charan teja
-
నిఖిల్‌ని చూసి గర్వపడుతున్నా
‘‘స్పై థ్రిల్లర్ సినిమాలు తీయడం అంత సులభం కాదు.. అది ఒక సవాల్. ఎందుకంటే ఇలాంటి హాలీవుడ్ సినిమాలను ఓటీటీల్లో చూసేస్తున్నారు. కానీ, ‘స్పై’ టీజర్, ట్రైలర్ చూశాక చాలా బాగా అనిపించింది. అంతర్జాతీయ స్థాయి విలువలకు ఏ మాత్రం తగ్గలేదు. రాజశేఖర్, చరణ్ తేజ్‌ల ప్యాషన్ ఏంటో తెలుస్తోంది. ఈ సినిమా ఘన విజయం సాధించాలి’’ అని హీరో నాగచైతన్య అన్నారు. నిఖిల్ సిద్ధార్థ్, ఐశ్వర్యామీనన్ జంటగా గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘స్పై’. ఈడీ ఎంటర్టైన్ మెంట్స్‌పై కె.రాజశేఖర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా రేపు(గురువారం) విడుదలకానుంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన నాగచైతన్య మాట్లాడుతూ– ‘‘నిఖిల్ అంటే నాకు చాలా ఇష్టం. ‘హ్యాపీడేస్’ తో కెరీర్ మొదలుపెట్టి, ‘స్వామిరారా, కార్తికేయ’ తో ఓ ట్రెండ్ సెట్ చేసి, ‘కార్తికేయ 2’ తో బాక్సాఫీస్‌ని షేక్ చేశాడు.. తనని చూసి నేను చాలా గర్వపడుతున్నాను. ‘కార్తికేయ 2’ తో ఒక ట్రెండ్ ఎలా సెట్ చేశాడో.. ‘స్పై’ చిత్రంతో ఆ ట్రెండ్ దాటి తర్వాతి స్థాయికి వెళతాడనే నమ్మకం ఉంది’’ అన్నారు. నిఖిల్ సిద్ధార్థ్ మాట్లాడుతూ–‘‘సుభాష్ చంద్రబోస్ వంటి ఒక గొప్ప వ్యక్తి గురించి ఉన్న సినిమా ‘స్పై’. నాలుగురోజుల కిందట ఈ మూవీ ఫైనల్ కాపీ చూశాక ‘థ్యాంక్యూ గ్యారీ’ అన్నాను.. అంత బాగా ఈ మూవీ తీశాడు. ఇలాంటి సినిమా చేసినందుకు యూనిట్ అంతా గర్వపడుతున్నాం. ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమా ఇది’’ అన్నారు. ‘‘ఒక్క ఫోన్ కాల్‌తో ‘స్పై’ ప్రీ రిలీజ్ వేడుకకి వచ్చిన నాగచైతన్యగారికి థ్యాంక్స్’’ అన్నారు కె.రాజశేఖర్ రెడ్డి. గ్యారీ బీహెచ్ మాట్లాడుతూ–‘‘డాక్టర్ అయిన నేను సినిమా ఇండస్ట్రీకి వెళ్తానంటే ఎవరూ ఒప్పుకోరు. కానీ, నా తల్లితండ్రులు ఒప్పుకుని, నన్నుప్రోత్సహించినందుకు కృతజ్ఞతలు. ‘స్పై’ చాలా బాగా తీశావంటూ నిఖిల్‌గారు నన్ను హత్తుకోవడంతో సినిమా విజయంపై మరింత నమ్మకం పెరిగింది’’ అన్నారు. ఈ వేడుకలో ఈడీ ఎంటర్టైన్ మెంట్స్ సీఈఓ చరణ్ తేజ్, సంగీత దర్శకుడుశ్రీచరణ్ పాకాల, కెమెరామేన్ వంశీ పచ్చిపులుసు, యూవీ క్రియేషన్స్ నిర్మాత వంశీ, నటీనటులు సాన్య ఠాకూర్, ఆర్యన్ రాజేష్ పాల్గొన్నారు. -
ప్రపంచం ఏమైతే నాకేంటి?
