ఆక్స్‌ఫర్డ్‌ బ్లూస్‌ గెలుపు | Oxford Blues Beats Manchester | Sakshi
Sakshi News home page

ఆక్స్‌ఫర్డ్‌ బ్లూస్‌ గెలుపు

Published Sat, Jul 13 2019 2:14 PM | Last Updated on Sat, Jul 13 2019 2:14 PM

Oxford Blues Beats Manchester - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం ఎ–2 డివిజన్‌ రెండు రోజుల క్రికెట్‌ లీగ్‌లో భాగంగా మాంచెస్టర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆక్స్‌ఫర్డ్‌ బ్లూస్‌ వికెట్‌ తేడాతో గెలుపొందింది. 234 పరుగుల ఛేదనకు శుక్రవారం బరిలోకి దిగిన ఆక్స్‌ఫర్డ్‌ బ్లూస్‌ 60.3 ఓవర్లలో 9 వికెట్లకు 238 పరుగులు చేసి గెలుపొందింది. వరుణ్‌ రెడ్డి (141 బంతుల్లో 121; 17 ఫోర్లు, 6 సిక్స్‌లు) అద్భుత సెంచరీతో జట్టును గెలిపించాడు. ప్రత్యర్థి బౌలర్‌ కె. అభిలాష్‌ 7 వికెట్లు దక్కించుకున్నాడు. అంతకుముందు మాంచెస్టర్‌ 61 ఓవర్లలో 233 పరుగులు చేసింది. సాయి చరణ్‌ 5 వికెట్లు దక్కించుకున్నాడు.  

ఇతర మ్యాచ్‌ల ఫలితాలు

∙ఆదిలాబాద్‌ జిల్లా: 272 (55 ఓవర్లలో), డెక్కన్‌ వాండరర్స్‌: 68 (రాకేశ్‌ గౌడ్‌ 5/14).
∙నిజామాబాద్‌ జిల్లా: 118 (వంశీ 56; వెంకట్‌ 7/24), టీమ్‌స్పీడ్‌: 121/2 (కార్తీక్‌ 31, రిషికేశ్‌ 33).
∙బాలాజీ సీసీ: 318 (నాయుడు 50, శశాంక్‌ 52, రోమిత్‌ 50; శౌనక్‌ కులకర్ణి 6/69), గెలాక్సీ: 253 (కౌశిక్‌ రెడ్డి 71, సురేశ్‌ 50).
∙అవర్స్‌ సీసీ: 156 (రాహుల్‌ రెడ్డి 43; నీల్‌ చక్రవర్తి 6/69), జిందా తిలిస్మాత్‌తో మ్యాచ్‌.   
∙కరీంనగర్‌: 266 (అజయ్‌ 81; రాఘవ 4/52), ఎలిగెంట్‌: 87 (దివేశ్‌ 31; సాయితేజ 6/18).
∙అగర్వాల్‌ సీనియర్‌: 238 (మొయిజ్‌ 68, శశిధర్‌ 76; అతుల్‌ 5/70), హెచ్‌యూసీసీ: 175 (హర్ష 3/37).
∙వరంగల్‌ జిల్లా: 324 (మేరాజ్‌ 51, జి. పవన్‌ 74, ఎన్‌. పవన్‌ 70), చీర్‌ఫుట్‌ చమ్స్‌: 72 (అజయ్‌ 8/30).

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement