
చరణ్ తేజ్, స్నేహా ఉల్లాల్
చరణ్ తేజ్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆయుష్మాన్ భవ’. స్నేహా ఉల్లాల్ కథానాయిక. ‘నేను లోకల్’ చిత్రదర్శకుడు త్రినాథ్‌రావు నక్కిన కథ అందించడంతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. దర్శకుడు మారుతి సహ నిర్మాతగా సి.టి.ఎఫ్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ నెల 21న రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు 75వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయనున్నారు.
ఈ సందర్భంగా చరణ్ తేజ్ మాట్లాడుతూ– ‘‘ప్రేమించిన అమ్మాయి కులం, మతం వేరైతే మర్చిపోవాలా? పారిపోవాలా? చచ్చిపోవాలా? ప్రపంచం ఏమైతే నాకేంటి? సమాజం ప్రేమని చూసే విధానం మారాలి.. లేకపోతే చంపేస్తా.. అనుకునే హీరో క్యారెక్టరైజేషన్‌తో ఈ చిత్రం తెరకెక్కింది. ఫస్ట్ లుక్ పోస్టర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ మీట్ అందించిన ఆడియోను యూత్ ఎంజాయ్ చేస్తున్నారు’’ అన్నారు. హుజన్, పరుచూరి వెంకటేశ్వరావు, రంగరాజన్, అశ్విన్, నిఖిత నటించిన ఈ చిత్రానికి అసోసియేట్ ప్రొడ్యూ సర్స్: బి.ఏ.శ్రీనివాసరావు, హేమరత్న, కథనం: పరుచూరి బ్రదర్స్, కెమెరా: దాశరథి శివేంద్ర.
Comments
Please login to add a commentAdd a comment