చరణ్‌తేజ్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఆయుష్మాన్ భవ’, స్నేహా ఉల్లాల్ కథానాయిక. ‘నేనులోకల్’ చిత్ర దర్శకుడు త్రినాథ్‌రావు నక్కిన కథ, దర్శకత్వ పర్యవేక్షణలో, దర్శకుడు మారుతి సహ నిర్మాతగా సి.టి.ఎఫ్ నిర్మాణ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రం చివరి షెడ్యూల్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా చరణ్ తేజ్ మాట్లాడుతూ–‘‘సమాజం ప్రేమను చూసే పద్ధతి మారాలి అనే కమర్షియల్ పాయింట్‌తో తెరకెక్కుతోన్న చిత్రమిది. ప్రేమించిన అమ్మాయి కులం, మతం వేరైతే మర్చిపోవాలా? పారిపోవాలా? చచ్చిపోవాలా? ప్రపంచం ఏమైతే నాకేంటి. సమాజం ప్రేమను చూసే విధానం మారాలి.. లేదంటే చంపేస్తా. అనుకునే హీరో క్యారెక్టర్‌తో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమా ద్వారా స్నేహా ఉల్లాల్ టాలీవుడ్‌కి రీ ఎంట్రీ ఇస్తున్నారు. మరో తెలుగు టాప్ హీరోయిన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. పరుచూరి బ్రదర్స్, త్రినాథ్‌రావు నక్కిన స్క్రీన్‌ప్లే బాగుంటుంది. నవంబర్ 9న సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మీట్ బ్రోస్, కెమెరా: దాసరధి శివేంద్ర, అసోసియేట్ ప్రొడ్యూసర్స్ : బి.ఏ.శ్రీనివాసరావు, హేమరత్న. -
పారిపోవాలా? చచ్చిపోవాలా?
చరణ్ తేజ్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆయుష్మాన్ భవ’. స్నేహా ఉల్లాల్ కథానాయిక. ‘నేను లోకల్’ చిత్రదర్శకుడు త్రినాథ్‌రావు నక్కిన కథ అందించడంతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. దర్శకుడు మారుతి సహ నిర్మాతగా సి.టి.ఎఫ్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ నెల 21న రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు 75వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా చరణ్ తేజ్ మాట్లాడుతూ– ‘‘ప్రేమించిన అమ్మాయి కులం, మతం వేరైతే మర్చిపోవాలా? పారిపోవాలా? చచ్చిపోవాలా? ప్రపంచం ఏమైతే నాకేంటి? సమాజం ప్రేమని చూసే విధానం మారాలి.. లేకపోతే చంపేస్తా.. అనుకునే హీరో క్యారెక్టరైజేషన్‌తో ఈ చిత్రం తెరకెక్కింది. ఫస్ట్ లుక్ పోస్టర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ మీట్ అందించిన ఆడియోను యూత్ ఎంజాయ్ చేస్తున్నారు’’ అన్నారు. హుజన్, పరుచూరి వెంకటేశ్వరావు, రంగరాజన్, అశ్విన్, నిఖిత నటించిన ఈ చిత్రానికి అసోసియేట్ ప్రొడ్యూ సర్స్: బి.ఏ.శ్రీనివాసరావు, హేమరత్న, కథనం: పరుచూరి బ్రదర్స్, కెమెరా: దాశరథి శివేంద్ర. -
పారిపోతే పిరికితనం
‘‘మనకి నచ్చిన అబ్బాయి మనవాళ్లకి నచ్చకపోతే ప్రాబ్లమ్ వాళ్ళది.. దానికి మనం ఎందుకు సూసైడ్ చేసుకోవాలి? తప్పు.. అలా అని పారిపోతే పిరికితనం.. ఓడిపోతే చేతకానితనం... ఇదే జీవితమా?’’ అనే మాటలు ‘ఆయష్మాన్‌భవ’ చిత్రంపై ఆసక్తి పెంచుతున్నాయి. చరణ్ తేజ్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆయష్మాన్‌భవ’. దర్శకుడు త్రినాథ్‌రావు నక్కిన కథ అందించి, దర్శకత్వ పర్యవేక్షణ చేయగా, మరో దర్శకుడు మారుతి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. స్నేహా ఉల్లాల్ ఓ కథానాయిక. మరో హీరోయిన్ హుజన్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రంలో ఆమె చేసిన సారా పాత్ర మొదటి లుక్ విడుదల చేశారు.