
సప్తగిరి, ధనరాజ్, ‘షకలక’ శంకర్, అజయ్, మాళవికా సతీషన్, స్నేహా ఉల్లాల్ ముఖ్య తారలుగా రూ΄÷ందిన చిత్రం ‘భవనమ్’. బాలాచారి కూరెళ్ల దర్శకత్వంలో సూపర్ గుడ్ ఫిలిమ్స్ సమర్పణలో ఆర్బీ చౌదరి, వాకాడ అంజన్ కుమార్, వీరేంద్ర సీర్వి నిర్మించారు. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 9న విడుదల చేయనున్నట్లు బుధవారం యూనిట్ ప్రకటించింది.
‘‘సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో రూ΄÷ందించిన ఈ చిత్రంలో మంచి వినోదం ఉంది. కీలక తారాగణం పండించే కామెడీ బాగుంటుంది. అన్ని వర్గాలవారూ ఎంజాయ్ చేసేలా ఆసక్తికరమైన కంటెంట్‌తో తెరకెక్కించిన ‘భవనమ్’ మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం ఉంది’’ అని చిత్రబృందం పేర్కొంది.