division cricket
-
మల్లికార్జున్ అజేయ డబుల్ సెంచరీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఎ1, ఎ2 డివిజన్ వన్డే లీగ్‌లో కేంబ్రిడ్జ్ ఎలెవన్ బ్యాట్స్‌మన్ జె. మల్లికార్జున్ (138 బంతుల్లో 201 నాటౌట్; 12 ఫోర్లు, 12 సిక్సర్లు) దుమ్మురేపాడు. బౌండరీలు, సిక్సర్లతో మైదానాన్ని హోరెత్తిస్తూ డబుల్ సెంచరీతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. మల్లికార్జున్‌కు తోడు బౌలింగ్‌లో సాతి్వక్ రెడ్డి (5/38), ఆశిష్ శ్రీవాస్తవ్ (4/27) చెలరేగ డంతో గురువారం రాజుసీసీతో జరిగిన మ్యాచ్‌లో కేంబ్రిడ్జ్ జట్టు 242 పరుగులతో ఘనవిజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన కేంబ్రిడ్జ్ నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్లకు 352 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆకాశ్ యాదవ్ (127 బంతుల్లో 106 నాటౌట్; 12 ఫోర్లు) అజేయ సెంచరీతో అదరగొట్టాడు. అనంతరం భారీ లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన రాజు సీసీని సాతి్వక్ రెడ్డి, ఆశిష్ వణికించారు. వీరిద్దరి ధాటికి రాజు సీసీ 29.3 ఓవర్లలో 110 పరుగులకే కుప్పకూలింది. ఇతర మ్యాచ్‌ల ఫలితాలు వరంగల్ జిల్లా: 163 (హితేశ్ యాదవ్ 3/14, అమోల్ షిండే 4/34), ఆంధ్రా బ్యాంక్: 164/1 (రోడ్రిగ్స్ 52, నీరజ్ బిష్త్ 50 నాటౌట్). ఎంసీసీ: 178/7 (ప్రమోద్ మహాజన్ 84; రవీందర్ 5/44), అవర్స్ సీసీ: 78/7 (శ్రీనివాస్ యాదవ్ 3/20). అగర్వాల్ సీనియర్స్: 152 (వీరేందర్ 62 నాటౌట్; అజీముద్దీన్ 4/63), గౌడ్ ఎలెవన్: 157/3 (హర్ష్ సంక్పాల్ 45, శ్రీకర్ రెడ్డి 49). నిజామాబాద్ జిల్లా: 107 (దుర్గేశ్ 3/25), బీడీఎల్: 108/1 (సింహా 61 నాటౌట్). డెక్కన్ వాండరర్స్: 309 (విశాల్ యాదవ్ 66, నూతన్ కల్యాణ్ 50, షేక్ మాజీద్ 109; అభినవ్ కుమార్ 3/47, చిరంజీవి 5/26), నిజాం కాలేజి: 87 (ఫిరాజుద్దీన్ 6/19). కాంటినెంటల్: 160 (జైదేవ్ గౌడ్ 52; యశ్వంత్ 3/53, అన్వేశ్ 3/22), ఆక్స్ఫర్డ్ బ్లూస్: 44/5 (21 ఓవర్లలో). హైదరాబాద్ బ్లూస్: 278/7 (రుతిక్ యాదవ్ 44, రవి పాండే 110; సుశీక్షిత్ రెడ్డి 3/40), పీకేఎంసీసీ: 190 (అనిరుధ్ కపిల్ గౌడ్ 44, శివ శంకర్ 67; రుతి్వక్ 5/47). డెక్కన్ క్రానికల్: 183 (వరుణ్ గౌడ్ 44, అద్నాన్ 30; జితేందర్ 4/28), ఖల్సా: 63 (అమన్ ఉపాధ్యాయ్ 3/11, విద్యానంద్ రెడ్డి 4/24). ఎలిగెంట్: 223 (దివేశ్ 66, అఫ్జల్ 41), శ్రీ శ్యామ్: 120 (ఇబ్రహీం అలీ 48; సిద్ధార్థ్ 3/29, పి. రాఘవ 5/45). గెలాక్సీ: 84(శ్రవణ్ 3/25, మయాంక్ గుప్తా 3/7), ఎవర్గ్రీన్: 87/1 (రాహుల్ 47). సీసీఓబీ: 267 (షేక్ మొహమ్మద్ 86, అజీజుద్దీన్ 55; రిషిత్ రెడ్డి 3/44, నితిన్ 3/34), బ్రదర్స్ ఎలెవన్: 235 (రిషిత్ రెడ్డి 62, హర్షవర్ధన్ 62; నోమన్ 3/28, అజీజుద్దీన్ 4/48). ఆర్ దయానంద్: 298/3 (బెంజమిన్ 51, షణ్ముఖ 73, రోహిత్ రెడ్డి 77 నాటౌట్, విఘ్నేశ్వర్ 48 నాటౌట్), నల్లగొండ జిల్లా: 140 (మోహిత్ సోని 3/34, బెంజమిన్ 4/25). నేషనల్: 133 (సహేంద్ర మల్లు 30; మెహర్ ప్రసాద్ 4/17), విజయ్ హనుమాన్: 134/6 (శ్రీకర్ రెడ్డి 61 నాటౌట్). డెక్కన్ బ్లూస్: 76 (సయ్యద్ మెహదీ హసన్ 6/9), ఎన్స్‌కాన్స్: 79/2 (10.2 ఓవర్లలో). సాయిసత్య: 184 (ఇషాన్ శర్మ 48; అశ్వద్ రాజీవ్ 3/26, వెంకటేశ్ 3/31), తెలంగాణ: 187/7 (సూరి 49; విజయ్ ఆకాశ్ 3/35). ఈఎంసీసీ: 258/7 (మెహుల్ భౌమిక్ 104, అసదుద్దీన్ 81), కొసరాజు సీసీ: 100/9. స్పోర్టివ్ సీసీ: 137 (విష్ణు 3/33), హెచ్‌యూసీసీ: 97/8 (అతుల్ వ్యాస్ 36 నాటౌట్; అశి్వన్ 4/13). కరీంనగర్: 183/9 (రిత్విక్ సూర్య 76; తనయ్ త్యాగరాజన్ 3/27, దివేశ్సింగ్ 3/33), స్పోర్టిం గ్ ఎలెవన్: 184/3 (హిమాలయ్ అగర్వాల్ 89 నాటౌట్, తనయ్ త్యాగరాజన్ 68). పాషా బీడీ: 143/9 ( పంకజ్ 5/22), చీర్‌ఫుల్ చమ్స్: 144/5 (సాయి కౌశిక్ 60 నాటౌట్; ఫహీమ్ 3/39). -
ఆక్స్ఫర్డ్ బ్లూస్ గెలుపు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం ఎ–2 డివిజన్ రెండు రోజుల క్రికెట్ లీగ్‌లో భాగంగా మాంచెస్టర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆక్స్ఫర్డ్ బ్లూస్ వికెట్ తేడాతో గెలుపొందింది. 234 పరుగుల ఛేదనకు శుక్రవారం బరిలోకి దిగిన ఆక్స్ఫర్డ్ బ్లూస్ 60.3 ఓవర్లలో 9 వికెట్లకు 238 పరుగులు చేసి గెలుపొందింది. వరుణ్ రెడ్డి (141 బంతుల్లో 121; 17 ఫోర్లు, 6 సిక్స్‌లు) అద్భుత సెంచరీతో జట్టును గెలిపించాడు. ప్రత్యర్థి బౌలర్ కె. అభిలాష్ 7 వికెట్లు దక్కించుకున్నాడు. అంతకుముందు మాంచెస్టర్ 61 ఓవర్లలో 233 పరుగులు చేసింది. సాయి చరణ్ 5 వికెట్లు దక్కించుకున్నాడు. ఇతర మ్యాచ్‌ల ఫలితాలు ∙ఆదిలాబాద్ జిల్లా: 272 (55 ఓవర్లలో), డెక్కన్ వాండరర్స్: 68 (రాకేశ్ గౌడ్ 5/14). ∙నిజామాబాద్ జిల్లా: 118 (వంశీ 56; వెంకట్ 7/24), టీమ్‌స్పీడ్: 121/2 (కార్తీక్ 31, రిషికేశ్ 33). ∙బాలాజీ సీసీ: 318 (నాయుడు 50, శశాంక్ 52, రోమిత్ 50; శౌనక్ కులకర్ణి 6/69), గెలాక్సీ: 253 (కౌశిక్ రెడ్డి 71, సురేశ్ 50). ∙అవర్స్ సీసీ: 156 (రాహుల్ రెడ్డి 43; నీల్ చక్రవర్తి 6/69), జిందా తిలిస్మాత్తో మ్యాచ్. ∙కరీంనగర్: 266 (అజయ్ 81; రాఘవ 4/52), ఎలిగెంట్: 87 (దివేశ్ 31; సాయితేజ 6/18). ∙అగర్వాల్ సీనియర్: 238 (మొయిజ్ 68, శశిధర్ 76; అతుల్ 5/70), హెచ్‌యూసీసీ: 175 (హర్ష 3/37). ∙వరంగల్ జిల్లా: 324 (మేరాజ్ 51, జి. పవన్ 74, ఎన్. పవన్ 70), చీర్ఫుట్ చమ్స్: 72 (అజయ్ 8/30). -
టైటిల్ పోరుకు ఆంధ్రా బ్యాంక్
సాక్షి, హైదరాబాద్: బ్యాటింగ్, బౌలింగ్ రంగాల్లో సమష్టిగా రాణించిన ఆంధ్రా బ్యాంక్ జట్టు హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ఎ–డివిజన్ వన్డే లీగ్‌లో ఫైనల్‌కు చేరుకుంది. ఈసీఐఎల్ గ్రౌండ్ వేదికగా శుక్రవారం జరిగిన తొలి సెమీఫైనల్లో ఆంధ్రా బ్యాంక్ 126 పరుగుల తేడాతో జై హనుమాన్ జట్టుపై విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆంధ్రా బ్యాంక్ 45 ఓవర్లలో 9 వికెట్లకు 365 పరుగుల భారీస్కోరు చేసింది. ఆశిష్ రెడ్డి (41 బంతుల్లో 70; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు), టి. రవితేజ (51 బంతుల్లో 53; 5 ఫోర్లు) అర్ధసెంచరీలు సాధించారు. ఓపెనర్లు నవీన్ రెడ్డి (41), రోనాల్డ్ రాస్ రోడ్రిగ్స్ (48) తొలి వికెట్‌కు 78 పరుగుల్ని జోడించి శుభారంభం అందించారు. వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ పీఎస్ చైతన్య రెడ్డి (40 బంతుల్లో 46; 3 ఫోర్లు, 1 సిక్స్), అభినవ్ కుమార్ (14 బంతుల్లో 30; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఎంఏ ఖాదిర్ (10 బంతుల్లో 25; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) దూకుడుగా ఆడారు. ప్రత్యర్థి బౌలర్లలో రంగనాథ్ 3 వికెట్లతో రాణించాడు. అనంతరం జైహనుమాన్ 36.3 ఓవర్లలో 239 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. కష్టసాధ్యమైన లక్ష్యఛేదనలో జై హనుమాన్ జట్టుకు మంచి ఆరంభం లభించింది. ఓపెనర్లు శశిధర్ రెడ్డి (49; 7 ఫోర్లు), అనిరుధ్ రెడ్డి (57; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) తొలి వికెట్‌కు 111 పరుగులు జతచేసి జట్టులో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. అయితే కె. సుమంత్ (3), విఠల్ అనురాగ్ (5), ప్రతీక్ రెడ్డి (5), సాకేత్ సాయిరామ్ (6), కార్తికేయ (2) క్రీజులో నిలవలేకపోయారు. మరో ఎండ్‌లో రోహిత్ రాయుడు (62 బంతుల్లో 67; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో జట్టు ఆ మాత్రమైన స్కోరు సాధించగలిగింది. సూర్యతేజ (31) పరవాలేదనిపించాడు. ప్రత్యర్థి బౌలర్లలో హితేశ్ యాదవ్ మూడు, రవితేజ, అమోల్ షిండే చెరో 2 వికెట్లు దక్కించుకున్నారు. -
సాయి అభినయ్ విజృంభణ
సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీఏ ఎ–2 డివిజన్ రెండు రోజుల క్రికెట్ లీగ్‌లో కొసరాజు సీసీ జట్టు ఘనవిజయాన్ని సాధించింది. పి. సాయి అభినయ్ (5/31) బౌలింగ్‌లో విజృంభించడంతో డీఎంఆర్సీ–2 మైదానంలో వీనస్ సైబర్‌టెక్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 263 పరుగుల తేడాతో గెలుపొందింది. ఓవర్‌నైట్ స్కోరు 10/4తో రెండోరోజు శుక్రవారం ఆట కొనసాగించిన వీనస్ జట్టు అభినయ్ ధాటికి 36.3 ఓవర్లలో 85 పరుగులకే కుప్పకూలింది. శుభమ్ శివాజీ చవాన్ (33; 6 ఫోర్లు) మినహా బ్యాటింగ్‌లో ఏ ఒక్కరూ రాణించలేకపోయారు. ఇన్నింగ్స్‌లో ఐదుగురు బ్యాట్స్‌మెన్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. ఇందులో నలుగురు అభినయ్ బౌలింగ్‌లోనే డకౌట్‌గా వెనుదిరగడం విశేషం. అంతకుముందు కొసరాజు సీసీ 348 పరుగులకు ఆలౌటైంది. డెక్కన్ వాండరర్స్ గెలుపు టీమ్ స్పీడ్‌తో జరిగిన మరో మ్యాచ్‌లో డెక్కన్ వాండరర్స్ జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట టీమ్ స్పీడ్ 217 పరుగులకు ఆలౌటవ్వగా... వాండరర్స్ 68.1 ఓవర్లలో 6 వికెట్లకు 218 పరుగులు చేసి గెలుపొందింది. గ్రీన్‌టర్ఫ్‌తో మాంచెస్టర్, ఎలిగెంట్తో మహమూద్ సీసీ, బాలాజీ కోల్ట్స్‌తో జై భగవతి, కాన్కర్డ్తో హెచ్‌యూసీసీ, గెలాక్సీతో మెగా సిటీ జట్ల మధ్య రెండో రోజు జరగాల్సిన ఆట వర్షం కారణంగా రద్దయింది. దీంతో మ్యాచ్ ఫలితాన్ని డ్రాగా నిర్ణయించారు. ఇతర మ్యాచ్‌ల ఫలితాలు రాకేశ్ ఎలెవన్: 259/9 (సచిత్ నాయుడు 150, రాఘవ 51), చీర్‌ఫుల్ చమ్స్: 25/0 (6 ఓవర్లలో). హెచ్‌బీసీసీ: 178 (మొహమ్మద్ హుస్సేన్ 70; అబ్దుల్ అద్నాన్ 5/41), శ్రీ శ్యామ్: 87/3 (ప్రణీత్37, ఇబ్రహీం సిద్ధిఖీ 33). క్రౌన్ సీసీ: 247 (అభిషేక్ 52, సందేశ్ 67, దినేశ్ 61; వెంకట్ 4/72), జిందా తిలిస్మాత్: 249/8 (సాయి వ్రత్ 121, షబార్ 48; దినేశ్ 4/73). -
యతిన్ రెడ్డి, భగత్ వర్మ సెంచరీలు
సాక్షి, హైదరాబాద్: దయానంద్ సీసీ బ్యాట్స్‌మెన్ యతిన్ రెడ్డి (262 బంతుల్లో 170; 20 ఫోర్లు, 6 సిక్సర్లు), భగత్‌వర్మ (234 బంతుల్లో 148; 20 ఫోర్లు, 3 సిక్సర్లు) బాధ్యతాయుత సెంచరీలతో ఆకట్టుకున్నారు. వీరిద్దరూ ఓపికగా ఆడటంతో హెచ్‌సీఏ ఎ–1 డివిజన్ మూడు రోజుల లీగ్‌లో భాగంగా ఇన్‌కంట్యాక్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో దయానంద్ సీసీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని దక్కించుకుని మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. ఓవర్‌నైట్ స్కోరు 228/6తో మూడోరోజు తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన దయానంద్ సీసీ గురువారం ఆటముగిసే సమయానికి 143 ఓవర్లలో 9 వికెట్లకు 558 పరుగులతో నిలిచింది. యతిన్, భగత్‌వర్మ రోజంతా క్రీజులో నిలబడి జట్టుకు ఆధిక్యాన్ని అందించారు. వీరిద్దరూ ఎనిమిదో వికెట్‌కు 320 పరుగుల్ని జోడించారు. తొలుత ఇన్‌కంట్యాక్స్ జట్టు 556 పరుగులకు ఆలౌటైంది. 2 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సాధించిన దయానంద్ సీసీ జట్టుకు 3 పాయింట్లు లభించగా, ఇన్‌కంట్యాక్స్ జట్టు ఖాతాలో ఒక పాయింట్ చేరింది. ఈ మ్యాచ్‌లో దయానంద్ సీసీ తరఫున అన్షుల్ (100), వై. చైతన్య కృష్ణ (104), యతిన్రెడ్డి, భగత్‌వర్మ సెంచరీలు చేశారు. దీపాన్‡్ష బుచర్, పి. రోహిత్ రెడ్డి, సలీమ్ షేక్ డకౌట్లుగా వెనుదిరిగారు. ఇతర మ్యాచ్‌ల ఫలితాలు గ్రూప్ ‘ఎ’: ఎస్‌సీఆర్‌ఎస్‌ఏ తొలి ఇన్నింగ్స్: 364, రెండో ఇన్నింగ్స్: 65/1 (వంశీకృష్ణ 32 నాటౌట్); జై హనుమాన్ తొలి ఇన్నింగ్స్: 165 (కమ్రుద్దీన్ 3/17, బి. సుధాకర్ 3/12). బీడీఎల్ తొలి ఇన్నింగ్స్: 232, రెండో ఇన్నింగ్స్: 137 (టి. సంతోష్ 48; కనిష్క్ నాయుడు 6/42), ఆంధ్రాబ్యాంక్ తొలి ఇన్నింగ్స్: 320, రెండో ఇన్నింగ్స్: 51/1 (9.1 ఓవర్లలో). ఎస్బీఐ తొలి ఇన్నింగ్స్: 342, రెండో ఇన్నింగ్స్: 313/6 డిక్లేర్డ్ (డానీ డెరెక్ ప్రిన్స్ 84, ఆకాశ్ భండారి 115), ఈఎంసీసీ తొలి ఇన్నింగ్స్: 244. గ్రూప్ ‘బి’ ఏఓసీ తొలి ఇన్నింగ్స్: 436; రెండో ఇన్నింగ్స్: 118/6 డిక్లేర్డ్ (రాహుల్ 49 నాటౌట్; వి. సాత్విక్ రెడ్డి 4/50), కేంబ్రిడ్జ్ ఎలెవన్ తొలి ఇన్నింగ్స్: 116, రెండో ఇన్నింగ్స్: 226 ( పి. నీలేశ్ 65; దివేశ్ పథానియా 4/55). ఎవర్గ్రీన్ తొలి ఇన్నింగ్స్: 610/6; ఎంపీ కోల్ట్స్ తొలి ఇన్నింగ్స్: 290, రెండో ఇన్నింగ్స్: 159/3 (వైష్ణవ్ రెడ్డి 66, అసదుద్దీన్ 71 నాటౌట్). ∙ఎన్స్‌కాన్స్ తొలి ఇన్నింగ్స్: 393, రెండో ఇన్నింగ్స్: 163/1 (ఓవైస్ 61 నాటౌట్, జునైద్ అలీ 95), కాంటినెంటల్ సీసీ తొలి ఇన్నింగ్స్: 263/9 డిక్లేర్డ్ (వై. అనిరుధ్ రెడ్డి 108, సంకీర్త్ 61; అజహరుద్దీన్ 4/17, మెహదీ హసన్ 4/48). జెమిని ఫ్రెండ్స్ తొలి ఇన్నింగ్స్: 429; ఇండియా సిమెంట్స్ తొలి ఇన్నింగ్స్: 165 (రతన్ తేజ 4/44), రెండో ఇన్నింగ్స్: 237 (శ్రేయస్ 136; ఎం. రాధాకృష్ణ 4/43, సంకేత్ 3/40). -
అనిరుధ్ విజృంభణ
సాక్షి, హైదరాబాద్: ఎ–2 డివిజన్ రెండు రోజుల క్రికెట్ లీగ్‌లో రాకేశ్ ఎలెవన్ బౌలర్ ఎన్. అనిరుధ్ (4–1–10–5) విజృంభించాడు. దీంతో కంబైన్డ్ డిస్ట్రిక్ట్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో రాకేశ్ ఎలెవన్ 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన కంబైన్డ్ డిస్ట్రిక్ట్స్ అనిరుధ్ ధాటికి 18.1 ఓవర్లలో 44 పరుగులకు ఆలౌటైంది. మొహమ్మద్ రోహన్ అలీ (11) మినహా ఏ ఒక్కరూ రెండంకెల స్కోరు చేయలేకపోయారు. అనిరుధ్ 10 పరుగులిచ్చి 5 వికెట్లతో చెలరేగగా, మరో బౌలర్ జి. రిత్విక్ 9 పరుగులిచ్చి 3 వికెట్లను పడగొట్టాడు. అనంతరం స్వల్పలక్ష్యం కోసం బరిలోకి దిగిన రాకేశ్ ఎలెవన్ జట్టు 10.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 45 పరుగులు చేసి గెలిచింది. ఇతర మ్యాచ్‌ల వివరాలు: జై భగవతి: 125 (బి. సారంగ్ 30, శివ కుమార్ 31; ఎఫ్‌కే ముజ్తబా 6/31, అభిషేక్ 2/16), పాషాబీడీ: 126/5 (విశేష్ 39, కార్తీక్‌రెడ్డి 34 నాటౌట్; మహ్మదుల్లా ఖాన్ 2/27). u రోహిత్ ఎలెవన్: 95 (సర్తాజ్ 36; ప్రేమ్ కుమార్ 4/9), ఖల్సా: 35 (పవన్ శర్మ 5/7). u విజయ్ హనుమాన్: 117 (పి. సాయినాథ్ 43, తౌసీఫ్ 3/64, అజ్మత్ ఖాన్ 5/22), న్యూ బ్లూస్: 120/5 (అకేందర్ కుమార్ 30, అజిత్ సింగ్ 39). u నిజాం కాలేజ్: 301, ఎలిగెంట్ సీసీ: 149 (అద్నాన్ అహ్మద్ 33, విపిన్ చౌదరి 50 నాటౌట్; అక్షయ్ 6/27, డి. శ్రీనివాస్ 3/50). u ఆక్స్ఫర్డ్ బ్లూస్: 87, గ్రీన్‌టర్ఫ్: 88/2 (వాహెద్ 36 నాటౌట్). -
ధీరజ్ అజేయ డబుల్ సెంచరీ
సాక్షి, హైదరాబాద్: ఎ–3 డివిజన్ వన్డే క్రికెట్ లీగ్‌లో లక్కీ ఎలెవన్ బ్యాట్స్‌మన్ ఎస్. ధీరజ్ గౌడ్ (125 బంతుల్లో 201 నాటౌట్; 28 ఫోర్లు) అజేయ డబుల్ సెంచరీతో విధ్వంసం సృష్టించాడు. దీంతో ఆదివారం సత్యం కోల్ట్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో లక్కీ ఎలెవన్ జట్టు 238 పరుగుల తేడాతో ఘనవిజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన లక్కీ ఎలెవన్ 37 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 349 పరుగుల భారీ స్కోరును సాధించింది. ధీరజ్ డబుల్ సెంచరీకి తోడు మరో ఓపెనర్ హర్షిత్ (112) కూడా సెంచరీ చేశాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు అజేయంగా 349 పరుగుల్ని జోడించారు. అనంతరం సత్యం కోల్ట్స్ జట్టును శశి (5/33)ధాటికి 26 ఓవర్లలో కేవలం 111 పరుగులకే ఆలౌటైంది. మరో మ్యాచ్ వివరాలు: రోషనారా: 362/6 (శ్రీకాంత్ రెడ్డి 114 నాటౌట్, నయన్ 73), టీమ్‌కున్: 228/4 (సుక్రుత్ 89, ప్రజ్వల్ 40). -
అమిత్ అజేయ డబుల్ సెంచరీ
సాక్షి, హైదరాబాద్: ఎ–1 డివిజన్ మూడు రోజుల క్రికెట్ లీగ్‌లో ఏఓసీ జట్టు బ్యాట్స్‌మన్ అమిత్ పచేరా (354 బంతుల్లో 221 నాటౌట్; 27 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అజేయ డబుల్ సెంచరీతో చెలరేగి జట్టుకు భారీస్కోరును అందించాడు. దీంతో కేంబ్రిడ్జ్ ఎలెవన్ జట్టుతో జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో ఏఓసీ జట్టు తొలి ఇన్నింగ్స్‌ను 122 ఓవర్లలో 8 వికెట్లకు 481 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అమిత్‌తో పాటు విష్ణు తివారీ (253 బంతుల్లో 148; 21 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో చెలరేగాడు. ప్రత్యర్థి బౌలర్లలో హర్మీత్ సింగ్ 5 వికెట్లతో ఆకట్టుకున్నాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన కేంబ్రిడ్జ్ ఎలెవన్ జట్టు తడబడింది. రెండోరోజు ఆటముగిసే సమయానికి 54 ఓవర్లలో 8 వికెట్లకు 158 పరుగులతో నిలిచింది. అనురాగ్ హరిదాస్ (42) రాణించాడు. ఏఓసీ బౌలర్లలో అభిషేక్ 3 వికెట్లు పడగొట్టాడు. ప్రణీత్, హిమాన్షు శతకాలు స్పోర్టింగ్ ఎలెవన్ జట్టుతో జరుగుతోన్న మరో మ్యాచ్‌లో ఇన్కమ్ ట్యాక్స్ జట్టు దీటుగా బదులిస్తోంది. బుధవారం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఇన్కమ్ ట్యాక్స్ ఆటముగిసే సమయానికి 66 ఓవర్లలో 3 వికెట్లకు 298 పరుగులతో నిలిచింది. ప్రణీత్ కుమార్ (192 బంతుల్లో 141 బ్యాటింగ్; 16 ఫోర్లు, 4 సిక్సర్లు), హిమాన్షు జోషి (183 బంతుల్లో 126; 17 ఫోర్లు) సెంచరీలతో కదం తొక్కారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 358/6తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన స్పోర్టింగ్ ఎలెవన్ జట్టు 107.4 ఓవర్లలో 440 పరుగులకు ఆలౌటైంది. మొహమ్మద్ ఫైజల్ అల్వి (47) రాణించాడు. ఇన్కమ్ ట్యాక్స్ బౌలర్లలో హిమాన్షు జోషి 3 వికెట్లు దక్కించుకున్నాడు. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు డెక్కన్ క్రానికల్ తొలి ఇన్నింగ్స్: 285/3 (బి. రేవంత్ 57, వరుణ్ గౌడ్ 56 బ్యాటింగ్, సాయి ప్రజ్ఞయ్ రెడ్డి 119 బ్యాటింగ్), ఆంధ్రాబ్యాంక్‌తో మ్యాచ్. ఆర్. దయానంద్ తొలి ఇన్నింగ్స్: 260/9 (వై. చైతన్య కృష్ణ 46, కుషాల్ పర్వేజ్ జిల్లా 118; జి. అనికేత్ రెడ్డి 4/95, పి. సాకేత్ సాయిరామ్ 3/66), బీడీఎల్‌తో మ్యాచ్. జెమిని ఫ్రెండ్స్ తొలి ఇన్నింగ్స్: 283 (ఆకాశ్ సనా 5/53), కాంటినెంటల్ తొలి ఇన్నింగ్స్: 178 (సి. దుర్గేశ్ 65 నాటౌట్; సంకేత్ 3/75). ఎవర్గ్రీన్ తొలి ఇన్నింగ్స్: 179, హైదరాబాద్ బాట్లింగ్ తొలి ఇన్నింగ్స్: 134 (ఆశ్రిత్ 34, మధు 36; ప్రణీత్ రెడ్డి 6/36). ఇండియా సిమెంట్స్: 132 (హృషికేశ్ 37; బి. సుధాకర్ 5/53, షేక్ మహబూబ్ పాషా 3/ 21); ఎస్‌సీఆర్‌ఎస్‌ఏ తొలి ఇన్నింగ్స్: 147/3 (ఎస్సీ మొహంతి 79, ఎం. సురేశ్ 61). -
అమోల్ షిండే అదుర్స్...
సాక్షి, హైదరాబాద్: ఈఎంసీసీతో జరిగిన ఎ–1 డివిజన్ మూడు రోజుల లీగ్ మ్యాచ్‌లో ఆంధ్రాబ్యాంక్ బౌలర్ అమోల్ షిండే (7/51, 5/34) అద్భుత ప్రదర్శన చేశాడు. ఫలితంగా ఆ జట్టు ఇన్నింగ్స్ 268 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఓవర్‌నైట్ స్కోరు 83/4తో మూడోరోజు శుక్రవారం తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఈఎంసీసీ జట్టు 53.5 ఓవర్లలో 109 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఫాలోఆన్ ఆడుతూ రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన ఈఎంసీసీ జట్టు అమోల్ షిండే ధాటికి 34.5 ఓవర్లలోనే 80 పరుగులకే కుప్పకూలి పరాజయం పాలైంది. తొలి ఇన్నింగ్స్‌లో 51 పరుగులిచ్చి 7 వికెట్లు తీసిన అమోల్ రెండో ఇన్నింగ్స్‌లో 34 పరుగులకే 5 వికెట్లు పడగొట్టి ఈఎంసీసీ పతనాన్ని శాసించాడు. అంతకుముందు ఆంధ్రాబ్యాంక్ తొలి ఇన్నింగ్స్‌ను 457/9 వద్ద డిక్లేర్ చేసింది. ఈ విజయంతో ఆంధ్రాబ్యాంక్ ఖాతాలో 7 పాయింట్లు చేరాయి. ఆర్. దయానంద్ ఎలెవన్, డెక్కన్ క్రానికల్ జట్ల మధ్య జరిగిన మరో మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. శుక్రవారం ఓవర్‌నైట్ స్కోరు 118/3తో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన దిగిన ఆర్. దయానంద్ జట్టు 73 ఓవర్లలో 9 వికెట్లకు 314 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. పి. రోహిత్ రెడ్డి (136 బంతుల్లో 110; 8 ఫోర్లు, 6 సిక్సర్లు) సెంచరీతో చెలరేగగా... కుషాల్ పర్వేజ్ జిల్లా (72), లలిత్ మోహన్ (50 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన డెక్కన్ క్రానికల్ జట్టు మూడో రోజు ఆటముగిసే సమయానికి 14 ఓవర్లలో 3 వికెట్లకు 50 పరుగులు చేసి మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో దయానంద్ జట్టు 204 పరుగులు చేయగా, డెక్కన్ క్రానికల్ జట్టు 177కు ఆలౌటైంది. ఇతర ఎ–1 డివిజన్ లీగ్ మ్యాచ్‌ల స్కోర్లు బీడీఎల్ తొలి ఇన్నింగ్స్: 320 (100.4 ఓవర్లలో); ఎస్బీఐ తొలి ఇన్నింగ్స్: 343/6 (డానీ డెరెక్ ప్రిన్స్ 87, కేఎస్కే చైతన్య 103 నాటౌట్, అహ్మద్ ఖాద్రి 47, ఆకాశ్ భండారి 50; మొహమ్మద్ ముదస్సిర్ 5/82). జై హనుమాన్: 332 (కె. రోహిత్ రాయుడు 177 నాటౌట్, జీఎస్ శాండిల్య 62; రక్షణ్ రెడ్డి 4/52); ఇన్‌కంట్యాక్స్: 42/2. హైదరాబాద్ బాట్లింగ్: 225 (తొలి ఇన్నింగ్స్), 235 (రవీందర్ రెడ్డి 60, జె. వినయ్ గౌడ్ 89; సయ్యద్ మెహదీ హసన్ 3/83, మీర్ ఒమర్ ఖాన్ 3/51); కేంబ్రిడ్జ్ ఎలెవన్: 215 (తొలి ఇన్నింగ్స్), 85/2 (హర్‡్ష జున్‌జున్‌వాలా 40). ఎవర్గ్రీన్: 285 (తొలి ఇన్నింగ్స్), 175/5 (జి. విక్రమ్ 62, బి. మనోజ్ కుమార్ 61, చందన్ 35); కాంటినెంటల్: 236 (ఎం. సమిత్ రెడ్డి 45; ప్రణీత్‌రెడ్డి 4/29, శుభమ్ 3/48). ఇండియా సిమెంట్స్: 140 (తొలి ఇన్నింగ్స్), 5/0 (2 ఓవర్లలో); ఏఓసీ: 256/5 డిక్లేర్డ్ (శివమ్ తివారి 52, అమిత్ 122, రవి 36). -
మనోజ్ 210 నాటౌట్
సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీఏ ఎ-డివిజన్ వన్డే లీగ్‌లో శాంతి ఎలెవన్ బ్యాట్స్‌మన్ మనోజ్ కుమార్ (114 బంతుల్లో 210 నాటౌట్; 28 ఫోర్లు, 7 సిక్సర్లు) అజేయ డబుల్ సెంచరీతో విధ్వంసం సృష్టించాడు. దీంతో యూనివర్సల్ సీసీతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 299 పరుగుల తేడాతో ఘనవిజయాన్ని సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన శాంతి ఎలెవన్ జట్టు 40 ఓవర్లలో 4 వికెట్లకు 362 పరుగుల భారీ స్కోరు చేసింది. మనోజ్ అజేయ డబుల్ సెంచరీతో యూనివర్సల్ సీసీ బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. సుమంత్ (60), కిరణ్ (41) ఆకట్టుకున్నారు. అనంతరం 363 పరుగుల లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన యూనివర్సల్ సీసీ జట్టు 40 ఓవర్లలో 63 పరుగులకు ఆలౌటై ఓడిపోరుుంది. శాంతి ఎలెవన్ బౌలర్లలో బి. రాహుల్ రెడ్డి 5 వికెట్లతో చెలరేగాడు. -
శ్రవణ్ రావు అద్భుత సెంచరీ
సాక్షి, హైదరాబాద్: ఎ- డివిజన్ వన్డే లీగ్‌లో రాజూస్ క్రికెట్ క్లబ్ బ్యాట్స్‌మెన్ ఎ. శ్రవణ్ రావు (149) అద్భుత సెంచరీతో చెలరేగాడు. దీంతో సత్య సీసీతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 164 పరుగుల తేడాతో ఘనవిజయాన్ని సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజూస్ క్లబ్ 37 ఓవర్లలో 294 పరుగులు చేసింది. శ్రవణ్ రావు త్రుటిలో 150 పరుగుల మార్క్‌ను కోల్పోయాడు. కమల్ యాదవ్ (39) రాణించాడు. ప్రత్యర్థి బౌలర్లలో కె. రిత్విక్ రెడ్డి 5, హర్ష 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సత్య సీసీ జట్టు 33.2 ఓవర్లలో 130 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. రిత్విక్ రెడ్డి (30), గౌరీ శంకర్ (39) పోరాడారు. రాజూస్ క్లబ్ బౌలర్లలో శ్రవణ్ 5 వికెట్లతో ఆకట్టుకున్నాడు. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు రోషనారా సీసీ: 341/6 (ముకేశ్ 76, సయ్యద్ జీషాన్ 53, బిజయ్ కల్యాణ్ 56 నాటౌట్), ఎల్‌ఎన్‌సీసీ: 88 (అమీర్ 3/25, కునాల్ 3/20, విను 3/29). రంగారెడ్డి జిల్లా: 87 (నదీమ్ ఖాన్ 3/10), షాలిమార్ సీసీ: 92/1 (నదీమ్ ఖాన్ 51 నాటౌట్). హైదరాబాద్ వాండరర్స్: 167 (జమీల్ 62; భరద్వాజ్ 4/40), అక్షిత్ సీసీ: 168/3 (రిత్విక్ 61 నాటౌట్, శ్రునోత్ 43). మహేశ్ సీసీ: 209 (పి. వినయ్ 43, కె. శ్రవణ్ 55 నాటౌట్; రాజశేఖర్ 7/68), కాకతీయ సీసీ: 181 (అనంత్ 54; వినయ్ 4/20). సాక్రెడ్ హార్ట్: 244 (లెస్లీ 102, జెరోమ్ 42; చైతన్య 4/50, స్వామి 3/36), ఎంపీ బ్లూస్: 247/8 (రాజు 59, యేసుదాస్ 3; లెస్లీ 5/52). ఎస్ఎన్ గ్రూప్: 127 (శ్రీనివాస్ 3/28, భరత్ 4/9), అంబర్పేట్ సీసీ: 128/6 (రిజ్వాన్ 39 నాటౌట్). అక్షిత్ సీసీ: 319 (శ్రునోత్ 79, షహాంక్ 63; సంజయ్ 3/78), యూనివర్సల్ సీసీ: 149 (యశ్వంత్ 47). -
యశ్వంత్ సెంచరీ
సాక్షి, హైదరాబాద్: బ్యాటింగ్‌లో యశ్వంత్ (130), ప్రజ్వల్ రావు (90) బౌలింగ్‌లో వీరాస్వామి (5/62) మెరుగ్గా రాణించడంతో సత్యసీసీ జట్టు సునాయాసంగా గెలుపొందింది. ఎ- డివిజన్ వన్డే లీగ్‌లో భాగంగా గోల్కొండ సీసీతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సత్యసీసీ జట్టు 52 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన సత్య సీసీ జట్టు 38.4 ఓవర్లలో 253 పరుగులకు ఆలౌటైంది. యశ్వంత్ సెంచరీతో ఆకట్టుకోగా... ప్రజ్వల్ రావు తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. గోల్కొండ సీసీ బౌలర్లలో శ్రీనికేత్ రెడ్డి, లోహిత్ చెరో 5 వికెట్లు పడగొట్టారు. అనంతరం 254 పరుగుల లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన గోల్కొండ సీసీ 28.4 ఓవర్లలో 201 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. సత్య సీసీ బౌలర్లలో వీరారెడ్డితో పాటు రిత్విక్ రెడ్డి (4/58) రాణించాడు. -
బాలాజీ, తరుణ్ సెంచరీలు
సాక్షి, హైదరాబాద్: విజయానంద్ సీసీ బ్యాట్స్‌మెన్ బాలాజీ రెడ్డి (108), తరుణ్ సాయి (103) సెంచరీలతో చెలరేగారు. దీంతో ఎ-డివిజన్ వన్డే లీగ్‌లో భాగంగా సఫిల్‌గూడ సీసీతో జరిగిన మ్యాచ్‌లో విజయానంద్ 263 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన విజయానంద్ సీసీ జట్టు 50 ఓవర్లలో 7 వికెట్లకు 320 పరుగులు చేసింది. బాలాజీ రెడ్డి, తరుణ్ సాయిలతో పాటు అభిషేక్ (72) ఆకట్టుకున్నాడు. ప్రత్యర్థి బౌలర్లలో హర్ష్ 4, రుత్విక్ 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం 323 పరుగుల భారీ లక్ష్యఛేదనకు దిగిన సఫిల్‌గూడ సీసీ జట్టు... తేజ (5/8), అభిషేక్ (5/6) ధాటికి 21.5 ఓవర్లలో 57 పరుగులకే కుప్పకూలింది. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు గన్‌రాక్ సీసీ: 202/7 (ఆకాశ్ 50, లక్ష్మణ్ 54; రితేశ్ 5/25), హెచ్‌పీఎస్: 203/7 (సారుురెడ్డి 37 నాటౌట్; చిరంజీవ్ 5/30). గోల్కొండ సీసీ: 257 (ఎజాజ్ 86, చిరంజీవి 53; రంగస్వామి 5/48), హైదరాబాద్ డిస్ట్రిక్ట్: 253 (సౌభిక్ 113; చిరంజీవి 4/48). రుషిరాజ్ సీసీ: 177 (రాజేశ్ 55, జీయ 38; జితేందర్ 5/20), అంబర్పేట్ సీసీ: 179 (రామకృష్ణ 50, భరత్ 50; తహ్సీన్ 4/30). పికెట్ సీసీ: 318/6 (ప్రద్యుమ్న 75, శాశ్వత్ 81; సారుుకృష్ణ 4/85), లక్కీ ఎలెవన్: 124 (అశ్విత్ 68 నాటౌట్; సందీప్ గౌడ్ 3/18, నితీశ్ 3/37). సత్య సీసీ: 224 (ప్రజ్వల్82, సారుు హర్ష 52; తేజస్ 3/67, అబ్దుల్ హఫీజ్ 3/61), టైమ్ సీసీ: 36 (అక్షయ్ 4/14, రిత్విక్ 5/10). నటరాజ్ సీసీ: 205/7 (వరుణ్ 52 నాటౌట్; ఫైజాన్ 3/20), సన్‌షైన్ సీసీ: 206/8 (అక్షయ్ 37, సారుు తేజ 4/55, అచ్యుత్ 3/49). సూపర్ స్టార్: 213/9 (రోహిత్ 90, విక్రవర్ధన్ 43), విజయ్ సీసీ: 75 (యశ్వంత్ 3/32, రోషన్ 3/18). ఎంపీ బ్లూస్: 311/6 (రాజు 118, యేసుదాస్ 76, స్వామి 40), అను సీసీ: 236 (నవల్ 51, నకుల్ 40; సిద్ధాంత్ 3/36). హైదరాబాద్ వాండరర్స్:219 (పటేల్ 74; కౌస్తుబ్ 3/49), రిలయన్స సీసీ: 168 (అఖిల్ 54; అనికేత్ 4/36, జితేందర్ 3/47) -
సీకే బ్లూస్ విజయం
సాక్షి, హైదరాబాద్:సాయిసుశాంత్ (134 నాటౌట్), ఆర్. సుశాంత్ (91) అద్భుత బ్యాటింగ్‌తో ఎ-డివిజన్ వన్డే లీగ్ మ్యాచ్‌లో సీకేబ్లూస్ జట్టు 2 వికెట్ల తేడాతో నోబుల్ సీసీపై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన నోబుల్ సీసీ 44.5 ఓవర్లలో 281 పరుగులకు ఆలౌటైంది. అనిరుధ్ కపిల్ (105), మొహమ్మద్ శంషుద్దీన్ (111) సెంచరీలతో రాణించినా జట్టుకు ఓటమి తప్పలేదు. ప్రత్యర్థి బౌలర్లలో ప్రతీక్ 5, అశ్వద్ రాజీవ్ 4 వికెట్లు పడగొట్టారు. అనంతరం 282 పరుగుల లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన సీకే బ్లూస్ జట్టు 44.3 ఓవర్లలో 8 వికెట్లకు 285 పరుగులు చేసి గెలిచింది. సారుు సుశాంత్ అజేయ సెంచరీతో చెలరేగగా... ఆర్. సుశాంత్ తృటిలో సెంచరీని చేజార్చుకున్నాడు. నోబుల్ సీసీ బౌలర్లలో హిమాన్షు చౌదరీ 5, కె. ధ్రువ సారుు 3 వికెట్లు దక్కించుకున్నారు. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు విజయ్‌పురి విల్లోమెన్: 244 (విక్రమ్ 72, అఫ్రోజ్ పాషా 49; అనూప్ సింగ్ 3/39), సికింద్రాబాద్ క్లబ్: 204 (సంజీవ్ 83; షకీర్ అహ్మద్ 3/32). మహేశ్ సీసీ: 201/7 (షకీర్ 30, నరేశ్ 38; కేసరి శ్రీకాంత్ 3/25), అంబర్పేట్ సీసీ: 204/6 (శ్రీకాంత్ 73, రిజ్వాన్ 64). కాకతీయ సీసీ: 256/9 (రాము 54, రవి 42; జయదేవ్ 3/31), సికింద్రాబాద్ క్లబ్: 192 (సీవీ ఆనంద్ 74; రాజశేఖర్ 3/44). భారతీయ సీసీ: 334/9 (జగదీశ్ 106 నాటౌట్, పృథ్వీ 60; జాఫరుల్లా ఖాన్ 7/30), ఎలెవన్ మాస్టర్స్: 307 (కమల్ సావరియా 154, జాఫరుల్లా ఖాన్ 64; దత్తు 5/50, హరీశ్ 3/37). ఆర్జేసీసీ: 280 (పృథ్వీ 53, సతీశ్ 71; జయచంద్ర 3/60), విమ్కో సీసీ: 140 (రోహిత్ 30). ఆడమ్స్ ఎలెవన్: 274/8 (సచిన్ కుమార్ 33, దుర్గేశ్ 152, ఫయాజ్ 46), బాయ్స్ టౌన్: 135/8 (ఖురేషి 42, ముస్తఫా 44 నాటౌట్; దుర్గేశ్3/36). పీఎన్ యంగ్‌స్టర్స్: 135 (బిలాల్ 43; శేషగిరి 3/27), ఎస్‌యూసీసీ: 140/1 (రజనీకాంత్ 35, యశ్వంత్ 36 నాటౌట్, చంద్రశేఖర్ 60 నాటౌట్). ఏకలవ్య సీసీ: 143/9, స్టార్లెట్స్ సీసీ: 145/8 (సుముఖేశ్ 42; తిలక్ 4/17). ఏబీ కాలనీ: 95 (వైష్ణవ్ 5/33, నితిన్ 4/16), విక్టరీ సీసీ: 96/7. యాదవ్ డెరుురీ: 231/7 (ప్రణీత్ 85, ప్రణవ్ 77 నాటౌట్; వంశీ 4/45), వాకర్ టౌన్: 225 (అబ్దుల్ 48, సందీప్ 52; సాహిల్ 4/58). ఎస్కే బ్లూస్: 315 (ప్రదీప్ 118, బిశ్వజీత్ 70; అనిరుధ్ 4/66), టీమ్కుమ్: 146 (విఘ్నేశ్వర్ 62; బిశ్వజీత్ 4/18). ఎల్‌ఎన్‌సీసీ: 138 (మదన్క్షీర్ సాగర్ 6/46), హైదరాబాద్ పేట్రియాట్స్: 140/3 (పుణీత్ 30, శైలేష్ 46 నాటౌట్). కిషోర్ సన్స: 218 (నితిన్ 55, చిరాగ్ 43; నిఖిల్ 4/46, పృథ్వీ 4/46), గ్రీన్లాండ్స: 112 (నిఖిల్ 38; శేఖర్ 6/22). ఆల్‌సెయింట్స్: 94 (హన్స రాజ్ 6/30), లాల్ బహదూర్: 96/4 (సఫ్దర్ అలీ 35). సెయింట్ ఆండ్రూస్: 244 (ఆర్యన్ 80; జితేశ్ 3/38, భరత్ 3/63), సెయింట్ సాయి: 202 (జితేశ్ 110, హుస్సేన్ 39; ప్రియాంశు 3/37, శంకర్ 5/41). విజయ్ సీసీ: 181 (మయక్ 35, అర్జున్ 30; మూర్తి 3/30), యంగ్ సిటిజన్: 109 (అమర్నాథ్ 30; ఓంప్రకాశ్ 3/30, అర్జున్ 3/38, ఫరీద్ 4/29). అక్షత్ సీసీ: 195/9 (అవినాశ్ 40, రిత్విక్ 50 నాటౌట్), రిలయన్స సీసీ: 181 (లోకేశ్54, కేశవ్53; రోనక్ 3/56). సత్యం కోల్ట్స్: 71 (రిత్విక్ 32, రిషికేశ్ 32; రాహుల్ 3/10), శాంతి ఎలెవన్: 72/2. ఇంటర్నేషనల్ సీసీ: 239 (సచిత్ 48, ఆరోన్ జార్జ్ 34; సారుు వెంకట్ 3/30), సత్య సీసీ: 225 (సాత్విక్ 78; ఆర్యన్ 4/24). -
రాణించిన బషీరుద్దీన్
సాక్షి, హైదరాబాద్: ఎ- డివిజన్ వన్డే లీగ్‌లో బాయ్స్ టౌన్ బ్యాట్స్‌మెన్ బషీరుద్దీన్ (103 బంతుల్లో 96; 13 ఫోర్లు, 1 సిక్సర్), జబల్ ఖాన్ (81 బంతుల్లో 56; 8 ఫోర్లు) రాణించారు. దీంతో సోమవారం సదరన్ స్టార్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బాయ్స్ టౌన్ జట్టు 55 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన బాయ్స్ టౌన్ జట్టు 39.3 ఓవర్లలో 247 పరుగులకు ఆలౌటైంది. బషీరుద్దీన్ త్రుటిలో సెంచరీని చేజార్చుకోగా... జబల్ ఖాన్ అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. ప్రత్యర్థి బౌలర్లలో జ్యోతి స్వరూప్ 3 వికెట్లతో రాణించాడు. అనంతరం 248 పరుగుల లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన సదరన్ స్టార్స్ జట్టు 42.4 ఓవర్లలో 192 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. సూర్య చంద్ర (68) ఒక్కడే రాణించాడు. బాయ్స్ టౌన్ బౌలర్లలో రహమాన్ మాజిద్ 3, ముస్తఫా ఖాన్, సమీయుద్దీన్ చెరో రెండు వికెట్లు తీశారు. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు: రాయల్ సీసీ: 222 (శివ శంకర్ 42, మహేశ్ 37 నాటౌట్; పాండే 2/33, సౌరవ్ 2/38), ఎంఎల్ జైసింహా: 91 (శివ శంకర్ 2/22, రాఘవ 6/34). హెచ్‌సీఏ అకాడమీ: 356 (సాద్విక్ రెడ్డి 107, జిబిన్ 54, శ్రీనివాస్ 42; హిమాన్షు 5/32, లఖన్ 3/44), నోబుల్ సీసీ: 178 (మొహమ్మద్ షంశుద్దీన్ 102 నాటౌట్; నరేందర్ 5/28, శివ 5/32). -
ఫ్యూచర్ స్టార్ 350/9 డిక్లేర్డ్
సాక్షి, హైదరాబాద్: బ్యాట్స్‌మెన్ వికాస్ రావు (198 బంతుల్లో 159 నాటౌట్; 19 ఫోర్లు), అనిల్ కుమార్ (85) రాణించడంతో ఫ్యూచర్ స్టార్ జట్టు తొలిరోజు భారీ స్కోరు సాధించింది. ఎ- డివిజన్ టూ డే (ప్లేట్) లీగ్ చాంపియన్‌షిప్‌లో భాగంగా డబ్ల్యుఎంసీసీతో గురువారం జరిగిన మ్యాచ్‌లో 71. 4 ఓవర్లలో 9 వికెట్లకు 350 పరుగులు చేసి ఇన్నింగ్‌సను డిక్లేర్ చేసింది. వికాస్ రావు, అనిల్ కుమార్ అద్భుత ప్రదర్శన కనబరిచారు. ఆర్. యశ్వంత్ (33) రాణించాడు. ప్రత్యర్థి బౌలర్లలో జీఆర్ యశ్వంత్ 6 వికెట్లతో ఆకట్టుకున్నాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన డబ్ల్యుఎంసీసీ తొలిరోజు ఆట ముగిసే సమయానికి 12 ఓవర్లలో 4 వికెట్లకు 54 పరుగులు చేసింది. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు: ఎలిగెంట్: 105 (రంగనాథ్ 4/34, బాలరాజు 3/16), రెండో ఇన్నింగ్స్: 31/1 (7 ఓవర్లలో), హెచ్‌యూసీసీ: 154/9 డిక్లేర్డ్ (బి. బాలరాజు 41, సాయి రేవంత్ 58; ఆదిత్య 3/13). -
సెయింట్ మేరీస్ గెలుపు
సాక్షి, హైదరాబాద్: ఎ- డివిజన్ వన్డే లీగ్‌లో భాగంగా ఇంటర్నేషనల్ స్కూల్‌తో జరిగిన మ్యాచ్‌లో సెయింట్ మేరీస్ జట్టు 10 వికెట్ల తేడాతో గెలిచింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో సెయింట్ మేరీస్ బౌలర్ గోపి రెడ్డి (5/15) చెలరేగడంతో మొదట బ్యాటింగ్ చేసిన ఇంటర్నేషనల్ స్కూల్ 15.3 ఓవర్లలో 46 పరుగులకే కుప్పకూలింది. సయ్యద్ రెహమాన్ (17) టాప్ స్కోరర్. జట్టులో ఆరుగురు డకౌట్ కావడం విశేషం. అనంతరం 47 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన సెరుుంట్ మేరీస్ జట్టు 2.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 49 పరుగులు చేసి గెలిచింది. అస్కారి (10 బంతుల్లో 38 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అద్భుతంగా ఆడాడు. -
పవన్ కుమార్ సెంచరీ
సాక్షి, హైదరాబాద్: ఎ-డివిజన్ రెండు రోజుల లీగ్‌లో భాగంగా డెక్కన్ బ్లూస్, పీకేఎం సీసీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రా గా ముగిసింది. 23/0 ఓవర్‌నైట్ స్కోరుతో రెండోరోజు తొలి ఇన్నింగ్‌సను ప్రారంభించిన పీకేఎం సీసీ జట్టు 143 పరుగులు చేసింది. వివేక్ (65) అర్ధసెంచరీ చేశాడు. డెక్కన్ బ్లూస్ బౌలర్లలో అఖిలేశ్ 4 వికెట్లతో రాణించాడు. అనంతరం ఫాలోఆన్ ఆడుతూ రెండో ఇన్నింగ్‌సను ప్రారంభించిన పీకేఎం సీసీ జట్టు ఆటముగిసే సమయానికి 49 ఓవర్లలో 2 వికెట్లకు 191 పరుగులు చేసి మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. సాయి సంజీవ్ (52), పవన్ కుమార్ (102) ఆకట్టుకున్నారు. అంతకుముందు డెక్కన్బ్లూస్ జట్టు తమ తొలి ఇన్నింగ్‌సను 351/9 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు నిజాం కాలేజ్: తొలి ఇన్నింగ్స 221, రెండో ఇన్నింగ్స 277/6 డిక్లేర్డ్ (సారుు కుమార్ 100, పి. శరత్ 114; రంగనాథ్ 4/64), ఎస్బీఐ: తొలి ఇన్నింగ్స 140 (అన్వేష్ రెడ్డి 6/30, రెండో ఇన్నింగ్స 111/5 (నాగ శ్రీనివాస రావు 42). -
టీమ్ కున్ ఘన విజయం
ఎ- డివిజన్ వన్డే లీగ్ సాక్షి, హైదరాబాద్: బ్యాట్స్‌మెన్‌తో పాటు బౌలర్లు సమష్టిగా రాణించడంతో ఎ-డివిజన్ వన్డే లీగ్‌లో టీమ్‌కున్ జట్టు ఘనవిజయం సాధించింది. గురువారం విక్టోరియా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 254 పరుగుల తేడాతో టీమ్ కున్ జట్టు గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ కున్ 45 ఓవర్లలో 8 వికెట్లకు 366 పరుగులు చేసింది. విఘ్నేశ్వర్ (82), అనిరుధ్ (80), విహారి (61) అర్ధసెంచరీలతో రాణించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన విక్టోరియా జట్టును టీమ్ కున్ బౌలర్లు కె. అనిరుధ్ (6/25), ధీరజ్ (3/29) నియంత్రించారు. వీరిద్దరి ధాటికి ఆ జట్టు 24.4 ఓవర్లలో 112 పరుగులకే కుప్పకూలింది. రామకృష్ణ (48) చివరి వరకు పోరాడాడు. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు ఎంపీ యంగ్‌మెన్: 224/7 (చారి 67), యూత్ సీసీ: 83 (నిహార్ 4/36, శివ 3/16). కాకతీయ సీసీ: 221 (సారుు 61; రిషద్ 3/36), రిషిరాజ్ సీసీ: 104 (మల్లికార్జున్ 40, రవి 3/14, రాజశేఖర్ 3/15). యూత్ సీసీ: 80 (రవి 5/37), కాకతీయ సీసీ: 83/3 . ఎంపీ స్పోర్టింగ్: 274 (రమాకాంత్ 79), సాక్రడ్ హార్ట్ సీసీ: 84 (సతీశ్ 3/6). గగన్ మహల్: 90 (చైతన్య 3/31, సిద్ధార్థ్ 3/23), మారేడుపల్లి బ్లూస్: 91/1 (స్వామి 53 నాటౌట్). సదరన్ స్టార్: 246 (యశ్వంత్ 69; కల్యాణ్ రావు 4/63, శైలేందర్ 4/11), సెయింట్ మేరీ సీసీ: 229 (శ్రీకర్ 72, చక్రవర్తి 5/52). ఎస్‌యూసీసీ: 234 (నితీశ్ 48, చంద్రశేఖర్ 4/57, నిఖిల్ 3/49), ఆజాద్సీసీ: 168 (స్వరూప్ 4/34). పీఎన్వై సీసీ: 193 (శ్రీకాంత్ 34, రాకేశ్ 4/37), విజయానగర్: 54( నర్సింహా 4/23, ఫహీముద్దీన్ 3/6). టీమ్‌కున్: 239 (వి. సహస్ర 67; సుశాంత్ 4/65), స్టార్లెట్స్: 128 (కార్తీశ్ 3/26). వాకర్స్ టౌన్ : 217/8 (సందీప్ 62, వంశీ 45; గంగాధర్ 3/20), ఎల్‌ఎన్‌సీసీ: 218/5 (ఓబుల్ రెడ్డి 88, ప్రతాప్ 63 నాటౌట్). సౌతెండ్ రేమండ్‌స: 160 (హాజీ 51, అఫాన్ 50నాటౌట్; సారన్ కశ్యప్ 5/13, నైరుత్ రెడ్డి 5/20), అమీర్ పేట్ సీసీ: 117 (అరుణ్‌కుమార్5/19). -
గ్రీన్లాండ్స్ విజయం
సాక్షి, హైదరాబాద్: బ్యాట్స్‌మన్ సుధీంద్ర (95 నాటౌట్)తో పాటు బౌలర్ నిఖిల్ (7/36) రాణించడంతో గ్రీన్లాండ్స్ జట్టు విజయం సాధించింది. ఎ- డివిజన్ వన్డే లీగ్‌లో భాగంగా ఇంపీరియల్ సీసీతో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంపీరియల్ సీసీ జట్టు 30.3 ఓవర్లలో 120 పరుగులు చేసింది. అనంతరం గ్రీన్లాండ్స జట్టు 14.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 121 పరుగులు చేసి గెలిచింది. సుధీంద్ర దూకుడుగా ఆడి ఆకట్టుకున్నాడు. ఇతర మ్యాచ్‌ల వివరాలు హైదరాబాద్ పేట్రియాట్స్: 267 (శైలేష్ 49; అరుణ్ 3/62), మయూర్: 69/9 (మహేశ్ 5/21). హెచ్‌సీఏ అకాడమీ: 406 (శ్రీనివాస్ 151; శశికుమార్ 5/121), సెయింట్ ప్యాట్రిక్స్: 181 (సాహిల్ 42; శివకోఠి 5/40). రాయల్ సీసీ: 207 (రవి శంకర్ 40; అమృత్ 3/18), సెయింట్ సాయి: 107 (హూస్టన్ 41; రాఘవ 4/28). తిరుమల: 209 (శ్రీకాంత్ 42, నవీన్ 76; బషీరుద్దీన్ 4/32, షరీఫ్ 3/14), బాయ్స్ టౌన్: 201 (బషీరుద్దీన్ 75; ధనంజయ్ 5/36). యంగ్ సిటిజన్: 154 (అస్లమ్ 71; అభిజిత్ 5/38, హిమాన్షు 5/6); నోబెల్: 157/8 (అనిరుధ్ 59, షంశుద్దీన్ 54; సాయి సృతీశ్ 7/21). -
చరణ్ తేజ సంచలనం
హైదరాబాద్: ఎస్‌యూసీసీ బౌలర్లు చరణ్ తేజ (7/6), అభయ్ స్వరూప్(4/3) విజృంభించారు. వీరిద్దరి ధాటికి చమ్స్ ఎలెవన్ జట్టు 44 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఎ- డివిజన్ వన్డే లీగ్‌లో భాగంగా సోమవారం చమ్స్ ఎలెవన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎస్‌యూసీసీ జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన చమ్స్ ఎలెవన్ జట్టు 14.1 ఓవర్లలో 44 పరుగులకే ఆలౌటైంది. చరణ్ ఆరు పరుగులిచ్చి ఏడు వికెట్లతో చెలరేగగా... అభయ్ కేవలం మూడు పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీశాడు. 45 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్‌యూసీసీ కేవలం 6.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 46 పరుగులు చేసి గెలిచింది. ఇతర మ్యాచ్‌ల ఫలితాలు మహేశ్ సీసీ: 393/6 (నరేశ్ 133, రామాంజనేయ ప్రసాద్ 102, శేఖర్ 71; పృథ్వీ 4/63), భారతీయ సీసీ: 142 (జగదీశ్ 65; విజయ్ 4/19). హైదరాబాద్ పాంథర్స్: 71 (రాఘవ 5/30), రాయల్ సీసీ: 72. వాకర్స్ టౌన్: 253 (ప్రవీణ్ 78, సందీప్ 77; కార్తీశ్ 4/38, ప్రసాద్ 2/25), టీమ్ కున్: 254/7 (విఘ్నేశ్వర్ 102, సహస్ర రెడ్డి 110). ధ్రువ్ ఎలెవన్: 190 (రూపేశ్ 53నాటౌట్, జాన్సన్ 33; ఆనంద్ కశ్యప్ 3/68, నిఖిల్ 3/29), గ్రీన్ ల్యాండ్స: 191 (సుధీంద్ర 101నాటౌట్). సత్యం కోల్ట్స్: 246/6 (రిషికేశ్64, సూర్యన్ 104నాటౌట్), రిలయన్స సీసీతో మ్యాచ్. ఆర్జేసీసీ: 294/7 (అవినాశ్ 98నాటౌట్, పృథ్వీ 88; అలీ 3/38), యూత్‌సీసీ: 147(శ్రీకాంత్ 32; శ్రీధర్ 4/32, పృథ్వీ 3/42). హైదరాబాద్ పేట్రియాట్స్: 167 (మదన్ 43; ఆకాశ్ 3/25), స్టార్లెట్స్: 82 (మదన్ 4/20). యాదవ్ డెయిరీ: 99 (39.5 ఓవర్లలో), రోషనారా: 10/4 (15 ఓవర్లలో). విక్టరీ సీసీ: 188 (సయ్యద్ 56, రోహిత్ సాగర్ 57; అరుణ్ 3/43, శ్రీకాంత్ 3/48), మయూర్ సీసీ: 49 (పవన్ 3/60). సన్‌గ్రేస్: 73 (సయ్యద్ సాదుద్దీన్ 36; సాకేత్ 3/11), యంగ్ మాస్టర్స్: 54 (అజీజ్ 3/7, ప్రవీణ్ సాగర్4/12). హెచ్‌సీఏ అకాడమీ: 287/8 (సీతారామ్ రెడ్డి 49, సాద్విక్ 42; సాయి తేజ 3/61), కన్సల్ట్ సీసీ: 169 (భరత్ 34, నజీర్ 72 నాటౌట్). ఎంపీ స్పోర్టింగ్ ఎలెవన్: 227/5 (రమాకాంత్ 47, వీరేంద్రనాథ్ 38, రాజశేఖర్ 41, గోపీ 71 నాటౌట్), అను సీసీ: 131 (తేజ 3/30). రాయల్ సీసీ: 248 (కిరణ్ 111, యశ్వంత్ 31; జాన్సన్ 3/51), ధ్రువ్ ఎలెవన్: 79 (రాఘవ 4/25, యశ్వంత్ 3/33). -
హడలెత్తించిన శేషగిరి
సాక్షి, హైదరాబాద్: ఎస్‌యూసీసీ బౌలర్ శేషగిరి (7/10) చెలరేగాడు. సదర్న్ స్టార్స్ బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించాడు. దీంతో ఎస్‌యూసీసీ 225 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఎ-డివిజన్ వన్డే లీగ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేపట్టిన ఎస్‌యూసీసీ 41 ఓవర్లలో 9 వికెట్లకు 251 పరుగులు చేసింది. చరణ్ తేజ (105 నాటౌట్) సెంచరీ సాధించగా, రాజ్ (53) రాణించాడు. తర్వాత సదర్న్ స్టార్స్ అనూహ్యంగా 26 పరుగులకే కుప్పకూలింది. శేషగిరి ధాటికి ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ ఎవరూ నిలువలేకపోయారు. ఇతర మ్యాచ్ ల స్కోర్లు ఆర్జేసీసీ: 291/9 (అవినాశ్ 51, పృథ్వీ 60, నాగార్జున 40), ఎంపీ యంగ్మన్:178 (సందీప్ 36, నితిన్ 35; కిరణ్ 5/16). యాదవ్ డెయిరీ: 249/6 (సాయివరుణ్ 107, సాకేత్ 53; సురేశ్ 3/43), స్టార్లెట్స్: 118 (సురేశ్ 44). ఆల్ సెయింట్స్: 214/3 (సాత్విక్ రెడ్డి 111, శివ 66; రాఘవ 3/84), రాయల్ సీసీ: 217/4 (నీరజ్ కుమార్ 113 నాటౌట్, నాగ్ 35). సీకే బ్లూస్: 347 (సుశాంత్ 110, బి.సారుు సుశాంత్ 81, బాలకృష్ణ 56 నాటౌట్; రుత్విక్ యాదవ్ 6/57, తేజస్ 3/22), సఫిల్‌గూడ: 93 (రుత్విక్ యాదవ్ 31; అశ్వద్ 6/18, ప్రతీక్ 3/14). అక్షిత్ సీసీ: 242 (భరద్వాజ్ 59, రోనక్ 60, రిలాస 3/69, సాత్విక్ అగర్వాల్ 4/57), సత్యం కోల్ట్స్: 96 (రిత్విక్ 5/7). రాజు సీఏ: 194 (అభినవ్ 66, పునీత్ 50; సంతోష్ 4/22), రంగారెడ్డి జిల్లా: 109 (వర్షిత్ 30; కౌశిక్ 6/33). ఆడమ్స్ ఎలెవన్: 251/5 (సచిన్ కుమార్ 101, జయంత్ 80), పీఎన్ యంగ్‌స్టర్స్: 252/7 (శ్రీకాంత్ 96, నరసింహా 51; దుర్గేశ్ 3/46). యంగ్ సిటీజన్: 142 (పృథ్వి 38, సారుు 34; జిబిన్ 5/15), హెచ్‌సీఏ అకాడమీ: 145/2 (సతీశ్ 56 నాటౌట్, శ్రీనివాస్ 50 నాటౌట్). -
సన్గ్రేస్ను గెలిపించిన శుభ్, అస్లామ్
సాక్షి, హైదరాబాద్: బౌలింగ్‌లో శుభ్ అగర్వాల్ (4/8), మొహమ్మద్ అస్లామ్ (4/8) చెలరేగడంతో ఎ- డివిజన్ వన్డే లీగ్‌లో సన్‌గ్రేస్ జట్టు విజయం సాధించింది. శనివారం సెయింట్ సాయి జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 5 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌గ్రేస్ జట్టు 21.5 ఓవర్లలో 51 పరుగుల అల్ప స్కోరుకే ఆలౌటైంది. విక్రాంత్ చౌదరీ (19) టాప్ స్కోరర్. సెయింట్ సాయి బౌలర్లలో నిఖిల్ 3 వికెట్లు పడగొట్టగా... లలిత్, తేజ, సన్నీ తలా రెండు వికెట్లతో రాణించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సెయింట్ సాయి జట్టు శుభ్ అగర్వాల్, అస్లామ్ ధాటికి 26.2 ఓవర్లలో 46 పరుగులకే కుప్పకూలింది. రిలయన్స, యూనివర్సల్ జట్ల మధ్య జరిగిన మరో మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో రిలయన్స జట్టు ఘనవిజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన యూనివర్సల్ జట్టు 22.4 ఓవర్లలో 67 పరుగులకు ఆలౌటైంది. హర్ష (23) రాణించాడు. రిలయన్స బౌలర్లలో కౌస్తుబ్ 5 వికెట్లు దక్కించుకున్నాడు. అనంతరం రిలయన్స జట్టు 7.3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 68 పరుగులు చేసి గెలిచింది. అఖిల్ (51) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. -
విజృంభించిన తిలక్, రోహన్
సాక్షి, హైదరాబాద్: బ్యాటింగ్‌లో ఠాకూర్ తిలక్ వర్మ (107 బంతుల్లో 136నాటౌట్; 17 ఫోర్లు, 3 సిక్సర్లు), బౌలింగ్‌లో రోహన్ (7/1) విజృంభించడంతో క్రెసెంట్ స్కూల్ భారీ విజయాన్ని సాధించింది. ఎ- డివిజన్ వన్డేలీగ్లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో 318 పరుగుల తేడాతో న్యూచైతన్య జూనియర్ కాలేజ్‌పై గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన క్రీసెంట్ స్కూల్ 40 ఓవర్లలో 2 వికెట్లకు 327 పరుగులు చేసింది. తిలక్‌తో పాటు అనిరుధ్ (58), వివేక్ (53 నాటౌట్) అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు. అనంతరం 328 పరుగుల భారీ లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన న్యూ చైతన్య కాలేజ్ బ్యాట్స్‌మెన్‌ను క్రెసెంట్ జట్టు బౌలర్లు హడలెత్తించారు. వీరి ధాటికి చైతన్య కాలేజ్ జట్టు కేవలం 6.5 ఓవర్లలో 19 పరుగులకే ఆలౌటైంది. రోహన్‌తో పాటు త్యాగి (3/12) రాణించాడు. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు లయోలా అకాడమీ: 134 (ధీరజ్ విష్ణు 6/23); కిట్స్ జూనియర్ కాలేజ్: 137/4 (ప్రఫుల్ కుమార్ 51, మనూస్ 58 నాటౌట్). యువ ఎడ్యుకేషనల్ అకాడమీ: 60 (యశ్వంత్ 5/32, కుషాల్ 5/8); డీఏవీ పబ్లిక్ స్కూల్:61/1. సుల్తాన్ ఉలూమ్ జూనియర్ కాలేజ్: 143 (రెహమాన్ షకూర్ 5/18); మర్యాస్ సెంటినరీ జూనియర్ కాలేజ్:78 (సోఫియాన్ 5/13). నియో క్వాంటమ్ జూనియర్ కాలేజ్:100 ( కశ్యప్ 6/44); ఫస్ట్ క్లాస్ జూనియర్ కాలేజ్: 101/4 ( రోహిత్ 36). భారతీయ విద్యా భవన్స: 124 (సాయి వర్ధన్ 3/32); అర్బన్ జూనియర్ కాలేజ్:125/6 (సాయికేత్ సాహా 4/17). విజినరీ జూనియర్ కాలేజ్ : 273/9 (అభినవ్ 46, అబ్ధుల్ ఖలీద్ ఖురేషి 62, మీర్ హుస్సాం 39, అజ్మత్ 59; ఆయూబ్ 5/26); మర్యాస్ కాలేజ్ (యూసుఫ్‌గూడ): 193 (సూరజ్ సక్సేనీ 60, రాహుల్ రావు 46; మొహమ్మద్ నమన్ అఫ్సర్ 5/30). సెయింట్ ట్ మర్యాస్ జూనియర్ కాలేజ్ (బషీర్‌బాగ్):216 (సాయి కృష్ణ భార్గవ 30, భరత్ 34; పఠాన్ 3/35, అబ్ధుల్ ఖదీర్ 3/37); గెలాక్సీ జూనియర్ కాలేజ్: 215 (లియాఖత్ హుస్సేన్ 65, పఠాన్ 36 నాటౌట్; కృష్ణ భార్గవ 5/43). హెచ్‌పీఎస్ : 255 (హరీశ్ సింగ్ 95, రాహుల్ నాయక్ 63; గుణ సత్యార్థ్ 4/46); గీతాంజలి సీనియర్ స్కూల్:142 (యశ్ బన్సల్ 84, సాయి పూర్ణానంద్ 31; రిషిక్ రెడ్డి 4/12). గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్: 152 /8 (జి. ప్రకాశ్ 46; సారుు అభినవ్ 3/20); షేర్వుడ్ పబ్లిక్ స్కూల్: 78 ( రిచా కీర్తన్ 4/17). -
చార్మినార్ సీసీ గెలుపు
సాక్షి, హైదరాబాద్: బౌలర్లు రాణించడంతో చార్మినార్ సీసీ జట్టు ఘన విజయాన్ని సాధించింది. ఎ- డివిజన్ మూడు రోజుల లీగ్‌లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఇన్నింగ్స 91పరుగుల తేడాతో స్పోర్టింగ్ ఎలెవన్ జట్టును ఓడించింది. తొలి ఇన్నింగ్సలో 143 పరుగులు చేసిన స్పోర్టింగ్ ఎలెవన్ జట్టు రెండో ఇన్నింగ్సలో 27.3 ఓవర్లలో 83 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది.చార్మినార్ బౌలర్లలో మొహమ్మద్ సిరాజ్ 4 వికెట్లతో రాణించాడు. అంతకుముందు చార్మినార్ సీసీ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 104 ఓవర్లలో 317 పరుగులు చేసింది. ఇతర మ్యాచ్‌ల వివరాలు ఇన్‌కం ట్యాక్స్: తొలి ఇన్నింగ్స్ 467, రెండో ఇన్నింగ్స్ 207/2 (హరికాంత్ 57, హిమాన్షు 68, సందీప్ 40 నాటౌట్); జై హనుమాన్: 217 (సాకేత్ 65 నాటౌట్; హిమాన్షు 4/103). డెక్కన్‌క్రానికల్: తొలి ఇన్నింగ్స్ 375; దయానంద్: ఇన్నింగ్స్ 380/8 (కుషాల్ పర్వేజ్ 112, వంశీరెడ్డి 64; సీవీ మిలింద్ 4/64). -
హడలెత్తించిన సచిత్ నాయుడు
సాక్షి, హైదరాబాద్: ఎ-డివిజన్ రెండు రోజుల లీగ్‌లో కాన్‌కర్డ్ 7 వికెట్ల తేడాతో హెచ్యూసీసీపై విజయం సాధించింది. కాన్‌కర్డ్ బౌలర్లు సచిత్ నాయుడు (6/26), మున్నా తివారీ (4/12) ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను వణికించారు. దీంతో గురువారం రెండో ఇన్నింగ్సలో హెచ్‌యూసీసీ 123 పరుగులకే కుప్పకూలింది. బాలరాజు (52) రాణించాడు. తర్వాత 67 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన కాన్‌కర్డ్ రెండో ఇన్నింగ్సలో 3 వికెట్ల నష్టానికి 69 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్సలో హెచ్‌యూసీసీ 60, కాన్‌కర్డ్ 117 పరుగులు చేశాయి. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు ఆక్స్ఫర్డ్ బ్లూస్ తొలి ఇన్నింగ్స్ : 193 (కృతిక్ రెడ్డి 107; సూర్యతేజ 5/50), పాషా బీడి తొలి ఇన్నింగ్స్ : 455/7 డిక్లేర్డ్, ఆక్స్ఫర్డ్ రెండో ఇన్నింగ్స: 156 (అశోక్ డేవిడ్ 30, కృతిక్ రెడ్డి 33; ప్రవీత్ కుమార్ 4/34). ఫ్యూచర్ స్టార్ తొలి ఇన్నింగ్స్ : 380/9 డిక్లేర్డ్ (వికాస్ రావు 155), ఎలిగెంట్ సీసీ తొలి ఇన్నింగ్స్ 115 (అరుణ్ రాథోడ్ 6/29, అంకిత్ అగర్వాల్ 4/37), ఎలిగెంట్ సీసీ రెండో ఇన్నింగ్స: 80 (శ్రీధర్ రెడ్డి 5/20). రాకేశ్ ఎలెవన్ తొలి ఇన్నింగ్స్: 352/9 డిక్లేర్డ్, ఉ స్మానియా తొలి ఇన్నింగ్స్ 318 (సిద్ధాంత్ 115, కృపాకర్ 40; విఘ్నేశ్ 3/86), రాకేశ్ రెండో ఇ న్నింగ్స: 109/6 (హుస్సేన్ 33; కృపాకర్ 3/36). పోస్టల్ తొలి ఇన్నింగ్స్ 187, న్యూబ్లూస్ తొలి ఇన్నింగ్స్ : 64, ఫాలోఆన్‌లో రెండో ఇన్నింగ్స్ : 113 (భరత్ 43; వరప్రసాద్ 5/28, భార్గవ్ ఆనంద్ 4/14). గెలాక్సీ తొలి ఇన్నింగ్స్: 125/9 డిక్లేర్డ్, శ్రీచక్ర తొలి ఇన్నింగ్స:72 (నిఖిల్ 48; ఆశిష్ 5/33, దీపక్ 327), గెలాక్సీ రెండో ఇన్నింగ్స: 135 (భరత్ కుమార్ 5/39), శ్రీచక్ర రెండో ఇన్నింగ్స: 143 (లోక్‌నాథ్ 38; సంహిత్ రెడ్డి 6/62). చీర్‌ఫుల్ చమ్స్ తొలి ఇన్నింగ్స్: 247, తెలంగాణ తొలి ఇన్నింగ్స్ : 140/9 డిక్లేర్డ్ (రాకేశ్ 30, నర్సింగ్ రావు 52; విఘ్నేశ్ 4/10), తెలంగాణ రెండో ఇన్నింగ్స: 148/3 (రాకేశ్ 60 నాటౌట్). ఎంసీసీ తొలి ఇన్నింగ్స్: 145, రాజు సీసీ తొలి ఇన్నింగ్స్: 109, ఎంసీసీ రెండో తొలి ఇన్నింగ్స్: 253/3 డిక్లేర్డ్ (సంతోష్ 115, దీపక్ 46), రాజు సీసీ రెండో తొలి ఇన్నింగ్స్: 139/7 (వివేకానంద్ 73; మనోజ్ కుమార్ 4/41). హైదరాబాద్ టైటాన్స్ తొలి ఇన్నింగ్స్ : 274, డబ్ల్యూ ఎంసీసీ తొలి ఇన్నింగ్స్: 306 (హబీబ్వలి 60, నాగరాజు 107, సమన్విత్ 68; సాక్ష్యం గోగియా 6/71), టైటాన్స రెండో ఇన్నింగ్స: 235 (నయీం 40, సిద్దిఖ్ అఫ్సర్ 82; యశ్వంత్ 3/75). -
అమోల్ షిండే ఆల్‌రౌండ్ షో
సాక్షి, హైదరాబాద్: ఎ-డివిజన్ మూడు రోజుల లీగ్‌లో ఆంధ్రాబ్యాంక్ ఆటగాడు అమోల్ షిండే (7/77, 81) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. దీంతో ఎన్సకాన్స జట్టు పరాజయం దిశగా పయనిస్తోంది. రెండో రోజు 148/5 ఓవర్‌నైట్ స్కోరుతో బుధవారం ఆట ప్రారంభించిన ఎన్సకాన్స తొలి ఇన్నింగ్సలో 195 పరుగుల వద్ద ఆలౌటైంది. మెహదీ హసన్ (65) రాణించాడు. అమోల్ షిండే ఏడు వికెట్లు తీశాడు. దీంతో ఆంధ్రాబ్యాంక్‌కు 9 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. తర్వాత రెండో ఇన్నింగ్స ఆడిన ఆంధ్రాబ్యాంక్ 191 పరుగుల వద్ద ఆలౌటైంది. ఒక దశలో ప్రత్యర్థి బౌలర్ ముదాసిర్ హుస్సేన్ (7/63) ధాటికి తడబడిన ఆంధ్రాబ్యాంక్‌ను షిండే (81) బ్యాటింగ్‌లోనూ రాణించి ఆదుకున్నాడు. దీంతో ఎన్సకాన్స ముందు 201 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దీన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఎన్సకాన్స రెండో ఇన్నింగ్సలో ఆట నిలిచే సమాయానికి 5 వికెట్ల నష్టానికి 48 పరుగులు చేసింది. కనిష్క్ నాయుడికి 3 వికెట్లు దక్కాయి. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు హైదరాబాద్ బాట్లింగ్ తొలి ఇన్నింగ్స: 110 (సారుు కీర్త్ 47; విశాల్ శర్మ 6/42, ఆకాశ్ భండారి 3/42), ఎస్బీహెచ్ తొలి ఇన్నింగ్స: 220/2 (డాని డెరిక్ ప్రిన్స 84, కేఎస్కే చైతన్య 77). డెక్కన్ క్రానికల్ తొలి ఇన్నింగ్స: 276/7 (మిలింద్ 97 బ్యాటింగ్, షాదాబ్ 57; శ్రీచరణ్ 4/107), ఆర్.దయానంద్‌తో మ్యాచ్. స్పోర్టింగ్ ఎలెవన్ తొలి ఇన్నింగ్స: 143/9 డిక్లేర్డ్ (మాన్సింగ్ రమేశ్ 40, యతిన్ 30; సిరాజ్ 4/27), చార్మినార్ తొలి ఇన్నింగ్స: 117/4 (సారుు ప్రజ్ఞయ్ రెడ్డి 48). ఇన్కమ్ ట్యాక్స్ తొలి ఇన్నింగ్స: 331/7 (వంశీవర్ధన్ రెడ్డి 91 బ్యాటింగ్, అక్షత్ రెడ్డి 64, హబీబ్ అహ్మద్ 45, హర్షవర్ధన్ నాయుడు 47; తేజ 3/22), జైహనుమాన్‌తో మ్యాచ్. -
చక్రవర్తికి 7 వికెట్లు
సాక్షి, హైదరాబాద్: సదర్న్ స్టార్స్ బౌలర్ చక్రవర్తి (7/42) చెలరేగడంతో ఈ జట్టు 30 పరుగుల తేడాతో లాల్‌బహదూర్ పీజీపై గెలుపొందింది. ఎ-డివిజన్ వన్డే లీగ్‌లో సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేపట్టిన సదర్న్ స్టార్స్ 195 పరుగుల వద్ద ఆలౌటైంది. రితేశ్ (64) రాణించాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన లాల్‌బహదూర్ జట్టు 165 పరుగులకే ఆలౌటైంది. దినేశ్ (58) మినహా ఇంకెవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయారు. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు యంగ్ సిటిజన్: 70 (వంశీ ఆచార్య 5/6), నటరాజ్: 71/9 (అజయ్ మూర్తి 4/8). తిరుమల: 94 (గిరి 5/22), ఎస్‌యూసీసీ: 95/5 (చరణ్ 32). సెయింట్ సాయి: 235 (జితేశ్ రెడ్డి 110, అమృత్ 48; శివేష్ 3/47), హైదరాబాద్ పాంథర్స్: 143 (జితేశ్ రెడ్డి 5/29, నిఖిల్ 3/22). -
స్పోర్టివ్ సీసీపై నేషనల్ సీసీ గెలుపు
సాక్షి, హైదరాబాద్: జయంత్ (7/11) బౌలింగ్‌లో చెలరేగినప్పటికీ స్పోర్టివ్ సీసీ జట్టు పరాజయం పాలైంది. ఎ డివిజన్ రెండు రోజుల లీగ్‌లో నేషనల్ సీసీ జట్టు 5 వికెట్ల తేడాతో స్పోర్టివ్ సీసీ జట్టుపై గెలుపొందింది. శుక్రవారం రెండో రోజు ఆటలో స్పోర్టివ్ సీసీ జట్టు రెండో ఇన్నింగ్సలో 26.1 ఓవర్లలో 90 పరుగులకు ఆలౌటైంది. గోపీకృష్ణ (30) రాణించాడు. నేషనల్ సీసీ బౌలర్లలో సుమిత్ 5, ప్రణీత్ 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం నేషనల్ సీసీ జట్టు రెండో ఇన్నింగ్సలో 12.3 ఓవర్లలో 5 వికెట్లకు 135 పరుగులు చేసి గెలిచింది. ప్రశాంత్ (46), నరేశ్ (30) ఆకట్టుకున్నారు. స్పోర్టివ్సీసీ బౌలర్లలో అనుదీప్ 3 వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు తొలి ఇన్నింగ్సలో స్పోర్టివ్ సీసీ 138 పరుగులు చేసి ఇన్నింగ్స డిక్లేర్డ్ చేయగా... నేషనల్ సీసీ 96 పరుగులు మాత్రమే చేసింది. ఇతర మ్యాచ్‌ల వివరాలు నిజామ్ సీసీ: 301 (సందీప్ 44, శరత్ 34, అక్షయ్ 126 నాటౌట్; సంపత్ 4/122, అఖిలేశ్ 4/76), రెండో ఇన్నింగ్స 41/2; డెక్కన్ బ్లూస్: 268 (హర్షవర్ధన్ 43, డి. హర్షవర్ధన్ 126; అన్వేష్ /90, సారుు కుమార్ 3/50). విజయ్ హనుమాన్: 252/7 (శశిధర్ 46, మెహర్‌ప్రసాద్ 71, రంగనాథ్ 61); మాంచెస్టర్ 23/1. బ్రదర్స్ ఎలెవన్: 129/9 డిక్లేర్డ్ (మొహమ్మద్ ముష్ఫికర్ 43; రిషబ్ 5/34, మొహమ్మద్ రజా 3/39); జైభగవతి: 104/4 (శిరీష్ 72 నాటౌట్). -
షాలిమార్ సీసీ గెలుపు
సాక్షి, హైదరాబాద్: బ్యాటింగ్‌లో అబ్దుల్ యూసుఫ్ (50), దేవేశ్ (48), బౌలింగ్‌లో ఆర్యన్ (5/65) రాణించడంతో ఎ-డివిజన్ వన్డే లీగ్‌లో షాలిమార్ జట్టు ఘనవిజయాన్ని సాధించింది. సోమవారం ఉప్పల్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో 77 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన షాలిమార్ సీసీ 47.4 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌటైంది. యూసుఫ్ అర్ధసెంచరీ చేయగా.. ఖుర్షీద్ (31) రాణించారు. ఇంటర్నేషనల్ సీసీ బౌలర్లలో సొహైల్ 3 వికెట్లు తీశాడు. అనంతరం ఇంటర్నేషనల్ సీసీ 26.4 ఓవర్లలో 141 పరుగులకే అలౌటైంది. ఆర్యన్ 5వికెట్లు, ఖుర్షీద్ 3 వికెట్లు పడగొట్టారు. మరో మ్యాచ్‌లో సూపర్‌స్టార్ క్రికెట్‌క్లబ్ 84 పరుగుల తేడాతో నోబుల్ క్రికెట్ క్లబ్‌పై గెలుపొందింది. కులీకుతుబ్ షా మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్‌స్టార్ జట్టు 47.3 ఓవర్లలో 285 పరుగులకు ఆలౌటైంది. సాయి కృష్ణ (57) అర్ధసెంచరీ చేశాడు. నోబుల్ బౌలర్లలో హిమాన్షు 5 వికెట్లు పడగొట్టాడు. అనంతరం నోబుల్ క్రికెట్ క్లబ్ 37 ఓవర్లలో 201 పరుగులకు ఆలౌటైంది. షంషుద్దీన్ (51), లఖన్ (51), అనిరుధ్ (30) రాణించారు. సూపర్‌స్టార్ బౌలర్లలో సంతోష్ 6 వికెట్లతో ఆకట్టుకున్నాడు. -
కదం తొక్కిన సాత్విక్
సాక్షి, హైదరాబాద్: బ్యాటింగ్‌లో సాత్విక్‌రెడ్డి (134 బంతుల్లో 150; 18ఫోర్లు, 1 సిక్సర్), బౌలింగ్‌లో నీల్ చక్రవర్తి (4/23), ముజ్తాబా (4/18) చెలరేగడంతో ఎ- డివిజన్ వన్డే లీగ్‌లో ఆల్‌సెయింట్స్ హైస్కూల్ జట్టు ఘన విజయాన్ని సాధించింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 238 పరుగుల తేడాతో ఇంపీరియల్ జట్టుపై గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆల్‌సెయింట్స్ జట్టు 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసింది. సాత్విక్ సెంచరీతో కదంతొక్కాడు. తమీమ్ (48) రాణించాడు. ఇంపీరియల్ జట్టు బౌలర్లలో సాయి మణికంఠ 3 వికెట్లు పడగొట్టాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంపీరియల్ జట్టు 13.3 ఓవర్లలో 43 పరుగులకే ఆలౌటైంది. ఇతర మ్యాచ్‌ల వివరాలు లక్కీ ఎలెవన్: 266( మహేశ్ 120, ప్రమోద్ రెడ్డి 63; సుహాస్ రెడ్డి 6/25), రాజు సీఏ: 139 (పునీత్ 20; శ్రవణ్ యాదవ్ 4/35). ఎలెవన్ మాస్టర్స్: 229/8 (కమల్ సావరియా 51, సలీమ్ 69; చంద్రకాంత్ 3/30, వంశీ 4/19), యూత్ సీసీ: 150 (అనిల్ 48; జాఫర్ 5/30, కమల్ 3/10). హెచ్‌పీఎస్-రామంతాపూర్: 154 (వైష్ణవ్ 43; శశికుమార్ 3/25, ఆర్యన్ 3/28), సెయింట్ ప్యాట్రిక్స్: 158/5 (ఆర్యన్ 47, సాయివినయ్ 41; వైష్ణవ్ 4/44). మయూర్ సీసీ: 195 (గోవర్ధన్ 63, శ్రీకాంత్ 39; ప్రభాత్ 5/36, జకారియా 3/19), విక్టోరియా: 84 (జకారియా 50; గోవర్ధన్ 5/25), ఆడమ్స్ ఎలెవన్: 181 (జయంత్ 86; రాహుల్ రాజీవ్ 4/31, శైలేంద్ర 3/31), సెయింట్ మేరీస్: 135 (కల్యాణ్ 27, రోహిత్ సింగ్ 4/30, మాజిద్ 2/11) వాకర్‌టౌన్ 153 (శివ 35, ప్రశాంత్ 31; సాయి అభినయ్ 3/30, సురుక్షిత్ 3/24), ఏబీ కాలనీ: 25 (ప్రశాంత్ 5/9, అంజి 3/5). సన్‌షైన్ 103 (అశ్వద్ రాజీవ్ 5/27, ప్రతీక్ 4/17), సీకే బ్లూస్: 104/3 (బెనర్జీ నాటౌట్ 53; శ్రీరామ్ 33), -
అక్షయ్ 7/74
సాక్షి, హైదరాబాద్: నిజామ్ కాలేజి బౌలర్ టి. అక్షయ్ (7/74) విజృంభించాడు. దీంతో ఎ-డివిజన్ రెండు రోజుల లీగ్‌లో బాలాజీ కోల్ట్స్‌తో జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. బాలాజీ కోల్ట్స్ తొలి ఇన్నింగ్స్‌లో 275 పరుగుల వద్ద ఆలౌటైంది. ఫయాజ్ (63) రాణించగా, మిగిలిన వారిలో అజయ్ రెడ్డి 36, అబిద్ 36, మహిర్ విజయ్ 30 పరుగులు చేశారు. చివరి రోజు ఆటలో అక్షయ్ అద్భుతమైన బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 113 పరుగుల ఆధిక్యం పొందిన నిజామ్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 157 పరుగుల వద్ద ఆలౌటైంది. శరత్ 43 పరుగులు చేయగా, మహిర్ విజయ్‌కి 3 వికెట్లు దక్కాయి. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు గ్రీన్‌టర్ఫ్ తొలి ఇన్నింగ్స్: 202, మహమూద్ సీసీ తొలి ఇన్నింగ్స్: 111 (త్రిశాంక్ గుప్తా 5/52, సాయి శ్రాగ్వి 4/31), గ్రీన్‌టర్ఫ్ రెండో ఇన్నింగ్స్: 166/8 డిక్లేర్డ్ (అబ్దుల్ వాహిద్ 61, కుస్రో కిస్టీ 35; ఫర్దీన్ ఉమాని 6/55), మహమూద్ సీసీ రెండో ఇన్నింగ్స్: 121/3 (యశ్ బన్సాల్ 51, గణేష్ 51). డెక్కన్ బ్లూస్ తొలి ఇన్నింగ్స్: 272, అగర్వాల్ సీనియర్స్ తొలి ఇన్నింగ్స్: 318 (సయ్యద్ నూరుల్లా 102, అహ్మద్ షాజిల్ 80; మణికాంత్ 3/28, అఖిలేశ్ 3/52). విజయ్ హనుమాన్ తొలి ఇన్నింగ్స్: 386/7 డిక్లేర్డ్, పీకేఎంసీసీ తొలి ఇన్నింగ్స్: 233 (అభినవ్ 30, వరుణ్ 32), ఫాలోఆన్ రెండో ఇన్నింగ్: 56/6. నేషనల్ సీసీ తొలి ఇన్నింగ్స్: 208, ఎస్బీఐ తొలి ఇన్నింగ్స్: 313 (నాగ శ్రీనివాస్ 75, విన్సెంట్ వినయ్ 60, హరిబాబు 51, అబుబాకర్ 45; కేశవులు గౌడ్ 3/15). -
శతక్కొట్టిన రోహిత్ శ్రీనివాస్
సాక్షి, హైదరాబాద్: ఎ డివిజన్ మూడు రోజుల లీగ్‌లో గౌడ్స్ ఎలెవన్ , ఎవర్గ్రీన్ జట్ల మధ్య మ్యాచ్ డ్రా గా ముగిసింది. చివరి రోజు ఆటలో గౌడ్స్ బ్యాట్స్‌మన్ రోహిత్ శ్రీనివాస్ (157 బంతుల్లో 110; 14 ఫోర్లు, 1 సిక్సర్) సెంచరీతో కదం తొక్కాడు. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 80.4 ఓవర్లలో 8 వికెట్లకు 296 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేసింది. రోహిత్‌తో పాటు రేవంత్ సాయి (61) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. ఎవర్గ్రీన్ బౌలర్లలో అజ్మత్ ఖాన్, రోహన్ యాదవ్ చెరో మూడు వికెట్లతో రాణించారు. అనంతరం మ్యాచ్ ముగిసే సమయానికి ఎవర్గ్రీన్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 17 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 40 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌ల్లో గౌడ్స్ ఎలెవన్ 287/9, ఎవర్ గ్రీన్ 225 పరుగులు చేశాయి. మిగతా మ్యాచ్‌ల్లో ఏఓసీ ఇన్నింగ్స్ 199 పరుగుల తేడాతో జెమినీ ఫ్రెండ్స్‌పై గెలుపొందగా, కాంటినెంటల్, గుజరాతీ మ్యాచ్ డ్రా అయ్యింది. ఇతర మ్యాచ్‌ల ఫలితాలు కాంటినెంటల్: తొలి ఇన్నింగ్స్ 236, రెండో ఇన్నింగ్స్ 198/9 డిక్లేర్డ్ (సంతోష్ 39, సంహిత రెడ్డి 37, సందీప్ మనోహర్ 41, యశ్వంత్ రెడ్డి 47; కమల్ చౌదరీ 3/55), గుజరాతీ: తొలి ఇన్నింగ్స్ 220, రెండో ఇన్నింగ్స్: 215/9 (రోహిత్ రెడ్డి 96, ఆదిత్య 38; లలిత్ మోహన్ 5/89). ఏఓసీ: తొలి ఇన్నింగ్స్ 481/9; జెమినీ ఫ్రెండ్స్: తొలి ఇన్నింగ్స్ 99, ఫాలో ఆన్: 183 (అభిరత్ రెడ్డి 43, రాధకృష్ణ 48). -
తిలక్‌వర్మ సెంచరీ
సాక్షి, హైదరాబాద్: బ్రదర్స్ ఎలెవన్ బ్యాట్స్‌మన్ ఠాకూర్ తిలక్‌వర్మ (123) శతక్కొట్టాడు. దీంతో ఎ-డివిజన్ రెండు రోజుల లీగ్‌లో సలీమ్నగర్తో జరిగిన ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. మొదటిరోజు సలీమ్‌నగర్ తొలి ఇన్నింగ్స్‌లో 279 పరుగుల వద్ద ఆలౌటైంది. రెండో రోజు గురువారం ఆటలో బ్రదర్స్ ఎలెవన్ తొలి ఇన్నింగ్స్‌లో 234 పరుగులు చేసి ఆలౌటైంది. తిలక్‌వర్మ సెంచరీ సాధించగా, కార్తీకేయన్ (50) రాణించాడు. సలీమ్‌నగర్ బౌలర్లలో సమీ అన్సారి 5, షాహిద్ 3 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆడిన సలీమ్‌నగర్ జట్టు మ్యాచ్ ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసింది. తొలి రోజు స్కోర్లు నిజామ్ కాలేజి: 388/7 డిక్లేర్డ్ (సాయి కుమార్ 163; అన్వేశ్ రెడ్డి 127, అక్షయ్ 38; అజిత్ కుమార్ 5/89), బాలాజీ కోల్ట్స్: 45/0. {Xన్టర్ఫ్: 202 (సయ్యద్ అస్కారి 90; మహబూబ్ 3/13, ఆదిత్య 3/19), మహమూద్ సీసీ: 99/7 (గణేష్ 30; సాయి శ్రాగ్వి 3/28, తిశాంత్ గుప్తా 3/44). డెక్కన్ బ్లూస్: 272 (హర్షవర్ధన్ సింగ్ 64, హర్షవర్ధన్ 56; విశాల్ సింగ్ 5/73, సయ్యద్ పాషా 3/36), అగర్వాల్ సీనియర్స్: 48/2. విజయ్ హనుమాన్: 386/7 డిక్లేర్డ్ (మెహర్ ప్రసాద్ 100, రంగనాథ్ 78, సాయి కుమార్ 51), పీకేఎంసీసీ: 19/0. నేషనల్ సీసీ: 208 (వినయ్ 68), ఎస్బీఐ: 77/2 (నాగ శ్రీనివాస్ 32 బ్యాటింగ్). -
మధు కుమార్, అజారుద్దీన్‌ల వీరవిహారం
సాక్షి, హైదరాబాద్: జిందా తిలిస్మాత్ బ్యాట్స్‌మెన్ మధు కుమార్ (161 బంతుల్లో 124; 17 ఫోర్లు, 1 సిక్స్), అజారుద్దీన్ (69 బంతుల్లో 104 నాటౌట్; 11 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీలతో కదంతొక్కారు. దీంతో ఎ-డివిజన్ రెండు రోజుల లీగ్‌లో జిందా తిలిస్మాత్ జట్టు ఇన్నింగ్స్ 171 పరుగుల తేడాతో క్రౌన్ సీసీపై జయభేరి మోగించింది. మొదటి రోజు ఆటలో క్రౌన్ సీసీ తొలి ఇన్నింగ్స్‌లో 76 పరుగులకే కుప్పకూలింది. తర్వాత జిందా తిలిస్మాత్ 69 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 405 పరుగుల భారీస్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ముఖ్యంగా అజారుద్దీన్ భారీ సిక్సర్లతో చెలరేగి మెరుపు సెంచరీ సాధించాడు. దీంతో 329 పరుగుల ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆడిన క్రౌన్ సీసీ 36.1 ఓవర్లలో 158 పరుగుల వద్ద ఆలౌటైంది. అమర్ అయూబ్ 5, విష్ణు చైతన్య 3 వికెట్లు పడగొట్టారు. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు : సలీంనగర్ తొలి ఇన్నింగ్స్: 279 (జమీరుద్దీన్ 92, ఖాలిద్ 60, గౌస్ జునైద్ 70; నొమన్ అఫ్సర్ 3/51), బ్రదర్స్ ఎలెవన్ తొలి ఇన్నింగ్స్: 42/0. డబ్ల్యూఎంసీసీ తొలి ఇన్నింగ్స్: 210 (ఖాసిమ్ వాలి 38, సునీల్ 38; శ్రీనివాస్ 6/76, దినేశ్ 4/63), రాజు సీసీ తొలి ఇన్నింగ్స్: 178 (దినేశ్ 89; మెహ్తాబ్ అలమ్ 3/44), డబ్ల్యూఎంసీసీ రెండో ఇన్నింగ్స్: 107/9 (శ్రీనివాస్ 5/44, దినేశ్ 4/47), రాజు సీసీ రెండో ఇన్నింగ్స్: 78 (దినేశ్ 35; ఖాసిమ్ వాలి 3/28). -
రాణించిన శ్రీకృష్ణ
