలీవుడ్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. తొలిసారి హిందీలో ఆమెకు అవకాశం కల్పించిన బాలీవుడ్ బ్రహ్మచారి  సల్మాన్ఖానే ఇప్పుడు కూడా ఆమెకు మరో చాన్సు ఇస్తున్నాడు. 'లక్కీ.. నో టైం టు లవ్' అనే చిత్రంలో స్నేహా ఉల్లాల్ తొలిసారి హిందీతెరపై కనిపించింది. అయితే ఆ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తాపడింది.

లక్కీ సినిమా నాటినుంచే సల్మాన్ ఖాన్ తనతో టచ్లోనే ఉన్నారని, అప్పటికి సినిమాలంటే తనకు భయం పోలేదు గానీ ఇప్పుడైతే బాగా అనుభవం వచ్చింది కాబట్టి, ఇప్పుడు మరోసారి బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధంగా ఉన్నానని స్నేహా ఉల్లాల్ చెప్పింది. సినిమాల్లో బాగా ఆకర్షణీయంగా కనిపించాలని సల్మాన్ చెప్పాడని, జిమ్ ఎలా చేయాలో చెప్పడమే కాక, బెల్లీ డాన్సు కూడా నేర్చుకోవాలని సూచించాడని తెలిపింది. ఇప్పటికి కొన్ని తెలుగు సినిమాల్లో నటించిన అనుభవం ఉంది కాబట్టి, ఇక మీదట సినిమాలు ఎంచుకునేటప్పుడ జాగ్రత్తగా వ్యవహరిస్తానని చెబుతోంది. ఈసారి ఎలాంటి పొరపాట్లు చేయబోనని అంటోంది. అయితే ప్రస్తుతానికి సల్మాన్తో కలిసి నటించడానికి మాత్రం ఎలాంటి అవకాశం లేదని ఆమె చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement