
హుజన్
‘‘మనకి నచ్చిన అబ్బాయి మనవాళ్లకి నచ్చకపోతే ప్రాబ్లమ్ వాళ్ళది.. దానికి మనం ఎందుకు సూసైడ్ చేసుకోవాలి? తప్పు.. అలా అని పారిపోతే పిరికితనం.. ఓడిపోతే చేతకానితనం... ఇదే జీవితమా?’’ అనే మాటలు ‘ఆయష్మాన్‌భవ’ చిత్రంపై ఆసక్తి పెంచుతున్నాయి. చరణ్ తేజ్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆయష్మాన్‌భవ’. దర్శకుడు త్రినాథ్‌రావు నక్కిన కథ అందించి, దర్శకత్వ పర్యవేక్షణ చేయగా, మరో దర్శకుడు మారుతి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. స్నేహా ఉల్లాల్ ఓ కథానాయిక.
మరో హీరోయిన్ హుజన్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రంలో ఆమె చేసిన సారా పాత్ర మొదటి లుక్ విడుదల చేశారు.ఆ పోస్టర్‌లోనే పై విధంగా రాశారు. చరణ్ తేజ్ మాట్లాడుతూ– ‘‘సమాజం ప్రేమని చూసే పద్ధతి మారాలి’ అనే కమర్షియల్ పాయింట్‌తో తెరకెక్కించిన చిత్రమిది. మా చిత్రానికి పరుచూరి బ్రదర్స్ చక్కని కథ ఇచ్చారు. బాలీవుడ్ సంగీత దర్శకుడు మీట్ బ్రోస్ అద్భుతమైన సంగీతం అందించారు. ఈ వేసవిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి ప్రొడక్షన్ హౌస్ అండ్ ప్రొడ్యూసర్: సి.టి.ఎఫ్, అసోసియేట్ ప్రొడ్యూసర్స్: బి.ఎ.శ్రీనివాసరావు, హేమరత్న, కెమెరా: దాశరథి శివేంద్ర.
Comments
Please login to add a commentAdd a comment