యూనివర్సల్‌పై లక్కీ ఎలెవన్ గెలుపు సాక్షి, హైదరాబాద్: ఎ-డివిజన్ వన్డే లీగ్‌లో లక్కీ ఎలెవన్ 98 పరుగుల తేడాతో యూనివర్సల్ జట్టుపై గెలుపొందింది. లక్కీ ఆటగాళ్లు శ్రీకృష్ణ (90) బ్యాటింగ్‌లో, నాగశివ (4/25), విజయ్ (3/22) బౌలింగ్‌లో రాణించారు. మొదట బ్యాటింగ్ చేపట్టిన లక్కీ జట్టు 50 ఓవర్లలో 247 పరుగులు చేసి ఆలౌటైంది. రాహుల్ 33 పరుగులు చేయగా, ప్రత్యర్థి బౌలర్లు కపిల్ 4, సోమ్‌నాథ్, యశ్వంత్ చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత 248 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన యూనివర్సల్ 149 పరుగులకే ఆలౌటైంది. ఈశ్వర్ 26, రాజ్ 20 పరుగులు చేశారు. నాగశివ 4, విజయ్ 3, రోహన్ 2 సమష్టిగా యూనివర్సల్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. -
శ్రీధర్ రెడ్డి 9/33
హైదరాబాద్: ఫ్యూచర్ స్టార్స్ మీడియం పేసర్ శ్రీధర్ రెడ్డి (9/33) చెలరేగాడు. ఆక్స్ఫర్డ్ బ్లూస్‌తో జరిగిన ఎ-డివిజన్ రెండు రోజుల మ్యాచ్‌లో అతను అద్భుతమైన స్పెల్ (15.2-4-33-9) ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను హడలెత్తించాడు. తొలిరోజు ఆటలో ఫ్యూచర్స్టార్స్ 318/9 స్కోరు చేసింది. రెండో రోజు ఆక్స్ఫర్డ్ బ్లూస్ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఈ తొమ్మిది శ్రీధర్ ఖాతాలోకే వెళ్లాయి. తర్వాత ఫాలోఆన్‌లో రెండో ఇన్నింగ్స్ ఆడిన ఆక్స్ఫర్డ్ జట్టు మ్యాచ్ ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది. డ్రాగా ముగిసిన ఈ మ్యాచ్ ఫ్యూచర్స్టార్స్కు 9, ఆక్స్‌ఫర్డ్‌కు 3 పాయింట్లు దక్కాయి. ఖురేషీ 3కే ఏడు వికెట్లు శ్రీచక్ర ఆటగాడు అబ్దుల్ ఎలల్ ఖురేషీ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. తొలుత బౌలింగ్‌లో మూడే పరుగులిచ్చి 7 వికెట్లు కూల్చిన ఖురేషీ బ్యాటింగ్‌లో అర్ధసెంచరీ సాధించాడు. మొదటి రోజు ఆటలో తొలుత బ్యాటింగ్ చేపట్టిన అవర్స్ 72 పరుగులకే ఆలౌటైంది. ఖురేషీ (5.5-2-3-7) అసాధరణ స్పెల్‌తో రెచ్చిపోయాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన శ్రీచక్ర ఆట నిలిచే సమయానికి 7 వికెట్లకు 152 పరుగులు చేసింది. ఖురేషీ (63) రాణించాడు. అనిశ్ కుర్దుకర్కు 4 వికెట్లు దక్కాయి. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు జిందా తిలిస్మాత్ తొలి ఇన్నింగ్స్: 93 (అజారుద్దీన్ 21; సౌరవ్ కుమార్ 5/55, ఈశ్వర్ రావు 4/18), బడ్డింగ్ స్టార్స్ తొలి ఇన్నింగ్స్: 279 (ముకేశ్ 54; అమర్ అయూబ్ 7/106), జిందా తిలిస్మాత్ రెండో ఇన్నింగ్స్: 105 (అజార్ అలీ 36; అబ్దుల్ మొఖిత్ 5/24, ముకేశ్ 4/34). ఉస్మానియా తొలి ఇన్నింగ్స్: 226, న్యూబ్లూస్ తొలి ఇన్నింగ్స్: 218, ఉస్మానియా రెండో ఇన్నింగ్స్: 200/4 (ఆశిష్ 100, సిద్ధాంత్ 49, వసీయుద్దీన్ 3/81), న్యూబ్లూస్ రెండో ఇన్నింగ్స్: 59/3. అగర్వాల్ సీనియర్స్ తొలి ఇన్నింగ్స్: 178, ఎస్బీఐ తొలిఇన్నింగ్స్: 199/9 (క్రాంతి కుమార్ 42, అబు బాకర్ 44), అగర్వాల్ రెండో ఇన్నింగ్స్: 25/5. గ్రీన్‌టర్ఫ్ తొలి ఇన్నింగ్స్: 376, నిజామ్ కాలేజి తొలి ఇన్నింగ్స్: 259 (సాయికుమార్ 81, సందీప్ 55; సాయి శ్రాగ్వీ 5/63, త్రిశాంక్ గుప్తా 5/118). విజయ్ హనుమాన్ తొలి ఇన్నింగ్స్: 231, మహమూద్ సీసీ తొలి ఇన్నింగ్స్: 235/9 డిక్లేర్డ్ (గణేష్ 65; మెహర్ ప్రసాద్ 4/66), విజయ్ హనుమాన్ రెండో ఇన్నింగ్స్: 162/3 (భరత్ తేజ 38). -
శతక్కొట్టిన ప్రణీత్
హైదరాబాద్: బ్యాట్స్‌మెన్ పి. ప్రణీత్ రెడ్డి (310 బంతుల్లో 187; 26ఫోర్లు, 1 సిక్సర్) సెంచరీతో కదం తొక్కడంతో ఎ-డివిజన్ మూడు రోజుల లీగ్‌లో ఎవర్ గ్రీన్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో గుజరాతి జట్టు భారీ స్కోరు చేసింది. బుధవారం రెండో రోజు ఆటలో గుజరాతి జట్టు 129 ఓవర్లలో 9 వికెట్లకు 519 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ప్రణీత్‌తో పాటు రాహుల్ (74), కమల్ (42) ఆకట్టుకోగా... ఎవర్గ్రీన్ బౌలర్ చందన్ 6 వికెట్లతో రాణించాడు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఎవర్ గ్రీన్ జట్టు ఆట ముగిసే సమయానికి 43 ఓవర్లలో 4 వికెట్లకు 179 పరుగులు చేసింది. చందన్ సహాని (83), రోహన్ (64 బ్యాటింగ్) ఆకట్టుకున్నారు. ఇతర మ్యాచ్‌ల వివరాలు ఎంపీ కోల్ట్స్: తొలి ఇన్నింగ్స్ 227; రెండో ఇన్నింగ్స్ 2/1; కేంబ్రిడ్జ్ ఎలెవన్: తొలి ఇన్నింగ్స్ 341 (తనయ్ 89, అనురాగ్ 48, చంద్రశేఖర్ 95; ఆకాశ్ 5/37) ఎస్‌సీఆర్‌ఎస్‌ఏ: తొలి ఇన్నింగ్స్ 137, రెండో ఇన్నింగ్స్ 141 (వంశీ కృష్ణ 79; లలిత్ మోహన్ 5/45); కాంటినెంటల్: తొలి ఇన్నింగ్స్ 63 (సుధాకర్ 4/13), రెండో ఇన్నింగ్స్ 45/2. గౌడ్స్ ఎలెవన్ : తొలి ఇన్నింగ్స్ 273; జెమిని ఫ్రెండ్స్: 315/8 (హెచ్.కె. సింహా 77, రాధ కృష్ణ 142, అబ్దుల్ ఖురేషి 37 బ్యాటింగ్) స్పోర్టింగ్ ఎలెవన్: 281/3 (రమేశ్ 73, చిరాగ్ 96, అంకుర్ 71 బ్యాటింగ్, చైతన్య 33బ్యాటింగ్); దయానంద్‌తో మ్యాచ్. -
గ్రీన్ టర్ఫ్, మాంచెస్టర్ మ్యాచ్ డ్రా
హైదరాబాద్: ఎ-3 డివిజన్ రెండు రోజుల లీగ్‌లో గ్రీన్‌టర్ఫ్, మాంచెస్టర్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ శుక్రవారం డ్రా గా ముగిసింది. మొదట బ్యాటింగ్ చేసిన గ్రీన్‌టర్ఫ్ 80 ఓవర్లలో 242 పరుగులకు ఆలౌటైంది. అనంతరం మాంచెస్టర్ జట్టు 45 ఓవర్లలో 173 పరుగులు చేసింది. శ్రవణ్ (51), హరీశ్ (37), డేనియల్ (30) రాణించాడు. గ్రీన్ టర్ఫ్ బౌలర్లలో అబ్దుల్ వహీద్ 5 వికెట్లు పడగొట్టాడు. ఇతర మ్యాచ్‌ల వివరాలు డెక్కన్ బ్లూస్: 171 (శ్రీవాస్తవ్ 3/11); మహమూద్ సీసీ: 171/9 (యశ్ బన్సల్ 58; మణికంఠ 4/36, షనుక్ 3/42). అగర్వాల్ : తొలి ఇన్నింగ్స్ 191, రెండో ఇన్నింగ్స్ 176/7 డిక్లేర్డ్ (సాయివ్రత్ రెడ్డి 40, మహేశ్ 44; సాయి కుమార్ 3/47); నిజాం: తొలి ఇన్నింగ్స్ 292 (సాయి సందీప్ 90; విశాల్ 3/77), రెండో ఇన్నింగ్స్ 55. ఎస్బీఐ: 108 డిక్లేర్డ్ (రాందాస్ 35, రంగనాథ్ 48; అనుదీప్ 3/37); స్పోర్టివ్ సీసీ: 157/5 (గోిపీ కృష్ణ 66, కిరణ్ కుమార్ 33). -
సాత్విక్ డబుల్ సెంచరీ
హైదరాబాద్: హెచ్‌సీఏ ఎ-డివిజన్ వన్డే క్రికెట్లో ఆల్ సెయింట్స్ హైస్కూల్ కుర్రాడు సాత్విక్ రెడ్డి (118 బంతుల్లో 213; 18 ఫోర్లు, 11 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. భారీ సిక్సర్లు, చూడచక్కని బౌండరీలతో మెరుపు వేగంతో డబుల్ సెంచరీని నమోదు చేశాడు. దీంతో ఆల్‌సెయింట్స్ గ్రౌండ్స్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు 306 పరుగుల తేడాతో ధ్రువ్ ఎలెవన్‌పై భారీ విజయం సాధించింది. మొదట ఆల్‌సెయింట్స్ జట్టు 49.1 ఓవర్లలో 373 పరుగులు చేసి ఆలౌటైంది. సాత్విక్, సయ్యద్ యూసుఫ్ తమీమ్ (70 బంతుల్లో 80; 2 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి భారీస్కోరుకు బాటలు వేశాడు. డేన్ జాన్స్‌న్‌కు 5 వికెట్లు దక్కాయి. తర్వాత ధ్రువ్ ఎలెవన్ 67 పరుగులకే ఆలౌటైంది. ముస్తాక్ అహ్మద్ 3, నీల్ చక్రవర్తి 2 వికెట్లు తీశారు. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు గన్‌రాక్ సీసీ: 102 (ఆకాశ్ 32; రోహిత్ యాదవ్ 7/15), సెయింట్ ప్యాట్రిక్స్: 105/1 (సాయి వినయ్ 52 నాటౌట్, సాహిల్ కృష్ణ 35). రోషనారా: 316 (శ్రీకాంత్ రెడ్డి 108 నాటౌట్, ఇర్ఫాన్ ఖాన్ 60; విజయ్ 2/35, వరప్రసాద్ 2/39), వాకర్‌టౌన్: 140 (చంటి 62; బెంజమిన్ 5/25, ఉదయ్ కుమార్ 3/20). అమీర్‌పేట్: 305/9 (ఆశిష్ యాదవ్ 129, గురిందర్ సింగ్ 53; అభినవ్ 5/51, సమీర్ 2/36), విక్టోరియా: 68 (అభినవ్ 30; నైరుత్ రెడ్డి 5/20, చందన్ 4/16). సౌతెండ్ రేమండ్స్: 122 (హాజి 38; దీపక్ 5/26, సాహిల్ 3/33), యాదవ్ డెయిరీ: 123/1 (ప్రణీత్ 53 నాటౌట్). హైదరాబాద్ పేట్రియాట్స్: 283 (మహేశ్ 120, పవన్ 60; అనిరుధ్ 3/32, కార్తీశ్ 3/60), టీమ్ కున్: 190/9 (అనిరుధ్ 107; ప్రణయ్ 4/38). -
సెంచరీతో కదం తొక్కిన ఠాకూర్ తిలక్
ఎ-2 డివిజన్ రెండు రోజుల లీగ్ సాక్షి, హైదరాబాద్: బ్రదర్స్ ఎలెవన్ ఆటగాడు ఠాకూర్ తిలక్ (204 బంతుల్లో 144; 20 ఫోర్లు, 1సిక్సర్) సెంచరీతో కదం తొక్కడంతో ఎ-2 డివిజన్ రెండు రోజుల లీగ్ రెండో రోజు ఆటలో ఆ జట్టు 5 వికెట్లకు 211 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. తర్వాత క్రౌన్ జట్టు 49 ఓవర్లలో 110 పరుగులు చేసి ఆలౌటైంది. క్రౌన్ జట్టు బ్యాట్స్‌మెన్‌లో మొహమ్మద్ గౌస్ (38) ఒక్కడే రాణించాడు. బ్రదర్స్ ఎలెవన్ బౌలర్లలో అఫ్సర్ 4 వికెట్లు, అజీమ్ 3 వికెట్లు పడగొట్టారు. ఇతర మ్యాచ్‌ల వివరాలు పూల్-ఏ ఉస్మానియా: తొలి ఇన్నింగ్స్ 199/10, రెండో ఇన్నింగ్స్ 61/2 (10 ఓవర్లలో); అవర్స్ సీసీ: 200/10 (అమర్ రాజా 73, అభిలాష్ కులకర్ణి 35; సత్యనారాయణ 5/51); కొసరాజు: 162/9 డిక్లేర్డ్; శ్రీచక్ర: 301/9 డిక్లేర్డ్ (సుందర్ కుమార్ 52, నిఖిల్ 110 నాటౌట్ , భరత్ కుమార్ 37; వికాస్ 4/31); సాయి సత్య: 207/6 ( నారాయణ్ 60, శివదత్తా 35, అరవింద్ 61; ఆశిష్ 3/38); వ ర్షం కారణంగా గెలాక్సీ ఇన్నింగ్స్ రద్దు. టీమ్‌స్పీడ్: 265/9 డిక్లేర్డ్ (మొహమ్మద్ వజీయుద్దీన్ 92; బాలాజీ సింగ్ 4/57); విశాఖ: 67/10 (హితేశ్ యాదవ్ 6/8, భువన్ రెడ్డి 3/22), ఫాలోఆన్: 75/8 (రణ్వీర్ సింగ్ 5/28); డెక్కన్ వాండరర్స్: 159/9 డిక్లేర్డ్ (హర్షవర్థన్ రెడ్డి 40, దినేశ్ గౌడ్ 51; సాగర్ 3/31); పోస్టల్: 77/10 (అతుల్ వ్యాస్ 4/31); సీసీఓబీ: 179/5 (ప్రణయ్ 78, సల్మాన్ 31); న్యూబ్లూస్తో మ్యాచ్ పూల్ బి బడ్డింగ్ స్టార్: 146/10 ( కె. భరత్ 70; మొహమ్మద్ సైఫుద్దీన్ 7/53); అపెక్స్ సీసీ: 147/7 (రిజ్వాన్ 34; సన్నీ 4/71); జిందా తిలిస్మాత్: తొలి ఇన్నింగ్స్ 285/10, రెండో ఇన్నింగ్స్ 32/0; హెచ్‌బీసీసీ: 182/10 (రిషికేశ్ 30, దీపాంకర్ 49, అఖిల్ రాథోడ్ 31, విష్ణు చైతన్య 5/50), ఫాలోఆన్: 134/10 (ప్రిన్స్ 53, అమీర్ బిన్ ఆలీ 4/67, అయూబ్ 4/26); రోహిత్ ఎలెవన్: 309/10; శ్రీశ్యామ్: 10/1 (5. 2 ఓవర్లలో) మ్యాచ్ డ్రా.