హైదరాబాద్: ఎస్‌యూసీసీ బౌలర్లు చరణ్ తేజ (7/6), అభయ్ స్వరూప్(4/3) విజృంభించారు. వీరిద్దరి ధాటికి చమ్స్ ఎలెవన్ జట్టు 44 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఎ- డివిజన్ వన్డే లీగ్‌లో భాగంగా సోమవారం చమ్స్ ఎలెవన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎస్‌యూసీసీ జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన చమ్స్ ఎలెవన్ జట్టు 14.1 ఓవర్లలో 44 పరుగులకే ఆలౌటైంది. చరణ్ ఆరు పరుగులిచ్చి ఏడు వికెట్లతో చెలరేగగా... అభయ్ కేవలం మూడు పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీశాడు. 45 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్‌యూసీసీ కేవలం 6.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 46 పరుగులు చేసి గెలిచింది.
ఇతర మ్యాచ్‌ల ఫలితాలు
మహేశ్ సీసీ: 393/6 (నరేశ్ 133, రామాంజనేయ ప్రసాద్ 102, శేఖర్ 71; పృథ్వీ 4/63), భారతీయ సీసీ: 142 (జగదీశ్ 65; విజయ్ 4/19).
హైదరాబాద్ పాంథర్స్: 71 (రాఘవ 5/30), రాయల్ సీసీ: 72.
వాకర్స్ టౌన్: 253 (ప్రవీణ్ 78, సందీప్ 77; కార్తీశ్ 4/38, ప్రసాద్ 2/25), టీమ్ కున్: 254/7 (విఘ్నేశ్వర్ 102, సహస్ర రెడ్డి 110).
ధ్రువ్ ఎలెవన్: 190 (రూపేశ్ 53నాటౌట్, జాన్సన్ 33; ఆనంద్ కశ్యప్ 3/68, నిఖిల్ 3/29), గ్రీన్ ల్యాండ్‌స: 191 (సుధీంద్ర 101నాటౌట్).
సత్యం కోల్ట్స్: 246/6 (రిషికేశ్64, సూర్యన్ 104నాటౌట్), రిలయన్‌స సీసీతో మ్యాచ్.
ఆర్‌జేసీసీ: 294/7 (అవినాశ్ 98నాటౌట్, పృథ్వీ 88; అలీ 3/38), యూత్‌సీసీ: 147(శ్రీకాంత్ 32; శ్రీధర్ 4/32, పృథ్వీ 3/42).
హైదరాబాద్ పేట్రియాట్స్: 167 (మదన్ 43; ఆకాశ్ 3/25), స్టార్‌లెట్స్: 82 (మదన్ 4/20).
యాదవ్ డెయిరీ: 99 (39.5 ఓవర్లలో), రోషనారా: 10/4 (15 ఓవర్లలో).
విక్టరీ సీసీ: 188 (సయ్యద్ 56, రోహిత్ సాగర్ 57; అరుణ్ 3/43, శ్రీకాంత్ 3/48), మయూర్ సీసీ: 49 (పవన్ 3/60).
సన్‌గ్రేస్: 73 (సయ్యద్ సాదుద్దీన్ 36; సాకేత్ 3/11), యంగ్ మాస్టర్స్: 54 (అజీజ్ 3/7, ప్రవీణ్ సాగర్4/12).
హెచ్‌సీఏ అకాడమీ: 287/8 (సీతారామ్ రెడ్డి 49, సాద్విక్ 42; సాయి తేజ 3/61), కన్సల్ట్ సీసీ: 169 (భరత్ 34, నజీర్ 72 నాటౌట్).
ఎంపీ స్పోర్టింగ్ ఎలెవన్: 227/5 (రమాకాంత్ 47, వీరేంద్రనాథ్ 38, రాజశేఖర్ 41, గోపీ 71 నాటౌట్), అను సీసీ: 131 (తేజ 3/30).
రాయల్ సీసీ: 248 (కిరణ్ 111, యశ్వంత్ 31; జాన్సన్ 3/51), ధ్రువ్ ఎలెవన్: 79 (రాఘవ 4/25, యశ్వంత్ 3/33).