ఆ పోస్టర్లోనే పై విధంగా రాశారు. చరణ్ తేజ్ మాట్లాడుతూ– ‘‘సమాజం ప్రేమని చూసే పద్ధతి మారాలి’ అనే కమర్షియల్ పాయింట్‌తో తెరకెక్కించిన చిత్రమిది. మా చిత్రానికి పరుచూరి బ్రదర్స్ చక్కని కథ ఇచ్చారు. బాలీవుడ్ సంగీత దర్శకుడు మీట్ బ్రోస్ అద్భుతమైన సంగీతం అందించారు. ఈ వేసవిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి ప్రొడక్షన్ హౌస్ అండ్ ప్రొడ్యూసర్: సి.టి.ఎఫ్, అసోసియేట్ ప్రొడ్యూసర్స్: బి.ఎ.శ్రీనివాసరావు, హేమరత్న, కెమెరా: దాశరథి శివేంద్ర. -
చరణ్ తేజ సంచలనం
హైదరాబాద్: ఎస్‌యూసీసీ బౌలర్లు చరణ్ తేజ (7/6), అభయ్ స్వరూప్(4/3) విజృంభించారు. వీరిద్దరి ధాటికి చమ్స్ ఎలెవన్ జట్టు 44 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఎ- డివిజన్ వన్డే లీగ్‌లో భాగంగా సోమవారం చమ్స్ ఎలెవన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎస్‌యూసీసీ జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన చమ్స్ ఎలెవన్ జట్టు 14.1 ఓవర్లలో 44 పరుగులకే ఆలౌటైంది. చరణ్ ఆరు పరుగులిచ్చి ఏడు వికెట్లతో చెలరేగగా... అభయ్ కేవలం మూడు పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీశాడు. 45 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్‌యూసీసీ కేవలం 6.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 46 పరుగులు చేసి గెలిచింది. ఇతర మ్యాచ్‌ల ఫలితాలు మహేశ్ సీసీ: 393/6 (నరేశ్ 133, రామాంజనేయ ప్రసాద్ 102, శేఖర్ 71; పృథ్వీ 4/63), భారతీయ సీసీ: 142 (జగదీశ్ 65; విజయ్ 4/19). హైదరాబాద్ పాంథర్స్: 71 (రాఘవ 5/30), రాయల్ సీసీ: 72. వాకర్స్ టౌన్: 253 (ప్రవీణ్ 78, సందీప్ 77; కార్తీశ్ 4/38, ప్రసాద్ 2/25), టీమ్ కున్: 254/7 (విఘ్నేశ్వర్ 102, సహస్ర రెడ్డి 110). ధ్రువ్ ఎలెవన్: 190 (రూపేశ్ 53నాటౌట్, జాన్సన్ 33; ఆనంద్ కశ్యప్ 3/68, నిఖిల్ 3/29), గ్రీన్ ల్యాండ్స: 191 (సుధీంద్ర 101నాటౌట్). సత్యం కోల్ట్స్: 246/6 (రిషికేశ్64, సూర్యన్ 104నాటౌట్), రిలయన్స సీసీతో మ్యాచ్. ఆర్జేసీసీ: 294/7 (అవినాశ్ 98నాటౌట్, పృథ్వీ 88; అలీ 3/38), యూత్‌సీసీ: 147(శ్రీకాంత్ 32; శ్రీధర్ 4/32, పృథ్వీ 3/42). హైదరాబాద్ పేట్రియాట్స్: 167 (మదన్ 43; ఆకాశ్ 3/25), స్టార్లెట్స్: 82 (మదన్ 4/20). యాదవ్ డెయిరీ: 99 (39.5 ఓవర్లలో), రోషనారా: 10/4 (15 ఓవర్లలో). విక్టరీ సీసీ: 188 (సయ్యద్ 56, రోహిత్ సాగర్ 57; అరుణ్ 3/43, శ్రీకాంత్ 3/48), మయూర్ సీసీ: 49 (పవన్ 3/60). సన్‌గ్రేస్: 73 (సయ్యద్ సాదుద్దీన్ 36; సాకేత్ 3/11), యంగ్ మాస్టర్స్: 54 (అజీజ్ 3/7, ప్రవీణ్ సాగర్4/12). హెచ్‌సీఏ అకాడమీ: 287/8 (సీతారామ్ రెడ్డి 49, సాద్విక్ 42; సాయి తేజ 3/61), కన్సల్ట్ సీసీ: 169 (భరత్ 34, నజీర్ 72 నాటౌట్). ఎంపీ స్పోర్టింగ్ ఎలెవన్: 227/5 (రమాకాంత్ 47, వీరేంద్రనాథ్ 38, రాజశేఖర్ 41, గోపీ 71 నాటౌట్), అను సీసీ: 131 (తేజ 3/30). రాయల్ సీసీ: 248 (కిరణ్ 111, యశ్వంత్ 31; జాన్సన్ 3/51), ధ్రువ్ ఎలెవన్: 79 (రాఘవ 4/25, యశ్వంత్ 3/33).