
ధనలక్ష్మీ గుర్తుందా? అదేనండి... ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ సినిమాలో ఈ పేరుతోనే హీరోయిన్‌గా పరిచయమయ్యారు స్నేహా ఉల్లాల్. ఆ సినిమా తర్వాత ‘నేను మీకు తెలుసా’, ‘సింహా’, ‘అలా... మొదలైంది’, ‘మడత కాజా’, యాక్షన్ 3డీ’ వంటి చిత్రాల్లో నటించిన ఈ తేనెకళ్ల సుందరి కొన్ని కారణాల వల్ల సిల్వర్ స్క్రీన్‌కు దూరమయ్యారు. ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ తర్వాత ‘ఆయుష్మాన్ భవ’ సినిమాతో తెలుగు తెరపై మరోమారు మెరవనున్నారు.
సోమవారం ఆమె పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం సినిమాలోని పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ‘‘ఏంటి? వైశాలి అంటే ట్రెడిషనల్ అనుకుంటున్నారా..? పిచ్చ పోష్! ఫిగర్ అదరిపోద్ది’’ అని ఈ పోస్టర్‌పై ఉండటం విశేషం. సో.. ఈ సినిమాలో స్నేహా ఉల్లాల్ పేరు వైశాలి అని అర్థమైంది కదా. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది మంచి హిట్స్‌లో ఒకటి నిలిచిన నాని ‘నేను లోకల్’ దర్శకుడు త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తారన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో ‘సాక్షి’ ఆయన్ను సంప్రదించగా ‘‘ఈ సినిమాతో నాకు ఎటువంటి సంబంధం లేదు. హీరో రామ్‌తో ఓ లవ్‌స్టోరీ సినిమా చేయనున్నాను. ఫిబ్రవరిలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు త్రినాథరావు.
Comments
Please login to add a commentAdd a comment